రంగనాయకమ్మ కథ ‘విధవల పట్ల… -అనిశెట్టి రజిత

తెలుగు సాహితీ లోకంలో రంగనాయకమ్మగారిది ప్రత్యేక స్థాయి, స్థానం. వీరు 1939లో పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించారు. స్వీట్‌హోమ్‌, స్త్రీ, పేకమేడలు, అమ్మ, జానకి విముక్తి, అమ్మకు ఆదివారం లేదా ? బలిపీఠం, కళ్ళు తెరిచిన సీత నవలలూ,

కథాసంపుటాలుÑ చలం సాహిత్యం, రామాయణ విష వృక్షం, తెలుగు వాచకాలూ, అనువాదాలూ, పరిచయాలూ, వ్యాకరణాలూ, తత్వశాస్త్రం, మార్క్‌ ్స కాపిటల్‌ ఇవిగాక మరెన్నో రచనలు చేసారు. మార్కి ్సస్ట్‌ రచయిత్రిగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక సామాజికాంశాలపై పలు రచనలు చేస్తున్నారు.
రంగనాయకమ్మ ‘అమ్మ’ కథా సంపుటి 1966 లో మొదటి ముద్రణ పొందింది. ఈ పొత్తంలో 9 కథలున్నాయి. అన్నీ కూడా 1950ల చివర్లో 1960ల్లో రాసినవే. ‘విధవల పట్ల మన కనీసధర్మం !’ కథ 1958 మార్చి నెలలో ‘‘ప్రజామత’’ పత్రికలో ప్రచురింపబడిరది. ఈ కథ సుమారు 65 ఏళ్ల నాటి మన సమాజానికి చెందినది. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య ఉత్తరాల రూపంలో కథ నడుస్తుంది. కుసుమ ఉత్తరం అందుకుంటుంది అనురాధ. ఆ లేఖలో కుసుమ ‘విధవరాలు’ అనబడే విద్యార్థిని తమ కళాశాలకు మల్లు చీర కట్టుకొని, వెంట్రుకలు ముడేసుకొని వస్తుంటే సాటి పిల్లలు ఆమె పట్ల హేళనగా ప్రవర్తించడం గురించి రాస్తుంది. ప్రత్యుత్తరం రాస్తూ తన ఊళ్లోనే కాదు ప్రతిచోటా వైధవ్యం పొందిన స్త్రీల పట్ల సాటి స్త్రీలూ సమాజం వ్యవహరించే తీరు గురించి తన అనుభవంలోని సంఘటనలు కొన్ని స్నేహితురాలితో పంచుకుంటుంది అనురాధ. ఏయే సందర్భాలలో భర్తపోయిన ఆడవాళ్ళను ఎలా చూస్తారు, వెలివేస్తూ అవమానాలపాలు చేస్తారో కొన్ని అనుభవాలను రాస్తుంది. తమ ఇంట్లో జరిగిన ఒక పేరాంటానికి పిలుపులకని చిన్న కుంకుమ భరిణే తీసుకుని వెళ్తుంది అనురాధ. ఒక ఇంట్లో ఇరవై ఏళ్లు కూడా లేని వితంతువైన అమ్మాయిని ఆమెను పేరంటానికి పిలవరని తెలిసినా పిలుస్తుంది. ఆమె రాను రాలేను అంటుంది. అందర్నీ పిలిచినట్లు నిన్ను పిలుస్తున్నాను అంటే నీకభ్యంతరం లేకపోయినా మీ అమ్మా, నాయినమ్మ, మీవాళ్ళకుంటుంది, వచ్చిన పేరంటాళ్లందరూ నన్ను నవ్వులపాలు చేస్తారు ముక్కున వేలేసుకుంటారు నేను రాను, నాకా అర్హతలేదని విచారంగా చెప్తుంది. రచయిత్రి మళ్ళీ రమ్మని వాదిస్తుంది. అప్పుడా అమ్మాయి మా చెల్లెలి పెళ్ళిలో ఏం జరిగిందో నీకు తెలిసికూడా నన్ను పేరంటానికి రమ్మని ఎలా అడుగుతున్నావని దీనంగా ప్రశ్నిస్తుంది.
