ప్రస్తావన :
ఒక స్త్రీ చదువుకొంటే మొత్తం కుటుంబం చదువుకొన్నట్లేనని పెద్దల మాట. ఒక కుటుంబాన్ని అన్ని విధాలా సంరక్షించే పెద్దగా ఈ మాట అక్షరాలా నిజం. స్త్రీ చదువుకొని ఉండి పిల్లల చదువుల గురించి చక్కగా శ్రద్ధ తీసుకొని కుటుంబం ఉన్నతస్థాయికి ఎదిగేటట్లు చేయగలదు. చదువు ఆధారంగా ఉద్యోగం చేసి కుటుంబ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దగలదు.
ఇంటి పనితో పాటు బయట పనిని చక్కదిద్ది భర్తకు సహాయం చేయగలదు. చదువుకోని వారు ఇలా ఉండలేరా? ఉండగలరు. కానీ చదువుకొంటే బంగారానికి సుగంధం అబ్బినట్లు. వారిలో సహజంగా ఉన్న సామర్థ్యం మరియు శక్తి ఇంకా ఎక్కువగా ఉపయోగించి కుటుంబానికి మేలు చేస్తారు. ప్రస్తుత కాలంలో చదువుకోని స్త్రీ ఉన్నదంటే అతిశయోక్తే. అందరూ వారి వారి శక్తిని అనుసరించి చదువుకుంటున్నారు. ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేక సహాయం కూడా దొరుకుతోంది. సమాజంలో మారిన అభిప్రాయాలను అనుసరించి కుటుంబాలు కూడా ఆడపిల్లల చదువు గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే అందరూ ఉన్నత విద్యాభ్యాసం చేయగలుగుతున్నారా? ఉన్నత విద్య పూర్తిచేసి, పూర్తి చేయక చాలామంది ఇంటిలో ఉండిపోతున్నారు, లేదా వచ్చిన ఉద్యోగం చేస్తున్నారు. దేశంలోని పరిస్థితి కొంత కారణం కావచ్చు. కానీ ప్రత్యేకంగా చూస్తే స్త్రీల సామాజిక స్థితి దీనికి కొంత కారణం కావచ్చు. ప్రస్తుత ఉల్లేఖనం స్త్రీలు ఉన్నత విద్యాభ్యాసంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయం మీద చర్చ కొనసాగిస్తోంది. అధ్యాపక శిక్షణ కార్యక్రమంలో జరిగిన పరిశోధన ఆధారంగా ఈ చర్చ జరుగుతుంది.
స్త్రీకి విద్య అవసరం:
మందుగా ప్రస్తావనలో చెప్పినట్లు స్త్రీ చదువుకొంటే కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళగలదు. కుటుంబం గురించే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచించగలిగే శక్తిని విద్య ఇస్తుంది. సమాజం సరిగ్గా ముందుకు నడవాలంటే స్త్రీ పురుషుల సమాన భాగస్వామ్యం ఎంతో అవసరం. పురుష ప్రాధాన్య సమాజంలో తన పాత్రను సరిగ్గా అంచనా వేసి ముందుకు సాగగలిగిన సామర్ధ్యం విద్యవలన లభిస్తుంది. భారతదేశంలో స్త్రీ పురుష జనాభా సరిగ్గా మధ్యకు దాదాపుగా 50 శాతం ఉంది. ఆడశిశువు భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల సమాజ పురోగతిలో ఆటంకాలు రావచ్చు. సమాజంలో సగభాగమైన స్త్రీలపట్ల పురుషులలో సరైన అవగాహన రావాలంటే స్త్రీల వలనే సాధ్యం. ఈ మార్పు చదువుకున్న స్త్రీలు మాత్రమే తీసుకు రాగలరు. అందువలన స్త్రీ విద్యలో రాణిస్తున్న ఈ కాలంలో కూడా స్త్రీకి విద్య ఎంతో అవసరం. సమాజంలో తన కర్తవ్యం ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవడానికి విద్య ఎంతో అవసరం.
