దృశ్యమాధ్యమం ద్వారా చైతన్యం

విషయసేకరణ : టి.ఎల్‌ భాస్కర్‌, ప్రాజెక్టు హెడ్‌, భూమిక, చేతన కమ్యూనిటీ టీవీ
బైర్రాజు పౌండేషన్‌ లాభాపేక్షలేని స్వచ్చందసేవా సంస్థ ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచి గ్రామీణ వికాసం దిశగా తీసుకువెళ్లాలని 2001 జూలై మాసంలో స్థాపించబడి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా  జిల్లాల్లో 200 గ్రామాలను దత్తత తీసుకుని వైద్యం, విద్య, వయోజన విద్య, వ్యవసాయం, పారిశుద్ధ్యం, సురక్షిత త్రాగునీరు, మహిళాసాధికారత, జీవనోపాధి, మహిళలజీవనోపాధి, కమ్యూనిటీ టివీ, అశ్వని ప్రాజెక్టుల ద్వారా కొన్ని వేల మందికి సేవ చేస్తూ ప్రజల భాగస్వామ్యం – విజ్ఞాన వినియోగం – ఆశయసాఫల్యం అనే మూడు మౌలిక సిద్ధాంతాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది.
యునెస్కో వారి సౌజన్యంతో ”ఫైడింగు ఏ వాయిస్‌” అనే ప్రాజెక్టును 2006 సంవత్సరం నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరుకుమిల్లి, ఐ- భీమవరం, జువ్వల పాలెం గ్రామాల్లో ప్రారంభించబడి సుమారు 18 నెలలు దిగ్విజయంగా నడిచిన తరువాత మీడియా ల్యాబ్‌ ఆసియా ఈ ప్రాజెక్టుతో అనుసంధానమైంది. తద్వారా 2007 సంవత్సరంలో ఇది ఎనిమిది గ్రామాలకు విస్తరించి నేడు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్మర్మేషన్‌ టెక్నిలజీ, మీడియా ల్యాబ్‌ ఆసియా మరియు బైర్రాజు పౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రాజెక్టు చేతన” పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
పరిచయం: ఎటువంటి అభివృద్దికీ నోచుకోకుండా దిగువ శ్రేణిలో ఉన్న గ్రామీణ ప్రజల గొంతుకే ఈ కమ్యూనిటీ టీవీ. ఇది కేబుల్‌ వీడియో ద్వారా ప్రసారమవుతుంది. ఇది లోకల్‌ కేబుల్‌నెట్‌వర్క్‌ ద్వారా అలాగే కమ్యూనిటీ టీవీ సెంటర్‌లద్వారా చూపించే ఒక శక్తి వంతమైన మాధ్యమం.కమ్యూనిటీ టీవీ ప్రొడ్యూసర్‌ల ద్వారా ఆలోచనలను,  స్థానిక సమస్యలను వెలికి తీసి తద్వారా గ్రామీణ ప్రజల్లో సాధికారతను తీసుకువచ్చి వారిని చైతన్యవంతుల్ని చేసి వారి వారి గ్రామాల్లో ప్రజలను ఆయా అంశాలలో భాగస్వాముల్ని చేసి ప్రొడక్షన్‌ తయారు చేస్తుంది. వాటిని కేబుల్‌ టివీ ద్వారా మరియు ల్యాప్‌టాప్‌ల ద్వారా స్క్రీనింగు చేయబడుతుంది. ప్రతినిత్యం గ్రామాలూ మరియు వాటి అనుబంధ ప్రాంతాలలో ఉన్న ఇంటింటికీ ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రదేశాలు:
కమ్యూనిటీ టీవీ పశ్చిమ మరియు తూర్పు గోదావరి జిల్లాలోని ఎనిమిది గ్రామాల్లో విస్తృతంగా తన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జిన్నూరు, లంకలకోడేరు, జవ్వల పాలెం, ఏలూరుపాడు (పశ్చిమగోదావరి జిల్లా), ఈతకోట, పొడగట్లపల్లి, అంతర్వేదిపాలెం, రామేశ్వరం (తూర్పు గోదావరిజిల్లా) అన్ని సెంటర్లు హైదరాబాద్‌కి సుమారుగా 450 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి.
ప్రజలు: ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా మహిళల భాగస్వామ్యం మరియు విద్యార్ధులను ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా చేసి వారికి శిక్షణను ఇచ్చి వారిచే సమస్యలు గుర్తించి వాటికి  వారి ద్వారానే పరిష్కారమార్గంను  అన్వేషించడం మరియు పరిశోధన దిశగా వారిని సమాయత్త పరచయటం ఇత్యాది కార్యక్రమాలతో పాటు వీడియో షూటింగు, ఎడిటింగు మొదలైనవి చేయించి మంచి ప్రొడక్ట్స్‌ వారిద్వారానే అందించడం.
కెపాసిటీ బిల్డింగు
ు వీడియో ఫిలిం తయారు చేయడానికి ఈ క్రింది అంశాలలో వీడియో వాలంటీర్లకు శిక్షణను ఇవ్వడం జరిగింది.
ు మీడియాను పరిచయం చేయడం
ు మన భావాలను, ఆలోచనలనూ, ఉద్దేశ్యాలను వ్యక్తపరిచే సాధనం ఈ వీడియో.
ు కెమెరాను ఎలా ఉపయోగించాలి అలాగే మిగిలిన అన్ని విషయాలను ఉపయోగించడం
ు ప్రీ ప్రొడక్షన్‌లో ఉన్న స్క్రిప్ట్‌ రైటింగు, స్టోరీ బోర్డ్‌,  కాన్సెప్ట్‌ డిజైన్‌ మొదలైనవి
ు మల్టీమీడియా మరియు పొస్ట్‌ ప్రొడక్షన్‌ను పరిచయం చేయడం

