ఉమా నూతక్కి కథలు – వంశీ కృష్ణ

“Sometimes fate is like a small sandstorm that keeps changing directions. You change direction but the sandstorm chases you. You turn again, but the storm adjusts.

Over and over you play this out, like some ominous dance with death just before dawn. Why? Because this storm isn’t something that blew in from far away, something that has nothing to do with you. This storm is you. Something inside of you. So all you can do is given into it, step right inside the storm, closing your eyes and plugging up your ears so the sand doesn’t get in, and walk through it, step by step. There’s no sun there, no moon, no direction, no sense of time. Juse fine white sand swirling up into the sky like pulverized bones. That’s the kind of sandstorm you need to imagine.
And you really will have to make it through that violent, metaphysical, symbolic storm. No matter how metaphysical or symbolic it might be, make no mistake about it. It will cut through flesh like a thousand razor blades. People will bleed there, and you will bleed too. Hot, red blood. You’ll catch that blood in your hands, your own blood and the blood of others. And once the storm is over you won’t remember how you made it through, how you managed to survive. You won’t even be sure, in fact, whether the storm is really over. But one thing is certain. When you come out of the storm you won’t be the same person who walked in. That’s what this storm’s all about.”
కాఫ్కా ఆన్‌ ది షోర్‌లో హారుకి మురకామీ చెప్పిన ఈ మాటలు ఉమా నూతక్కి కథలు చదువుతున్నంతసేపూ నన్ను హంట్‌ చేస్తూ వచ్చాయి. ఆమె ఇమాజినేషన్‌ అంతా అచ్చు మురకామీ చెప్పిన ఇసుక తుఫాన్‌లాగే ఉంది. మురకామీ చెప్పినట్టుగానే ఆ కథలన్నీ చదివాక I won’t be the same person. ఏమున్నది ఉమా నూతక్కి కథలలో.
భద్రమైన జీవితాలు అనుకున్న వాటిలో పేరుకున్న అభద్రత, అది సృష్టించే విలయం ఉంది. అస్తిత్వాన్ని మించి అంతరంగం చేసిన అన్వేషణ ఉంది. మానవ వికృత మనస్తత్వం చేసిన గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు జీవితాంతమూ చేసే సలపరింత ఉంది. ఆ వికృత మనస్తత్వం ఏర్పడడానికి దోహదపడే తాత్విక భూమికలు అన్వేషణ ఉంది. తన మీద తాను క్షణకాలమైనా పడే జాలిలో నుండి, సానుభూతిలో నుండి గట్టిపరచుకునే వ్యక్తిత్వం కోసం చేసే పోరాటముంది. వీటన్నింటినీ సమన్వయం చేసే ఒక దృక్పథం ఉంది. ఫెమినిజం లాంటి పాత మాట ఊసు ఎత్తకుండానే తనను తాను అన్వేషించుకునే, ఆ అన్వేషణా ఫలితాలను వ్యక్తం చేసే అభివ్యక్తి ఉంది.
శిశిరలో శిశిర, మిట్ట మధ్యాహ్నపు నీడలో మిథున, హుక్‌లో మయూర, మరో వాన మబ్బుల కాలంలో మరో మిధున, నిర్జనలో ఆమె ఎవరైనా కావచ్చు అవి కేవలం పాత్రల పేర్లు మాత్రమే కాదు, ఒక స్త్రీ స్వయంగానో, పరకీయంగానో అనుభవించే దుఃఖానికి అక్షర రూపాలు. ఎవరి జీవితంలో అయినా ఏముంటుంది అసలు? ఇంత దుఃఖం, అన్ని కన్నీళ్ళు, కొంత మోదం, కొన్ని కౌగిళ్ళు అంతే కదా! అనుకుంటే అంతేకానీ వాటి లోతు, లయ అనుభవిస్తే తప్ప అర్థం కాదు.
