గృహహింస బాధితులతో ముఖాముఖి – శాంతి ప్రియ

17/12/2022 తేదీన కినారా హోటల్‌, హబ్సిగూడలో గృహహింస నిరోధక చట్టం 2005 అమలులో బాధిత మహిళలు ఎదుర్కొంటున్న ‘సమస్యలు`సవాళ్ళు’ అనే అంశంపై 22 మంది బాధిత మహిళలతో ‘‘ముఖాముఖి’’ జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌,

రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాల నుండి, ఇంకా కరీంనగర్‌, సిరిసిల్లా జిల్లా నుండి మహిళలు వచ్చారు. విజయవాడ, రాజమండ్రి నుండి ముగ్గురు సర్వైవర్స్‌ జూమ్‌కాల్‌ నుండి వారి సమస్యను జ్యూరీకి వివరించి వారి నుండి సలహాలను తీసుకున్నారు.
జ్యూరీలో ఉమెన్‌Êఛైల్డ్‌ రంగారెడ్డి జిల్లా లీగల్‌ కౌన్సిలర్‌ విజయభాస్కర్‌, మేడ్చల్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌ అర్చనారావు, ప్రాక్టీసింగ్‌ అడ్వకేట్‌ సరళారెడ్డి, పీఓడబ్ల్యు సంధ్య, భూమిక ప్యానల్‌ అడ్వకేట్‌ శేషవేణి , భూమిక చీఫ్‌ ఫంక్షనరీ డైరెక్టర్‌ కె.సత్యవతి, ప్రశాంతి గారు ఉన్నారు.
పోలీస్‌ స్టేషన్లలో, భూమిక హెల్ప్‌లైన్‌, సఖి సెంటర్‌లో నమోదై, వివిధ కోర్టుల్లో డి.ఐ.ఆర్‌ వేసుకొని న్యాయ పోరాటం చేస్తూ తగిన న్యాయం కోసం ఎదురుచూస్తున్న మహిళలతో ఈ ముఖాముఖి ఏర్పాటు చేశాం. అనుభవజ్ఞులు, న్యాయకోవిదులు జ్యూరీగా ఉంటారు. బాధిత మహిళల సమస్యలను వినడంతో పాటు, పరిష్కారాలు వెతికే ప్రక్రియ కూడా ఈ ముఖాముఖిలో ఉంటుంది. స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా 16 రోజుల యాక్టివిజంలో భాగంగా భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది.
‘‘కదిలింది మహిళా లోకం, చూడండి స్త్రీల మేళా’’ పాటతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ మీటింగుకు వచ్చిన వారందరితో పరిచయ కార్యక్రమం జరిగింది. ముందుగా కరీంనగర్‌ సఖి సెంటర్‌ అడ్మిన్‌ లక్ష్మి మాట్లాడుతూ ‘సఖి కేంద్రం ద్వారా మహిళలకు పిల్లలకు లభ్యమవుతున్న సేవల గురించి వివరించారు.
సత్యవతి గారు, మా ప్యారా లీగల్‌ వాలంటీర్లు (పిఎల్‌వి) కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. భూమిక తరపు నుండి హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని పది బస్తీల నుండి ఒక్కో బస్తీకి ఐదుగురు చొప్పున మొత్తం పది బస్తీలకు 50 మంది పారా లీగల్‌ వాలంటీర్లుగా పని చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా వీరికి అనేక చట్టాల గురించి, స్త్రీలకు, పిల్లలకు ఉన్న సపోర్టు సిస్టమ్స్‌ గురించి శిక్షణనివ్వడం జరిగింది. వారి బస్తీల్లో ఏదైనా సమస్య వస్తే వారు హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేయించటం, బాధితులను సఖి సెంటర్లకు, సిడబ్ల్యుసిలకు తీసుకువెళ్ళటం బాధితులకు అండగా నిలబడి పోలీస్‌స్టేషన్లకు తీసుకువెళ్ళటం చేస్తుంటారు.