విద్య వలన ముందుగా లోకజ్ఞానం పెరుగుతుంది. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది. సంపాదన మార్గాలు కూడా మెరుగ్గా ఉంటాయి. సంపాదనను స్వంత అవసరాల గురించి ఖర్చు చేసుకోగలుగుతారు. స్వంత ఆరోగ్యం బాగోగులు చూసుకోగలుగుతారు. స్వంత బాగోగులతో పాటు కుటుంబ అవసరాల గురించి కూడా సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు. కుటుంబం మరియు సమాజం సరిగ్గా ముందుకు నడవడానికి స్త్రీ విద్య ఎంతో అవసరం.
స్త్రీలకు ఉన్నత విద్య వలన ప్రయోజనాలు :
21వ శతాబ్దంలో ఉన్నత విద్య ఆవశ్యకత అందరికీ అవసరం. ఉన్నత విద్య వలన మరింత అవగాహన పెరుగుతుంది. శాస్త్రీయ పరిశోధన మెళకువలు అలవడతాయి. స్త్రీలకు ఈ మెళకువలు చాలా అవసరం. సాధారణ విద్య వలెనే అందరికీ మంచి చేయగలిగిన స్త్రీలు ఉన్నత విద్యనూ పొందితే ఇంకా ఎక్కువగా కుటుంబానికి, సమాజానికి బాసటగా నిలబడగలరు. సమాజం అవసరాల గురించి మరింత అవగాహన రావడంతో పాటు, ముందు జీవిత లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాల గురించి ప్రణాళికలు వేసే పిల్లల భవిష్యత్తుకు మంచి బాటను సిద్ధం చేయగలరు. భవిష్యత్తు ప్రణాళికలు సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలరు. ఉన్నత విద్య వలన స్త్రీలు మరింతగా తన స్వంత ప్రయోజనాలే కాకుండా కుటుంబం మరియు సమాజం గురించి కూడా పని చేయగలరు.
అధ్యాపక ప్రశిక్షణ :
అధ్యాపక వృత్తి స్త్రీల కుటుంబ బాధ్యతల దృష్టి పరంగా చూస్తే అనుకూలమైనది. విద్యాలయం పిల్లలకు రెండవ ఇల్లులాంటిదని నానుడి. కుటుంబంలో పిల్లల ఆలనా పాలనా చూసే స్త్రీలు విద్యాలయంలో కూడా పిల్లల బాగోగులు సరిగ్గా చూడగలరని అభిప్రాయం. పాశ్చాత్య దేశాలలో కూడా చిన్నపిల్లల విద్యాలయాల్లో ఎక్కువ స్త్రీలనే అధ్యాపకులుగా తీసుకుంటారు. సమాజంలో అధ్యాపక వృత్తికి ఇంకా ప్రాముఖ్యం పెరుగుతోంది. అధ్యాపకుల బాధ్యతలు విస్తృతమవుతాయి. కేవలం చదువు చెప్పడం మాత్రమే కాదు, ఈనాటి ఉపాధ్యాయులు పిల్లలకు అనేక విషయాలలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ కారణంగా స్త్రీల పాత్ర ఇంటిలోనూ, అధ్యాపక వృత్తిలోనూ మరింత ప్రభావవంతమైనదని చెప్పవచ్చు. ఈనాటి పరిస్థితులను అనుసరించి అధ్యాపక ప్రశిక్షణ కార్యక్రమం రూపు రేఖలను మార్చుకుంటోంది. ప్రశిక్షణ కార్యక్రమంలో ఈ అదనపు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని చాలా మార్పులు తీసుకువచ్చారు. ఒక ముఖ్యమైన మార్పు కోర్స్ అవధిని రెండు సంవత్సరాలు చేయడం. ూతీaష్‌ఱషవ ్‌వaషష్ట్రఱఅస్త్ర బదులు ఱఅ్‌వతీఅంష్ట్రఱజూ కార్యక్రమాన్ని రూపొందించడం. దీని వలన మిగిలిన ప్రొఫెషనల్ కార్యక్రమాల్లాగా అధ్యాపక శిక్షణ కూడా ఒక వృత్తి నిపుణతను సాధించగలుగుతోంది.
