మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి, అందరూ ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, తెలియని విషయాలను ఒకరి ద్వారా తెలుసుకోవడం. మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది.
ఐక్యతారాగం ఇంకా కొనసాగాలని అనుకుంటున్నాను. ఇంకా కొత్త కొత్త విషయాలను, కొత్త కొత్త సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను నేర్చుకున్న విషయాలను అందరికీ తెలియచేస్తున్నాను. ట్రాన్స్‌జెండర్స్‌ను గౌరవించాలని తెలుసుకున్నాను. మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగకుండా మనం మన గ్రామాల్లో అందరం ఒక్కటిగా అయి వాటిని ఆపడానికి ప్రయత్నం చేయాలని, సమస్యలు వచ్చిన వారికి అండగా, ధైర్యంగా ఉండాలని చెబుతున్నాను. కుల, మత విభేదాలు లేకుండా సమానంగా ఉండాలని, మనుషులంతా ఒక్కటేనని చెబుతున్నాను. ముందుగా కుటుంబంలో మార్పు రావాలి. ఆడ, మగ సమానంÑ ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా చూడాలి. ప్రతి విషయంలో. ఉదా: తిండి, ఆరోగ్యం, చదువు, పని. ఐక్యతారాగంలో నేర్చుకున్న విషయంలో నాకు నా కుటుంబంలో, అలాగే బంధువులలో, స్నేహితులలో
ఉపయోగపడుతున్నాయి. నేను నేర్చుకున్న విషయాలు ఫీల్డ్ పరంగా ఉపయోగపడుతున్నాయి. నాకు సంతోషంగా ఉంది. నేను ఐక్యతారాగంలో నాకు తెలియని విషయాలను తెలుసుకున్నాను. నేను ఇంతకుముందు ఆడవారితో మాట్లాడాలంటే భయం, సిగ్గు పడేవాడ్ని. కానీ ఇప్పుడు అందరితో ఎటువంటి భయం లేకుండా మాట్లాడుతున్నాను. సెషన్స్‌కి ప్లాన్ ఎలా చేయాలో కూడా నేర్చుకున్నాను. ఐక్యతారాగం ద్వారా చిన్నప్పటి విషయాలు కూడా గుర్తుకు వచ్చే విధంగా అయ్యాయి. కొత్త ప్రదేశాలను కూడా చూడడం జరిగింది. పని ప్రదేశంలో కొత్తవారితో పరిచయాలు కూడా అయ్యాయి.