నిజమే ఆ రోజు జరిగిన తతంగం కొద్దిగ కాదు. ఆ అమ్మాయితో పాటు భోజనాల బంతిలో కూర్చున్న స్త్రీలు రకరకాల సాకులు చెప్తూ మళ్ళీ కూర్చుంటామని లేచి వెళ్ళిపోవడం. ఇలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తే అశుభమని గుసగుసలుగా అనుకోవడం, కళ్ళు పెద్దగా చేసుకొని ఆమెను వింతగా చూడటం, బిత్తరపోయి ఉన్న ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ వచ్చి ‘‘పునిస్త్రీ వాళ్ళతో నువ్వెందుకే ? దిష్టి పిడతలా, పద లోపలికి’’ అని లాక్కుపోవడం.. ఆ అమ్మాయి అవమానంతో తలెత్తుకోలేకపోవడం గుర్తుచేసుకుంటుంది అనురాధ.
నిత్య జీవితంలో పొద్దున లేచినప్పటి నుండి వైధవ్యం పొందిన స్త్రీల ముఖాలు చూడటం అపశకునం, అశుభం అంటూ ఈసడిరచడం. అది సబ్బుతోగాని సాన్నం చేయదట అని వారు పరిశుభ్రంగా ఉండటం కూడా చూడలేని వాళ్ళు, వాళ్ళ ఆహారపు అలవాట్లపై ఆంక్షలు విధించి తమలోని వికృతాన్ని చల్లార్చుకునేవాళ్లు, అంతటా వాళ్ళ ఉనికిని తిరస్కరిస్తూ తమ నుండి దూరం పెట్టడంలాంటి మూర్ఖతాలను గురించి బాధగా కుసుమకు రాస్తుంది అనురాధ. భర్తపోయిన ఆ స్త్రీలపట్లా వారి కొచ్చిన కష్టాలపట్లా, జీవచ్ఛవాల్లా వాళ్ళను బ్రతకమని శాసించడం పట్లా వ్యతిరేకతతో మనం సానుభూతిగా ఉండాలని తన ఆలోచనలు వెళ్ళబోసుకుంటుంది. సానుభూతిగా ఉండటం అంటే జాలి పడటమా ? కాదు వాళ్లు వేరు అని కాకుండా తమలాంటి స్త్రీలు అని మామూలుగానే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటం.
అరవై ఏళ్ళ నాటి సమాజంలో స్త్రీ అస్తిత్వం భర్త అస్తిత్వంతో మాత్రమే ముడివేసి చూసే సమాజంలోని అనాచారాలూ అవమానకర సంప్రదాయాలపట్ల రచయిత్రి వేదనతో, నిరసనతో రాసిన కథ ‘‘విధవల పట్ల మన కనీస ధర్మం’’ !
సమాజంలో జీవన క్రమపద్ధతి, క్రమశిక్షణాయుత జీవితం కోసం మనం ఏర్పర్చుకున్న కొన్ని నియమాలూ, విలువలూ, సంప్రదాయాలూ, ఆచారాలూ, వావి వరుసలూ, సంస్క ృతీ కొందరికి సౌఖ్యాన్నీ, అధికారాన్నీ ఇస్తే మరికొందరిని అత్యంత హీనమైన దీనమైన స్థితిగతుల్లోకి తోసేస్తుంది.
పురుషస్వామ్యం పెత్తనం చెలాయిస్తూ అడుగడుగునా అధికార శాసనాలు జారీ చేస్తూ అజ్ఞానాంధకారంలోకి సమాజాన్ని నెట్టివేయడం అనాదిగా జరుగుతున్న అకృత్యం. పెత్తనం ఒక విచక్షణారహితమైన మత్తు. అది కఠినంగా నిర్ధాక్షిణ్యంగా చెలాయింపబడుతుంది. స్త్రీల మీద అమలయ్యే పెత్తనాలే కుటుంబ వ్యవస్థ.