సత్యవతిగారు మాట్లాడుతూ తాను ఫ్యామిలీ కోర్టుల్లో అసలేం జరుగుతోందని తెలుసుకోవటానికి స్వయంగా వీవీ-3, వీవీ-4 కోర్టులకు వెళ్ళి చూసొచ్చానని, మన సిస్టమ్స్‌ ఏ మాత్రం సెన్సిటివిటీ లేకుండా బండబారిపోయాయని, సఖికి వచ్చినవాళ్ళకు తప్పకుండా పరిహారం దొరుకుతుందన్న ఆశతో వస్తారని, నెలకు కేవలం రూ.2,000 మెయింటెనెన్స్‌ కోసం కేసు వేసినా కోర్టుల్లో తీర్పు ఇవ్వటం లేదని చెప్పారు. డివి యాక్ట్‌లో 60 రోజుల్లో జడ్జిమెంట్‌ ఇవ్వాలని రూల్‌ ఉంది కానీ ఎక్కడా అలా జరగటం లేదు. సెన్సిటివ్‌ అధికారులు ఉంటే కొంతమేరకైనా మనం ఎలా మార్పు తీసుకురావచ్చో నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దివ్యా దేవరాజన్‌ గారు ఉమెన్‌ అండ్‌ ఛైల్డ్‌ డిపార్టుమెంటులో కమిషనర్‌గా ఉన్నారు. ఆమె చాలా సెన్సిటివ్‌గా స్పందిస్తారు. నాకు తెలిసిన కుటుంబంలో ఒక పాప మీద తను నాలుగు సంవత్సరాల వయసులో ఉండగా అత్యాచారం జరిగిందని, తల్లిదండ్రులు కేసు పెడితే పాపకు పది సంవత్సరాలు వచ్చాక, ఈ కేసు గురించి అందరూ మర్చిపోయాక ఒకరోజు సడన్‌గా కోర్టు సమన్లు తీసుకొని వచ్చారని చెప్పారు. ‘తల్లిని పోలీసులు అంతకుముందే స్టేషన్‌కి పిలిచి మీరు డబ్బుల కోసమే ఈ కేసు పెట్టారు, అత్యాచారం జరగలేదు అని అసహ్యంగా మాట్లాడారు. ఆ తల్లీ కూతుళ్ళతో నేను మర్నాడు రంగారెడ్డి జువెనైల్‌ కోర్టుకి వెళ్ళాను. అక్కడ బాధితులకు ఎలాంటి సదుపాయాలు లేవు. మంచి నీళ్ళు లేవు, కూర్చోటానికి లేదు. వృద్ధులు అలాగే ఎంతసేపైనా నిలబడే ఉండాలి. బాలింతలు పిల్లలకు పాలివ్వటానికి ఏర్పాట్లు లేవు. బాధితులు, వాళ్ళ వెంట తోడుగా వచ్చిన వాళ్ళు రోడ్ల మీద పడిగాపులు పడాలి. నేను నా ఫేస్‌బుక్‌లో ఇదంతా రాశాను. వెంటనే దివ్యా దేవరాజన్‌గారి పిఎ మర్నాడే నాకు కాల్‌ చేసి ఆ జువెనైల్‌ కోర్టుని అక్కడినుండి తరలించి వేరేచోట అన్ని సదుపాయాలతో పెట్టామని చెప్పారు. స్పందించే అధికారులు ఉంటే బండబారిన మన వ్యవస్థలో కొంతమేరకైనా మార్పు తీసుకురావచ్చు అనేదానికి ఉదాహరణగా ఇది చెప్పాను’ అన్నారు.
న్యాయం అనేది మనం ఎలా పొందాలి! అసలేం జరుగుతోది. ఇదంతా ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకరికొకరు కలిసి ఇక్కడ అందరూ మాట్లాడుకుంటే మనకు ధైర్యం వస్తుంది. మీరంతా ధైర్యంగా ఉండండి. మీ కేసు/ మీ ఫోటోలు ఏవీ బయటకు రావు. అది మీకు మేమిస్తున్న భరోసా. మీరూ ఫోటోలు తీయకండి. బాధితులు ఇక్కడ చెప్పిన విషయాలు బయట ఎవరితోనూ షేర్‌ చేయకండి’ అని చెప్పారు. జ్యూరీ సభ్యులను ఒక్కొక్కరిగా వారి గురించి అందరికీ వివరించి పరిచయం చేశారు.
