ఐక్యతారాగం శిక్షణలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ శిక్షణలో పాల్గొనడం వలన టీమ్ అందరి మధ్యలో మంచి స్నేహ భావం పెంపొందింది. ఒక్కొక్క సంస్థ మరియు సంస్థలో పని చేస్తున్న వారి యొక్క విభిన్న ఆలోచనలు, ఎక్స్‌పీరియన్స్
పంచుకోవడం వలన సభ్యులందరిలో చాలా మార్పు కలిగింది అనుకుంటున్నాను. టీమ్ అందరూ కూడా సమాజంలో ఉన్న సమస్యలని స్త్రీల దృక్పథం నుండి చూడటానికి, ఆలోచించడానికి ఈ శిక్షణ చాలా ఉపయోగపడిరది. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చాలా కొత్త విషయాలు ` మహిళా ఉద్యమాలు, సిడా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల హక్కులు ఇలాంటివి చాలా తెలుసుకొని అర్థం చేసుకోగలిగారు అనుకుంటున్నాను. ఈ శిక్షణలో భాగస్వాములు కావడం వలన వారిలో ఉన్న క్రియేటివిటీ ` పాటలు, కవితలు, న్యూస్ రీడర్స్ ఇలా బయట పెట్టగలిగారు. మొత్తంగా ఇది సభ్యులలో ఐక్యతకు మరియు ముందు ముందు అందరం కలిసి పని చేయడానికి అవకాశం ఏర్పడిరది అనిపిస్తుంది. కొత్త కొత్త ప్రదేశాలకి వెళ్ళి కొత్త వ్యక్తులతో మాట్లాడి ఆ ప్రదేశాలలో సెషన్స్ చేయడం వలన టీమ్ అందరిలో వారి మీద వారికి నమ్మకం పెరిగింది.
అనేక రకాల ఉద్యమాలలో భాగస్వాములయ్యి అనేక చట్టాలు, పాలసీలలో మార్పు తీసుకొని రావడానికి కారణమయిన వ్యక్తులని కలవడం కూడా టీమ్ అందరికీ మార్గదర్శకంగా, స్పూర్తిదాయకంగా ఉంది. శిక్షణలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ కూడా థ్యాంక్స్.