టెక్నాలజీ
చాల సున్నితమైన, సులువైన వీడియో సామాగ్రితో మరియు దృఢమైన వైర్లెస్‌ టెక్నాలజీ కలిగిన అశ్విని ప్రాజెక్టు ఉపయోగించడం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ నాన్‌- లినీయర్‌ ఎడిటింగు ద్వారా అన్ని సెంటర్‌లలోను చేయడం జరుగుతోంది. వీడియో టెక్నాలజీ, వీడియో ట్రాన్స్మిషన్‌లను వైర్లెస్‌లను ఉపయోగించడంతోపాటు, కేబుల్‌ నెట్‌వర్క్‌ను వాడతాం.
కంటెంట్‌ డిస్సిమినషన్‌
ఈ కార్యక్రమంలో మరో అద్భుతమైన విషయం ఏంటంటే లోకల్‌ కేబుల్‌ టీవీల భాగస్వామ్యంతో ముందుకు సాగడం. మేము చేసే లేదా తీసు లఘు చిత్రాలలో ఉన్న సమస్యలను, ఇతివృత్తాలను ఎంతగానో ప్రోత్సహిస్తూ మా మూల సిద్ధాంతంతో ఏకీభవిస్తూ మాతో నడుస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు. గ్రామాల్లో ఉండే ప్రజల ఇళ్ళకు కేబుల్‌ టీవీలద్వారా మా కంటెంట్‌ బదిలీ అవుతుంది. అందుకే మా ఎనిమిది సెంటర్లు నాలుగు కేబుల్‌ సెంటర్‌లద్వారా నిత్యం ప్రజలలోకి వెళ్ళుతున్నాయి.
భాగస్వామ్య పక్షాలు
మీడియా ల్యాబ్‌ ఆసియా,న్యూఢిల్లీ
యునెస్నో కమ్యూనికేషన్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ సెక్టార్‌
విజయలక్ష్మి కేబుల్‌ విజన్‌, భీమవరం, పశ్చిమగోదావరిజిల్లా
విజ్ఞాన భాగస్వామ్యం
వీడియో వాలంటీర్స్‌
ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమతా సొసైటీవారి అనుబంధంతో  స్త్రీల ఆరోగ్యంపై  తొమ్మిది  మల్టీమీడియా వీడియోలు తీయడం జరిగింది.
ఫాక్ట్స్‌
ు ఎనిమిది గ్రామాలు ఈ కార్యక్రమాలతో భాగస్వాములై ఉన్నాయి.
ు శిక్షణ పొందిన 16 మంది ప్రొడ్యూసర్స్‌ ఫిలిం మేకింగు చేస్తున్నారు.
ు సుమారుగా 100 డాక్యుమెంటరీలు తయారు చేయబడినవి.
ు  గ్రామాల్లో వాటి అనుబంధ ప్రదేశాల్లో 300 ల్యాప్‌టాప్‌లద్వారా స్క్రీనింగు చేయబడుతుంది.
ు 80 గ్రామాలలో టెలికాస్ట్‌ చేయబడుతున్నవి.
ు 200 మంది మహిళా మరియు విద్యార్ధి వాలంటీర్లను కలిగివుండి,ప్రోత్సాహక కరమైన ప్రజల భాగస్వామ్యంతో ముందుకు    వెళుతున్న కమ్యూనిటీ టి.వి.
లక్ష్యం
మహిళా సాధికారత, బాలల అభివృద్ధితో పాటు మేలైన సమాచారాన్ని అందించడం.
వారిలో స్వతహాగా భావాలను రేకెత్తించడం, ఆలోచనలను కలిగించడం,  ప్రణాళికా బద్దంగా ఉండడం, వాళ్ళలో వాళ్ళు అభివృద్ధి చెందడం. 
సంప్రదించవలసిన చిరునామా:
ఇన్‌ఛార్జి, ప్రాజెక్ట్‌ చేతన
బైర్రాజు పౌండేషన్‌,
2-74, సత్యం ఇన్‌క్లెవ్‌, జీడిమెట్ల విలేజ్‌, ఎన్‌హెచ్‌-7
హైదరాబాద్‌ – 500055
ఫోన్‌ : +91-40-23191725 ఎక్స్‌. 209,  ఫాక్స్‌ : +91-40-23191726
మొబైల్‌ : +91-9848515151
 లిళీబిరిజి. చీజీళిశీలిబీశిబీనీలిశిబిదీబిటలీగిజీజీబిశీతితీళితిదీఖిబిశిరిళిదీ.ళిజీవీ
ఇఇఇ.చీజీళిశీలిబీశిబీనీలిశిబిదీబి.బీళిళీ
అనువాదం : కె.ఎం.చక్రవర్తి

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.