ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్‌’’ డా. ఎం. ఎం. వినోదిని

ఈ మధ్య కాలంలో మన సమాజం గుర్తించిన కొత్త పేరు ఫాతిమా షేక్‌. చరిత్ర విస్మరించిన ఎందరో ప్రముఖుల చరిత్రను కొందరు చరిత్ర కారులు శ్రద్ధతో తవ్వి వెలికి తీస్తున్నారు. ముఖ్యంగా సమాజంలో అస్తిత్వ స్పృహ పెరిగాక, దళిత, బహుజన, ముస్లిం చరిత్రకారులు విస్మరణకు

గురైన ఎందరో గొప్ప సామాజిక వేత్తల చరిత్రను పునర్నిర్మిస్తున్నారు. అటువంటి ఒక చారిత్రక పునర్నిర్మాణం గా ముందుకు వచ్చిన కొత్త పుస్తకం ‘‘ ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్‌’’. ముస్లిం చరిత్రను పునర్నిర్మాణం చేస్తున్న సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ ఈ కొత్త పుస్తకాన్ని రచించారు. శకలాలుగా ఉన్న ఫాతిమా షేక్‌ చరిత్రను వెతికి తెచ్చి ఒక వరున క్రమంలో పెట్టి పాఠకులకు అందిచండానికి నశీర్‌ అహమ్మద్‌ గారు చేసిన ఈ కృషి ఎంతో విలువైనది.
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తెలుగు పాఠకులకు సుపరిచిత చరిత్రకారులు. చరిత్రలో మరుగున పడిపోయిన ఎందరో పోరాట యోధుల చరిత్రను పరిశోధించి పుస్తకాల కెక్కించి అందించారు. భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్రను వివరిస్తూ అనేక పుస్తకాలు వెలువరించారు. ఈ క్రమంలో చరిత్ర తవ్వకంలో నశీర్‌ అహమద్‌ తెలుగు పాఠక లోకానికి చారిత్రక మహిళ ఫాతిమా షేక్‌ జీవన పోరాట గాధను పరిచయం చేశారు. ఇటీవల కాలం వరకు తెలుగు పాఠకలోకానికి ఫాతిమా షేక్‌ పేరు కూడా తెలియదు. భారతదేశంలో ఆడపిల్లల చదువు కోసం పోరాడిన ఇద్దరు తొలితరం మహిళల్లో మొదటి వ్యక్తి సావిత్రీబాయి పూలేకాగా, రెండవ వ్యక్తి ఫొతిమా షేక్‌ అని తెలియడానికి ఇంత కాలం పట్టింది. అటువంటి ఫాతిమా షేక్‌ గురించి సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు ఎంతో శ్రమకోర్చి ఎక్కడెక్కడో వున్న పుస్తకాలనుంచి, చారిత్రక డాక్యుమెంట్ల నుండి సమాచారం సేకరించి ఫాతిమా షేక్‌ చరిత్రకు ఒక రూపాన్నిచ్చి పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు.
భారత తొలి ఆధునిక ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్‌ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఆమె వ్యక్తిగత జీవితం తో పాటు ఆమె చేసిన సామాజిక సేవను, ఆ సేవ వెనుకనున్న ధైర్యాన్ని. ఔదార్యాన్ని మనమీ పుస్తకంలో చూడవచ్చు. ఆనాటికి స్త్రీలు చదువుకోవడం అనేది సమాజానికి కొరుకుడు పడని విషయం. అటువంటి స్థితిలో ఫాతిమా షేక్‌, సావిత్రీబాయి పూలేతో కల్సి చదువుకోవడం, ఉపాధ్యాయ శిక్షణ పొందడం వాళ్ల పట్టుదలకు, వారి సామాజిక సేవా నిబద్ధతకు నిదర్శనం. ఇకనించి సావిత్రీబాయి ఫూలే పేరు పక్కన ఫాతిమా షేక్‌ పేరుని సగౌరవంగా చేర్చి, ఈ ఇద్దర్ని చదువుల తల్లులుగా ప్రజానీకం గుర్తు పెట్టుకుంటుంది.
