తెలుగు ప్రాచీన కావ్యాలలో కవయిత్రులు జాతి, వార్త, చమత్కారాలు – వేపాడ మమత

1. ఉపోద్ఘాతంః
తెలుగు లిఖిత సాహిత్యం ఆవిర్భావానికి పూర్వం వేదకాల సాహిత్యంలో యజుర్వేదంలో సులభ, గార్గి, మైత్రేయి, అపల, ఘోష, గోధ, విశ్వపర, లోపాముద్ర, జహుర్నామ వంటి స్త్రీ పండితుల పేర్లు కనిపిస్తున్నాయి. తెలుగు నాట తొలి సంకలన గ్రంథం ‘‘గాథా సప్తశతి’’. ఇందులోని మహిళా కవులతో తెలుగు మహిళా కవుల ప్రాచీనత క్త్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి దారి తీసుకుని వెళ్తుంది.

అది ప్రాకృత భాషలో ఉన్న గాథల సంకలనమే. అయినా తెలుగు నేలను ఏలిన తొలి పాలకులు శాతవాహన రాజులలో హాలుడు (క్రీ.శ.1వ శతాబ్ది) ఒకడు. పుష్పగుచ్ఛానికి కూర్పరిలా ఆంధ్రుల సాహిత్య, సాంస్కృతిక సంపదల జాబితాలో సంకలన గ్రంథాన్ని జమ చేశాడు. శాతవాహనుల రాజ్యం మహారాష్ట్ర నుండి ఆంధ్ర, తెలంగాణల మీదుగా కర్ణాటక వరకు విస్తరించింది. కనుక 700 గాథలు తెలుగు వాళ్ళే రాసినవి కాకపోవచ్చు. వాటిలోనూ 274 కవుల పేర్లు మాత్రమే తెలుస్తున్నవి. వీరిలో 11 మంది మహిళలు ఉన్నారు. (పీఠిక రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, శాలివాహన గాథాసప్తపతీ సారము, ఆంధ్రసారస్వత సరిషత్తు 1986) రాళ్ళపల్లి వారి 1932 నాటి సంకలనానికి కట్టమంచి రామలింగారెడ్డి రాసిన ముందుమాటలో రోహ, రేవా, మాధవి, అనులచ్చీ, అనులద్దీ, పహాయి, ససిప్పహ, నాథ అనే 8 మంది గాథా రచయిత్రులు పేర్కొనబడ్డారు. 1964 నాటికి భేగ్న, వదావహీ, వోహా అనే మరో ముగ్గురు పేర్లు చేరాయి. 1886 ముద్రణ అనుబంధంలో అకారాది క్రమంలో కవుల పేర్లు ఇస్తూ స్త్రీల పేర్లను పువ్వు గుర్తుతో సూచించారు. పల్లెటూరి సాధారణ జన జీవితానికి, మరీ ముఖ్యంగా గాఢమైన కోరికలతో ఆశించినది లభించని అసంతృప్తితో వేదనపడే మహిళల నిజాయితీతో కూడిన వ్యక్తీకరణకు గాథా సప్తశతి పేరు పడిరది. ఈ గాథలలో తరచూ వినిపించేది స్త్రీ స్వరమే. స్త్రీల కోణం నుండి వ్రాయబడిరది అంటారు పరిశోధకులు స్మితసెహగల్‌. (Gatha saptashati retailing intimate history of ancient Deccan & Aakar patel – A scorpion’s bitten her saptashat 24, November, 2018, the Hindu)
మాధవిః
‘‘దొరతనంబు తమది సెరపక, దాసులు
బోలె నలుక గొన్న వేళ దేర్చు
వారె ప్రియులు సుమ్ము వనితల కొరులెల్ల
బనికిరాని వట్టి భర్తలంతే’’ (రాళ్ళపల్లి పుట.18)
భర్త అధికారం చేసేవాడుగా ఉండకూడదు. అలిగినప్పుడు దాసులవలే భార్యను ఓదార్చగలిగిన వాళ్ళే వాళ్ళకు ప్రియులవుతారు. మిగిలిన వాళ్ళు వట్టి భర్తలు అంతే! వాళ్ళ జీవితంలో మనసుకు దగ్గరగా వచ్చినవాళ్ళు కాదన్న మాట! స్త్రీల ఆకాంక్ష ఎంత సాధారణంగా ఉందో కదా! సహజ స్నేహ సంబంధం గురించి స్త్రీ మనసులోని భావాలను ఇక్కడే గుర్తించవచ్చు. స్త్రీలు భర్తల నుండి స్నేహాన్ని కోరుతున్నారు, అధికారాన్ని కాదు. అది ఈనాటికీ పూర్తి కానిదే!