ప్రస్తుత పరిశోధన :
2011 జనాభా గణన అనుసారంగా స్త్రీల విద్య 64.46 శాతంగా నమోదయింది. వెనుకటి గణనాల కంటే ఎక్కువయినా ఇంకా అభివృద్ధి సాధించవలసిన అవసరం ఉంది. (ప్రియాంక, 2018) స్త్రీలు వృత్తిపరంగా అన్ని రంగాలలో వృద్ధి సాధిస్తున్నారు కానీ దేశ స్త్రీ జనాభా పరంగా స్త్రీ విద్యాభ్యాసం శాతం చూస్తే తక్కువ అని చెప్పపవచ్చు. దీనికోసం ముఖ్యంగా ఉన్నత విద్యలో స్త్రీల శాతం ఎక్కువగా ఉండాలి. ఉన్నత విద్య వలనే స్త్రీల స్థితిలో చెప్పుకోగలిగిన మార్పులు, ఉన్నతి సాధ్యం. మారుతున్న కాలంలో ఉన్నత విద్య, అందులోనూ అధ్యాపక ప్రశిక్షణ కార్యక్రమం ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి రంగంలోనూ శిక్షణ, ప్రశిక్షణ ప్రాముఖ్యతను సాధించాయి. కేవలం విద్యాలయాలలోనే కాక విశ్వవిద్యాలయాలలోను, పరిశ్రమలలోనూ మరియు ఇతర ప్రదేశాలలోనూ ప్రశిక్షణ ప్రాధాన్యత పెరిగింది. దీనివలన అధ్యాపక ప్రశిక్షణ కార్యక్రమం ప్రాధాన్యత కూడా పెరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో
ఉంచుకొని ప్రస్తుత పరిశోధన జరపబడిరది.
వెనుకటి కాలంకంటే చదువుకోవడానికి స్త్రీలకు ప్రోత్సాహం లభిస్తోంది. అవకాశాలు, సహాయాలు కూడా పెరిగాయి. సమాజపరంగా కూడా అనుకూల వాతావరణం లభిస్తోంది. అయినా స్త్రీల సంఖ్య అనుకున్నంత ఎక్కువగా కనిపించడం లేదు. దీనికి కారణాలేంటి? ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఈ పరిశోధన ప్రయత్నించింది. ఏ ఏ సమస్యల వలన స్త్రీలు ఉన్నత విద్యను పొందలేక పోతున్నారు లేక రాణించలేకపోతున్నారు? వ్యక్తిగత, విద్య మరియు వృత్తిపరంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి? ఏవి ప్రధానమయిన సమస్యలు? ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది.
పరిశోధన కోసం మహారాజ సాయాజిరావు యూనివర్శిటీ బరోడా ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ నుంచి బి.ఎడ్. రెండవ సంవత్సరం చదివే విద్యార్థినుల నుంచి 2018 సంవత్సరంలో సమాచారం సేకరించడం జరిగింది.
అధ్యాపక ప్రశిక్షణ ఎక్కువగా స్త్రీలు చదివే వృత్తి విద్యగా పరిగణిస్తారు. బరోడా విశ్వవిద్యాలయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా దీనికి విరుద్ధం కాదు. రెండు సంవత్సరాల కోర్సు అయిన తర్వాత స్థితిలో కొంత మార్పు ఉంది. విద్యార్థినులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. వయోభేదం కూడా వివిధంగా ఉంటుంది. మొత్తం పురుష / స్త్రీ విద్యార్థులలో వయోభేదం కనిపిస్తుంది. ట్యూషన్ నడపడానికి, ఉద్యోగం చేయడానికి, కుటుంబ బాధ్యతలు తీరి చదువును ఉపయోగించుకోవడానికి, ఆర్థిక అవసరాల గురించి ఈ కోర్సులో చేరడం జరుగుతుంది. ఒక హద్దు వరకు చదివి మళ్ళీ చదువులో చేరతారు కావున కాలాంతరం ఉంటుంది. ఉద్యోగం చేస్తూ కూడా ఉద్యోగం ఖాయం అవడానికి కూడా చదువుతూ ఉంటారు. ఈ కారణాల వలన సమస్యలు, వాటి స్థాయి వివిధ రకాలుగా ఉంటాయి. ఈ దృష్టితో విషయ సేకరణకు విద్యార్థినుల విద్య, వ్యక్తిగత మరియు ఉద్యోగ విషయాల సమస్యల గురించి ఒక చెక్‌లిస్ట్ తయారుచేశాము. దీనిలో గుర్తించిన సమస్యల ఆధారంగా 77 వాక్యాలను తయారు చేశాము. వాటికి ఇచ్చిన సమాధానాలను సంక్షిప్తంగా వివరించాము.