ఇద్దరు మనుషుల మధ్య ఉండే సంబంధం కేవలం వాళ్ళిద్దరికీ మాత్రమే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులయితే, బయటినుండి మనం అల్లే ఊహలకు, పడే అసూయలకు అంతే ఉండదు. ఇంతా చేసి తరువాత ఎప్పుడో ఆ బంధంలోని స్వచ్ఛత, తేట నీటి అడుగు చేప పిల్లల తారళ్యతలా అనుభవంలోకి వస్తే ఆ నిర్మల మందాకినీ సారళ్యం ముందు మన తనువూ, హృదయమూ సిగ్గుతో భారంగా ఒంగిపోవలసిందే. శిశిర కథలో శిశిర ఆ తారళ్యతకి ఒక ఉదాహరణ. ఎప్పుడో చిన్నతనంలో జరిగిన ఒకానొక భయంకరమైన అనుభవం పదే పదే కలల రూపంలో స్మృతిని పొందుతూ ఉంటే ఆ దుఃఖపు చారిక పేరు మిథున. హృదయానికి బహువచనాన్ని గట్టిగా పట్టి బంధిస్తూ నొప్పి కలుగచేస్తున్న బ్రా హుక్‌ కాస్త తొలగించినప్పుడు అనుభవంలోకి వచ్చే ఒక రిలీఫ్‌ని కూడా అతి ప్రయత్నం మీద సాధించుకోవాల్సిన విపత్కర స్థితికీ, తన మానసిక భౌతిక స్వేచ్ఛను బ్రాలా పట్టి బంధిస్తూ ఉన్న సజీవ మానవ సంబంధాల హుక్‌ కాస్త పక్కకు తొలగించి ఒక ట్రాజిక రిలీఫ్‌ పొందడానికి మధ్య ఒక అభేదాన్ని కనుగొనే ఒక మయూర, తాను, తన ఉద్యోగం, తన ప్రమోషన్లు, తన భద్రలోకం అందులోకి ఒక్క మనిషినయినా లోపలికి ఆహ్వానించలేకపోయి చివరకు తానొక నిర్జనగా మారిపోయానని గుండెలు అవిసేలా దుఃఖపడే ఆమె. వీళ్ళందరూ ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒకచోట మనకు తారసపడుతూనే ఉంటారు. ఆ మాటకొస్తే నిత్యం తారసపడుతూనే ఉంటారు. కాకపోతే వాళ్ళను మనం గుర్తించం. వాళ్ళు పడే దుఃఖాన్ని గుర్తించం. వాళ్ళ నిశ్శబ్ద పోరాటాన్నీ గుర్తించం. ఇదుగో ఇప్పుడు ఉమా నూతక్కి వాళ్ళను ఇలా అక్షరాలలోకి లాక్కుని వచ్చి మన కళ్ళముందు, మన చేతనా రాహిత్య యధాతథ స్థితి ముందు నగ్నంగా నిలబెడుతున్నది. చాలా రోజుల క్రితం సారంగ వెబ్‌ మ్యాగజైన్‌లో ‘బ్లాక్‌ ది లైఫ్‌’ చదివి వస్తు రూపాల సమన్వయానికి ముచ్చట పడిపోయా. ఆ తరువాత ఆంధ్రజ్యోతిలో నిశ్శబ్ద స్వరం చదివాక ఆమె కథలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు ఇలా కథల రూపంలో కథలు చదువుతూ ఆమె కథ చెప్పే విధానానికి, కథ చెప్పే టెక్నిక్‌, పాఠకుడిని వెంట తీసుకుని వెళ్ళే శైలికి ఆశ్చర్యం కలుగుతున్నది. చాలామంది వస్తువు మీద పెట్టిన దృష్టి కథా శిల్పం మీద పెట్టరు. కథా శిల్పం మీద దృష్టి ఉన్నవాళ్ళకి వస్తువు పట్ల పెద్దగా పట్టింపు ఉండదు. రెండిరటిపట్లా సమ్యక్‌ దృష్టి ఉమా నూతక్కి కథలలో కనిపిస్తుంది.
మిట్టమధ్యాహ్నపు నీడలో మిథున పొందిన దారుణమైన అనుభవాన్ని మొట్ట మొదట కల రూపంలో, తరువాత ఎదురింటి పసిపాప అనుభవ రూపంలో, చివరకు నాయనమ్మ రూపంలో పొరలు పొరలుగా ఆవిష్కరించడం ఉమా నూతక్కి కథా రచనలో సాధించిన నిపుణతకి సాక్ష్యం. అలాగే బ్లాక్‌ ది లైఫ్‌ కూడా. శైలి బావుంటే అతి సాధారణమైన కథను కూడా చదివిన పాఠకుడితో అద్భుతం అనిపించొచ్చు. అలా అనిపించిన కథ నీడ తొక్కిన ఆట.
