న్యాయం కావాలి – కొండవీటి సత్యవతి

గత కొన్నిరోజులుగా యావత్తు దేశంతో పాటు నన్నూ కుదిపేసిన రెండు సంఘటనలు తలచుకున్నప్పుడల్లా దుఃఖం పొంగివస్తోంది. దుఃఖం తర్వాత పట్టలేని కోపం. కోపాన్ని తీర్చుకునే సాధనం లేక ఒక నిస్సహాయత, ఆక్రోశం మనసంతా కమ్ముకుని నిలవనీయకుండా చేస్తున్న

సందర్భం. ఇందర్‌ మేఫ్‌ువాల్‌ మృతి మనసుని పిండేస్తే, బిల్కిస్‌ భానో రేపిస్టుల విడుదల, వాళ్ళకి జరిగిన సన్మానాల దృశ్యాలు గుండెను మండిరచాయి. ఆగస్టు 14, 15 తేదీల్లో వరుసగా జరిగిన ఈ రెండు సంఘటనలు దేశమంతా ప్రకంపనలు సృష్టించాయి.
తొమ్మిదేళ్ళ ఇంద్రకుమార్‌ మేఫ్‌ువాల్‌ రాజస్థాన్‌లోని జలారో జిల్లాలో సురానా అనే గ్రామంలో సరస్వతి విద్యామందిర్‌ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. టీచర్ల కోసం పెట్టిన నీటికుండను ముట్టుకున్నాడనే ఆరోపణలతో ‘చైల్‌ సింగ్‌’ అనే టీచర్‌ ఇందర్‌ను దారుణంగా కొట్టాడు. ఈ సంఘటన జరిగింది జులై 20వ తేదీన. గాయపడిన కొడుకుని తీసుకుని తండ్రి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. కానీ ఆగస్టు 14న ఇందర్‌ చనిపోయాడు. దెబ్బలకి ఉబ్బిన అతని కన్ను, శాశ్వతంగా మూసుకుపోయిన అతని కళ్ళు ఒక బీభత్సమైన కలలాగా వెంటాడుతున్నాయి. కులోన్మాదంతో కుళ్ళిపోయిన మెదళ్ళు, పాశవికంగా ఇందర్‌ని హింసించి చంపేసిన అమానవీయ, అమానుష టీచర్‌ చైల్‌సింగ్‌కి మద్దతుగా ర్యాలీ తీసిన సింగ్‌ కమ్యూనిటీ వ్యక్తుల బరితెగింపు షాక్‌కి గురిచేసింది. పసివాడిని పొట్టన పెట్టుకున్న వాడికి సపోర్టుగా ఊరేగింపు తీసిన వ్యక్తుల కులకంపు, మనువాద మురికి ఇప్పట్లో నన్ను వదిలేట్టు లేదు. సోషల్‌ మీడియాలో తిరుగుతున్న ఇండర్‌ డాన్స్‌ వీడియోను చూసినపుడు ఆ పిల్లాడి చైతన్యాన్ని, ఉత్సాహాన్ని మధ్యలోనే చిదిమేసిన చైల్‌సింగ్‌కు మరణశిక్ష విధించాలనే డిమాండుకు ఓ క్షణం మనసు అంగీకరించినా, మరణ శిక్షలు పరిష్కారం కాదని వివేకం చెంపమీద కొట్టింది. ఉరి తీయాల్సింది మనుషుల్ని కాదు ‘మను ధర్మం’ పేరుతో కులోన్మాదాన్ని విషంలాగా చిమ్ముతున్న భావజాలాన్ని. ఈ దిశగానే మన ఆచరణ ఉండాలని బలంగా అనిపించింది.
ఇక రెండో సంఘటన బిల్కిస్‌ భానో అత్యాచార నేరస్తుల విడుదల. దేశం మొత్తం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో స్వాతంత్య్రోద్యమ ఉత్సవాల ముగింపు వేళ, దేశ ప్రధాని భారతీయులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ దేశ మహిళల హక్కులు, గౌరవం స్త్రీ శక్తి అంటూ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీ మధ్యాహ్నం బిల్కిస్‌ భానోతో పాటు దేశ ప్రజలందరూ నిర్ఘాంతపోయే దారుణ వార్త మీడియా ద్వారా బయటికొచ్చింది. 17 సంవత్సరాలుగా తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయం మీద న్యాయ పోరాటం చేస్తున్న బిల్కిస్‌ భానో ఈ దుర్వార్తను వినాల్సి వచ్చింది.