మొదటగా మాట్లాడిన రాఘవి (పేరు మార్చాం) అనే బాధితురాలు తన కేసు గురించి చెబుతూ తాను 2021లో ప్రొడక్షన్‌ ఆర్డర్‌, రెసిడెన్స్‌ ఆర్డర్‌ కావాలి అని 2021లో సఖి ద్వారా కేసు ఫైల్‌ చేశానని, కోర్టులో కేసు జరుగుతోందని, రెండేళ్ళయినా ఆర్డర్లు రాలేదని చెప్పారు. ఈమెకి ఇద్దరు పిల్లలు. ఈమె మానవహక్కుల సంఘంలో పిటిషన్‌ వేయగా ఈమెకు, పిల్లలకు వేరుగా ఇల్లు తీసిపెట్టి మెయింటెనెన్స్‌ ఇవ్వమని ఆర్డర్‌ వచ్చింది. ఇంటి అద్దె, మెయింటెనెన్స్‌ ఇస్తున్నారు. ‘నాకు, నా భర్త ఉమ్మడి ఇంట్లో ఉండాలని ఉంది. అది నా హక్కు అనుకుంటున్నాను. కానీ నా భర్త, అతని కుటుంబ సభ్యులు నన్ను ఆ ఇంట్లోకి రానివ్వరు. నేను ఒంటరిగా పిల్లలతో అవస్థ పడుతున్నాను. డివి సర్వైవర్‌ కోర్టుకి వెళ్ళకపోతే కేసు కొట్టేస్తారు. కోర్టుకి వెళ్ళేందుకు వారి దగ్గర బస్సు ఛార్జీలకు కూడా డబ్బులుండవు. కోర్టు ఇలాంటి సర్వైవర్స్‌కి బస్‌ ఛార్జీలు ఇప్పించాలి. ఇంకా ఇల్లు మహిళ పేరు మీద ఉండాలి. మహిళ ఇంట్లోనుండి బయటకు వెళ్తే పిల్లలతో ఎక్కడ ఉంటుంది? ఎలా బ్రతుకుతుంది? ఇల్లు ఆమె పేరుమీదే ఉండేలా, బయటకు వెళ్ళే పరిస్థితి వస్తే భర్తే బయటకు వెళ్ళేలా చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాను’ అన్నారు. అందరూ అందుకు అవును, అవును అని చప్పట్లు కొట్టారు.
లాయర్‌ సరళా రెడ్డి గారు ఆమెకు లీగల్‌ ఖర్చులు కావాలని కోర్టులో పిటిషన్‌ వేయొచ్చు. ఆ ఖర్చులు రెస్పాండెంట్‌ పే చెయ్యాలి. సెక్షన్‌ 23 క్రింద డివికి కోర్టుకి వచ్చాక ఇతర రిలీఫ్‌ (ఉపశమనాలు)కు కోర్టులో వేసుకోవాలి. రెస్పాండెంట్‌ కౌంటర్‌ వేయకముందే రిలీఫ్స్‌కి వేసుకోవచ్చు అని సలహా ఇచ్చారు. సంధ్యగారు మాట్లాడుతూ ‘ఈ డివి యాక్ట్‌ రాకముందు ఈ ఫ్యామిలీ కేసులన్నీ క్రిమినల్‌ కోర్టులకే వెళ్ళేవి. ఇల్లు జాయింట్‌ అయినా, ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నా స్త్రీకి రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ అదే ఇంట్లో ఉండేలా ఇవ్వాలి’ అని చెప్పారు. లాయర్‌ శేషవేణి మాట్లాడుతూ కేసు కోర్టుకి వచ్చాక మూడు రోజుల్లో రెస్పాండెంట్‌కి సమన్స్‌ పంపిస్తారు. కేసు నడవడంతో సంబంధం లేకుండా interim relief mandatory గా ఇవ్వాలని చెప్పాలని అన్నారు.
కరుణ (పేరు మార్చాం) అనే టీచర్‌ తనకు పెళ్ళయి 33 సంవత్సరాలయిందని, భర్త తనకన్నా 18 సంవత్సరాలు పెద్దవాడని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేసి రిటైరయ్యాడని, అతనికి 68 సంవత్సరాల వయసని చెప్పింది. తన భర్తకు మొదటినుండి వివాహేతర సంబంధాలు ఉండేవని, కొడుకు పెళ్ళై కోడలు ఇంటికి వస్తే ఆమెతో కూడా అసభ్యంగా ప్రవర్తించబోతే కొడుకు, తాను అతనికి ఎదురు తిరిగి ప్రశ్నించామని, తమను కొట్టి ఇంట్లోనుంచి వెళ్ళగొట్టాడని చెప్పింది. ‘భార్యాభర్తలు కలిసి సంపాదించిన ఆస్తులన్నీ అతని పేరు మీదే పెట్టుకున్నాడు. సెంటర్‌లో మూడంతస్తుల సొంత ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. మిగతా పోర్షన్లన్నీ అద్దెకు ఇచ్చాడు. ఇంటికి రోజూ సెక్స్‌ వర్కర్లని తీసుకొస్తోంటే పోర్షన్లలో అద్దెకుండే వాళ్ళు అదేంటని ప్రశ్నించారని నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, మీరు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపొమ్మని తిడుతున్నాడు. వాళ్ళు నాకు ఫోన్‌ చేసి ఇదంతా చెప్పారు. నా చిన్న కూతురు స్పెషల్‌ ఛైల్డ్‌. ఆమెకు ట్రీట్‌మెంట్‌కు అవసరాలు చాలా ఉంటాయి. కానీ, నా భర్త అవేమీ పట్టించుకోడు’ అని ఆమె చెప్పింది.