తెలుగు సాహిత్యం లిఖిత సాహిత్యంగా కావ్యరూపంలో క్రీ.శ.11వ శతాబ్దం నుండి కనిపిస్తుంది. సంస్కృతంలోని మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం వల్ల అది పూర్తిగా కావ్య స్వరూప స్వభావాలను సంతరించుకోలేదు. కానీ, కావ్య మర్యాదలు పాటిస్తూనే అదొక కావ్యేతిహాసంగా కొనసాగింది. అది నాటి భారతీయ సమాజంలో ఉన్న కొన్ని వర్గాల ప్రజల జీవితాలను కావ్యంగా అందించింది. ఆ తర్వాత 12వ శతాబ్దంలో శివకవులు తమ మతాన్ని విస్తరించుకొనే నేపథ్యంలో సామాన్యులను కూడా సాహిత్యంలోకి తీసుకున్నారు. 13వ శతాబ్దంలో అది మత వైషమ్యాలను పోగొట్టే ప్రయత్నంలో శివకేశవులకు అభేదాన్ని పాటిస్తూ హరిహరాద్వైతానికి నాంది పలికింది. ఇక్కడి 13వ శతాబ్దానికి చెందిన దానమ్మ, ప్రోలమ్మలు అనే కవయిత్రులు కనిపిస్తారు. 1953లో ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ‘ఆంధ్ర కవయిత్రులు’ అనే పుస్తకం రాసింది. తెలుగులో మహిళల సాహిత్య చరిత్ర రచనకు ఇది ఆరంభం. దానమ్మ, ప్రోచమ్మలు తెలుగింటి అత్తా కోడళ్ళు. దానమ్మ ఖడ్గ తిక్కన భార్య, ప్రోలమ్మ ఖడ్గ తిక్కన తల్లి. వీరిని తొలి తెలుగు మహిళా రచయిత్రులుగా ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ పేర్కొన్నారు. అయితే
వాళ్ళు రాసిన పద్యాలు ఏమిటంటే ఆసువుగా చెప్పిన కంద పద్యాలు. దేశీ ఛందస్సుకు సంబంధించినవి. తొలి తెలంగాణ కవయిత్రిగా చెప్పబడుతున్న కుప్పాంబిక 1276లో బూధపురంలోనే ఒక శాసనం వేయించింది. ఈ శాసనాన్ని బట్టి కుప్పాంబిక గురించిన సమాచారం తెలుస్తుంది.
మరలా 14వ శతాబ్దంలో మొదటి బుక్కరాయలు భార్య అయిన గంగాదేవి (క్రీ.శ.1370`14 శ.) ‘‘మధురావిజయం’’ (వీర కంపరాయల చరిత్ర) అనే 8 సర్గల సంస్కృత మహాకావ్యాన్ని ఈమె రచించింది. పూర్వ కవి స్తుతిలో తిక్కనను కూడా చేర్చినది. 15వ శతాబ్దం వరకు శ్రీనాథుని ప్రభావంతో శైవరచనలు వచ్చినా మతద్వేషం పెద్దగా కనిపించదు. సాహిత్యాన్ని మరలా సంస్కృత కావ్యాలను తెలుగులోకి విస్తృతంగా అనువాద ప్రక్రియ చేశారు. అదే కాలంలో కొన్ని స్వతంత్ర ఇతివృత్తంతో తెలుగు కావ్యాలు కూడా వచ్చాయి. ఈ శతాబ్దంలోనే తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క కనిపిస్తుంది. ఈమె తాళ్ళపాక అన్నమయ్య పెద్ద భార్య. ‘‘సుభద్రా కళ్యాణము’’ అనే కావ్యాన్ని మంజరి ద్విపదలో రాసింది. (క్రీ.శ.1460`15వ శ.)