ఏమిటా వార్త. పదిహేనేళ్ళ క్రితం తనమీద సామూహిక అత్యాచారం చేసి, తర్వాత తన కుటుంబ సభ్యులమీద కూడా అత్యాచారం చేసి చంపేసిన హంతక, అత్యాచార నేరస్థులకు ‘క్షమాభిక్ష’ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా జైలు నుండి విడుదల చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. ఈ దుర్మార్గమైన వార్త బిల్కిస్‌ని భయభ్రాంతురాలుని చేసింది.
ఆమెతోపాటు మొత్తం గ్రామమంతా భయాందోళనలతో వణికిపోయారు. అన్నింటినీ మించి కరకు పాషాణాల్లాంటి 11 మంది నేరస్తులకు స్వీట్లు తినిపించి, పూలదండలేసి బయట ప్రపంచంలోకి ఆహ్వానించిన తీరును టీవీల్లో, సోషల్‌ మీడియాల్లో చూసిన బిల్కిస్‌ భానో మనసులో చెలరేగిన కల్లోలం, అవమానం, ఆందోళనను తూచడానికి నా దగ్గర ఏ కొలమానమూ లేదు. పదిహేడు సంవత్సరాలుగా ఆమె గుండెల్లో గూడుకట్టిన గాయాన్ని క్రూరంగా కెలికిన ఆ అమానవీయ దృశ్యాలు నా కళ్ళల్లోను మంటలు మండిరచాయి. ఈ దేశ న్యాయవ్యవస్థ వేసుకున్న మనువాద ముసుగు మెల్లగా జారిపోయిన దృశ్యాలవి.
ఆగస్టు 14న ఈ దుర్మార్గ వార్త బయటకు రాగానో బిల్కిస్‌ భానోతో పాటు ఆమె గ్రామానికి చెందిన 50 కుటుంబాలు గూడు చెదిరిన పక్షుల్లా భయంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. గ్రామం మొత్తం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందనే వార్తలొచ్చాయి. రేపిస్ట్‌ నేరస్తులు విడుదలై సంబరాలు చేసుకుంటున్న దౌర్భాగ్య వేళ బిల్కిస్‌ భానో పరిస్థితి ఏంటనే ఆందోళనతో చాలామంది తనతో మాట్లాడడానికి ప్రయత్నించినపుడు ఆమె ఎవరికీ అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్‌ నుండి ట్రాన్స్‌జెండర్‌ మహిళ జాక్‌ మెంబర్‌ ఒకరు గుజరాత్‌ వరకు వెళ్ళారు బిల్కిస్‌ను కలవడానికి. ఆమె భర్త అతి కష్టంమీద అందుబాటులోకి వచ్చి తామెదుర్కొంటున్న దుర్భరస్థితిని వివరించారు. బిల్కిస్‌ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌ను వదిలి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారని ఆయన చెప్పాడని జాక్‌ మీటింగ్‌లో ఆవిడ చెప్పినపుడు నాకు చాలా ఏడుపొచ్చింది. నిజానికి ఆ సమావేశంలో పాల్గొన్న అందరి కళ్ళూ తడిసిపోయాయి. నేరం చేసిన వాళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా స్వేచ్ఛగా తిరుగుతుంటే అన్యాయానికి, అత్యాచారానికి బలైన బిల్కిస్‌ మాత్రం ఉన్న ఊరి నుండి పారిపోవాల్సి రావడానికి మించిన అన్యాయం, అమానుషం, న్యాయ వ్యవస్థ వైఫల్యం చాలా స్పష్టంగా అర్థమైన సందర్భం.
