బంగారు భవిష్యత్తు
బడికి మేము దారిలో రాబందులు
తగులుతాయని బడికి వెళ్ళె ఆమె బడి మనేసింది.
పుస్తకం. పట్టవలసిన చేతులతో పలుగు, పార పట్టింది
ఆ బాధలు చూడలేక భారం దింపుకోవాలని
తల్లిదండ్రులు బలవంతపు పెళ్ళి చేశారు.
14 ఏళ్ళకే గర్భం దాల్చింది. మరియు
గర్భస్రావం సమయంలో కనుమూసింది.
తల్లిదండ్రులు గుండేలు పగిలేల ఏడ్చారు.
మళ్ళి భర్త భార్య పోయిందన్న బాధలేకుండా
భర్త మళ్ళి పెళ్ళి చేసుకున్నాడు. బలవంతపు పెళ్ళి
బాలిక జీవితం నాశనం చేసింది.
బాలికలందరికి ఒకటే సూచన బలవంతపు పెళ్ళి వద్దు
బంగారు భవిష్యత్తు ముద్దు
` జి. జ్యోతి, 10వ తరగతి, భూనీడు.
కోకిల రాగం
రోజులా నిదుర లేచాను
కొత్తగా అనిపించింది మా పెరటులోని మామిడి చెట్టు
లేత చిగురు, పూలతో నిండుగా ఉంది
కాయలు, గుత్తులు గుత్తుల బరువును
ఎలా మోస్తుందో ఆ చెట్టు పాపం…
అనుకున్నాను మనస్సులో కొత్తగా
అమ్మను చూశాను ఓ సారి
కనిపించింది కొత్తగా, అందంగా
పోల్చుకున్నాను ఆ గున్నమామిడి చెట్టుతో
నన్ను, నా అల్లరిని భరించే అమ్మ
ఎలా ఉంటుందో ఇంత ప్రశాంతంగా
అమ్మ చేతిలో షడ్రుచుల పచ్చడితో
ముద్దిస్తూ చెప్పింది ఉగాది శుభాకాంక్షలని
అనిపించింది కోకిల రాగం కన్నా మిన్నగా…
నేను ఉండాలి అమ్మకు
ప్రతి రోజు ఓ ఉగాది పండుగలా…
` సిహెచ్.లిఖిత, 7వ తరగతి