ఉన్నత విద్యలో తెలంగాణ మహిళల అధిక నమోదు దేశానికే ఆదర్శం – డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు, వారి జీవన విధానం, మహిళా హక్కులు, అమలవుతున్న చట్టాల మీద అవగాహనతో కూడిన అర్థవంతమైన చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. మహిళా సాధికారత అంటే ఆధునిక సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా హోదాను, అవకాశాలను అనుభవిస్తూ నిర్ణయాత్మక స్థానంలో

ఉండటం. మహిళలు పొందగలిగే ప్రతి అవకాశం వారికి అందేలా చూడటం. ప్రతి నిర్ణయంలో స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను ఇవ్వడం. విద్య, ఆరోగ్య, ఉద్యోగ రంగాల్లో భాగస్వాములై మహిళలు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలి. సొంత ఉద్యోగంతో సంపాదించుకునే సామర్ధ్యం వారికి ఉండాలి. మహిళల శక్తి సామర్ధ్యాలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రంగాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఆర్థిక స్వాతంత్య్రాన్ని, రాజకీయ అవకాశాలను కల్పించాలి. ఇవన్నీ కేవలం విద్యతోనే సాధ్యమవుతుంది. ఇటీవలి కాలంలో దేశంలో ఉన్నత విద్యలో బాలుర కంటే బాలికల నమోదు అధికంగా ఉంది, అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళల ఉన్నత విద్య నమోదులో దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంది.
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ 2011 సంవత్సరం నుండి ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (AISHE) నిర్వహిస్తోంది. భారతదేశంలో ఉన్న అన్ని ఉన్నత విద్యా సంస్థలను కవర్‌ చేస్తుంది. ఈ సర్వేలో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మౌలిక సదుపాయాల సమాచారం, ఆర్థిక సమాచారం మొదలైన విభిన్న అంశాలపై వివరణాత్మక సమాచారాన్ని సేకరిస్తుంది. మొదటిసారిగా AISHE 2020`21లో ఉన్నత విద్యా సంస్థల సమాచారాన్ని వెబ్‌ ‘‘డేటా కాప్చర్‌ ఫార్మాట్‌ (DCF)’’ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌ సమాచార సేకరణ ప్లాట్‌ఫారంను ఉపయోగించి సమాచారాన్ని పొందుపరిచారు. దీన్ని నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసి) ద్వారా ఉన్నత విద్యా శాఖ అభివృద్ధి చేసింది. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (AISHE) 2020`21 ప్రకారం, భారతదేశంలో ఉన్నత విద్యలో 2019`20 విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు 3.85 కోట్ల నుండి 2020`21లో దాదాపు 4.14 కోట్లకు చేరింది. 2019`20 విద్యా సంవత్సరంలో యువతుల నమోదు 1.88 కోట్ల నుండి 2.01 కోట్లకు పెరిగింది. మొత్తం నమోదులో యువతుల నమోదు శాతం 2014`15లో 45 శాతం నుండి 2020`21లో దాదాపు 49 శాతానికి పెరిగింది. 2020`21 లో ఈశాన్య రాష్ట్రాల్లో యువతుల నమోదు 6.14 లక్షలు, యువకుల నమోదు 5.92 లక్షల కంటే ఎక్కువ (ప్రతి 100 మంది విద్యార్థులకు, జాతీయ నమోదు నిష్పత్తి (NER) లో 104 మంది విద్యార్థినులు ఉన్నారు). మొదటిసారిగా 2018`19లో బాలుర నమోదు కంటే బాలికల నమోదు ఎక్కువై, ప్రస్తుతం అదే ధోరణి కొనసాగుతోంది.