2002 గుజరాత్‌ మత కల్లోలాల కాలం నుండి బిల్కిస్‌ ఓ పెద్ద గాయాన్ని మోస్తోంది. ఆ గాయం తగిలిన నాటి నుండి ఆమె న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. సామూహిక అత్యాచారానికి గురైనప్పుడు బిల్కిస్‌ వయస్సు కేవలం 21 సంవత్సరాలు, 5 నెలల గర్భిణి. ఆమెతో పాటు తన మూడు సంవత్సరాల పాప ఉంది. అత్యాచార నేరస్తులు ఆ పసిపాపని బండరాయితో కొట్టి చంపడాన్ని కళ్ళారా చూసింది.అంతేకాదు తన కుటుంబంలోని 14 మందిని హత్య చేయడాన్ని, హత్యలకు ముందు అత్యాచారం చేయడాన్ని చూసింది. ఇదంతా తనమీద అత్యాచారం జరుగుతున్నప్పుడే చూసింది బిల్కిస్‌. ఇంతటి భయానక, బీభత్స అత్యాచార, హత్యాకాండలో కొనఊపిరితో బయటపడిన బిల్కిస్‌ భానోకు 17 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత న్యాయం దొరికింది. 2008లో ముంబైలోని ప్రత్యేక కోర్టు 11 మంది రేపిస్ట్‌, హంతక ముఠాకు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. ఈ శిక్షని మహారాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్ధించాయి. 17 సంవత్సరాలుగా నేరస్థులు జైల్లోనే ఉన్నారు. బిల్కిస్‌ భానో తన జీవితాన్ని తాను గడుపుకుంటోంది.
ఆగస్టు 15న హఠాత్తుగా, ఉరమని పిడుగు ఆమె తలపై పడిరది. ఆ వార్త ఆమెకు తీవ్ర మనోవేదన కలిగించింది. ఘోరాతిఘోరమైన నేరం చేసిన ఆ 11 మందికి గుజరాత్‌ ప్రభుత్వం ఎంతో ఉదారంగా ‘‘క్షమాభిక్ష’’ పెట్టి విడుదల చేసింది. వాళ్ళు విడుదలైన విషయం మీడియా ద్వారానే బిల్కిస్‌కి తెలిసింది. అప్పటినుండి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.
అంతకు ముందే దేశవ్యాప్తంగా వివిధ జైళ్ళలో ఉన్న ఖైదీలకు ‘‘క్షమాభిక్ష’’ ప్రసాదించే కేసులకు సంబంధించిన విధివిధానాలను, మార్గదర్శకాలను సుప్రీంకోర్టు వెలువరించింది. వాటిప్రకారం ‘‘అత్యాచారాలకి పాల్పడిన వారికి ఎటువంటి క్షమాభిక్ష ఇవ్వకూడదని, ముఖ్యంగా సిబిఐ విచారించిన కేసులలో ‘క్షమాభిక్ష’ వర్తించద’’ని స్పష్టంగా పేర్కొన్నారు. మార్గదర్శకాలు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టుకి తెలపకుండా, గుజరాత్‌ హైకోర్టుకు తెలియకుండా గుజరాత్‌ ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించి హత్యాచారులను విడుదల చేసింది. గుజరాత్‌ ప్రభుత్వపు ఈ దుశ్చర్య బిల్కిస్‌తో పాటు, న్యాయం కోసం ఎదురుచూస్తున్న వేలాదిమందికి ఆశనిపాతం లాంటిది. రేపిస్టులను సమాజంలోకి ఇలా వదిలేసి సన్మానాలు చేస్తే ముందు ముందు అత్యాచారాలు పెరిగిపోయి మొత్తం సమాజానికే ముప్పు ఏర్పడవచ్చు.
ఈ విషయమై అందరం కలిసికట్టుగా పోరాడి బిల్కిస్‌ భానో పక్షాన నిలబడాల్సి ఉంది. ఆమెకు అండగా ఉండటమే కాక 11 మంది నేరస్థుల్ని తిరిగి జైలుకు పంపేదాకా పోరాటం చేయాలి. గుజరాత్‌ ప్రభుత్వానికి వివిధ పద్ధతుల్లో మన నిరసనని తెలియచేద్దాం. బిల్కిస్‌ భానోకు న్యాయం కోసం డిమాండ్‌ చేద్దాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.