జననమరణాలు ప్రతి ప్రాణికీ ఒక్కటే. ఒకరి మరణం వల్ల మరొకరికి ఏర్పడే వెలితి, శూన్యం అనివార్యం. కానీ స్త్రీ పురుషుల సంబంధాల్లో వైవాహిక వ్యవస్థ సంప్రదాయపు అధికారిక సూత్రాల్లో చిక్కుకొని భార్య చనిపోతే భర్త పట్ల ఏర్పడే సానుభూతీ వెనువెంటనే అతనికి మళ్ళీ పెళ్ళి చేసి కుటుంబాన్ని ఏర్పర్చాలన్న ఆరాటం కనబరిస్తే భర్త మరణించిన స్త్రీ పట్ల ఎలాంటి ఆలోచనా కనపర్చదు సమాజం. కుటుంబంలో కొనసాగుతున్న అసమ సంబంధాలూ అణిచివేతలూ, స్త్రీల పట్ల ఏర్పర్చుకున్న దృష్టికోణాలూ అన్నీ కలిసి అశుభం, అపశకునం, ఆచారం, సంప్రదాయం అన్న ఉరితాళ్ళను వైధవ్యం పొందిన స్త్రీ పట్ల నిర్ధాక్షిణ్యంగా బిగిస్తుంది. వైధవ్యం అనే ప్రయోగం ప్రత్యేకత ఏమిటి ? స్త్రీని రాతి బొమ్మలా చేయడం ఎందుకు ? ప్రగతి ప్రగల్భాలు వల్లించడం ఎందుకు ?
సమాజంలో చెలామణిలో ఉన్న ఆంక్షలు, పాటింపులు స్త్రీలపట్ల క్రూరమైన పాశాలుగా మారుతాయి. ఈ అశాస్త్రీయ నమ్మకాలతో, మూఢత్వంలో కరుడుగట్టిన విశ్వాసాలతో అభాగ్యతను స్త్రీలనుదుట బలవంతంగా రుద్దబడుతున్నది. సమాజం సిగ్గుపడుతూ తలదించుకొని సంస్కరణ ప్రక్షాళనా చేసుకోవాల్సిన విషయాల్లో ‘వైధవ్యం’ అనే దుర్మార్గపు వ్యవస్థ ఒకటి.
అరవై డెబ్బై ఏళ్ళ నాటి వ్యవస్థను నేటి ఆధునిక వ్యవస్థతో పోలిస్తే స్త్రీకి సంభవించే వైధవ్యంపట్ల మౌలికంగా పెద్దగా మార్పేమీ లేకపోవడం చూస్తున్నాము. కొందరు బొట్టూ, గాజులు, పూలు ధరించడమే మార్పు కాదు.
రంగులేని మల్లు వస్త్రాన్ని చుట్టబెట్టడం, జుట్టు ముడివేసుకోవడం.. అందరిలోకి అనాకర్షనీయంగా విచిత్రంగా కనిపించేట్టు
ఉండటం, బడికిగాని, కళాశాలకుగానీ బయటికి ఎక్కడికైనా వెళ్ళితే ఎగతాళి చేయబడటం అనేది బాలికా వధువుల పట్లా, యావ్వన స్త్రీలపట్టా చూస్తూనే ఉన్నాం.అంతా వాళ్ళ కర్మ, తలరాత అనుకుంటాం. ఆ బ్రహ్మ రాసిన రాత అంటారు. ఆ బ్రహ్మ ఎవరోగాదు ఈ బ్రాహ్మణ్య పితృస్వామ్య సమాజం.
అనురాధ ప్రత్యుత్తరం రాయమన్న కుసుమకు ఉత్తరం రాస్తూ రాయడానికి గోడవలేమున్నాయి ఏదో కాలక్షేపం కబుర్లు తప్ప… అయితే మా ఊళ్లో ఉన్న పేరాంటాళ్ల గొడవ గురించి చెప్తానుండు అంటూ.. వివిధ పేరాంటాల సందర్భాల్లో ఊళ్ళోని వాళ్ళను పిలవడానికి పోయినప్పుడు ఆయా ఇళ్లలో ఉండే వితంతు స్త్రీలను పిలవడం ఎంత ఘర్షణ సంఘర్షణతో కూడిన విషయమో కొన్ని సంఘటనలను ఉటంకిస్తుంది.