46 మంది విద్యార్థినులు చెక్ లిస్టుకు సమాధానం ఇచ్చారు. వారి సమాధానాలను సంక్షిప్తంగా ఇక్కడ వ్యాఖ్యానం ఇవ్వడం జరిగింది.
విద్య సంబంధ సమస్యలు :
28 మంది విద్యార్థినులు పూర్తి సమయం క్లాసులు హాజరవడం కష్టమని చెప్పారు.
23 మంది విద్యార్థినులు ఇంటర్న్‌షిప్‌కి ఇచ్చిన స్కూల్ దూరమని చెప్పారు.
22 మంది విద్యార్థినులు ప్రాక్టికల్ పని చాలా ఎక్కువని చెప్పారు.
21 మంది విద్యార్థినులు కంప్యూటర్ ల్యాబ్ ఎక్కువ సమయం ఉపయోగించుకోవడానికి కుదరదని చెప్పారు.
19 మంది విద్యార్థినులు స్టడీ నోట్స్ తయారు చేసుకోవడానికి వనరులు దొరకడం కష్టమని, కొన్ని తరగతులలో కూర్చునే వసతి ఇబ్బందికరంగా ఉందని చెప్పారు.
17 మంది విద్యార్థినులు సిసిఎ కార్యక్రమాలు నిర్వహించడం కష్టమని చెప్పారు.
16 మంది విద్యార్థినులు 80% హాజరు నియమం, విద్య మరియు ఇతర కార్యక్రమాల కోసం కేటాయించిన విద్యార్థుల కూటమితో సర్దుబాటుతో పనిచేయడం కష్టమని చెప్పారు.
14 మంది విద్యార్థినులు విరామం లేకుండా ప్రతిరోజు పరీక్షలు రాయడం కష్టమని చెప్పారు.
13 మంది విద్యార్థినులు లైబ్రరీలో తగినన్ని రిఫరెన్స్ పుస్తకాలు లేవని మరియు తరగతిలో చర్చలు జరుగుతున్నప్పుడు భయం లేకుండా స్వంత అభిప్రాయం వ్యక్తం చేయడం కష్టమని చెప్పారు.
12 మంది విద్యార్థినులు డిపార్టుమెంట్ బయట చేయవలసిన ప్రాక్టికల్ వర్క్ చేయడం, పరీక్షలకు తయారవడానికి తగిన సమయం దొరకడం మరియు ప్రాక్టికల్ వర్క్ ప్రదర్శన కష్టమని చెప్పారు.
11 మంది విద్యార్థినులు డిపార్ట్‌మెంట్ ఈవెంట్స్ నిర్వహించడం కష్టమని చెప్పారు.
10 మంది విద్యార్థినులు ఇంగ్లీష్ భాషలో అభిప్రాయాలు వ్యక్తం చేయడం, పనులు చేయడానికి కేటాయించిన కూటమిలో అభిప్రాయం వ్యక్తం చేయడం, అసైన్‌మెంట్స్ సమయంలో సమర్పించడం, ఇచ్చిన మెటీరియల్‌ను ఉపయోగించి క్లాస్ నోట్స్ నుంచి ఫెయిర్ నోట్స్ తయారు చేయడం, ప్రతిరోజూ లెసన్ ప్లాన్స్ రాయడం మరియు రిపోర్ట్స్ సమర్పించడానికి ఇచ్చిన ఫార్మాట్‌ను అర్థం చేసుకోవడం వంటివి కష్టమని చెప్పారు.