16వ శతాబ్దంలో ప్రబంధ ప్రక్రియ తెలుగు సాహిత్యాన్ని స్వర్ణయుగంగా మార్చింది. 16వ శతాబ్దంలో ఆతుకూరి మొల్ల రామాయణం రచించింది. ఈమె తండ్రి కేసన. ఈమెది నెల్లూరు దగ్గర గోపవరం. ఈ ఊరి దేవుడు శ్రీకంఠ
మల్లేశుని ఆశీస్సుల చేతనే తనకి కవితా గుణం అబ్బినట్లు అవతారికలో చెప్పుకున్నది. ఈమె పేరుతోనే ‘మొల్ల రామాయణం’గా జన ప్రాచుర్యం పొందింది. అవతారిక పద్యంలో పూర్వ కవి స్తుతిలో శ్రీనాథుడు చివరివాడిగా కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి మొల్ల శ్రీనాథుడి తర్వాత 1580కి పూర్వం జీవించి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.
‘‘కంటిన్‌ జానకి ఁపూర్ణచంద్ర వదనన్‌ గళ్యాణి’’
ఈ వాక్య ప్రయోగం చాలా ఔన్నత్యమయినది. లంక నుండి వచ్చిన హనుమంతుడు రామునికి ముందుగా ‘‘చూశాను జానకిని’’ అని చెప్పడంలో సీత కుశలంగానే ఉందని చెప్పి మిగతా విషయాన్ని వివరించాడు. దీనివల్ల కుశల వార్తకై ఎదురుచూస్తున్న వారికి శాంతిని కలిగిస్తుంది. ఇదే సూత్రాన్ని మొల్ల వాడిరది. వాల్మీకి, తమిళ రామాయణ కర్త కంబన్‌లను మొల్ల అనుసరించింది. కష్టంలో ఉన్నప్పుడు, ఆదుర్దా చెందుతున్నప్పుడు ముందుగా విషయాన్ని చెప్పడం మొల్ల ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.
శ్రీకృష్ణదేవరాయల కూతురు మోహనాంగి. ఈమె ‘‘మరీచి పరిణయం’’ కావ్యాన్ని రాసింది. దీని గ్రంథ పీఠిక మాత్రమే లభిస్తున్నది. శ్రీకృష్ణదేవరాయలు భార్య తిరుమలాంబ ‘‘వరదాంబికా పరిణయం’’ రాసింది. దీనిలో అచ్యుతదేవరాల పరిణయ గాథ ఉంది.
ఇంకా తరువాత కాలంలో నాచి ` నాచి విజయం, లీలావతి ` లీలావతి గణితం రాశారు. ఈమె గణిత శాస్త్రవేత్త అయిన భాస్కరాచార్యుని కుమార్తె. త్రివేణి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని కవయిత్రి. ఈమె రంగనాథ సహస్రము, బృంగ సందేశం, తత్వమాల భద్రోదయము వంటి కావ్యాలను రాసింది.
ఆ తర్వాత 16, 17 వ శతాబ్దాలలో కూడా దాని ప్రభావం వల్ల పిల్ల ప్రబంధాలు పుట్టుకొచ్చాయి. కానీ 17వ శతాబ్దంలో చేమకూర వెంకటకవి ‘‘విజయ విలాసము’’ గొప్ప కావ్యంగా వెలుగొందింది. ఈ కావ్యంలోనే జాతి, వార్త, చమత్కారాల ప్రస్తావన కనిపిస్తుంది. దక్షిణాంధ్ర యుగంలో రామభద్రాంబ ‘రఘునాథ అభ్యుదయం’ సంస్కృతంలో రచించింది. రఘునాథుని చేత కనకాభిషేకము చేయించుకున్న కవయిత్రి మధురవాణి. సరస్వతీ మహలను పండితవాదంలో గెలిచి మధుర నుండి తంజావూరు తెప్పించిన వీణా విద్వాంసురాలు మధురవాణి. విజయరాఘవని ఆస్థాన కవయిత్రి రంగాజమ్మ (1633`74). ఈమె ఉషాపరిణయం అనే ప్రబంధాన్ని, మన్నారు దాస విలాసం అనే యక్షగానాన్ని రచించింది.