రచయిత్రి తాను 20 ఏళ్ల లోపు వయస్సులో రాసిన కథ కావడం వల్ల కొన్ని భావనల అభివ్యక్తీకరణలో ఆ రోజుల్లోని భావజాల ప్రభావం కనిపిస్తుంది. అనురాధ ‘‘కుంకుమభరిణె పట్టుకొని పేరాంటాళ్ళని పిలిచే స్థితిలో ఉండటం చేతనే స్త్రీలు ‘కర్మ వల్లనే’ విధవలవుతారని’’ భావిస్తుంది అని ఈ కథ గురించి అంటుంది. భావాల్లో కొంత వెనుకబాటుతనం ఉన్నప్పటికినీ ఆమె అభివృద్ధి దృష్టి కలిగి ఉండటం స్పష్టంగా తెలుస్తుంది.
65 ఏళ్ల నాటి వ్యవస్థ తీరు సంస్కారం, అభాగ్యులుగా చేయబడుతున్న స్త్రీల పట్ల సానుభూతీ సంవేదనా… కుటుంబంలోని వ్యక్తుల మూఢత్వం. నిర్భంద వైధవ్యాలను నీచంగా అమలుపర్చడం ఈ కథలోని అంశం. నాగరికులు అనబడే సామాజికులు ఎవరు ఈ కథ చదివినా హృదయం చలిస్తుంది. భర్తపోయిన స్త్రీలను వితంతువులుగా మార్చే ప్రక్రియలో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్న సమాజం తన కనీస ధర్మం గుర్తెరిగి ప్రవర్తించాలనీ, మనుషులుగా నిర్మించుకున్న మన సంఘం స్త్రీలను శిల్పాలుగా చెక్కి నిర్జీవులుగా చేయరాదనీ, సహజీవన బాధ్యతల్లో సమభావన, మానవ గౌరవం, హోదాలపట్ల హేతుబద్ధమైన ప్రవర్తనా నియామళి ఉండాలనీ రచయిత్రి ఈ కథలో సూత్రప్రాయంగా చెప్పారు. అనాచార వ్యవస్థలను వ్యతిరేకిస్తూ మానవీయ విలువలను సమాజం పాటించాలని స్పష్టంగా చెప్పడం ఈ కథా లక్ష్యం.
ఏమీ మారని సమాజం పట్ల పునరాలోచన చేస్తూ అర్థంలేని ఆచారాల సంకెళ్ళ నుండి మహిళాలోకాన్ని విముక్తం చేసుకోవాలన్న పిలుపు, మన కనీస ధర్మం అన్న మాననీయత ఈ కథ మనకిచ్చే ఆర్ధ్రమైన సందేశం ! ఎటు చూసినా ఈ హేయమైన ఆచారానికి ఏ మత సమ్మతీలేదు అయినా మతపు విలువల్ని ఆపాదించి మరీ శాడిజంతో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అరాచకపు ఆచారాల మురికి కాలువలో పడి కొట్టుకుపోతున్న సమాజం అభివృద్ధి, మానవ ప్రగతి అంటూ తలెత్తుకొని నిలబడే అర్హతను కోల్పోతుంది. కోల్పోయింది కూడా. బాధించేదేదైనా త్యజించాలి.
మన ఉన్నతికి, వికాసానికి తోడ్పడే ఏ అచారం, నియమం, అంశమైనా సంతోషంగా ఆహ్వానించాలి. మేధస్సు ఉన్న ప్రతి మనిషి పాటించాల్సిన విషయం ఇది. దురాచారాల అధర్మం ఇంకానా చెల్లుబాటయ్యేది ! ? అప్పుడిది సభ్య సంస్కార సోకాల్డ్‌ నాగరిక ఆధునిక సమాజం అని ఎట్లా భావిస్తాం. కాలదోషం పట్టిన నియమాలనూ, ధర్మాలనూ, భావాలనూ తిరస్కరిస్తూ నవసమాజపు నవ్యతలను స్వీకరించి పాటించాలి. స్త్రీలకున్న సవాలక్ష సమస్యలు, బంధనాలను తెంచడం, వైధవ్యం అనే ఆచారాన్ని దహించివేయడం ఈ కాలం మనుషుల కనీస కర్తవ్యం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.