ఎవరికైనా అవసరమే…! ` -నాంపల్లి సుజాత

కాలంతో…
భూగోళంతో కలిసి నడవడమే
అప్డేట్‌ అవ్వడమంటే…

ఆకులు రాలాయనో
మలిసంధ్య ఎదురొచ్చిందనో ముడుచుకోక
తాజాగా చివుర్లను మొలిపించుకోవడం
అవసరమే ఎవరికైనా

రాగంలో రాగమై వర్ణంలో వర్ణమై
అడుగు కలిపి సాగితేనే
సరికొత్త దీపకాంతులమై ప్రజ్వలించేది.

పరిణామక్రమాన్ని అంగీకరించిన
ఒకనాటి అగ్నికలశమే
ప్రాణిని ఆవిష్కరింప చేసిన జీవగ్రహం

తనను తాను
సంస్కరించుకోకుంటే ఇంకేముందీ
పుట్టలు పెరిగి పాకురుపట్టి పోమూ!?

గొంగళి పురుగు నవీకరించుకుంటేనే
రంగుల సీతాకోకై రెక్కవిచ్చేది
రాగి పాత్రలని రుద్ది మెరిపించకుంటే
బొగ్గుల మయమే కదా

ఎప్పటికీ ముట్టని ఊటబాయి మంచినీళ్ళు
మర్లబడి తెర్లయిపోవూ…
భూకేంద్రక సిద్ధాంతమే సరిjైుందంటూ
ఆదిమయుగాల్లోనే జీవిస్తుంటారు కొందరెందుకో
వాడకుంటే మెదడుకూడా
అంతరించిపోతుంది వాలము లాగే

నవీకరించుకోవడం అంటే…
రంగుల రెక్కలను అతికించుకొని
గాల్లో విహరించమని కాదు.
రంగు వెలిసిపోకుండా నీకు నువ్వు పరిమళించమని

ఒక్క మనుషులకే కాదు
సర్వోపకరణాలకు నవీకరణ ఆవశ్యకమే…!
నేను సృష్టించిన చరవాణే
ప్రాధేయపడుతోంది
అప్డేట్‌ అయ్యేందుకు అనుమతి నియ్యమని!
ప్రాణం లేని పరికరమే
అదేపనిగా ఆరాటపడుతుంటే
నన్ను నేను నవీకరించుకోవద్దూ…!?

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.