చాలా కథలు ఆత్మాశ్రయ పద్ధతిలో ఉండి పాఠకుడిని ఆకట్టుకుంటాయి. కానీ ఆ పద్ధతికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి ‘మరో వాన మబ్బుల కాలం’లో పాఠకుడి అనుభవంలోకి వస్తుంది. నా వరకు నేను మిగతా కథలు చదివినప్పుడు పొందిన సంతృప్తిని ‘మరో వాన మబ్బుల కాలం’ చదివినప్పుడు పొందలేకపోయాను. దానికి ప్రధానమైన కారణం అది ఆత్మాశ్రయ పద్ధతిలో ఉండటమే అనుకుంటాను. వివాహ బంధంలో ఇమడలేక వెళ్ళిపోయిన మయూర మళ్ళీ తిరిగి వచ్చినపుడు, మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అర్జున్‌ మానసిక స్థితి పాఠకుడికి అర్ధమయితే తప్ప ఆ పాత్ర మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేడు. ఆ మానసిక స్థితి ఏమిటన్నది మిథున పరంగా కథ చెప్తున్న కథకుడు వివరించలేదు. వాన మబ్బుల కాలం నిజానికి అర్జున్‌, మయూరల కథ. కానీ మిథున పరంగా చెప్పడంతో ఆయా పాత్రల స్టాండ్‌ ఏమిటో, అవి ఎందుకలా బిహేవ్‌ చేస్తున్నాయో పాఠకుడు అర్థం చేసుకోలేడు. పైగా శరత్‌ మయూర పక్షమూ, మిథున అర్జున్‌ పక్షమూ తీసుకుని, మిథున మయూరనీ, శరత్‌ అర్జున్‌నీ జడ్జ్‌ చేస్తారు. అదెలా కుదురుతుంది? అర్జున్‌ బిహేవియర్‌కి అర్జున్‌కి ఒక ఆర్గ్యుమెంట్‌ ఉంటుంది. మయూర బిహేవియర్‌కి మయూరకి ఒక ఆర్గ్యుమెంట్‌ ఉంటుంది. ఎవరి ఆర్గ్యుమెంట్‌ వాళ్ళు చెబుతుంటే ఎవరు ఎవరో పాఠకుడు జడ్జ్‌ చేసుకుంటాడు. ఒక సందర్భంలో శరత్‌ ‘అర్జున్‌ మామూలు భర్తలాగే ప్రవర్తించాడు’ అంటాడు. ఆ మాట చెప్తే మయూర చెప్పాలి. శరత్‌ ఎలా చెప్తాడు? ఒకవేళ అర్జున్‌ శరత్‌ ఊహించినట్లు మామూలు భర్తే అయితే మీరు కలిసి
ఉండేది ఎన్నాళ్ళు? అని మిథున ప్రశ్నిస్తే ‘నువ్వు విలువ ఇవ్వాలి అంటే మా కాపురానికి కావలసిన టైమ్‌ ఫ్రేమ్‌ ఎంత?’ అని ఎలా అడగగలుగుతాడు. ఆ తరువాత శరత్‌ ‘మయూరని పసుపు పచ్చ తాడుతో కట్టేయాలని చూసే అప్పటి అర్జున్‌ కాదు’ అని ఎలా అనగలిగాడు. అర్జున్‌ పట్ల తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి దోహదపడిన అంశాలు ఏవి? ఇవేవీ ఆ కథలో లేవు. ఎందుకంటే ఆత్మాశ్రయ పద్థతిలో కథ చెప్పినట్లు ఉండే పరిమితి అది. ఆ పరిమితిని ఉమా నూతక్కి అధిగమించలేదు కనుక ఆ పరిమితిని అధిగమించాలి అనుకుంటే నీడ తొక్కిన ఆట రాసినట్టుగా అర్జున్‌ మయూర మిథున శరత్‌ అంటూ ఇండివిడ్యువల్‌ మోనోలాగ్‌ రాస్తే బావుండేది. అలా రాయకపోవడం వలన పాఠకుడు కూడా మిథున లాగే మయూర స్వేచ్ఛా ప్రియత్వం బరితెగింపు అనుకుంటే తప్పేమీ లేదేమో. అలా అనుకుంటే అది మయూర పాత్రకి అన్యాయమే.
పర్సనల్‌ స్పేస్‌ పేరుతో మనం పోగొట్టుకుంటున్న అనుబంధాల విలువ గురించి అంతర్వాహినిలో అండర్‌ కరెంట్‌గా చెప్పడమూ బావుంది. ‘‘సర్లేవే! ఒక్కపూట నా పక్కన పడుకుని కబుర్లు చెప్పండే అంటే నువ్వూ, నీ కూతురూ చెరో గదిలోకి పారిపోయి తలుపేసుకుంటారు. ఇప్పుడు మంచం మీద ఐసియులో ఉంటే నువ్వు బయట కూర్చుని ఏం లాభమే?’’ అంటుంది అమ్మ. ఈ ఒక్క మాటా ఆధునిక పిల్లలందరికీ తగులుతుంది. అమ్మ పక్కన నాలుగు కబుర్లు చెప్పడానికి మనకు తీరిక దొరకదు. కానీ ఆమె హాస్పిటల్‌లో ఉంటే రాత్రంతా బయట పచార్లు చేసి అమ్మ మీద ప్రేమను చాటుకుంటాం. హౌ రిడిక్యులస్‌ ఇటీజ్‌. దాన్ని ఉమా నూతక్కి బాగా పట్టుకుంది.
ఉమానూతక్కి కవిత్వం రాస్తుందో లేదో తెలియదు కానీ మధ్యలో ఆమె ఉదహరించిన వేగుంట మోహన ప్రసాద్‌ కవిత, మహాభారతంలోని తిక్కన పద్యం బావున్నాయి. అవ్యక్తం అన్న కథ అయితే అచ్చం కవితలాగే ఉంది. పురుషుడు ప్రధాన పాత్రగా ఆమె రాసిన కథ ఇదొక్కటే. ‘25వ గంట’ చదివినప్పుడూ, ‘అంతర్వాహిని’ చదివినప్పుడూ అందులో నన్ను నేను వెతుక్కున్నాను. తెలుగు కథా ప్రపంచానికి ఒక కొత్త చేర్పు ఉమా నూతక్కి ‘25వ గంట’.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.