అతిశూద్ర, శూద్ర బాలికల కోసం నూటాడెబ్బయి సంవత్సరాల ముందే మొదటి పాఠశాలను నడిపిన మహోన్నత స్త్రీల చరిత్ర ఇప్పటి వరకూ పాఠ్య పుస్తకాల కెక్కకపోవడం విషాదం. మన సమాజంలో మహాత్మా జోతిరావు పూలే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిరెండు మూడు దశాబ్దాలే. శూద్రులు చదువుకోవడం పట్ల ఆరోజుల్లో బ్రాహ్మణ వర్గాలకు ఎంత వ్యతిరేకత ఉందో, శూద్ర స్త్రీలు చదువుకోవడం పట్ల అంతకు మించి వ్యతిరేకత ఉంది. ముస్లిం స్త్రీల పరిస్థితిలో కూడా పెద్ద తేడా లేదు. ముస్లిం స్త్రీలకు ధార్మిక చదువుల వరకు మాత్రం అనుమతి ఉంది. ముస్లిం స్త్రీలు ఆధుసిక విద్య నేర్చుకోవడం పట్ల ఆనాటి కొందరు ఛాందస ముస్లిం పెద్దలు వ్యతిరేకించడాన్ని గురించి సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు ఈ పుస్తకంలో రికార్డు చేశారు. ఫాతిమా షేక్‌ అన్ని అడ్డంకులను అధిగమించి ఉర్దూ, అరబిక్‌ భాషలతో పాటు మరాఠీ, ఇంగ్లీషు భాషలను కూడా నేర్చుకోవడం గొప్ప విషయం.
‘ ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు – ఫాతిమా షేక్‌’ అనే ఈ పుస్తకంలో ఫాతిమా షేక్‌తో పాటు ఫాతిమా షేక్‌ అన్నయ్య ఉస్మాన్‌ షేక్‌ గురించి, మహాత్మా జోతిరావు పూలే చదువుకు, ఉద్యమానికి తోడ్పాటు నందించిన మున్నీ గఫ్ఫార్‌ బేగ్‌ గురించి కూడా సమాచారం అందించారు.సావిత్రీబాయి మరియు జ్యోతిరావులు బహుజనులకు విద్యాబోధన చేస్తున్నారని, వారు చేస్తున్న విద్యా పోరాటాన్ని మెచ్చని సొంతవారే వాళ్ళను ఇంటి నుండి వెళ్లగొట్టారు. అటువంటి సమయంలో ఫాతిమా సోదరుడు ఉస్మాన్‌ షేక్‌ తన ఇంట్లో ఫూలే, సావిత్రీబాయిలకు ఆశ్రయం ఇచ్చాడు.
మహాత్మా జోతిరావు ఫూలే స్నేహితుడైన ఉస్మాన్‌ షేక్‌, ఆయన చెల్లెలు ఫాతిమా షేక్‌లు మహాత్మా జోతిరావు ఫూలే తలపెట్టిన కార్యక్రమాల్లో తోడు నిలవడమే కాకుండా వాళ్ల ఇంటిలోని కొంత భాగాన్ని, పాఠశాలగా మార్చి బాలికల విద్యాబోధనకు తోడ్పాటు నందించారు. ఫాతిమా షేక్‌, ఉస్మాన్‌ అన్నచెల్లెళ్ళు ఇద్దరూ ఫూలే సావిత్రీబాయి ల లక్ష్యానికి తోడు నిలిచారు. బహుజనులకు బాలికలు మరియు విద్యను అందించడం లో, అనేక పాటశాలలు ఏర్పాటు చేయడంలో తోడు నిలిచారు.
భారతదేశంలో బాలికల విద్య కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన ధీరవనితలు సావిత్రీబాయి ఫూలే %–% ఫాతిమా షేక్‌లు. వీరిరువురుకి సమాజం నుంచి దారుణమైన రీతిలో ఎదురైన అసమ్మతిని, అవమానాన్ని, తిరుగుబాటును ఎదుర్కొని ఆడపిల్లల చదువు కోసం బలంగా, స్థిరంగా నిలబడిన తొలి భారతీయ ఉపాధ్యాయ ఉద్యమకారిణులు. దేశంలోని కోట్ల మంది బాలికలు విద్యను పొందేందుకు మార్గం సుగమం చేశారు.
సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు ఈ పుస్తకంలో అవసరమైన ప్రతిచోటా తగిన చారిత్రక ఆధారాలతో సహా ఎన్నో కొత్త విషయాలను మన ముందుంచారు. ఇటువంటి పుస్తకాలు చదివినప్పుడు ఎందరో మహనీయుల సేవలను సమాజానికి తెలియకుండా మరుగున పడిపోయాయని మనకు అర్ధమవుతుంది. ఇటువంటి గొప్ప సామాజిక సేవ చేసిన స్త్రీ చరిత్రను అందించిన ఈ పుస్తకం, పుస్తక రచయిత అభినందనీయులు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.