ఇంకా ఈ కాలంలోనే కృష్ణాజి, చంద్రరేఖ, సౌందరి ఉన్నారు. ‘రాధికా స్వాంతనము’ అనే శృంగార ప్రబంధం రాసిన ముద్దు పళని ఈ యుగం నాటిదే. తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహాత్మ్యం, వాశిష్ట రామాయణం మొదలగు కావ్యాలు రచించింది.
కవయిత్రులు ` శతకాలుః
భావ లింగ శతకం ` దార్ల సుందరీమణి
మదిన సుభద్రమ్మ ` రాఘవ రామా కేశవ రామ శతకం
బండి బాపమ్మ ` మీనాక్షి శతకం
రత్నమాంబ ` వెంకటరమణ శతకం
చెలికాని చెల్లాయమ్మ ` జానకి శతకం పార్థసారధి శతకం
యక్షగానాలుః
అక్క మహాదేవి చరిత్ర ` బాల పాపాంబ
రామాయణం ` అన్నదానము వెంకటాంబ
శివ కురువంజి ` చెప్పిన రత్నమ్మ
శ్రీమంతుని చరిత్ర ` శ్రీరామపుత్రి
ఆండాళ్ళు చరిత్ర ` కొత్తూరు రంగనాయకమ్మ మొ॥
ఇలా రాసిన తెలుగు సాహిత్యం మొత్తం మీద సమకాలీన, సామాజిక జీవితానికి కావలసిన విలువలను వివరించి చెప్పడానికి ప్రయత్నించింది.
ఆయా యుగాల్లో కవులు తమ జీవిత దృక్పథాలకు అనుగుణంగా సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. నన్నయ, తిక్కన యుగాల వరకు వెలసిన ‘ఆంధ్ర మహాభారతం’ తలమానికం. వీరు చిత్రించిన పాత్రల్లో తెలుగువారి స్వభావాలు కొద్దిగా కనిపించినా, ఇవేవీ సమకాలీన సమాజంలోని జీవిత వాస్తవికతను ప్రత్యక్షంగా కావ్య దర్పణంలో చూపించే ప్రయత్నాలు కావు. జీవితంలోని ఉత్తమ విలువలను అనుసరించడం లేదా తిరస్కరించడం వలన కలిగే లాభనష్టాలను సాహిత్య మర్యాదను ఆశ్రయించి చెప్పేది కావ్యేతిహాసం. ప్రజలు ఆ కాలంలో జీవించే బ్రతుకు తీరుతెన్నుల కంటే ప్రజలు ఏ కాలంలోనైనా జీవించవలసిన బ్రతుకు చింతలను రేకెత్తించడానికి కవిత్రయ సాహిత్యం కృషి చేసింది.
ఆదికవి నన్నయ ఆంధ్ర మహాభారతం ఇతిహాసానికి చెందినది. పాల్కురికి సోమన దేశీ కవిత్వం, శతకం వైపు మొగ్గు చూపారు. తిక్కన సోమయాజి ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణాలు ఇతిహాస, పురాణాలకు సంబంధించినవి. ఎర్రన కూడా వీరి బాటలోనే నడిచాడు.