శేషవేణి మాట్లాడుతూ పెన్షన్‌ అటాచ్‌మెంట్‌ ఆర్డర్‌ అడగాలి. భర్త జీతం తీసుకునేవాడయినా, పెన్షనర్‌ అయినా నేరుగా ఈ ఆర్డర్‌ వలన మీ అకౌంట్‌లోకి మెయింటెనెన్స్‌ రిలీఫ్స్‌ డబ్బులు వస్తాయి అని చెప్పారు. సంధ్య మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం కోసం కోర్టు పర్మనెంట్‌ ఆర్డర్‌ ఇస్తుంది. పిల్లల వైద్యం కోసం ఒక డాక్టర్‌ ద్వారా రిపోర్టు తీసుకొని ఎంసి వేయాలి. డివి యాక్ట్‌లో పిల్లల వైద్యం మరియు మెయింటెనెన్స్‌ కోసం సెపరేట్‌గా వేయాలి. సరళారెడ్డి మాట్లాడుతూ భార్యాభర్తలిరువురూ కలిసి సంపాదించిన ఆస్తి భర్త పేరునే
ఉంచుకుంటే సివిల్‌ సూట్‌ వేసుకొని ఆ ఆస్తిలో తన భాగం ఉందని అడగొచ్చు అన్నారు.
సంధ్య మాట్లాడుతూ మెయిన్‌టెనెన్స్‌ కేసులో ఆర్డర్లు రావటానికి కోర్టులో ఏళ్ళు పడతాయి. పిడబ్ల్యుడివి యాక్ట్‌ వైద్యం, పిల్లల విద్య, మెయింటెనెన్స్‌ లాంటి తక్షణ అవసరాలకు డబ్బును బాధితురాలికి వెంటనే అందించడానికే వచ్చింది.
శేషవేణి మాట్లాడుతూ మీరు మొదట ఈ అవసరాల గురించి రాయటం మిస్‌ అయినా ఏ ఒక్క రిక్వైర్‌మెంట్‌ మర్చిపోయినా మళ్ళీ వాటికి వేసుకోవచ్చు పరిస్థితులను బట్టి బాధితుల పిల్లల అవసరాలు మారతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని మీరు కేసుకు జత చేసి అడగవచ్చు అన్నారు. భర్త, భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం చేస్తే ఛీటింగ్‌ కేస్‌ పెట్టవచ్చు. డాక్యుమెంటరీ సాక్ష్యాలతో మీరు కోర్టులోనే డైరెక్టుగా కూడా వెయ్యొచ్చు అని చెప్పారు. సత్యవతి మాట్లాడుతూ చాలాసార్లు మీ అడ్వకేట్‌ మిమ్మల్ని సరిగ్గా గైడ్‌ చెయ్యరు. మీకు మేమున్నాం. భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా ప్రతి శనివారం మీరు మా పానల్‌ అడ్వకేట్‌ సలహాను, సూచనలు పొందవచ్చు. మీకు మేం అండగా ఉంటాం అని చెప్పారు. సంధ్య ఏడుస్తున్న సర్వైవర్‌ను ఉద్దేశించి ముందు మీరు దుఃఖాన్నుండి బయటకు రండి. దుఃఖంతో మీకు ఏం చెయ్యాలో తోచదు. గందరగోళంగా ఉంటుంది. మీ చుట్టూ మీకు ఉన్న అవకాశాలను, మీకు తోడ్పడేవాళ్ళను గుర్తించలేరు వాటిని ఉపయోగించుకోలేరు అన్నారు.