గత మూడు, నాలుగేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య అడ్మిషన్లలో బాలికలదే పైచేయిగా కనిపిస్తోంది. డిగ్రీ, పీజీ వంటి వృత్తి విద్యాకోర్సుల్లో యువతుల నమోదు క్రమంగా పెరిగింది. గణాంకాల ప్రకారం చూస్తే 2019`20 విద్యా సంవత్సరంతో పోల్చితే 2020`21లో యువతుల ఎన్‌రోల్‌మెంట్‌ (నమోదు) 4.5% పెరిగింది. ఇదే కాలంలో మొత్తం ఎన్‌రోల్‌మెంట్‌ 4.8% పెరగడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నమోదు తొలిసారిగా నాలుగు కోట్లు దాటి, 2020`21 సంవత్సరానికి 4.14 కోట్ల విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఇది 2019`20తో పోల్చితే 7.5%, 2014`15తో పోల్చితే 21% అధికం. యువతుల నమోదు రెండు కోట్లు దాటగా 2019`20తో పోల్చితే 13 లక్షల మంది అధికంగా ప్రవేశాలు పొందారు. 2014`15తో పోల్చితే ఎస్సీ విద్యార్థుల నమోదు 28%కు పెరగగా, ఎస్సీ యువతుల నమోదు 38%కు పెరిగింది. అలాగే ఎస్టీల నమోదు 47% కాగా, ఎస్టీ యువతుల నమోదు 63.4%కు పెరిగింది. ఓబీసీల నమోదు 32% ఉండగా, ఓబీసీ యువతుల నమోదు 39% పెరిగింది. దూరవిద్యలో నమోదు 2019`20తో పోల్చితే 7% పెరిగింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత, మహిళా సాధికారతను సాధించడానికి, వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వం అనేక రకాల విధానాలు, పథకాలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి బాలికా విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు రెసిడెన్షియల్‌ ఉచిత ఉద్యను అందిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో మొదట అత్యున్నత విద్యా ప్రమాణాలతో అధిక సంఖ్యలో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ బాలికల కోసం అన్నీ కలిపి దాదాపు వెయ్యికి పైగా గురుకుల విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రత్యేకంగా 60 మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు లా, అగ్రికల్చర్‌, డిజైనింగ్‌ లాంటి ప్రత్యేక కాలేజీలు ఏర్పాటు చేసి ఉన్నత విద్యను అందిస్తోంది. దీంతో రాష్ట్రంలో మహిళా విద్యలో నమోదు శాతం గణనీయంగా పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కుటుంబాల యువతులు ఐఐటీ, ఐఐఐటీ, ఇంజనీరింగ్‌, బీడీఎస్‌, మెడిసిన్‌ చదవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పెద్ద చదువులు చదివించడానికి పేద కుటుంబాలకు భారంగా మారేది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల సంస్థల ఆధ్వర్యంలో 66 గురుకుల కళాశాలలను సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్సీ (ప్రతిభ కళాశాలలు) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కోచింగ్‌ అందిస్తోంది. కోచింగ్‌ తీసుకున్న అమ్మాయిలు ఏటా మెడిసిన్‌, ఇంజనీరింగ్‌లో జాతీయసంస్థల్లో సీట్లు సాధిస్తూనే ఉన్నారు. దేశ సగటు నమోదు 27 శాతం అయితే తెలంగాణ నమోదు 40 శాతంగా ఉంది. యువతులు జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. యువతుల ఉన్నత విద్య అవసరాన్ని గుర్తించి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో ఉన్న కోఠి మహిళా కళాశాలను ‘మహిళా యూనివర్శిటీ’గా మార్చింది. రాష్ట్ర స్థాయి కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రవేశ పరీక్షలు (సీపీగేట్‌)`2022 లెక్కల ప్రకారం 2022`23 విద్యాసంవత్సరంలో తెలంగాణలో పీజీలో చేరిన యువతులు 72 శాతం ఉంటే (2021`22లో 70 శాతం), డిగ్రీలో 52 శాతం, బిఎడ్‌లో 81 శాతం యువతులు ఉన్నత విద్యలో పొందిన ప్రవేశాలే ఉన్నత విద్యలో యువతుల అధిక నమోదు పురోగతికి నిదర్శనం. అలాగే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కూడా అధికంగా యువతులే ప్రవేశం పొందారు. పాఠశాల విద్యలో కూడా దాదాపు బాలురతో సమానంగా బాలికలు చేరుతున్నారు. గురుకులాలు, మోడల్‌ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళలో బాలుర కంటే బాలికల సంఖ్య అధికంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ బాలికలకు, యువతులకు అండగా ఉంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే షాదీ ముబారక్‌, కళ్యాణలక్ష్మి లాంటి మహిళా పథకాలు కూడా పరోక్షంగా వీరి చదువులకు సహకరిస్తున్నాయి.
