బాలల స్వభావం
నెహ్రుగారి జన్మదినం
బాలలందరికీ శుభదినం
పిల్లల ఆటపాటలతో ఆనందం
వారే మన భారతదేశపు భవితవ్యం
వారి మోములో అమాయకత్వం
వారు చూపించే మొండితనం
కల్మషం లేని దరహాసం
వారిని చూస్తే వచ్చే జ్ఞాపకం
మనలోని స్వచ్ఛతనం మానవత్వం
చిన్నతనంలో వారు చేసే అల్లరి
మరువలేము జీవితంలో అవి
అమ్మా నాన్నల ప్రేమను కోరే ఉత్సాహం
వారే అమ్మానాన్నలకు నమ్మకం
` జి.సాయి సీతాదేవి, పదవ తరగతి
బాలలు… వారి రూపాలు
బాలలు బాలలు బాలలు
భగవంతుని రూపాలు
కృష్ణుడి లాంటి చిలిపి పనులు
దొంగిలిస్తారు పెద్దల మనసులు
పెంచుతారు మన మదిలో వారి మీద ప్రేమలు
చిలిపి దొంగలకే వీరు రాజులు మహారాజులు
చదువు మీద ఇష్టం తక్కువ
ఆటల మీద ఆసక్తి ఎక్కువ
చిరునవ్వులకు చిరునామాలు మన బాలలు
పూ రేకుల వంటి పెదాలపై ముసిముసి నవ్వులతో
ముద్దు ముద్దు మాటలతో
చిట్టి పొట్టి అడుగులతో
వచ్చీరాని బంధాలతో పిలుస్తూ
అల్లరి కృష్ణుడు అనే పేరును సంపాదిస్తూ
నేటి భావిభారత పౌరులై నిలిచి
మంచి భవిష్యత్తు కోసం వేచి
ఆనందం తెప్పిస్తారు మన బాలలు
బాలలు బాలలు బాలలు
` వి.రేష్మిత అఖిల శ్రీ, ఎనిమిదవ తరగతి,
బాలలు`రేపటి పౌరులు
బాలలు రేపటి పౌరులు
నేటి తరాన్ని తీర్చిదిద్దే వీరులు
అందరినీ మురిపించే ఆణిముత్యాలు
అల్లరి చేసే అల్లరి పిడుగులు
చిలక పలుకులు పలికే చిన్నారులు
సరదాగా మాట్లాడే సిరిమువ్వలు
గలగలమని మాట్లాడే గడుసులు
వాస్తవాలు పలికే విరిసిన పువ్వులు
చిరునవ్వులు చిందించే చిగురాకులు
పలుకుతున్నారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
` జి.గౌమిక, పదవ తరగతి
బాలలు`రేపటి పౌరులు
బాలలు రేపటి పౌరులు
నేటి తరాన్ని తీర్చిదిద్దే వీరులు
అందరినీ మురిపించే ఆణిముత్యాలు
అల్లరి చేసే అల్లరి పిడుగులు
చిలక పలుకులు పలికే చిన్నారులు
సరదాగా మాట్లాడే సిరిమువ్వలు
గలగలమని మాట్లాడే గడుసులు
వాస్తవాలు పలికే విరిసిన పువ్వులు
చిరునవ్వులు చిందించే చిగురాకులు
పలుకుతున్నారు బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
` జి.గౌమిక, పదవ తరగతి
ప్రియమైన బాలలు
ఎన్నో చిలిపి పనులు
కపటం లేని నవ్వులు
పూల వంటి సుతిమెత్తని మనసులు
ఎవరినీ నొప్పించక పలికే పలుకులు
అమ్మ మాట వినక ఆడే ఆటలు
సొంతగా ఆలపించే పాటలు
చిరునవ్వుని పంచే చిన్నారులు
కల్మషం ఎరుగని చిరుదివ్వెలు
ఎనలేని ఆనందాలు
కలవారే మన ప్రియమైన బాలలు
వారే రేపటి పౌరులు… నేటి పిల్లలు…
` డి. నీలిమ కృష్ణ, పదవ తరగతి