ఒక సర్వైవర్‌ మాట్లాడుతూ తన భర్త చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ తనను చాలా హింసించాడని, ఎన్ని కేసులని పెట్టాలి అని అంటే సంధ్య గారు మాట్లాడుతూ ఎన్ని కేసులు పెడతాం అని ఆలోచించకండి. మీ బాబుని కొడితే మీ బాబు మేజర్‌ అయితే అతనితో కేసు పెట్టించండి. మైనర్‌ అయితే అతని తరుపున మీరు కేస్‌ పెట్టండి. మిమ్మల్ని కొడితే కూడా మీరు కేసు పెట్టండి. అలా ఎన్నిసార్లు జరిగితే అన్నిసార్లు కేసులు పెట్టండి. ఈ విషయాలన్నీ జడ్జిగారి దృష్టికి వచ్చి మీకు అనుకూలంగా తీర్పు రావటానికి దోహదపడతాయి అని చెప్పారు. సుమతి అనే సర్వైవర్‌ మాట్లాడుతూ ‘నేను ఎంఎ బిఎడ్‌ చేశాను. ఉద్యోగం చేస్తున్నాను. నాకు పదిహేను సంవత్సరాల వయసులో రెండెకరాల పొలం, బంగారం, కట్నం ఇచ్చి పెళ్ళి చేశారు’ అని చెప్పారు. పెళ్ళయిన దగ్గర నుండి భర్త ఆమెపై అనేక అభాండాలు వేయటం, అత్త, ఆడపడుచులు, భర్త కొట్టటం, వేడి వేడి నూనె మీద పోయటం, కరెంట్‌ షాక్‌ పెట్టడం, స్లో పాయిజన్‌తో ఆమెకు పక్షవాతం వచ్చేలాగా చేయడం, ఆమె బెడ్‌రూమ్‌కి వేరే అబ్బాయిలను రాత్రిపూట పంపి ఆమె చెడ్డదని తల్లిదండ్రులకు, ఊళ్ళోవాళ్ళకు ప్రచారం చేయటం చేయటం, పుట్టింటికి తరిమేయటం, తల్లిదండ్రులు కాపురానికి పొమ్మని బలవంతంగా పంపించటం.. ఇలా ఆమె ఎంతో నరకం అనుభవించారు. వేడినీళ్ళకు ఉపయోగించే వేడి హీటర్‌ను ఈమె ఒంటిమీద వేసి చంపాలని చూశారు. ఈమెకి పిచ్చి అని ప్రచారం చేసి భర్త విడాకులకు అప్లై చేశాడు. ఈమె 2020లో భర్త దగ్గరినుండి బయటకు వచ్చి ఒంటరిగా ఉంటున్నారు. 2020లో భర్తపై 498ఎ కేసు, డివిసి మెయింటెనెన్స్‌కు వేశారు. భర్త ఏ రోజూ కోర్టు వాయిదాలకి హాజరు కాడు. ఈమెకు తల్లిదండ్రులు పెళ్ళి సమయంలో రెండెకరాలను వీరి ఇద్దరి పేరుమీద జాయింట్‌గా ఇచ్చారు. దాన్ని తన పేరుమీద బహుమతిగా ఇచ్చినట్లు రిజిష్టర్‌ చేస్తేనే మీ అమ్మాయితో కాపురం చేస్తానని బెదిరించి ఆ రెండెకరాలు భర్త తన పేరుమీద రిజిస్టర్‌ చేసుకున్నాడు. ఈమెకు తల్లిదండ్రులు పెట్టిన బంగారాన్ని అత్త, ఆడపడుచులు లాగేసుకున్నారు. ఇప్పుడు 12, 13 సంవ్సరాల వయసున్న ఇద్దరు కొడుకుల్ని అతను తన దగ్గరే ఉంచుకుని మీ తల్లి పిచ్చిదని వారికి చెప్తూ కనీసం వారిని చూడడానికి కూడా ఈమెను అనుమతించటం లేదు.
అర్చనారావు (లాయర్‌, మేడ్చల్‌ ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌) మాట్లాడుతూ డివిసిలో పిల్లల్ని తల్లి చూసే హక్కు ఉందని, పిల్లల్ని విజిట్‌ చేయడానికి ఈమెతో అప్లికేషన్‌ పెట్టించమని, తాను ట్రై చేస్తానని, ఎరేంజ్‌ చేస్తానని సఖి లీగల్‌ కౌన్సిలర్‌కి చెప్పారు. డిఎల్‌ఎస్‌ఎ నుండి కూడా ఛైల్డ్‌ కస్టడీతో పాటు విజిటింగ్‌ ఇమ్మీడియట్‌గా అడగొచ్చు అని చెప్పారు. సంధ్య మాట్లాడుతూ ‘ఇంట్లో తీవ్రమైన హింస అనుభవిస్తున్నప్పుడు స్త్రీలకు శారీరక, మానసిక సమస్యలు ఉండటం సహజం. భార్యలను వదిలించుకోవాలంటే భర్తలు మానసిక సమస్యలు ఉన్నాయని చెప్తారు. ఒకవేళ మానసిక సమస్యలు ఉంటే డాక్టర్‌కి చూపించుకొని మందులు వాడుకొని తగ్గించుకుంటాం. అది విడాకులకు ఒక కారణం కాదు, చట్టం