ప్రతి సంస్థ నుండి ఐక్యతారాగం ట్రైనింగ్ తీసుకున్న సభ్యులు బృందాలుగా ఏర్పడి ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకుని ఆ సారాంశాన్ని ఒకే అభిప్రాయానికి చేర్చి ఇంటర్వ్యూ రూపంలో రాయడమైనది.
1. 3 సంస్థలతో పనిచేయడం మీకు ఎలా అనిపించింది?
జ. పరిచయాలు పెరిగాయి. ఒకరిమధ్య ఒకరికి స్నేహభావం పెరిగింది. కలిసి పనిచేయగలిగాము. ఒకరికొకరం సందేహాలను అడిగి తెలుసుకున్నాం. అందరం ఒకటే, ఒకే సంస్థలో పనిచేసిన భావన వచ్చింది. 3 సంస్థలు వేరే అనే ఫీలింగ్ లేదు. కలిసి పనిచేయగలమనే నమ్మకం వచ్చింది. మిగతా 2 సంస్థల యొక్క ఉద్దేశాలను అర్ధం చేసుకోగలిగాము. పని విధానం తెలుసుకోగలిగాము. ఆ సంస్థలు పనిచేస్తున్న ప్రదేశాలను చూడగలిగాము. ఇక్కడి సామాజిక పరిస్థితులను తెలుసుకోగలిగాము. చాలా సంతోషమనిపించింది.
2. మీరు నేర్చుకున్న అంశాల్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన (లేదా) ఆలోచింపచేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తెలుపగలరు?
జ. కౌన్సిలింగ్‌తో జెండర్ దృక్పథంతో కుటుంబాలని అర్థం చేసుకునేలా రోజువారీగా కూడా ఫెసిలిటేషన్ చేయగలుగుతున్నాము. లైంగికతను అర్థం చేసుకుని కౌన్సిలింగ్లో భాగంగా అర్థం చేసుకుని ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నాము.
3. ఐక్యతారాగం ద్వారా వ్యక్తిగతంగా మీలో వచ్చిన మార్పు ఏమిటి?
జ. కలిసి పనిచేయగలం అనే నమ్మకం పెరిగింది. స్త్రీ దృక్పథంతో చూడాల్సిన అంశాలను మళ్ళీ ఒకసారి గుర్తుచేసుకోవడం. సమాచార స్థాయి పెరిగింది. అందరితో కలిసి పనిచేయడం, చేయించడం, ఓపికతో సమయపాలన పాటించడం లాంటివి నేర్చుకోగలిగాము. ఎలాంటి కొత్త స్థలాల్లో అయినా కూడా పని చేయగలమనే నమ్మకం పెరిగింది. స్త్రీ దృక్పథం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా చర్చించడం పాటించేలా చేయగలుగుతున్నాము. పని చేయడంలో కుటుంబం నుండి దొరికే సహకారం అర్థం చేయించగలుగుతున్నాము.
4. మీరు నేర్చుకున్న అంశాలు మీకు పనిలో ఎలా ఉపయోగపడ్డాయి? ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్తారు?
జ. ప్రతి అంశం కుటుంబం, బంధువులు, ప్రొఫెషన్లలో ఎదురవుతున్నాయి, వాటిని ఎదుర్కోగలుగుతున్నాము. కాన్ఫిడెంట్‌గా మార్పు తీసుకురావడంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. మిగతా టీంకి కూడా అంశాన్ని స్త్రీ దృక్పథంలో చూసేలా నేర్పించడం చేయగలుగుతున్నాము. మిగతా టీంకి కూడా చేసే కార్యక్రమాల్లో ఓరియంటేషన్ ఇవ్వొచ్చు. ఫెసిలిటేటర్స్‌గా, మాడ్యూల్స్ చేయడంలో, అంశాలను గుర్తించడంలో, సులభమయిన తెలుగు భాషలో మెటీరియల్ తయారుచేయాలి. టీం లీడ్ చేసుకుని మిగతావాళ్ళు చేసేలా, అందరూ పాల్గొనేలా చేయగలుగుతాం. సమయపాలన పాటిస్తూ ప్రణాళికా బద్ధంగా పని చేయడంÑ మిగతా టీంకి నేర్చుకున్న అంశాలను పంచుతున్నాము. సంస్థలో పని చేస్తున్న సభ్యులందరూ ఒకే దృక్పథంతో పనిచేసేలా అవగాహన కల్పించడం.