9 మంది విద్యార్థినులు బి.ఎడ్. విషయం అర్థం చేసుకోవడం, ఉపాధ్యాయులు బోధించే విషయాలు అర్థం చేసుకుని అనుసరించడం, స్వయంగా చదువుకోవడం, ఇచ్చిన కూటమితో ప్రాక్టికల్ వర్క్ సాధన చేయడం వంటివి కష్టమని చెప్పారు.
8 మంది విద్యార్థినులు తరగతిలో బోధన జరుగుతున్నప్పుడు నోట్స్ రాయడం మరియు ంఱఎబశ్రీa్‌ఱశీఅ లెసన్స్ ఒత్తిడి తట్టుకోవడం కష్టమని చెప్పారు.
6 మంది విద్యార్థినులు ప్రశ్నలకు సరైన క్రమంలో సమాధానాలు రాయడం, సెమిస్టర్ మరియు మార్క్ షీట్ విషయాలను అర్థం చేసుకోవడం మరియు ఇంటర్న్‌షిప్ సమయంలో స్కూల్ షిఫ్ట్ (ఉదయం లేక సాయంత్రం) ఇబ్బందిగా ఉంటున్నాయని చెప్పారు.
4 మంది విద్యార్థినులు ఉపాధ్యాయుల నిర్దేశాలు అర్థం చేసుకొని పాటించడం, విషయాలు నేర్చుకోవడానికి ఇచ్చిన Iజు ుశీశీశ్రీం ఉపయోగించడం, తరగతిలో ఇతర విద్యార్థులతో కలిసి మెలిసి ఉండడం, విద్యా సంబంధిత విషయాల గురించి ఉపాద్యాయులు ఇచ్చే సలహాలు అర్థం చేసుకోవడం కష్టమని చెప్పారు.
3 మంది విద్యార్థినులు పరీక్షలు రాసేటప్పుడు సమయ పాలన, ఇంటర్న్‌షిప్ సమయంలో పాఠశాల సమయ పాలన మరియు ఇంటర్న్‌షిప్ సమయానికి పూర్తి చేయడం కష్టమని చెప్పారు.
1 విద్యార్థిని పాఠ్య పుస్తకాలలోని విషయాలు అర్థం చేసుకోవడం మరియు ఇంటర్న్‌షిప్ సమయంలో స్కూల్ నియమాలకు సర్దుకొని ఉండడం కష్టమని చెప్పారు.
విషయ బోధన చేసే ఉపాధ్యాయులతో మరియు సాటి విద్యార్థినీ విద్యార్థులతో కమ్యూనికేట్ చేయడం కష్టమని ఏ విద్యార్థినీ చెప్పలేదు.
విద్యార్థినుల వివిధతతో సమన్వయంగా విద్యా సమస్యలు చెప్పడం జరిగింది. ఎక్కువ సమయం చదువుకు ఇవ్వలేకపోవడం, కూటమిలో పనిచేయలేకపోవడం, అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోవడం, కుటుంబం`చదువు మధ్య సమన్వయం చేసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎక్కువమంది వ్యక్తం చేశారు.
వనరుల లోపం వలన ఈ సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. నోట్స్ తయారు చేసుకోలేకపోవడం వంటివి దీనికి ఉదాహరణ. ప్రాక్టికల్స్ వర్క్ సంబంధిత సమస్యలు, ఇంటర్న్‌షిప్ సమస్యలు, Iజు ఉపయోగ సమస్యలు చదువులో వచ్చిన గ్యాప్ కారణంగా కావచ్చు. విద్యార్థినుల మధ్య సమస్యలు లేకపోవడం స్త్రీల విద్య పట్ల స్త్రీలకు పెరిగిన అవగాహనకు ప్రతీకగా చెప్పవచ్చు.
కుటుంబ సమస్యలు :
14 మంది విద్యార్థినులు పూర్తి సమయం డిపార్టుమెంటులో ఉండడం మరియు సిసిఎ కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాలలో పాల్గొనడం కష్టమని చెప్పారు.