జాతి, వార్త, చమత్కారాలుః
‘‘తా రసపుష్టిjైు ప్రతిపదంబున జాతియు వార్తయున్‌ జమ
త్కారము నర్థగౌరవము గల్గు ననేక కృతుల్‌ ప్రసన్నగం
భీరగతిన్‌ రచించి మహి మించినచో నిక శక్తు లెవ్వర
య్యా! రఘునాథ భూపరసికాగ్రణికిన్‌ జెవిసోక చెప్పగా న్‌’’ (విజయ విలాసము అవ.31)
జాతి, వార్త, చమత్కారం, అర్థగౌరవం… ఈ నాలుగింటి వలన కావ్యానికి రసపుష్టి, ప్రసన్న గంభీరత అనే స్వభావ విశేషాలు కలుగుతాయి. వీటిల్లో జాతి అంటే స్వభావం అని వేదం వెంకట రమణయ్య శాస్త్రిగారు, స్వభావోక్తి అని బులుసు వెంకటరమణయమ్య గారు వివరిస్తే, ఆరుద్ర గారు ‘జాతి’ అంటే ‘జోక్‌’ అని, వార్త అంటే ‘సామెత’ అని పేర్కొన్నారు. (జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు పుట.158)
జాతిః
సమాజంలో కవి చూసిన వాస్తవాన్ని వాస్తవంగా వాఙ్మయంలో రికార్డు చేయటం. ఇది 15వ శతాబ్ది సాహిత్య చైతన్యంలోని శక్తివంతమైన ధోరణి. దీనిని తరువాతి కాలంలో జాతి అని పిలిచినట్లు తెలుస్తోంది.
ఉదాః శ్రీనాథుని చాటుపద్యం
‘చిన్ని చిన్ని రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంచులను తేళ్ళు
పల్లనాటి సీమ పల్లెటూళ్ళు’’.
అనే పద్యం వాస్తవ కథనం. పలనాడులోని అప్పటి పల్లెటూరు స్వభావాన్ని చెప్పిన పద్యం ఇది (పుట. 156 జి.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు.)
కృష్ణాజన్మ దక్షిణాంధ్ర యుగపు కవయిత్రి (క్రీ.శ.17 పూర్వార్థం) ఈమెకు కృష్ణాంబ, కృష్ణాజీ అనే నామాంతరాలు కూడా ఉన్నాయి. రామినూతల తిరుమలయ్య కుమార్తె, రంగాజమ్మకు సమకాలీనురాలు విజయ రాఘవని ఆస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె రాసిన కావ్యాల గురించి ఆధారాలు లేవు. రామభద్రాంబ మధురవాణి, కృష్ణాజి, కాళయ్య శిష్యులేనని పద్యం ద్వారా తెలుస్తోంది. దీనిని విజయ రాఘవ నాయకుడు కాళయ్యను ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.
‘‘అయ్య దినముల రామభద్రాంబ వారు
నేడు కృష్ణాజీ కవిత నేర్పు మెరసి
కవిత సేయుట లెల్ల నీ ఘనత కాదె
కవి వినుత చర్య చంగల్వ కాళనార్య’’
కృష్ణాజన్మను కూడా కాళయ్య తన కావ్యం ‘రాజగోపాల విలాసం’లో ప్రస్తావించాడు. సాహిత్య ప్రతిభని అతను కీర్తించిన విధానాన్ని బట్టి ఆమె గొప్ప పండితురాలని తెలుస్తోంది.
‘‘ప్రస్తార సంఖ్యను పదమూడు కోటలు నలువది రెండు లక్షల పదిహేడు
వేలు నేలళ్ళూరును వింసతియును నారు వృత్తంబులందు నీ వృత్తమునకు
నీ వర్ణన సమస్యను నీవు కూర్చు మనటన్న నా వృత్తమున సమస్యను రచించి
యందుకు శ్లోకంబు లాశువుగా జెప్పి యవి తెలుగును పద్యములు జేసి
ఇరువదారును ఛందంబు లెరిగి యిట్లు
కవిత చెప్పినవార లీ భూవిని గలరే యనుచు నుందురు వినుతింప గణతగాంచే’’ (రాజగోపాల విలాసం)
కీర్తనీయ గుణాలాంబ కృష్ణ మాంబ అని కాళయ్య రాజగోపాల విలాసంలో చెప్పాడు.
వార్తః
సామాజిక సాహిత్య స్పృహతో రచించే కవిత్వంలో ఉండవలసిన మరొక లక్షణం ‘వార్త’. ‘వార్త’ అంటే సమకాలీన సమాజంలోని జనజీవన విధానానికి సంబంధించిన వివరణ.
ఉదాః ఒక రూకకే షడ్రుచులతో కూడిన వంటలతో పూటకూళ్ళావిడ విందు పెట్టినట్లు శ్రీనాథుడు క్రీడాభిరామంలో చెప్పుకున్నాడు. జాతి ఒక వ్యవస్థను వ్యక్తం చేసినట్లే వార్త ఒక వ్యవస్థను వివరిస్తుంది. ఈ రెండూ కవిత్వంలో ఎంత ముఖ్యమో వాటిని చమత్కారంగా వక్రీకరించడం కూడా అంతే ముఖ్యం. స్వభోవోక్తిని జాత్యాలంకారం అనే పేరున్నది. 16వ శతాబ్దంలోని కావ్యాలంకార సంగ్రహ (నరస భూపాలయం) కర్త స్వభావోక్తి అనటానికి బదులు ‘జాతి’ అని అన్నాడు. (జి.వి.సుబ్రహ్మణ్యం పుట.157. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు) నన్నయ ‘వార్త’ అనే పదాన్ని ‘వాణిజ్యం’కు బదులుగా వాడాడు.
భావలింగ శతకం రాసిన దార్ల సుందరమ్మ (1755) తన కవిత్వంలో ఆనాటి ప్రజల్లో నేటికీ నిలబడి ఉన్న కుల వివక్ష గురించి వివరిస్తూ కింద చెప్పిన పద్యం నిదర్శనం. ఆమె పద్మశాలి సామాజిక వర్గానికి చెందినది. భావలింగ శతకంలోసుందరమ్మ రాసిన పద్యం దానికి ఆధారం.
‘‘సాలయనగా బాఠశాలయో దెనుగున
దొలుత యచట నీవు పలుకబడుట
సాలెదాననుచు జాటగాబడితిని
పాపభయ విభంగ భావలింగ’’ (భావలింగ శతకం)
చమత్కారంః
‘‘చమత్‌ కరోతికి చమత్కారః’’ అని శబ్దకల్ప ధ్రుమం చెబుతోంది. ఇది ‘చమ్‌’ ధాతువు యొక్క వర్తమానకాల అసమాపక క్రియ రూపం. ‘‘భూమిపై ఉన్నదానిని ఉన్నట్లు చెప్పినా మాటల తేటలు బహుళంగా ఉండేటట్లు చెప్పినా అది ‘మహితోక్తి’ కావాలి. సహృదయ హృదయాంగమై ఉండాలి. ప్రబంధ కవులు అలంకారంగా గ్రహించిన జాతిని సమాజంలో చూసిన దానిని చూసినట్లు చమత్కారంగా, అర్థ గౌరవంతో, సహృదయ రంజికంగా చెప్పి సామాజిక స్పృహగా గ్రహిస్తారు శ్రీనాథ యుగ కవులు’’. (జీ.వి.సుబ్రహ్మణ్యం సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు)
‘‘సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయియే
ర్పడ ఒక కాంతయయ్యెనట నన్నుగా నాతని పాదరేణు వి
య్యెద వడి నోడ సోకి నీది యేమగునో యని సంశయాత్ముడే’’ (మొల్ల రామాయణం)
గోదావరి దాటేటప్పుడు పడవ దగ్గరికి వచ్చిన రాముని పాదాలు కడిగిన గుహుడు పడవని మాత్రం ఎక్కనీయలేదని చెప్తుంది. ఈ భావనను ఆమె సంస్కృత ఆధ్యాత్మిక రామాయణం నుండి స్వీకరించిందని ఆరుద్ర అంటాడు. ఆస్వాశాంత పేరుకు విశేషణంగా ‘కవితా చమత్కార’’ అన్న బిరుదు నామాన్ని ధరించ కలిగిందంటే ఇలాంటి చమత్కార వ్యక్తీకరణలు చేయగలిగిన సామర్ధ్యం మొల్ల సొంతమని అర్థం చేసుకోవాలి.
దానమ్మః
‘‘పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంబు నాయకులెందరు
ముగ్గురు ఆడవారమైతిమి
వగక భేటికి జలకామాడ వచ్చిన చోటన్‌’’
ఇది ఖడ్గతిక్కన యుద్ధం నుండి వెనుతిరిగి ఇంటికి వచ్చినప్పుడు భార్య దానమ్మ చెప్పిన పద్యం. ఇప్పుడు మన ఇంట్లో నువ్వు, నేను, అత్త… ముగ్గురం ఆడవాళ్ళమే అని ఆమె భర్త చర్యలను నిరసించింది.
పోలమ్మః
‘‘అశద్రృశముగ అరివీరుల
పసమీరగ గెలవలేక పంద క్రియ నీవు
అసివైచి తిరిగి వచ్చిన
పనులున్‌ విరిగితివి తిక్క! పాలును విరిగినవి’’
పై పద్యంలో ‘‘నీవు శత్రుసైన్యానికి వెన్ను చూపి నిలవలేక తిరిగి వచ్చావు. నీ చర్యలకి పశువుల మనసులు కూడా విరిగి వాటి పాలు కూడా విరిగిపోయాయి’’ అంటుంది అతని తల్లి.
పై రెండు పద్యాలలో కూడా చమత్కారం, వ్యంగ్యం రెండూ ధ్వనిస్తున్నాయి, కర్తవ్యాని బోధిస్తున్నాయి.
మన తెలుగులో కావ్య సాంప్రదాయం కానీ, ప్రబంధ సాంప్రదాయం కానీ ఒక విశిష్టమైన ఒక పద్ధతిలో వెలువడిరది. అవి సమకాలీన సమాజాన్ని ప్రతిఫలిస్తూనే విశ్వజనీనమైన భావాలను చెప్పిన సాహిత్యం తెలుగు సాహిత్యం. కాబట్టి ఆ సాహిత్యానికి సంబంధించిన జాతి, వార్తా చమత్కారాలలో తెలుగు లిఖిత సాహిత్యం ఆవిర్భావం నుండి చేమకూర వేంకట కవి వరకు ఈ ప్రయాణం కొనసాగింది. కవులందరూ సాధారణంగా సంస్కృత మర్యాదను అనుసరించి తెలుగు కావ్యాలను రచించారు. భరతుని సిద్ధాంతాల నుండి మిగతా సిద్ధాంతాల వరకు అదే పరంపర కొనసాగింది. కాబట్టి విశిష్ట అధ్యయనం భారతీయ సమగ్రతకు, సంస్కృతికి ఏ విధంగా దోహదం చేస్తాయేమోనని నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. మన తెలుగు కవుల ఆలోచన, భావాలు చాలా విశాలవంతమైనవి. అవి సంస్కృతంలో వచ్చినప్పటికీ యావద్భారత సంస్కృతిని దృష్టిలోకి తీసుకున్నారు. జాతీయ సమగ్రతకు (చీa్‌ఱశీఅaశ్రీ Iఅ్‌వస్త్రతీఱ్‌వ) కారణభూతమయ్యే విషయానికి దోహదం చేసే అంశంగా మన తెలుగు సాహిత్యం ఆనాటి నుండి ప్రయత్నం చేస్తోంది. శ్రీనాథ యుగంలో సాహిత్య గతిలో మార్పు వచ్చింది. సమకాలీన సమాజంలోని ఛాయాచిత్రాలను శ్రీనాథుని సాహిత్యపు కెమెరాలో బంధించినవే. విభిన్నమైన ప్రవృత్తికి శ్రీకారం చుట్టిన మహాకవి శ్రీనాథుడు. మహాకావ్య లేదా ప్రబంధాల ఆవిర్భావానికి శ్రీనాథుని కాలం సంధికాలం. అది ఈ రాయల కాలానికి ఉత్కృష్ట రూపాన్ని దాల్చింది.
దక్షిణాంధ్ర యుగ కవి చేమకూర వేంకటకవి ‘విజయ విలాసం’ ఆఖరి మహాకావ్యం అంటారు.
శ్రీనాథ యుగంలో జాతి, వార్త, చమత్కారాలను కథాకావ్య ప్రక్రియలో పాటించే పద్ధతిని సాగించినవారు, జక్కన ` విక్రమార్క చరిత్ర, అనంతమాత్యుడు ` భోజరాజీయం, కొరవి గోపరాజు ` సింహాసన ద్వాత్రింశిక, పంచతంత్రం ` దూబగుంట నారాయణ కవి మొ॥.
ప్రబంధ యుగంలో శ్రీకృష్ణ దేవరాయలు ` ఆముక్త మాల్యద, అల్లసాని పెద్దన ` మనుచరిత్ర, నంది తిమ్మన ` పారిజాతాపహరణం, ధూర్జటి ` శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, మాదయ గారి మల్లన ` రాజశేఖర చరిత్ర మొదలైనవి.
దక్షిణాంధ్ర యుగంలో రఘునాధ నాయకుడు రాసిన రఘునాథ రామాయణం, శృంగార సావిత్రి, వాల్మీకి చరిత్ర, చేమకూర వెంకటకవి ` విజయ విలాసం.
ముగింపుః
ఆంధ్ర సాహిత్య చరిత్రలో లభించిన తెలుగు కవయిత్రులు ఆయా కాల పరిస్థితులను బట్టి రచించారు. దక్షిణాంధ్ర యుగంలోని ముద్దు పళని వేశ్య కాబట్టి ఆమె ‘ఇళాదేవీయం’ (రాధికా స్వాంతనం)లో ఆ ఛాయలు బాగా కనిపిస్తాయి. ఈమె కందుకూరి వంటి అగ్రగణ్యులతో అభాసు పాలయ్యింది. ఆధునికులలో వేశ్యా వృత్తిపై నిషేధం ఉండటం వలన మానవతావాదులుగా శరీరాన్ని అమ్ముకోవడం అనేది అతి జుగుప్సాకరమైనదిగా భావిస్తున్నాము. కాలమాన పరిస్థితులను బట్టి సమాజంలోని విలువలు మానవ జీవితానికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయనటంలో ఎటువంటి సందేహం లేదు. సరిగ్గా ఆధారాలు లేక మరుగున పడిన మాణిక్యాలు ఇంకెంతమంది కవయిత్రులు ఉన్నారో తెలియదు.
ప్రధాన ఆకర గ్రంథాలుః
1. చేమకూర వేంకటకవి ` విజయ విలాసం
2. విజయ విలాసము హృదయోల్లాస వ్యాఖ్య ` తాపీ ధర్మారావు
3. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు ` డా.జి.వి.సుబ్రహ్మణ్యం
4. పరిశోధన విధానం ` డా.ఎస్‌.జయప్రకాష్‌
5. సారస్వత వివేచన ` రా.రా.
6. ముదిగంటి సుజాతారెడ్డి, ముదిగంటి గోపాలరెడ్డి ` సంస్కృత సాహిత్య చరిత్ర
7. చమత్కార చంద్రిక ` విశ్వేశ్వరుడు
8. శబ్దరత్నాకరము ` బహుజనపల్లి సీతారామయ్య
9. దామకూర కవితా వైభవం ` కులశేఖర రావు
10. ఆంధ్ర సాహిత్యంః చమత్కార వైభవం ` పొన్నగంటి హనుమంతరావు
11. శ్రీనాథుని యుగంలోని కథా కావ్యాలుః జాతి వార్తా చమత్కారాలు ` ఇనగంటి భాగ్యరేఖ
12. ప్రబంధ యుగ కావ్యాలుః చమత్కార ప్రస్థానం ` మెరుగుమిల్లి వెంకటేశ్వరరావు

వేపాడ మమత, పరిశోధక విద్యార్థిని, ఆంధ్ర విశ్వవిద్యాలయం

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.