తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ`శాంతి ర్యాలీ

హైదరాబాద్‌ నడిబొడ్డున వందలాది మంది ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ‘‘మేము శాంతి, ఐక్యత కోసం కలిసి నడుస్తాం. మేము మత విద్వేషాన్ని తిరస్కరిస్తున్నాం’’.
` రాజ్యాంగాన్ని నిలబెడతామని ప్రతిజ్ఞ చేస్తూ అన్ని వర్గాల వాళ్ళ నుంచి భాగస్వామ్యం ` ర్యాలీ తర్వాత, ‘‘తెలంగాణ ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ’’ మత సామరస్య ప్రచారం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

` ప్రజల, ముఖ్యంగా మైనారిటీల రాజ్యాంగ హక్కులపై పెరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అనేకమంది ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా శ్రేయస్సు కోరే పౌరుల, ప్రజా సంఘాల విస్తృత వేదిక అయిన తెలంగాణా ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ (టిపియు) ఆధ్వర్యంలో, ఈ రోజు హైదరాబాద్‌ నడిబొడ్డున బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం దగ్గరున్న బాబు జగ్జీవన్‌ రామ్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌ బండ్‌ దగ్గర బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు శాంతి ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడిరది. ర్యాలీలో పాల్గొన్నవాళ్ళు ‘‘మేము శాంతి కోసం ఐక్యంగా ఉన్నాము’’, ‘‘మత విద్వేషాలకు నో చెప్పండి’’, ‘‘మజ్హబ్‌ నహీ సిఖాతా ఆపస్‌ మే బైర్‌ రఖ్నా’’, ‘‘మానవత్వమే మా అందరి మతం’’ వంటి మత సామరస్యం, శాంతి కోసం పిలుపునిచ్చే సందేశాలు పోస్టర్ల ద్వారా ఇచ్చారు. టిపియు అనేది హైదరాబాద్‌తో పాటు తెలంగాణా అంతటా అన్ని మతాల ప్రజల మధ్య శాంతి, ఐక్యతను నెలకొల్పడానికి పనిచేసే ఒక వేదిక. ముఖ్యంగా, మత ఛాందసవాద శక్తులు దేశంలో మత విద్వేషాలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితులకు స్పందిస్తూ ఏర్పాటయిన వేదిక. ఈ ఫోరం ఏప్రిల్‌ 20వ తేదీన ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి ఈ అంశాలపై ముఖ్యమంత్రికి లేఖ రాసింది. శాంతి ర్యాలీ ఈ ఫోరమ్‌ యొక్క మొదటి బహిరంగ కార్యక్రమం. ఆ తర్వాత హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో, తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లో మత సామరస్య ప్రచారం జరుగుతుంది.
ఈ ర్యాలీలో అనేకమంది ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందులో ప్రొఫెసర్‌ రమా మెల్కోటే (ప్రముఖ కార్యకర్త, ఓయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌), ప్రొఫెసర్‌ పద్మజా షా (రచయిత్రి, ఓయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌), వి.సంధ్య (పిఓడబ్ల్యు), కొండవీటి సత్యవతి, పి.ప్రశాంతి (భూమిక), ఖలీదా పర్వీన్‌ (అమూమత్‌ సొసైటీ), కె.సజయ (తెలంగాణ ఉమెన్‌Êట్రాన్స్‌జెండర్‌ జెఎసి), మజర్‌ హుస్సేన్‌ (సిఓవిఎ), మరియా తబస్సుమ్‌ (విద్యావేత్త), సారా మాథ్యూ (సంకల్ప్‌ ఉమెన్స్‌ సపోర్ట్‌ అలయన్స్‌), కిరణ్‌కుమార్‌ విస్సా (రైతుస్వరాజ్యవ్‌ వేదిక), మీరా సంఘమిత్ర (నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌`ఎన్‌ఎపిఎం), సిస్టర్‌ లిస్సీ మరియు సిస్టర్‌ రోసీ (తెలంగాణ గొమెస్టిక్‌ వర్కర్స్‌ యూనియన్‌), రaాన్సీ (పి.ఓ.డబ్ల్యు), ఎం.ఎ.షకీల్‌ (న్యాయవాది), ఖలీద్‌ ఖాన్‌ (ఆలిండియా ముస్లిం సంఘం), విమల మోర్తలా (రచయిత్రి, సామాజిక కార్యకర్త), కృష్ణకుమారి (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు), సబా ఖాద్రీ Ê జాహిద్‌ ఖాద్రీ (హెల్ప్‌ హైదరాబాద్‌), సుజాత సూరేపల్లి Ê దీప్తి సిర్ల (దళిత ఉమెన్స్‌ కలెక్టివ్‌), ఇమ్రాన్‌ సిద్ధిఖీ తదితరులు ఉన్నారు.
