ఐక్యతారాగం శిక్షణ తీసుకున్న తర్వాత నాలో చాలా ధైర్యమొచ్చింది. బస్తీకి వెళ్ళినపుడు బస్తీవాసులతో మాట్లాడే క్రమంలో వేరే వాళ్ళ వ్యక్తిత్వం గురించి వాళ్ళు నాకు చెప్పినపుడు ఏం మాట్లాడాలో నాకు అర్థమయ్యేది కాదు, మౌనంగా
ఉండిపోయేదాన్ని. కానీ ఐక్యతారాగం శిక్షణ తర్వాత వాళ్ళు చెప్పింది విని వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారో అర్థం చేసుకుని నాళ్ళ గురించి నాకు చెప్పిన వ్యక్తులకు తిరిగి వాళ్ళ గురించి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది.
గల్లీ మీటింగులో ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు చాలా భయంగా ఉండేది. కానీ ఈ శిక్షణ తర్వాత ఆ మీటింగులలో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. ఐక్యతారాగంలో నేర్చుకున్న ప్రతి యాక్టివిటీ గల్లీ మీటింగుల్లో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. నేను అక్కడ ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. మీటింగులో పాల్గొన్న వారితో గేమ్స్ ఆడిరచి ఆ గేమ్ యొక్క ఉద్దేశాన్ని గురించి వారికి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాను. ఐక్యతారాగంలో నేర్చుకున్న ప్రతి యాక్టివిటీ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగపడుతుంది అని ఆలోచించి నేను చేసే పనిలో వాటిని ఉపయోగించగలుగుతున్నాను. అధికార చక్రం అనే పద్ధతి ద్వారా ఒక వ్యక్తి చుట్టూ ఉన్న అనేక ప్రభావాలు ఎలా పనిచేస్తాయనేది బాగా అర్థమైంది. ఇంటర్‌సెక్స్ గురించి కూడా నాకు గతంలో తెలియదు. ఈ శిక్షణ తర్వాత దాని గురించి తెలుసుకోగలిగాను. బస్తీలలో ట్రాన్స్‌జెండర్స్ గురించి బస్తీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ట్రాన్స్ జెండర్స్ అలా కావడానికి కారణాలేంటనేది బస్తీ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నాను. ఎక్కడైనా సందేహం లేకుండా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను.
థాంక్స్ ‘ఐక్యతారాగం’. ఇలాంటి శిక్షణలు ఇక ముందు కూడా చాలా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఐక్యతారాగం నాకు ఎన్నో నైపుణ్యాల గురించి తెలుసుకునే అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు.