తెరతీయగరాదా నవల `స్త్రీ దృక్పథం – వడ్డివాటి మల్లయ్య

నేటి సమాజంలో స్త్రీలు విద్య, వైద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ కొన్ని రంగాలలో స్త్రీలకు అవమానాలు, అవరోధాలు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు సినిమారంగాన్ని తీసుకుంటే అందులో లేడి ఆర్టిస్టులకు క్యాస్టింగ్‌ కౌచ్‌ అనే అంశం ఇబ్బంది కలిగిస్తున్న అంశం.

సమాజంలో కూడా అనేక రంగాలలో స్త్రీలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కార్యాలయంల్లో ఉండే బాసులు స్త్రీలను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఇతర వ్యవస్థల్లో కూడా బాసులు స్త్రీలను లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకున్న తల్లిదండ్రులు స్త్రీలను ఎక్కడికైనా పంపించాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిరది.
1983వ సంవత్సరంలో చక్కిలం విజయలక్ష్మి రాసిన నవల ‘తెరతీయగరాదా’. ఈ నవల్లో సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే ఇబ్బందులు, అలాగే నాటక రంగంలో స్త్రీ ఎలాంటి అవమానాలకు, అవరోధాలకు గురవుతున్నారో ఈ నవల ద్వారా మనకు తెలుస్తుంది. స్త్రీ నాటకంలో నటించడానికి వెళితే తల్లిదండ్రులు అలాగే సమాజం ఆ స్త్రీని ఎంత నీచంగా చూస్తుందో రచయిత్రి కళ్లకు కట్టినట్లు చిత్రించింది. నాటకరంగంలో పురుషులు స్త్రీలను ఎంత హేళనగా చూస్తారనేది ఈ నవల ఇతివృత్తం.
ఈ నవలలో ప్రధాన పాత్ర భాను. మరొక పాత్ర ఆదిత్య. ఆదిత్య మంచి కళాకారుడు, నాటక ప్రియుడు, సాహిత్యకారుడు, సంగీత విద్వాంసుడు. ఆదిత్యకు జీవితం మీద విరక్తి కలిగి తాగుడుకు బానిస అవుతాడు. ఆదిత్యకు రాము అనే పిల్లవాడు సేవ చేస్తూ అతని దగ్గరే ఉంటాడు. మద్యం తాగే అలవాటు ఉండటం వలన ఆదిత్యను ఎవరు గౌరవించే వాళ్ళు కాదు. రాము, ప్రకాష్‌ అనే ఇద్దరూ మాత్రం అతనిని గౌరవిస్తారు. ప్రకాష్‌ నాటకాలలో నటించే వ్యక్తి. నాటకాల గురించి ఆదిత్య దగ్గర సంభాషిస్తూ ఉంటాడు. అప్పుడు ఆదిత్య నాటకంలో నటన గురించి నటనలో ఉండే లోపాల గురించి ప్రకాష్‌కి చెబుతుంటాడు. ప్రకాష్‌, ఆదిత్య మంచి మిత్రులు అవుతారు. ఒకరోజు ఆదిత్య ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆదిత్య ఆరోగ్యం క్షీణించినా అదేమీ పట్టించుకోకుండా తాగుతూనే ఉంటాడు. అలా ఉండగా ప్రకాష్‌ డాక్టర్‌ను పిలుచుకుని వచ్చి చూపిస్తాడు. ఇలా తాగుడుకు బానిస అవ్వడానికి గల కారణం ఏంటో ఆదిత్య చెప్పాలని లేకపోతే పచ్చి మంచినీళ్లు కూడా తాగను అని ప్రకాష్‌ పట్టుపడతాడు. అప్పుడు ఆదిత్య తన గత జీవితం గురించి ప్రకాష్‌తో చెబుతాడు.
ఆదిత్య జమీందారీ కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను నాటకరంగం మీద ఆసక్తితో ఒక నాటక సమాజాన్ని అద్దెకు తీసుకుంటాడు. ఆ నాటక సమాజానికి ‘శారద నటనాలయం’ అని పేరు పెడతాడు. కార్యాలయానికి ‘హెవెన్‌ టోర్స్‌’ అని పేరు పెడతాడు. నాటకాలు ఉన్నప్పుడు నాటకాలు చేయిస్తుంటాడు. ఖాళీ సమయాల్లో దేశ పర్యటన చేస్తూ ఉంటాడు.
ఒకరోజు వరంగల్‌కి ఆదిత్య, మిత్రుడు జయరామ్‌ ఇద్దరు కలిసి రామప్ప దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు. అక్కడ ఆలయంలో భాను అనే అమ్మాయి నృత్యం చేస్తుంది. భాను నృత్యం చూసిన ఆదిత్య ముగ్ధుడవుతాడు. అప్పటి నుండ ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రామప్ప ఆలయంలోని శిల్పకళా ప్రత్యేకత గురించి ఆదిత్య, జయరామ్‌ మాట్లాడుకుంటారు. రామప్ప దేవాలయాన్ని సందర్శించుకుని వెళ్ళిపోతారు.
భాను ఉదయాన్నే లేచి నవల చదువుకుంటూ అన్నం వండావా అని తల్లి లలితమ్మను అడుగుతుంది. లలితమ్మ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. దాంతో భాను లలితమ్మ దగ్గరకు వచ్చి చూస్తుంది. అప్పుడు లలితమ్మ బాధపడుతుంటుంది. ఎందుకు బాధ పడుతున్నావని భాను ఆమెను అడుగుతుంది. భాను తండ్రి విశ్వనాధం ఒక మిల్లులో పని చేస్తూ ఉంటాడు. అతనికి సంసార జీవితం మీద విరక్తి కలిగి కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన తర్వాత ఆ కుటుంబం మీద అభిమానంతో మిల్లు యజమాని నెలనెలా కొంత ధనం యిస్తుంటాడు. ఆ యజమాని కొంత కాలానికి మరణిస్తాడు. దాంతో వాళ్లకి ఆర్థిక సహాయం అందకుండా ఆగిపోతుంది. అప్పుడు లలితమ్మకు కుటుంబపోషణ కష్టమై బాధపడుతూ ఉంటుంది. అది తెలుసుకున్న భాను తల్లికి ధైర్యం చెబుతుంది.అలాగే డబ్బులు సంపాదించడం అంత కష్టమైన పని కాదని ఏదో ఒక విధంగా సంపాదించగలను అని చెబుతుంది.
లలితమ్మ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా భానుకి చిన్నతనంలో నృత్యం నేర్పించిన రామానుజం మాస్టార్‌ గారు భాను వాళ్ళ ఇంటికి వస్తాడు. చదువుకోడానికి డబ్బులు లేవని చెప్పినా పిల్లలు బడికి వెళ్లారని లలితమ్మ బాధపడుతూ మాస్టారుతో చెబుతుంది. భారతి సమాజం వాళ్లు ఒక వారంలో నాటకం వేస్తున్నారు. అందులో ఒక శాస్త్రీయ నృత్యం ఉంది. ఆ శాస్త్రీయ నృత్యం చేస్తే 200 రూపాయలు ఇస్తారు. కావున భానుని ఆ నృత్యం చేయడానికి పంపించమని చెబుతాడు. లలితమ్మ భానుని నృత్యం చేయడానికి పంపడాన్ని తిరస్కరిస్తుంది.
అప్పుడు మాస్టారు నాటకం యొక్క గొప్పతనం గురించి, నృత్యం యొక్క గొప్పతనం గురించి ఇలా అంటాడు.‘‘నీవు ఈమాట అంటావని నాకు తెలుసమ్మా. కానీ నాటకం అంటే నీవూహిస్తున్నంత హీనమైనది కాదు. అది ఒక కళ, కళాకారులు కావడం, కళను ఆస్వాదించగలగడం సామాన్యులకు అబ్బేవిషయం కాదు. మహాకవి అయిన రాజశేఖరు ఇల్లాలు అవంతిసుందరి ఆమె స్వయంగా కవయిత్రి, పండితురాలు అలంకారశాస్త్రంలో ప్రవీణురాలు. అయినా నాటకాలలో నటించేది. ఇంకా శ్రీహర్షుని ‘ప్రియదర్శిక’ రాజులు ఆతఃపుర స్త్రీలతో కలిసి నాటకాలాడేవారని తెలుపుతుంది. నాటకం రసమయ దృశ్యకావ్యం. రమణీయం అయినా భానుచేత మనమేమీ నాటకాలాడిరచడం లేదు. తాత్కాలికంగా ఒక నృత్యం అంతే’’ అని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. నాటకం, నృత్యం అనేవి గొప్ప కళారూపాలు. ఈ కళలు ఈనాటివి కాదు అవి ప్రాచీన కాలం నుండి ఉన్న కళలని పై మాటల ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రాచీన కాలంలో సామాన్యులే కాకుండా ఉన్నత వర్గం వాళ్ళు, పండితులు, కవులు కూడా నాటకాలను, నృత్యాలను ప్రదర్శించారని రామానుజం మాస్టారు మాటల ద్వారా మనకు తెలుస్తుంది.
భానుని నృత్యం చేయడానికి పంపిస్తే నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారని లలితమ్మ అనుకుంటుంది. భానుని నృత్యం చేయడానికి పంపించనని అంటుంది. భాను కల్పించుకుని సమాజంలో ఎలా ఉన్నా అనుకుంటారు. సమాజాన్ని పట్టించుకుంటే పైకి రావడం చాలా కష్టం. తన తల్లి మాటలు లెక్కచేయకుండా మాస్టారికి నృత్యం చేయడానికి వస్తానని భాను చెబుతుంది.
భాను తన మాట వినట్లేదని లలితమ్మ మాస్టారుతో చెబుతుంది. అలా చెబుతూ ఉండగా భాను తన తండ్రి తప్పిదాలను ఎత్తి చూపుతుంది. తల్లీ కూతుర్ల మధ్య వాగ్వాదం జరుగుతుందని మాస్టర్‌ గారు భానుని లోపలికి పంపిస్తారు. ఈ శాస్త్రీయ నృత్యం చేయడానికి రిహార్సల్స్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ప్రాక్టీస్‌ చేసి ఆ నాటకం రోజు వచ్చి చేస్తే సరిపోతుందని చెప్పి మాస్టర్‌ వెళ్ళిపోతాడు.
భారతి సమాజం వాళ్ళ నాటకం చూడటానికి ఆదిత్య వస్తాడు. రామప్ప దేవాలయంలో చూసిన భానుని ఇక్కడ చూస్తాడు. తన మిత్రుడు రాఘవతో ఆమెను తను ఇంతకు ముందే చూసినట్టుగా చెబుతాడు. తన నృత్యానికి ముగ్ధుడైనట్లుగా చెబుతాడు. భానుకు ఎలాగైనా అభినందనలు తెలియజేయాలని ప్రయత్నిస్తాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి భానుకు కంగ్రాట్యులేషన్స్‌ చెబుతాడు. భాను తిరిగిచూడకుండానే థాంక్స్‌ అని చెబుతుంది. ఆదిత్య భాను నృత్యాన్ని పొగుడుతాడు. అప్పుడు భాను పక్కనే ఉన్న ముసలమ్మను చూపించి ఆమె కూడా బాగా నాటకం చేసింది. వెళ్ళి ఆమెను కూడా పొగడండి అని అంటుంది. దాంతో ఆదిత్య బిత్తరపోతాడు.
తరువాత భాను ఈ నృత్యం, నాటకాలు వదిలేసి ఏదో ఒక ఉద్యోగం, లేదా ట్యూషన్‌ చెప్పుకుందాం అని అనుకుంటుంది. కానీ అవేవీ కుదరకపోవడంతో మళ్లీ నాటకంలో నటించడానికి ప్రయత్నిస్తుంది. రామానుజం మాస్టారు గారి దగ్గరికి వెళ్లి తన సాధకబాధకాల గురించి చెప్పుకుంటుంది. తన తల్లి లలితమ్మ అమాయకత్వాన్ని గురించి ఇద్దరూ మాట్లాడుకుంటారు.ఆ తరువాత మళ్లీ డాన్స్‌ ప్రోగ్రామ్స్‌ ఉంటే ఇప్పించండి అని భాను మాస్టార్‌ గారిని అడుగుతుంది. భానుతల్లి లలితమ్మకు నాటకాలు, నృత్యాలు అంటే అసలు ఇష్టం ఉండదు. అందువలన భాను అడగగానే మాస్టారు ఆశ్చర్యపోతారు. వేరే సమాజం వాళ్ళు వచ్చి మా నాటకాల్లో నృత్యం ఉంది. ఆ అమ్మాయి నృత్యం చేస్తుందేమో అడగండి అని అన్నారు. చేయదని చెప్పేశాను. ఆ రోజే నాకు ఒక్క మాట చెప్పినా నేను అందులో అవకాశం ఇప్పించే వాడినని మాస్టారు అంటారు. మాస్టారు ఇంట్లో నుండి భాను బయటకు రాగానే అక్కడ ఆదిత్య తారసపడతాడు. భాను ఆదిత్య కొద్దిసేపు మాట్లాడుకుంటారు. భాను ఆదిత్యకు ఒక షరతు పెడుతుంది.తనను ఇకమీదట గుర్తు పెట్టుకోకూడదని భాను ఆదిత్యతో అంటుంది. ఆకండిషనుతో అక్కడ నుండి వెళ్ళిపోతారు.
భానుకి శాస్త్రీయ నృత్యం ఉన్న నాటకాలు ఏవీ లభించవు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాటకంలో నటించాలని నిర్ణయించుకుంటుంది. భాను ఒక నాటకంలో నటించడంతో వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి తమ్ముడు కృష్ణ చేతిలో పెడుతుంది. అక్కయ్య కష్టాన్ని చూసి తమ్ముడు బాధపడతాడు. తను కూడా చదువు మానేసి ఏదో ఒక పనిలో చేరాలిఅనుకుంటాడు. అప్పుడు భాను తమ్ముడిని మందలిస్తుంది. తాను కష్టపడుతుంది నీవు చదువుకోవాలని, కావున నువ్వుబాగా చదువుకోఅని తమ్ముడికి నచ్చజెప్పుతుంది. అలా భాను ఇంట్లో తమ్ముడుకృష్ణా చెల్లెలి సుబ్బులు చదువుకి అండగా ఉంటుంది. కుటుంబాన్ని కూడా ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకుంటుంది.
భాను మాటలకు ఆదిత్య బాధపడతాడు. తర్వాత అక్కడ ఉండలేక ఉరికి వెళతాడు. ఊరి నుండి వచ్చిన తర్వాత రాఘవ అనేమిత్రుడు ఆదిత్యతో ‘హెవెన్టోర్స్‌’లో ఒక అందమైన అమ్మాయి నాటకం చేస్తుందని చెబుతాడు. తనని చూడడానికి ఆదిత్య వస్తాడు. అక్కడికి వచ్చిచూస్తే భాను ఉంటుంది. దాంతో ఆదిత్య బయటకు వస్తాడు. అప్పుడు భాను కూడా ఆదిత్య వెనక వస్తుంది. గతంలోని మాటలను గుర్తు చేసుకుని మాట్లాడుకుంటూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళతారు.
ఒక రోజు సాయంత్రం బయట వరండాలో భాను చెల్లెలు సుబ్బులు నవల చదువుతూ ఉంటుంది. ఆ సమయంలో వాణి నాటక సమాజం వాళ్ళు వచ్చి చంద్రభాను గారి ఇల్లు ఇదేనా అని అడుగుతారు.భాను వచ్చి వాళ్ళను చాప మీద కూచో పెడుతుంది. తాను కూడా చాపమీద ఓ చివరగా కూర్చుంటుంది. నాటకంలో కొత్త అమ్మాయి కావాలని ఆర్గనైజర్‌ సుబ్బారావు డైరెక్టర్‌ మూర్తి అంటారు. శారద నటనాలయంలో మీరు వేసిన నాటకాలను చూసిమేము మీదగ్గరకు వచ్చాం. మీరు సరే అంటే అగ్రిమెంట్‌ చేసుకుందామని భానుతో చెబుతారు.
అప్పుడు భాను కథ తెలుసుకున్న తర్వాత అగ్రిమెంట్‌ మీద సంతకం చేస్తానని అంటుంది. నాటకరంగంలో ఎంతో అనుభవజ్ఞులైన లేడి ఆర్టిస్టులు ఐతేనే ముందుగా సబ్జెక్ట్‌ చెబుతారు. లేకపోతే లేడీ ఆర్టిస్టులకు సబ్జెక్టు చెప్పకుండానే అగ్రిమెంట్‌ మీద సంతకం చేయించుకుంటారు. ఆ తర్వాత వాళ్లను ఎలా కావాలంటే అలా ఉపయోగించుకుంటారు. ఆ విషయం భానుకి ముందుగానే తెలుసు కాబట్టి అగ్రిమెంట్‌ మీద సంతకం చేయదు.
అప్పుడు డైరెక్టర్‌ మూర్తి, ఆర్గనైజర్‌ సుబ్బారావు బయటకు వినిపించకుండా ఇలా మాట్లాడుకుంటారు.‘‘దీని టెక్కు ఎన్నాళ్లులే కాంట్రాక్టు మీద సంతకం చేసి రిహార్సల్స్‌కి రెండుసార్లు వచ్చిందంటే మూడోసారికి కుక్క పిల్లల తమ కాళ్ళచుట్టూ తిరగాల్సిందే’’ అని అనుకుంటారు. తరువాత రిహార్సల్స్‌ ఆఫీస్‌కు వస్తే అందరికీ ఒకేసారి సబ్జెక్టు వినిపిస్తామని అంటారు.
ఈ విధంగా నాటకరంగంలో స్త్రీలు అగ్రిమెంట్‌ మీద సంతకం చేసిన తర్వాతఅందులో ఉండే డైరెక్టర్లు, ఆర్గనైజర్లు, హీరోలు, మేకప్‌ మేన్స్‌ ఇలా ప్రతి ఒక్కరు లేడి ఆర్టిస్టులను ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురిచేస్తారు. వాళ్లను చిత్రహింసలు పెడుతారు. వాళ్లకు ఇష్టం లేని పాత్రలలో కూడా నటించాలని అంటారు. లేదంటే కమిట్మెంట్‌ అంటారు. ఈవిధంగా లేడీ ఆర్టిస్టులకు చిత్రహింసలు పెడతారని సుబ్బారావు, మూర్తి మాటల ద్వారా రచయిత్రి మనకు తెలియజేస్తుంది.
అంతా మాట్లాడుకుని వెళ్తున్న సమయంలో లలితమ్మ వచ్చి భానుని అరుస్తుంది.వాళ్లకి కూడా భాను నాటకాలలో నటించదని గట్టిగా చెబుతుంది. అప్పుడు వాళ్ళు తెల్లబోతారు. భాను ఆమె మాటలు ఏమి పట్టించుకోవద్దు. ఆమెకు కొంచం పిచ్చి అని చెబుతుంది.
శారద నటనాలయంలో ఒక నాటకం ఉంటుంది. అందులో భాను హీరోయిన్‌. అందుకోసం ఆదిత్య ముందువరుసలో చూడ్డానికి కూర్చుంటాడు. నాటకం ప్రారంభం అవుతుంది. ముందు వరుసలో ఉన్న ఆదిత్య భాను ఆందాన్ని చూసి ముగ్ధుడైపోతాడు. నాటకం అయిపోయిన తర్వాత గ్రీన్‌ రూమ్‌లోకి వెళ్లి భానుని అభినందించాలని ఆదిత్య అనుకుంటాడు. అంతలో గ్రీన్‌ రూమ్‌లో నుండి మేకప్‌ తీసివేసి వచ్చిన రాఘవ భాను నుండి నీకు గ్రీన్సిగ్నల్‌ వచ్చిందని చెబుతాడు. అయినా ఆదిత్య ఇంటికి వెళదాం పద అని రాఘవతో అంటాడు. అంతలో వెనక నుండి భాను పిలుస్తుంది. భాను నటన గురించి గొప్పగా చెప్పి ఆ తర్వాత ఐ లైక్‌ యూ ఐ లవ్‌ యూ అని ఆదిత్య అంటాడు. దాంతో భానుకి కోపం వచ్చి ఆదిత్య చెంప మీద కొట్టి వెళ్ళిపోతుంది. ఆదిత్య మరోసారి అవమానానికి గురవుతాడు.
ఆ తర్వాత భాను ఎదావిధిగా నాటకాలు చేస్తూ ఉంటుంది. ఓ నాటకం కోసం భాను రాత్రి ఒంటి గంట వరకూ రిహార్సల్స్‌ చేసి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి వరండాలో లైట్‌ వేయగానే ఓ మూలన భాను తండ్రి విశ్వనాథ కనిపిస్తాడు. భాను అతన్ని చూసి కూడా పట్టించుకోనట్టుగా తాళం తీసి ఇంట్లోకి వెళ్లబోతుంది. అప్పుడు విశ్వనాధం మీ అమ్మావాళ్లేరని అడుగుతాడు. అతని మీద కోపంతో భాను ఇలా అంటుంది. ‘‘మా నాన్న అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్ళారు.’’ అని అంటుంది. దాంతో విశ్వనాధం ఉలిక్కిపడతాడు.
సమాజంలో ఏ తండ్రి అయినాసరే తన పిల్లలకు అండగా లేకపోతే ఆ పిల్లలు ఆ తండ్రిని చాలా నీచంగా చూస్తారు. అలాగే తండ్రి ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్న కూడా చచ్చిన వ్యక్తితో సమానంగా భావిస్తారని భాను మాటల ద్వారా మనకు అర్థమవుతుంది.
తర్వాత తను వచ్చిన విషయం గురించి మాట్లాడతాడు. తను ఇక్కడే ఉండటానికి రాలేదని అంటాడు. అతనికి భాను నాటకంలో నటించడం ఇష్టం లేదు. ఆమె నాటకంలో నటిస్తున్న విషయం తెలిసి వచ్చానని అంటాడు. భాను కూడా అతనికి కోపం వచ్చేలాగా అవును నాటకాల్లో నటిస్తున్నానంటుంది. అలాగే తన నాటకాన్ని చూడటానికిరమ్మని చెబుతుంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో పెళ్లికి వెళ్లిన తల్లి లలితమ్మ, చెల్లెలు సుబ్బులు, తమ్ముడు కృష్ణ వస్తారు. లలితమ్మ భర్తను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ల దగ్గర పడుతుంది. భాను తన మాట వినడం లేదని లలితమ్మ అతనితో చెబుతుంది. భాను మాత్రం వాళ్ల మాటలు లెక్కచేయకుండా పిల్లలను లోపలికి వచ్చి పడుకోమని చెప్తుంది. తనుకూడా లోపలికి వెళ్లి పడుకుంటుంది.
భాను,కుమార్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడిరదని ఆదిత్యకు నాటకరంగంలో ఉన్నవాళ్లు చెబుతారు. దాంతో ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో రాఘవ అనే వ్యక్తి ఆదిత్యను ఓదారుస్తాడు. అలాగే నాటకరంగంలో ఉండే స్త్రీలను గురించి ఈ విధంగా అంటాడు.‘‘మర్యాదస్తులయిన ఆడపిల్లలెవరూ నాటకరంగంలోకి రారు. ఆడవాళ్ళు వచ్చిన మర్యాద నిలుపుకోలేరు. అలాంటి ఆమ్మణ్ణుల గురించి ఇంత బాధపడటం అనవసరం.’’ అని అంటాడు.
నాటకరంగంలో స్త్రీలు మంచివారు కారని, వాళ్ళు చెడిపోయి ఉంటారని, వాళ్ళు అమర్యాదకుటుంబాల నుండి వచ్చినవాళ్ళని ఇలా అనేక విధాలుగా నాటక రంగంలో ప్రవేశించిన స్త్రీల మీద సమాజం నిందవేస్తుందని రాఘవ మాటల ద్వారా మనకు అవగతమవుతుంది.
అలా భాను గురించి మాట్లాడుతున్న రాఘవను, ఆదిత్య మందలిస్తాడు. ఇలాంటివి నేను నమ్మను అని ఆదిత్య అంటాడు.రేపు ఉదయం 10 గంటలకు హెవెన్‌ డోర్స్‌లో కుమార్‌, భానుకి ప్రపోజ్‌ చేస్తాడు. అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. కావాలిఅంటే రేపు వచ్చి చూడు అని రాఘవ, ఆదిత్యతో అంటాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య అక్కడికెళ్ళి చూస్తాడు. అక్కడ భానుకి, కుమార్‌కి ఎలాంటి ప్రేమ సంబంధం లేదని తెలుస్తుంది.
ఆదిత్య ఒక నాటకం రాస్తాడు. ఆ నాటకంలో భానుని హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఈ నాటకానికి డైరెక్టర్‌ కృష్ణారావు గారు. భాను సాధ్యమైనంత వరకూ పూజా కార్యక్రమాలకు వెళ్లదు. కానీ ఈ నాటకం పూజా కార్యక్రమానికి వస్తుంది. పూజా కార్యక్రమం అంతా పూర్తి అయిన తరువాత అందరూ ఒక దగ్గర కూర్చుంటారు. అప్పుడు డైరెక్టర్‌ కృష్ణ రావు గారు అందరితో ఇలా అంటాడు. ‘‘ఇక్కడ చేరిన అందరూ వ్యక్తిగతమైన జీవితాలల్లో ఎవరైనా కావచ్చు. ఎంత గొప్పవారైనా కావచ్చు లేదా ఎన్ని బలహీనతలైనా వుండవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అందరూ నటులే! ఇక్కడ హీరో కావచ్చు, విలన్‌ కావచ్చు, రాజు కావచ్చు, బికారి కావచ్చు. కానీ అవన్నీ పాత్రలే! మనం వాటిని ధరించే నటులం మాత్రమే అంటే మనందరం ఒక్కటే!’’అని అక్కడ ఉన్న నటులతో అంటాడు. అలాగే నాటకం విజయవంతం కావాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలని కొన్ని సూచనలు చెబుతాడు.
నాటకంలో నటించే వాళ్ళు అందరూ ఒక్కటే అని, అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏమీ ఉండదు అని చెబుతాడు. అలాగే నాటకంలో హీరో, విలన్‌, రాజు, బికారి ఇలా ఉండేవని కేవలం పాత్రలు మాత్రమే అని అందులో హెచ్చుతగ్గులు ఏమీ ఉండవని. అలాగే నాటకంలో నటించే వాళ్ల వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, నాటకంలో మాత్రం అందరూ ఒకటే అని రచయిత్రి కృష్ణారావు పాత్ర ద్వారా తెలియజేస్తుంది.
ఈ సమాజం నాటకాల్లో నటించే వాళ్లకి ‘నాటకాల రాయుళ్లు’ అనే బిరుదునిచ్చిందని అక్కడున్న వాళ్ళందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అక్కడ ఉండే వాళ్ళు నిజమే అని అంటారు. నాటకాలలో నటించే పురుషులు గానీ, స్త్రీలు గానీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అక్కడ వాళ్ళందరూ సంభాషించుకుంటారు. అంతా అయిన తర్వాత ఇంటికి బయలుదేరటానికి సిద్ధమవుతారు. భాను ఆ నాటకంలో విలన్‌ పాత్ర చేస్తున్న నరేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన తోటి ఆర్టిస్టులు భాను గురించి హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న ఆదిత్యకి కోపం వస్తుంది. తన కోపాన్ని అక్కడ ప్రదర్శించడం సరికాదని దిగమింగుకుంటాడు.
చిన్నబ్బిపాలెంలో ‘షోకిల్లారాయుడు’ అనే నాటకంలో భాను నటించడానికి ఒప్పుకుంటుంది. అందులో హీరో పాత్ర ఆ ఊరి మోతుబరి కొడుకు రమణమూర్తి. ఆ నాటకానికి భాను ఆరు రిహార్సల్స్‌ ఒప్పుకుంటుంది. కానీ ఆ ఊరి నటులు ఆరు సరిపోవు ఎనిమిది చెయ్యాలని అంటారు. అప్పుడు భాను అన్ని నేను చేయలేనని అంటుంది. అలాగే నాకు నాలుగే రిహార్సల్స్‌ అయినా నేను చేయగలనంటుంది.
ఈ నాటకంలో భానుని తీసుకోమని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ శివ రావు చెప్పడంతో వాళ్ళు అతని దగ్గరికి వెళతారు. నీవు చెప్పిన లేడీ ఆర్టిస్ట్‌ ఆరు రిహార్సల్స్‌ చేసి డ్రామాలో నటిస్తుందట! అని అతనితో గోల చేస్తారు. అప్పుడు అతను నవ్వుకుని. ఆమె గురించి మీరు తక్కువ అంచనా వేస్తున్నారు. ఆమె ఒక్క రిహార్సల్‌ చేయకుండా కూడా నటించగల సత్తా కలిగిన లేడీ ఆర్టిస్ట్‌ అని భాను నటన గురించి గొప్పగా చెబుతాడు. దాంతో అందరూ సర్దుకుపోతారు.
ఇంకా భాను చిన్నబ్బిపాలెం నుండి వచ్చిన వెంటనే కో ఆర్టిస్ట్‌ గీత తారసపడుతుంది. వాళ్ళిద్దరూ నాటకంలో ఉండే పల్లెటూరి నటుల గురించి అలాగే ఇతర నటుల గురించి మాట్లాడుకుంటారు. అలాగే కొన్ని నాటకాల పేర్లు చెప్పి ఆ నాటకాల్లో సన్నివేశాల గురించి మాట్లాడుకుని నవ్వుకుంటారు. అలాగే ఆదిత్య రాసిన నాటకం గురించి మాట్లాడుకుంటారు. ఆ నాటకం డైరెక్టర్‌ కృష్ణారావు గురించి మాట్లాడుకుని ఆ కృష్ణారావుని ప్రేమిస్తున్నావా అని గీత భానుని అడుగుతుంది. అప్పుడు భాను పక్కున నవ్వి ఇలా అంది ‘‘వేషాలకోసం డైరెక్టర్లను ప్రేమించే ఆర్టిస్టులున్నంత వరకూ నాటకరంగం బాగుపడదు. కనీసం లేడి ఆర్టిస్టులు ఆర్టిస్టులుగా చూడబడరు.’’ అని అంటుంది.
నాటకల్లో, సినిమాల్లో లేడీ ఆర్టిస్టులు వేషాల కోసం డైరెక్టర్లను, నిర్మాతలను, హీరోలను ప్రేమించినంత కాలం లేడి ఆర్టిస్టులకు విలువ లేకుండా పోతుందని. అలాగే లేడీ ఆర్టిస్టులకు విలువ
ఉండాలంటేనటన మీద శ్రద్ధ పెట్టి గొప్పగా నటించాలని, నటనలో రాణించాలని భాను పాత్ర ద్వారా రచయిత్రి మనకు తెలియజేస్తుంది.
ఆదిత్య రాసిన నాటకంలో హాస్య పాత్ర రంగా. అతను సరిగ్గా ఆ పాత్రకు న్యాయం చేయలేదు. అందుకు డైరెక్టర్‌ కృష్ణారావు ఆ పాత్రను మార్చాలని అంటాడు. రంగాను తొలగించడంతో రంగా మిత్రుడు హీరో పాత్ర, అతను కూడా తప్పుకుంటాడు. దాంతో హీరోపాత్రకు ఆదిత్యను ఎంపిక చేస్తారు.ఆ నాటకం కోసం భాను, ఆదిత్య మిగిలిన వాళ్ళంతా రిహార్సల్స్‌ చేస్తూ ఉంటారు.
భాను అనేక నాటకాల్లో నటించడం వలన ఆదిత్యకు వారం రోజులైనా కనిపించదు. ఆదిత్య భాను వాళ్ళ ఇంటికి వస్తాడు. అప్పుడే ఇంట్లో తల్లి లలితమ్మ, భాను నాటకంలో నటించినందుకు డబ్బులు ఇవ్వలేదని మాట్లాడుకుంటూవుంటారు. ఆదిత్య వచ్చిన విషయం తెలిసితనని లోపలికి భాను తీసుకెళుతుంది.
ఇంటికి వచ్చిన ఆదిత్య గురించి భానును లలితమ్మ అనేక ప్రశ్నలు వేస్తుంది. స్నేహితుడు అని చెప్పినా ఆడపిల్లలకి మగవాళ్ళు స్నేహితులు ఏంటి అని అంటుంది. ఆదిత్య లలితమ్మ మాటలు విని అక్కడ నుండి త్వరగా వచ్చేయాలని వెంటనే లేచి వస్తానని చెప్పి వచ్చేశాడు.ఈ విధంగా నాటకంలో నటించే స్త్రీలను కన్న తల్లిదండ్రులు కూడా చేరదీయకుండా అవమానిస్తున్నట్లుగా లలిత మాటలద్వారా మనకు అర్ధమవుతుంది.
‘సూర్యోదయం సమాజంలో’ రాత్రి 12 గంటలకు రిహార్సల్స్‌ పూర్తయిన తర్వాత భాను ఇంటికి వస్తుండగా ఆమెకు తోడుగా గిరిధర్‌ వస్తాడు. వస్తూ ఉండగా మార్గమధ్యలో కానిస్టేబుల్‌ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రశ్నిస్తాడు. వాళ్ళు డ్రామా ఆర్టిస్టులని చెప్పినా కూడా వినకుండా వాళ్ళని అవమానపరిచే లాగా మాట్లాడుతాడు. దాంతో భాను కానిస్టేబుల్ని సెటప్‌ అని అంటుంది. కావాలి అనుకుంటే పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్ళండి అక్కడ చెప్పుకుంటాం అని అంటుంది. దాంతో ఆ కానిస్టేబుల్‌ వారిద్దరిని పోలీస్‌ స్టేషన్‌ కి తీసుకువెళ్తాడు.ఆ తరువాత ఉదయమే వాళ్లు డ్రామా ఆర్టిస్టులు అని తెలుసుకుని వాళ్ళను వదిలేస్తారు.
గిరిధర్‌, భాను లాడ్జిలో ఉంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారని గిరిధర్‌ అందరితో చెబుతాడు. సమాజంలో అందరూ భాను గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.ఆ విషయం రాఘవ ఆదిత్యతో చెబుతాడు. ఆదిత్య నమ్మడు. భాను పోలీస్‌ స్టేషన్‌ నుండి ఇంటికివస్తుంది. ఇంటి దగ్గర భాను తండ్రి విశ్వనాధం భుజం కోసుకొని స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు. విషయం తెలిసిన బాను ఎందుకలా చేసుకున్నాడని సుబ్బులును అడుగుతుంది. అప్పుడు లలితమ్మ ఇలా అంటుంది.‘‘ఎందుకంటని నంగనాచిలా అడుగుతున్నవే! రాత్రుళ్ళు అడ్డమైన వాళ్ళతో తిరిగి పోలీసు స్టేషన్లపాలైతే అభిమానంగల ఏ తండ్రి బ్రతుకుతాడు? నా కొంపకు శనిలాదాపురించావు. ఎప్పుడో ఓసారి నా పసుపుకుంకుమలు తీసుకెళ్ళి గంగలో కలిపి వస్తావు’’అని భానుని నిందిస్తూ లలితమ్మ తిడుతుంది.
ఈ విధంగా సమాజంలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు అండగా ఉండకుండా వాళ్లని నిందిస్తూ ఉంటారు.ఇక్కడ భాను తండ్రి విశ్వనాథం, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తాడు. తన భర్త తప్పిదాన్ని గ్రహించకుండా లలితమ్మ భానుని నిందించడం సరైంది కాదని రచయిత్రి ఈ సంఘటన ద్వారా తెలియజేస్తుంది.
విశ్వనాథంను హాస్పిటల్‌కి తీసుకెళ్తారు.అక్కడ డాక్టర్లు అతనికి బ్లడ్‌ ఎక్కించాలంటారు. అప్పుడు భాను తన బ్లడ్‌ ఇచ్చి తన తండ్రి ప్రాణాలను కాపాడుతుంది.
రిక్షాలో వెళ్తున్న భాను ఆదిత్యకు కనిపిస్తుంది. భాను కూడా అతన్ని చూసి రిక్షా ఆపమని అంటుంది. రిక్షా దిగి ఆదిత్య దగ్గరికి వెళుతుంది.‘‘భాను నేను విన్నది నిజమేనా రాత్రి నువ్వు, గిరిధర్‌ పోలీసు స్టేషన్లో’’ అని ఆదిత్య అడుగుతూ ఉండగానే భాను అవును అన్నట్లుగా తల ఉపుతుంది. దాంతో ఆదిత్య ‘‘వస్తాను’’ అని ఊరికి వెళ్ళిపోతాడు.
ఆదిత్య తల్లిదండ్రులు జమీందార్లు. ఆదిత్య నాన్న పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. ఆ పుట్టినరోజు వేడుకలకి ముఖ్యమైన వాళ్లందర్నీ ఆహ్వానిస్తారు. ఆ పుట్టినరోజు వేడుకలకి ఇన్స్పెక్టర్‌ ఆనంద్‌ కూడా వస్తాడు. ఆ ఇన్స్పెక్టర్‌ ఆనంద్‌తో ఆదిత్య మాటలు కలుపుతాడు. భాను గురించి కూడా ప్రస్తావన వస్తుంది. అప్పుడు భాను ఏ తప్పు చేయలేదని దారిన వెళ్తూ ఉంటే కానిస్టేబుల్‌ వాళ్ళను పట్టుకువచ్చాడని ఇన్స్పెక్టర్‌ ఆదిత్యకు చెబుతాడు. భాను గొప్పతనం గురించి చాలా విషయాలు చెబుతాడు ఇన్స్పెక్టర్‌.
భాను, ఆదిత్య చాలా నాటకాల్లో కలిసి నటిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా ఒక పల్లెటూరిలో ‘సీత అగ్ని ప్రవేశం’ అనే నాటకం చేస్తుంటారు. సీత పాత్రలో భాను రాముని పాత్రలో ఆదిత్య నటిస్తుంటారు. అందులో రాముడు సీతను శీల పరీక్ష చేస్తాడు. అప్పుడు సీత పాత్రలో ఉన్న భాను నాటకంలో డైలాగ్స్‌ కాకుండా తను సొంతంగా ఇలా అంటుంది.‘‘రామా! నీ అనుమానం సవ్యమైనదే. అయితే భార్యాభర్తలనిన సర్వ విషయములందును సములు, అనుమానం అనునది నీ ఒక్కడి సొత్తుకాదు. శీలం అనునది భార్యకు మాత్రమే అన్వయించునది కాదు. నీ ధర్మపత్నిగా కొన్ని మాసములు నాకు దూరంగా మసలిన నీ శీల పరీక్షను నేనుయును కోరుట సమంజసమే కదా?’’ అని అంటుంది.
భార్య భర్తలు ఇద్దరూ సమానమేనని, కాబట్టి భార్యను భర్త అనుమానించడం తప్పు అని రచయిత్రి భావన. ఈ విధంగా రాముడిని సీత ఆనాడే ప్రశ్నించి ఉంటే, నేటి సమాజంలో స్త్రీలు అవమానాలు అవరోధాలు ఎదుర్కొనే వాళ్ళు కాదని. అలాగే స్త్రీలను పురుషులు అనుమానించే వాళ్లు కాదని. ఈ సన్నివేశం ద్వారా రచయిత్రి మనకు తెలియజేస్తుంది.
భాను రాముడిని అలా ప్రశ్నించే సరికి ఆ నాటకం చూస్తున్న ఆ పల్లెటూరి ప్రేక్షకులు స్టేజిపైకి చెప్పులు విసురుతారు. అప్పుడు ఆర్గనైజర్‌ వైకుంఠం కలగజేసుకుని ప్రేక్షకులకు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక చెప్పిందని చెబుతాడు. ఆ విధంగా వైకుంఠం ప్రేక్షకులను శాంతింపజేస్తాడు. ఆ తరువాత అక్కడ నాటకం చేయడానికి వచ్చిన వాళ్ళందరూ భానుని తలా ఒక మాట అనడం ప్రారంభింస్తారు. అప్పుడు భాను ‘‘రాముడు ఘోరమైన నేరం చేసాడు’’ అని ఆవేశంగా అక్కడి వాళ్లందరికీ సమాధానం చెబుతుంది. దాంతో అందరూ మౌనంగా ఉండిపోతారు.
భాను ఇంటికి వచ్చినతర్వాత పడుకొని అక్కడ జరిగిన సంఘటన తలుచుకుంటూ ఉంటుంది. అలాగే నాటకంలో స్త్రీ, పురుషుల వ్యత్యాసం గురించి బాను ఇలా అనుకుంటుంది. ‘‘మగవాడు నటిస్తే అది కళ అవుతుంది. అతడు కళాకారుడు అవుతాడు. అదే ఆడది నటిస్తే అది భుక్తికి లేక అనుసరించిన చవకరకపు వృత్తి కింద జమకట్టబడుతుంది. ఏమిటి అన్యాయం’’ అని భాను సమాజాన్ని నిందిస్తుంది.
సమాజంలో నాటకాల్లో పురుషుడు నటిస్తే కళ కోసమని అంటారు. అలాగే అతడిని కళాకారుడని అంటారు. కానీ అదే స్త్రీ నటిస్తే మాత్రం ఆమెను కళాకారిణి అని అనరు. ఆమె కూటికోసంచేస్తుందని అంటారు. నాటకంలో నటించే తోటి పురుష నటులే ఈ నటీమణులను హేళన చేసి మాట్లాడుతుంటారు.ఈ విధంగా నాటకంలో నటించే స్త్రీలనుహేళన చేయకుండా గౌరవింపబడినప్పుడే ఈ నాటక సమాజం అభివృద్ధి చెందుతుందని రచయిత్రి భావన.
ఒక తాగుబోతు బయట డ్రామా ఆర్టిస్ట్‌ అని ఉన్న బోర్డు చూసి లోపలికి వచ్చి తలుపులు కొడతాడు. చదువుకుంటూ కూర్చున్న భాను తమ్ముడు కృష్ణ వెళ్ళి తలుపు తీస్తాడు.‘మీరు ఎవరు ఎందుకు వచ్చారు’ అని అడుగుతాడు. వెంటనే భాను తండ్రి వస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు. ‘‘ అబ్బ! అబ్బ! ఉన్నది ఒక్కటి. ఇంతమంది……’’ అతని మాట పూర్తికాక ముందే భాను వచ్చి అతని చెంప పగలగొడుతుంది. ఆ తరువాత కృష్ణ అతన్ని యీడ్చికెళ్ళి బయట వేస్తాడు.
లేడీ డ్రామా ఆర్టిస్ట్‌లు అంటే వేశ్య స్త్రీలుగా సమాజం భావిస్తోందని, అలాగే స్త్రీలు నాటకాల్లో నటిస్తే సమాజం వాళ్లను చెడిపోయిన వాళ్ల కింద జమ చేస్తుందని రచయిత్రి ఈ సంఘటన ద్వారా మనకు తెలుపుతుంది.
ఆ సంఘటన తరువాత భాను తండ్రి తానిక్కడ ఉండనని కాశీకి వెళ్ళిపోతానని అంటాడు. అప్పుడు భాను అదే మంచిది ఖర్చు లేకుండా అవుతుంది వెళ్ళు అని అంటుంది. ఆ మాటలు విన్న లలితమ్మ భానుని తిడుతూ శాపనార్థాలు పెడుతుంది. అలా ఆ ఇంట్లో ఇలాంటి గొడవలు మామూలుగానే జరుగుతూనే ఉంటాయి. భాను తండ్రి ఇంటి నుండి బయటకు వెళ్తాడు. తెల్లవారి సరికల్లా వెతికి ఇంటికి పట్టుకు వస్తారు. వారం రోజుల తర్వాత ఒక వార్తా పత్రికలో ఒక ప్రకటన ఇలా ఉంటుంది ‘‘ఈమధ్య వ్యభిచారులు కొందరు, పోలీసుల గళ్ళు కప్పడానికి బయట డ్రామా ఆర్టిస్టులమనే బోర్డు తగిలించుకుని లోపల వ్యాపారం కొనసాగిస్తున్నారు. అందువల్ల నిజమైన ఆర్టిస్టులు ఇబ్బందుల పాలవుతున్నారు. యికమీద సంగీత నాటక అకాడమీచే గుర్తించబడిన ఆర్టిస్టులు మాత్రమే అలా బోర్డులు తగిలించుకోవాలని నిర్ణయమైంది. ఆర్టిస్టులు నాటక సమాజాల ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుంది.’’ అని రాసి
ఉంటుంది. అయితే సమాజంలో కొందరు చేస్తున్న తప్పిదాల వలన భాను లాంటి నిజమైన ఆర్టిస్టులకు ఇబ్బందులు ఎదురవుతాయని. అలాంటి వాటిని అరికట్టాలంటే ఆర్టిస్టులు సంగీత నాటక అకాడమీ ద్వారా అలాగే నాటక సమాజాల ద్వారా గుర్తింపు పొందిన తరువాత బోర్డు తగిలించుకోవాలని అప్పుడు అయితేనే భాను లాంటి నిజమైన ఆర్టిస్టులకు ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయని రచయిత్రి భావన. ఒక పల్లెటూర్లో భాను, ఆదిత్య మిగిలిన ఆర్టిస్టులందరూ డ్రామా వేయటానికి వెళ్తారు. ఆ ఊరి సర్పంచ్‌ వీళ్లను సావిట్లో కూర్చో పెడతాడు. పల్లెటూరి వాళ్లకు లేడీ డ్రామా ఆర్టిస్టులను చూడాలని ఆత్రుత ఎక్కువ. అలాంటిది పల్లెటూర్లలో మామూలే.
ఇందులో నిరంజన్‌ అనే మేకప్‌ మ్యాన్‌ ఉంటాడు. అతను భానుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. ఆమెపైట గురించి మాట్లాడతాడు. ఆమెవ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు భాను తానె స్వయంగా మేకప్‌ వేసుకుంటుంది.
మామూలుగా నాటకాలలో లేడీ ఆర్టిస్టులు మేకప్‌ మ్యాన్‌తో ఒబిడియట్‌గా ఉంటారు. లేదంటే మేకప్‌ పాడు చేస్తారనుకుంటారు. మేకప్‌లో కూడా భాను లాగా ప్రావీణ్యం కలిగి ఉండాలని. అప్పుడు మేకప్‌ మ్యాన్‌ ఆగడాలు అరికట్టవచ్చని రచయిత్రి భావన.
నాటకం ప్రారంభమవుతుంది. ఆ నాటకంలో విలన్‌ పాత్ర జనార్ధన్‌. ఆ జనార్ధన్‌ పాత్ర కామంతో కళ్ళు మూసుకుని ఆ నాటకంలోని హీరోయిన్‌ని రేపు చేయబోతాడు. ఈ సమయంలో మదమెక్కిన మదపుటేనుగులా వస్తాడు. అలా రావడంతో స్టేజి మీద పొరపాటుగా జనార్ధన్‌ కాలు ఇరుక్కు పోతుంది. అప్పుడు అతను గట్టిగా అరుస్తాడు. స్టేజి మీద ఉన్న హీరోయిన్‌ పాత్ర భాను సమయస్ఫూర్తిని పాటిస్తూ జనార్ధన్‌ దగ్గరకు వెళ్లి ఇలా అంటుంది.‘‘మాధవ్‌! నీది కాని వస్తువును దురాక్రమణ చేయడానికి భగవంతుడు కూడా ఒప్పుకోడు’’ అని అంటూనే ఆ జనార్ధన్‌ చెయ్యి పట్టుకుని పైకి లాగడానికి ప్రయత్నిస్తుంది. అంతటితో నాటకం ముగుస్తుంది. కానీ నిజానికి నాటకంలో తాగిన మైకంలో విలన్‌ అలా ప్రవర్తిస్తాడు. ఆతర్వాత హీరోయిన్‌ విలన్ను చెంప దెబ్బ కొట్టి మార్చే సన్నివేశం అది. కానీ అక్కడ విలన్‌ కాలు ఇరుక్కుపోవడం చేత భాను సమయస్ఫూర్తిని చూపిస్తూ దానికి అనుగుణంగా నాటకాన్ని మార్చుకుంటుంది. దాంతో నాటకం రసాభాసం కాకుండా సజావుగా సాగుతుంది.
భానుకి అబార్షన్‌ అయినట్లు సమాజంలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న ఆదిత్య భాను నాటకం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్తాడు. ఆదిత్యను చూసి నాటకం వేస్తున్న భాను స్టేజ్‌ దిగి ఆదిత్య దగ్గరకు వస్తుంది.అప్పుడు ఆదిత్య భానుని ఇలా అడుగుతాడు. ‘‘భాను నేను విన్నది నిజమేనా’’ అని అడుగుతాడు. అప్పుడు భాను ‘‘నివేమనుకున్నావ్‌?’’ అని ఆదిత్యను అడుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల వలన నిజం కాదనుకున్నానని ఆదిత్య అంటాడు. అలా అనడంతో భాను సంతోషపడుతుంది. తన చెల్లెలు సుబ్బలక్ష్మికి అయిన అబార్షన్‌ను కప్పిపుచ్చడం కోసం ఆదిత్యతో భాను ఇలా అంటుంది.‘‘నీవు విన్నది ….. నిజమే’’ అని అంటుంది. దాంతో ఆదిత్య బాధపడి వెళ్ళిపోతాడు
ఆ తర్వాత భాను ఆదిత్య గ్రూప్‌ అంతా కలిసి ఒక కళాపరిషత్తుకు నాటకం వేయడానికి వెళ్లాల్సి వస్తుంది. పరిషత్తుకు వెళ్లే రోజు భాను తప్ప వెళ్ళే వాళ్లందరూ హెవెన్‌ డోర్స్‌ దగ్గరకు వస్తారు. వెళ్లడానికి అరగంట టైం ఉంటుంది. అయినా భాను రాదు. దాంతో అక్కడ ఉండే వాళ్ళు భాను గురించి ఈవిధంగా అనుకుంటారు. ‘‘బయలుదేరే సమయానికి ప్యాసింజర్‌ ఎవడైనా వచ్చాడేమో’’ అని ఒకరు.‘‘దారిలో హాస్పిటల్‌ తగిలి ఉంటుంది. అబార్షన్‌ అవసరం గుర్తు వచ్చి….’’ ఇలా భాను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుకుంటారు.