కూడా దీన్ని కారణంగా అంగీకరించదు అన్నారు. సత్యవతి మేడమ్‌ మాట్లాడుతూ సఖి సెంటర్‌ ద్వారా మేం గైడ్‌ చేసి మీకు రావాల్సినవి ఎలా చేయొచ్చో ఒక పరిష్కారం ఆలోచిస్తాం, మీ కేసుని మేము రివ్యూ చేసి తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనేది గైడ్‌ చేస్తాం అన్నారు. అడ్వకేట్‌ సరళారెడ్డి గారు మాట్లాడుతూ ‘భర్త కోర్టు వాయిదాలకు రావటం లేదని జడ్జికి చెప్పి ఎక్స్‌పార్టీ మెయింటెనెన్స్‌ ఆర్డర్‌ ఇవ్వమని అడగవచ్చు. మన అడ్వకేట్‌ మాత్రమే ఇది అడగాలని లేదు. మీరు అడిగితేనే ఎక్కువ ఎఫెక్ట్‌ వస్తుంది. పిల్లలు వున్నారు కనుక విడాకులు వద్దు అనుకుంటే పిటిషన్‌ డిస్మిస్‌ చెయ్యొచ్చు. సఖి లీగల్‌ కౌన్సిలర్‌ సపోర్టుగా ఉండి ఆమె కూడా కోర్టులో జడ్జిని అడగవచ్చు’ అని సలహా ఇచ్చారు. సత్యవతి గారు కరీంనగర్‌ నుంచి ఈ మీటింగ్‌కు వచ్చిన న్యాయ కమిటీ సభ్యులు భారతి, వీరవ్వలను అందరికీ పరిచయం చేసి వారు చేస్తున్న పని గురించి వీళ్ళు కొన్ని విషయాలు మీకు చెప్తారని అన్నారు.
భూమిక ప్రోగ్రాం ఆఫీసర్‌ ఆషా ఈ కార్యక్రమం ఎలా అమలు చేస్తారో చెబుతూ ‘బాధితులు ఎవరైనా గ్రామ సంఘాల్లో అప్లికేషన్‌ పెడితే మా ఫెడరేషన్‌ వాళ్ళు వారానికి రెండ్రోజుల సమయం ఇస్తాము. మేం మొత్తం న్యాయ కమిటీలో పది మందిమి ఉంటాం. బాధితురాలి ద్వారా ఆమె భర్త, అత్త మామలకు ఫోన్‌ చేసి పిలిపించి బాధితురాలితో ముందుగా మాట్లాడి ఆమె మా నుంచి ఏం కోరుతుందో తెలుసుకొని చెప్తాము’ అన్నారు. ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు, మరియు న్యాయ కమిటీ సభ్యురాలు భారతి మాట్లాడుతూ ‘ఈ విధంగా ఎంతోమంది వృద్ధుల సమస్యలను మేం వాళ్ళ కుటుంబంతో మాట్లాడి పరిష్కరించాము. ఇదంతా ఫ్రీ సర్వీస్‌. మనతోటి మహిళలు వారి సమస్యలు చెప్పుకోవటానికి మా దగ్గరకు ధైర్యంగా వస్తారు. పోలీసుల దగ్గరకు వెళ్ళాలంటే వారికి జంకు, భయం. వాళ్ళను సార్‌, సార్‌ అని బ్రతిమలాడాలి. మేమైతే వాళ్ళకెప్పుడూ అందుబాటులో ఉంటాం’ అని చెప్పారు.
గౌరెల్లి నుంచి ముందడుగు మహిళా మండలి న్యాయ కమిటీ సభ్యురాలు మాట్లాడుతూ పెద్ద మనుషులు పంచాయితీ చేస్తే డబ్బులు తీసుకుంటారు. మేం వారిలా కాకుండా ఉండాలి అని న్యాయ కమిటీలు ఏర్పాటు చేసుకొని మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. కొన్ని మొండి కేసులు, విడాకుల కేసులు సఖీకి పంపిస్తున్నామని చెప్పారు. భూమిక సత్యవతి మాట్లాడుతూ మనం ప్రతి ఒక్కదానికీ పోలీస్‌ స్టేషన్‌కి, కోర్టులకి వెళ్ళనక్కర్లేదు. మనకి చాలా సహాయం చేసేవాళ్ళు, ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి, వీటిని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పారు. ప్రశాంతిగారు మాట్లాడుతూ ‘ప్రత్యామ్నాయ న్యాయ విధానం ద్వారా బాధితులు లాయర్‌తోను, పోలీసులతోనూ చెప్పలేని విషయాలు వీళ్ళకి చెప్తారు. వీళ్ళు బాధితుల ఇళ్ళకి వెళ్ళి అత్తామామలు, భర్తలతో మాట్లాడతారు. చట్టం గురించి చెప్పి మాటల్తో భయపెపడ్తారు. దాంతో బాధితుల కుటుంబ సభ్యులు దారిలోకి వస్తారు’ ఇలా చాలా కుటుంబ సమస్యలని సరిచేశారు అని చెప్పారు.