ఈ ర్యాలీ భారత రాజ్యాంగ ప్రవేశ పఠనంతో ప్రారంభమై, అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఉమ్మడి తీర్మానాన్ని చదవడం, సీనియర్‌ కార్యకర్తల వ్యాఖ్యలు, జాతీయ గీతాలాపనతో ముగిసింది. పెరుగుతున్న మత సామరస్య సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, తెలంగాణ ఫర్‌ పీఎస్‌ అండ్‌ యూనిటీ భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి, మన రాష్ట్ర సమకాలీన, లౌకికతత్వాన్ని కాపాడడానికి, మైనారిటీల, అట్టడుగు వర్గాలతో సహా పౌరులందరి హక్కులను కాపాడడానికి కలిసి వచ్చినట్లు తీర్మానంలో పేర్కొంది. అన్ని విశ్వాసాల శాంతి, సహజీవనం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, చేస్తామని తీర్మానం ప్రకటించింది. ఈ తీర్మానం అన్ని వర్గాల ప్రజలకు శాంతి యొక్క ప్రయత్నాలను పటిష్టం చేయాలని, ప్రత్యేకించి వాళ్ళ సొంత వర్గాలలో ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని సవాలు చేయాలని, వాళ్ళున్న ప్రాంతాలలో బహుళ విశ్వాసాల శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతి ప్రచారాన్ని ప్రారంభించి, రాష్ట్రంలో మతపరమైన హింస లేకుండా ఉండేలా చూడాలని కూడా తెలంగాణా ప్రభుత్వానికి ఈ తీర్మానం విజ్ఞప్తి చేస్తుంది.
శాంతి ర్యాలీ తర్వాత, తెలంగాణా ఫర్‌ పీస్‌ అండ్‌ యూనిటీ రాబోయే నెలల్లో రాష్ట్రంలోని ప్రజలతో కలిసి మత రాజకీయాలు, మతపరమైన విద్వేషపూరిత ప్రచారం యొక్క ఆకర్షణ నుండి వాళ్ళను దూరం చేయడానికి, తెలంగాణ యొక్క సమ్మిళిత సహన సంస్కృతిని కాపాడాలని ప్రణాళిక రచిస్తుంది. ఈ మత సామరస్య ప్రచారం హైదరాబాద్‌లోని ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం, ముఖ్యంగా సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించి చేపట్టబడుతుంది.
ప్రొఫెసర్‌ రమా మెల్కోటే ః ‘‘కొన్ని వర్గాల ప్రజలు వేదనకు, వివక్షకు గురవుతున్న ఈ పరిస్థితులలో దేశాన్ని నిర్మించలేము. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, రాజ్యాంగ స్ఫూర్తిని, నైతికతను కాపాడుకోవడానికి, పౌర సమాజంలోని ప్రజలు చేతులు కలిపి, నిరంకుశత్వానికి, మత దురభిమానానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాల్సిన సమయం ఇది’’.
ప్రొఫెసర్‌ పద్మజా షా: ‘‘ఏ దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రజల్లో తాము సంతోషంగా, సురక్షితంగా ఉన్న భావన ఉన్నప్పుడు శ్రేయస్సు ఉంటుంది. ప్రజలు మతపరమైన ఇబ్బందులకు, ద్వేషాలకు భయపడి బతుకుతున్నప్పుడు కుటుంబాలు జీవనోపాధి పొందేందుకు, వాళ్ళ పిల్లలను చదివించడానికి ఇది తోడ్పడదు. మన మొహల్లాలు, బస్తీలు, కమ్యూనిటీలను శాంతియుతంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత. అలాగే మన పిల్లలు విద్వేష రాజకీయాలకు పాల్పడకుండా చూసుకోవడం కూడా.’’