కోవిడ్‌`19 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివే యువతుల శాతం గణనీయంగా పెరిగింది. ఉన్నత విద్యపై బాలికలకు ఉన్న ఆసక్తి బాలురకు ఉండటం లేదు. కోవిడ్‌ తర్వాత అన్ని రంగాల్లో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యా రంగంలో ఆధునిక పద్ధతులు, అసైన్డ్‌ విధానం, అభ్యాసన విధానంలో మార్పులు వచ్చాయి. విద్యా రంగంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ సరైన వేతనాలు దొరకని పరిస్థితి ఉంది. అందుకే బాలురు ఉన్నత విద్యలో డిగ్రీ తర్వాత పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాల కంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత విద్య కంటే వివిధ ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఉన్నత విద్యలో బాలుర నమోదు శాతం తగ్గింది. బాలికల విషయానికి వస్తే ఉన్నత విద్యపై ఆసక్తి అధికంగా ఉండడంతో పాటు ఉద్యోగం చేయాలనే ఆసక్తి, ఇంటివద్దే ఉంటూ ఉద్యోగాలు చేసే వెసులుబాటు ఉండటం, పలు ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలలు కూడా అందుబాటులోకి రావడం, మహిళా సాధికారత, నేటి సమాజంలో అన్ని అంశాలపై అవగాహన
ఉండటం వంటి అనుకూల అంశాలు తెలంగాణలో ఉన్నత విద్యలో మహిళల నమోదు పెరగడానికి దారి తీసిన పరిస్థితులుగా పేర్కొనవచ్చు.
కళాశాల స్థాయిలో ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవటం, రవాణా సౌకర్యాలు, కో`ఎడ్యుకేషన్‌ సమస్య, హాస్టల్‌ సదుపాయాలు, కళాశాల స్థాయిలో లింగ వివక్ష, శారీరక`మానసిక వేధింపులు మహిళల ఉన్నత విద్యను ప్రభావితం చేసే కారకాలుగా నివేదించబడ్డాయి. కాబట్టి ఈ సమప్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అలాగే ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యంపై సమాచారాన్ని సేకరించాలి. అందులో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాల సమన్వయ ప్రయత్నం ఉండాలి. ఉన్నత విద్యలో మహిళల పూర్తి భాగస్వామ్యాన్ని పెంచడానికి వైవిధ్య విధానాలు, కార్యక్రమాలను మరింత మెరుగ్గా అమలు చేయాలి. జాతీయ స్థాయిలో మరియు ఉన్నత విద్యా సంస్థల స్థాయిలో వేతన పారదర్శకత విధానాలు, కార్యక్రమాల అభివృద్ధి చేయాలి. విద్యార్థులు లింగ పక్షపాతం లేకుండా, వారి భవిష్యత్తు అధ్యయన రంగాలు, వృత్తి సమాచారాన్ని అందించి, వారిలో అవగాహన పెంపొందించేలా మహిళల భాగస్వామ్యాన్ని మెరుగుపరచాలి. జెండర్‌ సెన్సిటైజేషన్‌ గురించి విద్యార్థులకు, అథ్యాపకులకు మరింత అవగాహన కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో బాలికల అధిక నమోదు మహిళా సాధికారతకు, సామాజిక, ఆర్థిక పురోగతికి కూడా దారితీస్తుంది. ఉన్నత విద్యలో కేవలం బాలికల అధిక నమోదు మాత్రమే కాకుండా, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించేలా మరిన్ని ప్రభుత్వ విధానాలు, కొత్త పథకాలు తీసుకురావాలి. మహిళలు స్వశక్తితో సొంతంగా ఎదిగేలా వారికి కావలసిన మెరుగైన మౌలిక వనరులను, సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.