12 మంది విద్యార్థినులు సాయంత్రం పూట జరిగే ప్రోగ్రాములు కుటుంబ బాధ్యతల వలన పాల్గొనడం కష్టమని చెప్పారు.
9 మంది విద్యార్థినులు రవాణా సమస్యల వలన డిపార్టుమెంటుకు సమయానికి రావడం కష్టమని చెప్పారు.
7 మంది విద్యార్థినులు వివాహమైన స్త్రీల విద్య సమస్యల పట్ల డిపార్ట్‌మెంట్ వ్యక్తుల ఆలోచన, వ్యవహారం నిశ్చిత అభిప్రాయాలతో కూడి ఉంటాయని చెప్పారు.
6 మంది విద్యార్థినులు కుటుంబ బాధ్యతలు, కుటుంబ సభ్యులతో సంపర్కం సమస్యల వలన డిపార్ట్‌మెంట్‌కు తొందరగా రావడం, ఇంట్లో సాయంత్రం పరీక్షలకు చదువుకోవడం వంటివి సాధ్యం కావని చెప్పారు.
4 మంది విద్యార్థినులు కుటుంబ సభ్యులు తమని సమర్థత, స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తులుగా భావించరని, కుటుంబం మరియు డిపార్ట్‌మెంట్ మధ్య సమయం సరిగ్గా కేటాయించి పని జరపడం సాధ్యం కాదని చెప్పారు.
3 మంది విద్యార్థినులు కుటుంబంలో తమకు ఒక సభ్యునిగా స్థానం లేదని చెప్పారు.
2 మంది విద్యార్థినులు పిల్లల బాధ్యతల వలన విహారయాత్రలు, ఫీల్డ్ ట్రిప్‌లలో పాల్గొనడం కష్టమని చెప్పారు.
2 మంది విద్యార్థినులు కుటుంబ సమస్యలు ప్రస్తావిస్తూ, కుటుంబ సభ్యులు సాంప్రదాయపు పనులు చేసుకుంటే బావుంటుందనీ, తన చదువు పట్ల వ్యతిరేకత ఉందని, సోదరులతో సమానంగా చదువు చెప్పించాలన్న అభిప్రాయం లేదని, కో`ఎడ్యుకేషన్ సంస్థలలో చదవటం ఇష్టం లేదని, కుటుంబ వాతావరణం ఉద్యోగం చేయడానికి అనుకూలించదని, ఫీజు కట్టడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని చెప్పారు.
కుటుంబం విద్య లేక, అవగాహన లేక స్త్రీల విద్యను ప్రోత్సహించరని, కేవలం పెళ్ళి చేయడం కోసమే చదివిస్తున్నారనే అభిప్రాయాలను ఏ విద్యార్థినీ ఆమోదించలేదు.
కుటుంబ సమస్యలలో ఎక్కువగా సమయాభావం, కుటుంబ సభ్యుల సహకార లోపం మరియు ఆత్మవిశ్వాస రాహిత్యం ఎక్కువగా కనిపిస్తోంది. వివాహిత స్త్రీల గురించి సరయిన అవగాహన లేకపోవడం వంటివి ఆలోచించదగిన సమస్యలు. అయితే చాలా తక్కువమంది విద్యార్థినులు ఈ సమస్యల గురించి ప్రస్తావించారు. దీన్ని కుటుంబంలో స్త్రీల విద్య ఆవశ్యకత గురించి పెరిగిన అవగాహనగా భావించవచ్చు. సంఖ్యాపరంగా చూస్తే చాలా తక్కువమంది ఈ సమస్యల గురించి ప్రస్తావించారు. దీన్ని ఒక అనుకూలమైన ప్రతిస్పందనగా భావించవచ్చు. కుటుంబపరంగా స్త్రీలకూ విద్య గురించి సహకారం పెరిగిందని ఈ సంఖ్య సూచిస్తోంది.