అర్చనాగారు మాట్లాడుతూ ‘మీ అందరికీ ఫోన్లు ఉన్నాయి. కోర్టులో మీ కేసు ఏ స్టేజిలో ఉందో మీకు తెలియదు. మీ లాయర్లు మీకు చెప్పరు. మీ ఫోనులో కోర్టు కేసుల పొజిషన్‌ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఆ యాప్‌ను మీ ఫోన్‌లో వేసుకొని సెర్చ్‌ చేయండి. అది తెలుగు భాషలోనూ వస్తుంది. మీరు స్ట్రాంగ్‌ అవ్వండి. మీ కేసు ఏ స్టేజిలో ఉందో ధైర్యంగా మీ జడ్జిని అడగండి. రెస్పాండెంట్‌ కోర్టుకి అటెండ్‌ కాకపోతే పెనాల్టీ వేయించవచ్చు. ఆఖరి మెట్టు వరకు ఎక్కండి. మధ్యలో ఆగిపోకండి‘ అని చెప్పారు.
లీగల్‌ ప్రొసెస్‌లో ఏమేం అడ్డంకులు ఉన్నాయో జ్యూరీలో వారందరూ ఈ క్రింది విషయాలను చెప్పారు. బాధితులకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు.
Ex-parte orders insist చేయాలి.
Respondent కోర్టుకి వాయిదాలకు రాకపోతే heavy costs impose చేయాలి.
Ex parte అయ్యాక ఆర్డర్‌ ఇవ్వండి అని అడగండి.
DV కేసులో లా పూర్తయ్యాక internship తీసుకోవటానికి జూనియర్లు ఒక సంవత్సరం కోర్టులకి వస్తారు కదా! వారిని ఈ కోర్టులలో పనిచేయాలని చెప్పాలి.
తేదీలు ఫిక్స్‌ చేయాలి.
Maintenance order
Salary attachment
ప్రాపర్టీ అటాచ్‌మెంట్‌ తప్పనిసరిగా చేయాలి.
చివరగా జ్యూరీ సభ్యులు ఒక్కొక్కరు ఐదు నిమిషాలు మాట్లాడవచ్చని చెప్పగా విజయభాస్కర్‌ మాట్లాడుతూ డివి చట్టం గురించి ఇంకా చాలామందికి తెలీదు. అమలు సరిగా లేదు. నోటీసు ఎలా సర్వే చేయాలి, నోటీసు వర్క్‌ కాకపోతే ఏం చేయాలి అనేదానిపై అవగాహన లేదు. వారెంట్‌ కేసుల్లోలాగా సమన్లు కేసుల్లో అదే ప్రొసీజర్‌ను అనుసరిస్తున్నారు. సమన్ల విషయంలో ఇంకాస్త సరళీకరణ చేయాలి. డివి చట్టంలో మీ సొంత విధానాన్ని అనుసరించండి అని ఉన్నా జడ్జిలు దాన్ని అనుసరించటం లేదు. మీరే రెస్పాండెంట్‌కి సమన్లు జారీ అయ్యాక కూ డా ఎందుకు ఆలస్యమవుతోంది అని జడ్జిల వెంట పడాలి అని చెప్పారు.
సరళారెడ్డి మాట్లాడుతూ ‘ఈ ముఖాముఖి కార్యక్రమం నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నో ఉద్యమాలు చేపట్టి ఈ డివి చట్టాన్ని తెచ్చుకున్నాం. అప్పుడున్న ఉత్సాహం ఇప్పుడు లేదు. ఇంప్లిమెంటేషన్‌ సరిగ్గా జరగకపోవడంతో మనకీ నిరుత్సాహం వస్తోంది. మేజిస్ట్రేట్‌కి మన ఈ సూచనలన్నీ రికమెండేషన్లుగా ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మేజిస్ట్రేట్‌కి ఈ సూచనలు ఇస్తే సరిగ్గా తొందరగా ఆర్డర్లు ఇస్తారు. సత్యవతిగారిని ఇందుకు పూనుకొమ్మని కోరుతున్నాను’ అన్నారు.