నాటకాలలో నటించే అబ్బాయిలు నాటకాలలో నటించే అమ్మాయిల పట్ల సదభిప్రాయం కలిగి ఉండకపోతే, బయట సమాజం ఇంకా నీచంగాచూస్తుంది. కాబట్టి నాటక సమాజంలో వ్యక్తులు అలాగే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా గాని నాటకాల్లో నటించి స్త్రీలను చులకనగా చూడకుండా, వాళ్ల పట్ల సదభిప్రాయం కలిగి ఉండాలని, అలాగే వాళ్లు మనలాంటి మనుషులే అని గ్రహించి వాళ్లను గౌరవించాలని. అప్పుడే నాటక సమాజాలు నమస్కరింప పడతాయని రచయిత్రి ఉద్దేశం.
నాటకంలో భానుది విషాదభరితమైన పాత్ర. నాటకం చివరి సీనులో భాను ఆవేదనతో కన్నీరు కారుస్తుండగా తెరవాలిపోవాలి కానీ భాను మాత్రం అక్కడ విపరీతంగా పకపకమని నవ్వి నవ్వి నవ్వులోనే భాను ఏడుస్తుంది. భాను ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోతుంది. ఆ నాటకంలో భానుకి ఉత్తమ నటి అవార్డు వస్తుంది. భాను ప్రదర్శించిన చివరి నాటకం అదే.
నాటకం ముగించుకుని పరిషత్తుకు వచ్చిన రోజె భాను తమ్ముడు కృష్ణ కాలేజీలో జరిగిన గొడవలలో కాల్పులు జరిగి మరణించాడనే విషయం తెలుస్తుంది. అది తెలిసిన తరువాత అక్కడ వాళ్ళంతా సిగ్గుతో తలదించుకుంటారు.
భాను ఇంట్లో ఎవ్వరు ఉండరు. భాను ఒకటే ఉంటుంది. ఆదిత్య దగ్గర ఉండే రాము ఒక
ఉత్తరం తీసుకొచ్చి భానుకియిస్తాడు. అందులో భానుని అనుమానించి పెద్ద తప్పు చేశానని ఆదిత్య ఆ
ఉత్తరంలో రాసి ఉంటాడు.
ఆదిత్య ఊరికివెళ్లేసరికి ఇంటి దగ్గర పెళ్లికి సన్నాహాలు జరుగుతుంటాయి.ఆదిత్యకి తన మేనత్త కూతురు రూపతో వివాహం అవుతుంది. ఆ తర్వాత రూప గర్భవతి అని ఆదిత్యకు తెలుస్తుంది. కుటుంబం మర్యాద కాపాడటం కోసం పెద్దలందరూ తను బలిపశువును చేసి వాడుకున్నారని ఆదిత్య భాదపడతాడు. ఆదిత్య అక్కడ నుండి వచ్చేస్తాడు. దాంతో రూప ఆత్మహత్య చేసుకుంటుంది. ఆదిత్య కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. కానీ చివరికి రాము అనే అబ్బాయికి కనిపిస్తాడు. ఆదిత్య తల్లిదండ్రులు ఇంటికి రమ్మన్నా కూడా ఆదిత్య ఇంటికి వెళ్ళడు. అందువలన ఆదిత్యకు తన తల్లిదండ్రులు రాము ద్వారా డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇలా తన జీవితం చిందరవందరగా అయిపోయిందని, తను జీవచ్ఛవంలా బ్రతికి ఉన్నాడని. ఆదిత్య తన గత జీవితం గురించి ప్రకాష్‌తో చెప్తాడు.
మరుసటి రోజు ఉదయం ఆదిత్య ఒక ఉత్తరంలో ప్రకాష్‌కి నాటకాల కోసం ఆ భవనం రాసిచ్చినట్లు, అలాగే తన బ్యాంక్‌ ఖాతాలో ఉన్న డబ్బులు కూడా నాటక సమాజం కోసం తీసుకోమని చెప్పి, రాము వాళ్ళ ఊరికి వెళ్తాడని ఆ ఉత్తరంలో రాసిఉంటాడు. ఇంకా తనకి కళాకారుడిగా తనకెంతో తృప్తిని ఇచ్చిందని, తృప్తిని మించిన ధనం ఈ ప్రపంచంలో ఏమీ లేదని రాసి ఉంటాడు.
ఆ తర్వాత రైలులో ఆదిత్య, భాను కలుసుకుంటారు. ఆదిత్యకు నిజం చెప్పి తన మనసును సంతోష పెడదామని భాను అనుకుంటుంది. భాను తన జీవిత సారాంశం మొత్తం ఆదిత్యతో చెబుతుంది. అలాగే తన చెల్లెలు సుబ్బలక్ష్మి పెళ్లి కాకుండానే గర్భవతి అయిన విషయం కూడా చెబుతుంది. భాను మీద సంఘంలోనూ, సమాజంలోనూ దురభిప్రాయం ఉంది. కాబట్టి ఆ నింద తన మీద వేసుకుంటే తన తల్లికి తండ్రికి ఎలాంటి బాధ ఉండదని అలాగే సమాజం కూడా చెడుగా భావించదనే ఉద్దేశంతో భాను నిందను తనమీద వేసుకున్నానని చెబుతుంది. అలాగే తన కన్నతల్లికి కూడా ఈ నిజం తెలియకుండా తన చెల్లెలకు అబార్షన్‌ చేయించినట్లు చెబుతుంది.
భాను మేనమామకు భార్య చనిపోయి ఉంటుంది. వంటలు చేసుకోవడం ఇబ్బందవుతుంది. భాను చెడిపోయిందనడంతో ఆ సాకుతో భాను వద్ద వున్న ఆమె తల్లిని చెల్లెలిని తన ఊరికి తీసుకువెళతాడు.
ఆ తర్వాత భానుని అందరూ కలిసి ఒంటరిదాన్ని చేస్తారు. ఇలా ఒంటరి అయిన తరువాత ఒకసారి బస్సులో ప్రయాణిస్తూ ఉండగా యాక్సిడెంట్‌ అవుతుంది. భానుని హాస్పిటల్లో చేర్చుతారు. భాను కోసం ఎవరూ రాకపోవడం చూసి డాక్టరు వివరాలను అడిగి తెలుసుకుంటాడు. డాక్టర్‌ కూతురు అల్లుడు అమెరికాలో ఉండటం చేత ఆ వృద్ధ దంపతులు భానుని వాళ్ల దగ్గర పెట్టుకుంటారు. భాను అక్కడ ఉండగా ఆ దంపతులిద్దరూ కారు యాక్సిడెంట్‌ లో మరణింస్తారు. ఆ తర్వాత వాళ్ళ కూతురు అల్లుడు వస్తారు. వాళ్ళు వచ్చాక భాను అక్కడి నుండి ఒక చిన్న చేతి సంచితో బయటకు వస్తుంది.అలా వస్తూ ఉండగా రైలులో ఆదిత్య కలుస్తాడు. నిజం తెలుసుకున్న ఆదిత్య ఈ లోకాన్ని వదిలి వెళ్ళి పోతాడు.
భాను తల్లిదండ్రులగా కాకుండా సమాజంలోని తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రోత్సహించి అన్ని రంగాలలో రాణించే విధంగా తీర్చిదిద్దాలి. అలా తీర్చిదిద్దినప్పుడే స్త్రీలు అన్నిచోట్ల గౌరవింపబడుతారు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.