ఐక్యతారాగం శిక్షణకి ముందు నేను ఒక స్త్రీని, బలహీనురాలిని. సమాజంలో కొన్ని పనులకు మాత్రమే పరిమితురాలిని. మనసుతో సంబంధం లేకుండా సమాజాన్ని, కుటుంబాన్ని, వయసుని దృష్టిలో పెట్టుకుని నా ప్రవర్తన ఉండేది. ఐక్యతారాగం శిక్షణ తరువాత నా ఆలోచనా
విధానం పూర్తిగా మారింది. ‘‘మనసు వేరు సమాజం వేరు’’, పితృస్వామ్య వ్యవస్థ నుండి వచ్చిన వాటిని ముందు నాలో మార్చుకున్నాను. తర్వాత, కుటుంబం మరియు సమాజంలో మార్పు తీసుకురాగలుగుతున్నాను అనే నమ్మకం ఏర్పడిరది. నా దృష్టి కోణం పూర్తిగా మారింది. సమాజానికి నచ్చినట్టు ఉండాలంటే జీవితాంతం మనసు చంపుకుని జీవించటం, ఒక నటన జీవితం జీవించాలి. ఎవరికీ భంగం కలిగించకుండా, స్వేచ్ఛగా జీవించడంలో తప్పు లేదని ఈ శిక్షణ ద్వారా అర్థం చేసుకున్నాను. సమాజంలో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడైనా, ఎవరి పరిస్థితులనైనా నెగటివ్‌గా చూడకుండా పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకున్నాను.
థాంక్యూ సో మచ్.