సంధ్య మాట్లాడుతూ ‘ఇలాంటి ముఖాముఖి సెషన్‌ పెట్టినందుకు భూమికను అభినందిస్తున్నాను. ఇప్పటినుండి మీరు బాధితులు కాదు, ఫైటర్స్‌గా మారాలి. కోర్టు తలుపుల దగ్గర ఆగకుండా మీరు కోర్టుల్లో మాట్లాడతామని కోరండి. జడ్జిలకు చెప్పుకునే ప్రయత్నం చేయండి. మన వ్యవస్థలు పూర్తిగా పితృస్వామిక భావజాలంతో నిండిపోయి ఉన్నాయి. ఈ వ్యవస్థల్లో ఉన్న అవినీతి, నిర్లక్ష్యం, అలసత్వం అడ్వకేట్‌లు జవాబుదారీతనంగా లేకపోవడం, జడ్జిలు చాలా ట్రెడిషనల్‌గా ఉండటం, డివిసి లంటే చిన్నచూపు ఇవన్నీ కలిసి మీకు సరైన న్యాయం వెంటనే లభించకుండా అడ్డుపడుతున్నాయి. దశాబ్దాల పాటు పోరాడి మనం డివిసి తెచ్చుకున్నాం. స్త్రీలకు కావాల్సిన ముఖ్యమైన రిలీఫ్‌ల కోసం పోరాడి తెచ్చుకున్నాం. లైంగిక వేధింపులు చట్టం, పోక్సో ఇవన్నీ అందరం కలిసి ప్రెజర్‌ గ్రూప్‌లుగా పనిచేసి సాధించాం. కానీ అమలులో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ చట్టాలపై ఇంతవరకు రివ్యూలు లేవు. మహిళా కమిషన్‌ దగ్గరకు వెళ్ళి రివ్యూ చేయమని డిమాండ్‌ చేద్దాం. జడ్జిల దగ్గర నుండి మార్పు తీసుకురావాలి.Lapses ను గుర్తిద్దాం. DLSA అడ్వకేట్‌లను పట్టించుకోవడం లేదు. mandatory orders కావాలి. తప్పనిసరిగా న్యాయ వ్యవస్థలో రెస్పాండెంట్‌ అటెండ్‌ అయ్యేలాగా 60రోజుల్లో రిలీఫ్‌లు వచ్చేలాగా చూడాలి. మెయింటెనెన్స్‌ ఇవ్వడానికి వచ్చిందే డివిసి కదా. బాధితుల హక్కు కోసం వ్యవస్థ పనిచేసేలాగా మనం డిమాండ్‌ చేయాలి. ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడిన దానినుండి రికమెండేషన్లు తయారుచేసి వాటిని అందరికీ ఇద్దాం. ధైర్యంగా పోరాడండి. అది ప్రొటెక్షన్‌ ఆర్డర్‌ కోసం అయినా రెసిడెన్స్‌ ఆర్డర్‌ కోసం అయినా పోరాడండి. పోరాటం తప్పదు’ అని ముగించారు.
ప్రశాంతి మాట్లాడుతూ ‘గృహ హింస చట్టంలో హక్కు ఉంది. హక్కుల్ని ఎప్పుడైనా పోరాటం ద్వారానే పొందగలం. ఆ హక్కు మనకు లభించేవరకు చివరిదాకా పోరాడాలి. నాకు ఎవరూ లేరు, ఏమీ లేదు అనుకోకుండా మన మనసులో ధైర్యం ఉంటే మన మాటలో ఆ ధైర్యం వస్తుంది. ధైర్యంగా కోర్టుల్లో మీ హక్కు గురించి అడగండి’ అన్నారు.
చివరిగా కె.సత్యవతి మాట్లాడుతూ ‘మీకెప్పుడు ఏ సలహా కావాలన్నా హెల్ప్‌లైన్‌కి కాల్‌ చేసి మన భూమిక పానల్‌ అడ్వకేట్‌ శేషవేణి గారి సలహా తీసుకోండి. ఈ రోజు ఈ మీటింగులో నాకు ఎక్కువగా మీ అందరి దగ్గర నుండి వినపడిన పదం ‘టార్చర్‌’. ఈ టార్చర్‌ అనే పదం నన్ను చాలా వెంటాడుతోంది. ఈ పెళ్ళిళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయి. మనకి నోరు, చేయి, తెలివి ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాము. మనం మెయింటెనెన్స్‌ కోసం, బ్రతకటానికి అతనిపై ఆధారపడుతున్నాము. అది మన చేతకానితనం. ఇదంతా మీరు ఆలోచించండి కోర్టుల్లో ఏం జరుగుతోంది, సఖిలో ఏం జరుగుతోంది, సపోర్ట్‌ సెంటర్లలో ఏం జరుగుతోంది అనేది అద్దంలో చూసినట్లు మీరంతా చెప్పారు. మీరు మమ్మల్ని నమ్మి ఇవన్నీ మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ, అని ముగించారు. ఇక్కడ మీరు పంచుకున్న సమస్యలన్నింటినీ తప్పకుండా కోర్టులలోని న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్తాం.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.