‘‘సౌందర్య లహరి’’లో…
‘‘భూమిక’’ స్త్రీల మాసపత్రికను నేను ‘‘మనలో మనం’’గా ప్రారంభమైన ‘‘ప్రజాస్వామిక రచయిత్రుల’’ వేదిక కార్యక్రమం అనకాపల్లిలో జరిగినప్పుడు చూశాను.
రచయిత్రులందరి పేర్లతో ఉన్న బ్యానర్‌ను కవర్ పేజీగా వేశారు.
2009 జనవరిలో భూమిక ఎంతో ఆకట్టుకుంది. స్త్రీల గురించి, వారి సమస్యల పరిష్కార దిశగా సంపాదకీయాలు, రచనలు, కవితలు, కథలు, వ్యాసాలు అన్నీ స్త్రీల ప్రాథాన్యతగా మొత్తం పుస్తకం చాలా అపురూపంగా కనిపించింది కావాల్సిందే కైవశమైనట్లు. అనకాపల్లి పరిసరాల విశేషాలే తెలిసిన నాకు మొత్తం స్త్రీల మనోభావాల సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన
అనుభూతి. వేరే అన్ని పత్రికలలో అరకొరగా కనిపించిన స్త్రీ నేపథ్యం భూమికలో సంపూర్ణంగా కనిపించడం ఆనందం కలిగించింది. అప్పుడే రచయిత్రులందరితో కొండవీటి సత్యవతి గారిని చూశాను. భూమిక అభిమానినయ్యాను.
సంపాదకీయాలే కాక ఫేస్‌బుక్‌లో సత్యగారి పోస్టులకు వీరాభిమానినయ్యాననాలి. ఆకాశమంత స్వేచ్ఛను అనుభూతి చెందటాన్ని ఆస్వాదించటం వలన. మనం ఎలా ఉండాలనుకుంటామో అలా ఉండలేని పరిస్థితుల వల్ల అలా నడుచుకునే వారిలో అంతర్లీనంగా మమేకమై ఆనందిస్తూ అభిమానిస్తాం. భూదేవంత ఓర్పు ఆమె సొంతం. నడిచే మహా వృక్షంలా తనలో తలదాల్చుకున్న పక్షులనూ, జీవరాశినీ పొదువుకున్నట్లు సమాజంలో అసహాయులైన మహిళలనూ సదా రక్షిస్తోన్న మనసున్న అమ్మ.
` అమరజ్యోతి, అనకాపల్లి
షషష