5. జెండర్ సంబంధిత అంశాలను మీ కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ పనిచేసే చోట మరియు ఇతర ప్రాంతాల్లో అమలు చేయడానికి/చేయడంలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
జ. సమస్యను ఎవరూ ఒప్పుకోరు. కుటుంబంలో పనిని పంచుకుని చేయగలగడం. కుటుంబంలో తోటికోడళ్ళు, ఆడపడుచులకు, పితృస్వామ్య వ్యవస్థ ద్వారా వచ్చే సమస్యల్ని అర్థం చేయించడం, పిల్లల్ని సమానంగా చదివించడం, కట్నం ఇవ్వడం వలన ఎదురయ్యే సమస్యల్ని అన్ని రకాల హింసల్ని అర్థం చేయించడం, హింసకు కారణాలు వెతకడం, హింస నుంచి బయటపడే మార్గాలను వెతికేలా ఆలోచింపచేయడం, సెల్ప్ కాన్ఫిడెన్స్‌ని పెంచేలా మానసిక ధైర్యాన్ని అందివ్వడం. తన సమస్యను తను పరిష్కరించుకునేలా ఫెసిలిటేషన్ చేయగలుగుతున్నాము. ఫ్రెండ్స్‌తో డి.వి.సి, ఎకనామిక్, జెండర్ స్పృహ గురించి చర్చించడం, నిర్ణయం తీసుకునేలా చూడడం.
6. స్త్రీ వాద దృక్పథంతో యువనాయకత్వాన్ని ఒక ఉద్యమంలాగా ముందుకు నడపడానికి ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా?
జ. ఇంకా సమాచార స్థాయిని పెంచుకోవడానికి పుస్తకాలు చదవడం, సోషల్ మీడియా నాలెడ్జిని పెంచుకోవాలి.
ఉద్యమాలలో పాల్గొనాలి. ఉద్యమకారులతో కలిసి పనిచేయడం వలన వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. నెట్వర్క్స్ ఏమున్నాయి. అవే అవగాహనా పెంచుకోవాలి. సామాజిక మాధ్యమాలను ఉపయోగించి సామాజిక ఉద్యమాల్లో పాల్గొనేలా నేర్చుకోవాలనుకుంటున్నాము. జోగినీ వ్యవస్థ గురించి విషయాన్ని తెలుసుకోగలిగాము. ట్రాన్స్‌జెండర్ సమస్యలను అర్థం చేసుకుని వారిని గౌరవంగా, సమానంగా చూడాలి. సమాజంలో, కుటుంబాల్లో అలా చూడటం లేదు. కానీ నాకు ప్రయాణం చేస్తుండగా ఎదురైన వారిని స్నేహభావంతో భయపడకుండా మాట్లాడగలిగాము. చుట్టుపక్కల వాళ్ళకి అర్థం చేయించగలిగాము.
7. 3 సంస్థల సభ్యులు కలిసి ఫెసిలిటేటర్స్‌గా ఎలా ముందుకు వెళ్ళవచ్చు?
జ. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి ఫెసిలిటేటర్స్‌గా వెళ్ళడానికి సమయం. బడ్జెట్ అవసరమవుతాయి. ఆర్గనైజేషన్స్ సపోర్టు చేయగలగాలి. అలా చేయడం వలన కొత్త మనుషులు, కొత్త స్థలం, సమస్యలు డిఫరెంట్‌గా ఉంటాయి. అప్పుడు మన దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుతాము. అక్కడ ఉన్న కొత్త విషయాలను పరిస్థితులను తెలుసుకుంటాము. అలా ఎక్స్పోజర్ అవ్వడం వలన మనకు నాల్డెజ్ పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటుంది. 3 సంస్థల సభ్యులు కూడా ఒకే విధమైన ఆలోచన దృక్పధం ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవడం, పని తీరుని అర్థం చేసుకోగలగడం.
మేము నేర్చుకున్న అన్ని అంశాలు మాకు కౌన్సిలింగ్లో రెస్పాండెంట్స్కి లింకుతో అర్థం చేయించడానికి చాలా
ఉపయోగపడుతున్నాయి. లైంగిక వేధింపు, పనిభారం, చిన్నచూపు, ఆర్థికపాలసీ, ఆరోగ్య నిర్లక్ష్యం, పితృస్వామ్య వ్యవస్థ ప్రభావం, ప్రతి మహిళ ఎదుర్కోవడం… సెషన్స్‌లో పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము. సర్వైవర్స్‌కి న్యాయం, సపోర్టు చేయగలుగుతున్నాము. మార్పుకి ప్రయత్నం జరుగుతోంది. సెషన్స్ ప్లాన్లు, మీటింగులు ఆర్గనైజ్ చేయడం, ఇంప్లిమెంటేషన్ చేయగలగడంతో పాటు మాడ్యూల్స్ తయారు చేయగలుగుతున్నాము. ప్రాక్టికల్‌గా రోల్‌ప్లే చేయడం, స్క్రిప్ట్ ప్రిపరేషన్ చేయడం.. వంటివి చేయడం వలన గ్రామస్థాయిలో కూడా చేయగలిగామనే నమ్మకం వచ్చింది.