అనుబంధం!
మనసుకు కావాలి అందం,
అందరికీ కావాలి అనుబంధం!
అనుబంధాలలో ఉందాం
కష్టాలను జయిద్దాం!
నవమాసాలు మోసేది రక్తసంబంధం,
మనకు తెలియనిది మానవ సంబంధం!
ఉందాం ఉందాం కలిసి ఉందాం,
అనుబంధంతో నివసిద్దాం!
మనం చేయకూడదు యుద్ధం,
ఏర్పరచుకోవాలి అనుబంధం!
ప్రయత్నిస్తే విజయం సాధిస్తాం,
మనకి కావాలి మానవ సంబంధం!!
` కె.సాయి కౌశిక్, 8వ తరగతి
సంబంధం
సంబంధం అంటే మానవ సంబంధం!
పెంచుకో నీ జీవితానికో అనుబంధం!
ప్రేమ, ఆప్యాయతతో కలిసి బ్రతకరా!
మనిషికి, మనిషి మీద గౌరవాన్ని నిలపరా!
డబ్బు మీద నీ జీవితం ఆధారపడనీయకు!
మానవ సంబంధమే నీకు తోడు
ఎన్నో జన్మల పుణ్యమా!
అందరం కలిసి మెలిసి బ్రతుకుదాం ఓ మానవుడా!!
నీవు చనిపోయినా నీ పేరు నిలుపుకో,
మానవ సంబంధం పెంచుకో!
పువ్వుని ఎంత సున్నితంగా చూసుకుంటావో,
అలాగే మానవ సంబంధాన్ని నీ గుండెల్లో పెట్టి చూసుకో…
` కె.నీర్జన, 7వ తరగతి
బంధాన్ని పెంచుకో
మనది భారతదేశం
బంధాలు, అనుబంధాలు ఉన్న దేశం.
అన్నదమ్ములు, అక్కాచెల్లెలు
బంధాలు ఎన్నో అనుబంధాలు!
జాలి, దయతో మసలుకో
నీ జీవితాన్ని కాపాడుకో!
ఉమ్మడి కుటుంబంతో
ఉన్నాయిరా సంబంధాలు!
మనలో లేవేమిరా ఈ బంధాలు
మనుషులతో స్నేహంగా ఉండరా!
తర్వాత వాళ్ళే మనకు అండరా!
మనకు ఎందరో స్నేహితులు
కానీ వాళ్ళలో స్నేహం లేదురా తమ్ముడా!
డబ్బే ప్రధానం అని దాని వెనకాల పడితే
చివరకు అది మనలను వదిలివేస్తుంది చెల్లెలా!
బంధాన్ని పెంచుకో
సంబంధాలను తెంచుకోకురా తమ్ముడా!
మానవ సంబంధాలు మరుగైపోతున్నాయి.
ఇకనైనా వాటిని వెలుగులోనికి తీసుకొద్దాం తమ్ముడా! చెల్లెలా!
` జి.మహేష్, 7వ తరగతి