నేను ఈ మూడు సంవత్సరాలలో జరిగిన ఐక్యతారాగంలో చాలా విషయాలు నేర్చుకోవడంతో పాటుగా కొన్ని అంశాలలో నన్ను నేను మార్చుకోగలిగాను. వ్యక్తిగతంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. చాలా అంశాలపై నా వ్యక్తిగత అభిప్రాయాలను అందరిముందు
వ్యక్తపరచడానికి సంకోచిస్తాను. మన మాటలకు ఎవరు ఎలా స్పందిస్తారో అనే ఒక భావన ఉండేది. కానీ ఐక్యతారాగంలో చేరినప్పటినుంచి నాలో కొంత మార్పు వచ్చింది. సౌకర్యవంతంగా మాట్లాడగలుగుతున్నాను.
శిక్షణలో భాగంగా నందిని గారు, ప్రశాంతి గారు శిక్షణలో పాల్గొన్న ప్రతి ఒక్కరి అభిప్రాయాలను తెలుసుకోవడం, దాన్ని అర్థవంతంగా మార్చి తిరిగి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం వలన స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను. అందరితో కలిసి మాట్లాడడం, పనిచేయడం వలన చాలా విషయాలను తెలుసుకోగలిగాను. వాటినుండి నేర్చుకున్న సమాచారాన్ని మా పనిలో ఉపయోగించగలుగుతున్నాను. విభిన్న నేపథ్యాలు ఉన్న వ్యక్తులతో కలిసి కొద్దిరోజులు
ఉండడం వలన నాలో కూడా మార్పు వచ్చింది. అందరి జీవనశైలి, పరిస్థితులు తెలుసుకోవడం వలన అందరినీ అర్థం చేసుకునే విధానంలో మార్పు రావడం జరిగింది. ఇది వృత్తిపరంగా ఎంత ఉపయోగపడిరదో, వ్యక్తిగతంగా కూడా అంతే మార్పు తీసుకువచ్చింది. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశం కూడా చాలా ఉపయోగకరంగా ఉండడం వలన వృత్తిపరంగా చాలా కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను. ఎక్కువమందితో కలిసి పనిచేయడం, సమావేశాల్లో శిక్షణనివ్వడం వంటి వాటిలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా మన కమ్యూనిటీ ప్రాంతాల్లోను, పోలీసు శిక్షణలు చేస్తున్నప్పుడు ఐక్యతారాగంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఉపయోగించగలుగుతున్నాను.