నవంబర్ పూర్తయింది. డిసెంబర్ మొదలైంది.
‘‘అమ్మా ఏమిటమ్మా ఈ రోజు పనులన్నీ ఇంత హడావిడిగా చేస్తున్నావు’’.
‘‘ఇంకా తెలిదానే, ఈ రోజు సుబ్రహ్మణ్య షష్టి.’’
‘‘అవునా, అయితే మనం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళదాము.’’
‘‘వెళదామే. వెళదాం… వెళదాం… అప్పుడే కంగారేమిటి.’’
మేము ముస్తాబవడం అయింది. అయితే మా అమ్మ, ‘‘అరెరే… ఇంకా ముస్తాబవుతూనే ఉన్నారా? ఇంక ఎప్పుడు వెళ్తామో చెప్పండి’’ అంది.
‘‘క్షమించమ్మా, పద పద మనం అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి’’ అంటూ బయల్దేరాం.
నేను, అమ్మ, నాన్న, అన్నయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాం.
అప్పుడు మా అమ్మమ్మ ‘‘వచ్చారా రండి, రండి. కాళ్ళు కడుక్కుని ఇంటిలోనికి రండి’’ అంది.
అంతలో మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు. అంతే ఇక చూసుకోండి మా అల్లరికి కొదవే లేదు.
సమయం రాత్రి ఎనిమిదయింది. మా మావయ్య ఇంటికి వచ్చాడు. ‘‘ఇదేమిట్రా ఇంకా కూర్చునే ఉన్నారు. పదండి, పదండి’’ అంటూ మా మావయ్య తీసుకువెళ్ళాడు. అంతే ఇక మామయ్యకు మమ్మల్ని తిప్పడానికే సరిపోయింది. ఒకసారి అక్కడికంటే, ఇంకోసారి ఇక్కడికని తిప్పుతూనే ఉన్నాం. ‘‘అరెరె అరెరె ఆపండిరా. ఇక ఎక్కడికని తిప్పుతాను’’ అన్నాడు మావయ్య.
తెల్లవారిపోయింది. మేము మా ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. అప్పుడు మా అమ్మమ్మ మా ఇంటికి తీసుకువెళ్ళడానికి అరిసెలు, బొబ్బట్లు, గొరిమిటిలు ఇంకా ఎన్నో పిండి వంటలు చేసింది. వాటిలో కొన్ని మేము, కొన్ని మా పెద్దమ్మ వాళ్ళు తీసుకున్నాం. మిగిలినవి మా అమ్మమ్మ వాళ్ళు తీసుకున్నారు.
మధ్యాహ్నం అవసాగింది. ఇక చూసుకో, మా ఇకఇకలు, పకపకలు ఊపందుకున్నాయి. తింటూ మాట్లాడుకుంటున్నాము. అలా తింటుండగానే సాయంత్రం అవసాగింది. మేము మా ఇంటికి వచ్చేశాము. ఇలా జరిగింది మా అమ్మమ్మగారి ఊరు ప్రయాణం. చూశారా, మిత్రులారా ఎంత అందంగా ఉందో మా ప్రయాణం. మీకు కూడా ఈ అనుభూతి కలగాలంటే మీరు మీ ఊరు వెళ్ళండి. వర్షం వచ్చినప్పుడు, ఎండ కూడా వస్తే ఏం కనిపిస్తుందో అలా ఉంది మా ప్రయాణం.
`.