ఉద్యోగ సమస్యలు :
్న శ్రమ, సమర్థత కంటే ఇతర విషయాల వలన ఉద్యోగం పొందగలమని 28 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న చదివిన విషయంలో (టీచింగ్ మెథడ్) తొందరగా ఉద్యోగాలు దొరకడం కష్టమని 14 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న ఎక్కువ డిగ్రీలు ఉంటే మంచి ఉద్యోగం దొరుకుతుందని 13 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న పురుషులకు తొందరగా ఉద్యోగం దొరికే అవకాశం ఎక్కువని 10 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న కుటుంబ బాధ్యతలు మరియు ఉద్యోగం సమంగా నిర్వర్తించడం కష్టమని 8 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న 8 నుంచి 10 గంటల సమయం ఉద్యోగం చేయడం కష్టమని 10 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న తక్కువ జీతానికి పని చేయవలసి వస్తుందని 9 మంది విద్యార్థినుల అభిప్రాయం.
్న ఉద్యోగం కొరకు సంక్షిప్త సమాచారం (బయోడేటా) తయారు చేయడం తెలియదని 9 మంది విద్యార్థినుల అభిప్రాయం.
5 మంది కంటే తక్కువ విద్యార్థినులు ఉద్యోగంపై శ్రద్ధ మరియు ఉత్సాహం లేవని, కంప్యూటర్ శిక్షణ లేదని, కుటుంబ బాధ్యతలు భారమని మరియు ఉద్యోగం పొందే కౌశత్వం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సగం మంది విద్యార్థినులు సమర్థత కంటే ఇతర విషయాల వల్ల ఉద్యోగం పొందగలమని చెప్పడం కొంత ఆలోచించవలసిన విషయం. ఇది స్త్రీ సమస్య కంటే సమాజ సమస్యగా పరిగణించవచ్చు. అయితే స్త్రీకి ఇది పురుషునికంటే ఎక్కువ సమస్య కావచ్చు (శ్రీఱసవ aపబంవ aఅస ష్ట్రaతీతీaంంఎవఅ్). ఉద్యోగం కూడా సమయాభావం వల్ల చేయడం కష్టమని చెప్పడం, కొంత ఒంటరిగా పెద్దలకు దూరంగా
ఉండడం వల్ల కావచ్చు. ఆ సమస్యలను కూడా తక్కువమంది విద్యార్థినులు వ్యక్తం చేయడం హర్షించదగ్గ విషయం. ఎక్కువ మందికి వృత్తిపరమైన సమస్యలు సంభాళించే అవగాహన లేదా సహకారం ఉందని ఆశించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలలో ఎలాంటి తయారీలో ఉండాలి అనే విషయం గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని విద్యార్థినుల సమాధానాలను బట్టి అర్థమవుతోంది.
ఉపసంహారం :
మొత్తం 46 మంది విద్యార్థినులలో సగం మంది సమయాభావ సమస్యల గురించి చెప్పారు. 20 అంతకంటే తక్కువ మంది అన్ని సమస్యల గురించి అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాధానాలు ఇచ్చిన సంఖ్యాపరంగా చూస్తే స్త్రీల విద్యపై పెరిగిన సమర్థత, అవగాహన సూచిస్తున్నాయని చెప్పవచ్చు. విద్యార్థినులు తమ విద్యావసరాల గురించి మంచి అవగాహన కలిగి ఉన్నారని భావించవచ్చు. సమస్యలను కూడా లోతుగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అయితే ఈ పరిశోధన ఒక డిపార్టుమెంటు విద్యార్థినుల అభిప్రాయాలను మాత్రమే వ్యక్తం చేస్తోంది. బరోడా వాతావరణం స్త్రీల సమస్యల గురించి సరిగా స్పందించి సహకరించి ఉండవచ్చు. అందువలన ప్రస్తుత పరిశోధన ఉన్నత విద్యలో స్త్రీల సమస్యలకు సంబంధించి ఒక చిన్న అంశం గురించిన అవగాహన అని భావించవచ్చును. పూర్తి అవగాహనకు ఇదే పరిశోధనను ఎక్కువ పరిధిలో జరపవలసిన అవసరం ఉంది.