ఖలీదా పర్వీన్‌ : ‘‘మేము మా సొంత ప్రాంతాలలో శాంతి కోసం పిలుపునిస్తాము. మనం మన యువతకు అన్ని మతాల మధ్య సౌభ్రాతృత్వాన్ని నేర్పాలి. మన రాజ్యాంగం సోదరభావం, ఐక్యతను తెలుపుతుంది. భారతదేశంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మేము అనుమతించము. విద్య, ఉపాధి, నివాసం, ఆరోగ్యం మన ప్రజా సమస్యలు… మతం కాదు.’’
మజ్హర్‌ హుస్సేన్‌ : ‘‘హైదరాబాద్‌లో లేదా తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా అల్లర్లు పునరావృతం కాకుండా ప్రజలను శాంతి భద్రతల మార్గదర్శకులుగా మార్చడం, వారి ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించడం మా మొదటి సంకల్పం. గత 20 ఏళ్ళలో, హైదరాబాద్‌లోని సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్లు సున్నితమైన ప్రాంతాల ప్రజలను ప్రేరేపించి శిక్షణనివ్వడం ద్వారా అల్లర్లను నిరోధించవచ్చని నిరూపించాయి.’’
సిస్టర్‌ లిస్సీ: ‘‘ప్రజల రాజ్యాంగ హక్కులు మన దేశ ప్రజలు చాలా కాలం నిరీక్షణ తర్వాత దక్కిన బహుమతి. శాంతిని కోరుకునే వారందరి సంఫీుభావం ఈ ర్యాలీ. శాంతి భద్రతల కోసం పరిపాలించే వారికి ఇది ఒక సందేశం. అలాగే శాంతిని నాశనం చేయడానికి ప్రయత్నించే వారికి ఒక గుణపాఠం.’’
కిరణ్‌ విస్సా: ‘‘మన సొంత కమ్యూనిటీల్లోనే ద్వేషం, తప్పుడు సమాచారం, హింస కోసం పిలుపునిచ్చే సందేశాలను చూసి, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తాలని మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అప్పుడే ప్రస్తుత పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించగలం.’’
సారా మాథ్యూ: ‘‘స్థిరత్వం, శ్రేయస్సు కోసం శాంతి పునాది. బాధ్యతాయుతమైన పౌరులు ఏకతాటి పైకి రావడం, శాంతి భద్రతల పతాకం ఎగరేయడం, మన రాజ్యాంగాన్ని నిలబెట్టడం ఇలాంటి సమయంలో అవసరం. ఈ శాంతి ర్యాలీతో ఈ గొప్ప
ఉద్దేశానికి సంఫీుభావం తెలుపుదాం.’’
మీరా సంఘమిత్ర: ‘‘తెలంగాణ వేరే కొన్ని రాష్ట్రాల లాగా మతహింసను పెద్దగా చూడనప్పటికీ, రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు చాలా కలతపెట్టే విధంగా ఉన్నాయి. శాంతియుత సహజీవనం ఆకాంక్షించే మనమందరం ఆ వాతావరణం చెదిరిపోకుండా చూసుకోవడానికి చాలా కష్టపడాలి. మనం తెలంగాణాలోని ప్రతి భాగానికి టిపియు మరియు రాజ్యాంగ విలువల స్ఫూర్తిని తీసుకెళ్ళి ప్రజల జీవనోపాధిని, సామాజిక భద్రతను కోరుకుంటున్నారని, ద్వేషం, నేరాలను, మత వివక్షను కోరుకోవట్లేదని నిరూపించాలి.’’
ఇమ్రాన్‌ సిద్ధిఖీ: ‘‘హిందూ ముస్లింల స్నేహపూర్వక సహజీవనం ఉండే గంగా జమునా సంస్కృతి హైదరాబాద్‌లో మనం గర్వించదగిన ప్రధాన లక్షణం. ఇది హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌లో ముఖ్యమైన భాగం. దీన్ని సంరక్షించడం హైదరాబాదీలందరికీ ఎంతో ముఖ్యం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.