కవి వేదనకు ప్రతిరూపం జాషువా పిరదౌసి – డా. రాగ్యా నాయక్‌ ఆడావతు

మాతృభూమికి మరువని విశ్వమానవ దృష్టి సంప్రదాయ సంస్కారం వదలని ఆధునిక సృష్టి. ఆసక్తిత్వాన్ని తిరస్కరించని హేతువాదం. ద్వేషపూరితం కాని అగ్రహప్రకటన అన్ని కలిపిన మహాకవి గుర్రం జాషువా.

కవిత వస్తువులోనూ, రూపంలోనూ, సంప్రదాయ దృక్పథం గల కవులున్నారు. వస్తురూపాలు రెండిరటిలోనూ సంప్రదాయ దృక్పథం ప్రదర్శించిన కవులున్నారు. రూపంలో ప్రాచీనత, వస్తువులో ఆధునికత పాటించిన కవులు చాలా కొద్దిమంది మాత్రమే. ఈ మూడో వర్గంలో చేరతాడు జాషువా. ఒక వైపు హేతువాదోద్యమం మరోవైపు భావకవితా ప్రభంజనం వీస్తున్న కాలంలో కలం పట్టినవాడు. అటువంటి సంక్లిష్ట సందర్భంలో వాడలా, ఉద్యమాల ఉరవడిలో అనుకరణ ప్రాయమైన కవితా స్రవంతిలో కొట్టుకుపోకుండా సర్వతంత్ర స్వతంత్రమైన, సృష్టితో తమ ప్రత్యేకతను నిలుపుకొన్న కవులు కొందరే. వాళ్లలో మొదట చెప్పదగినవాడు గుర్రం జాషువా.
జాషువా రచించిన లఘు కావ్యంలో గబ్బిలం, ముంతాజ్‌ మహాల్‌, పిరదౌసి సుప్రసిద్ధమైనవి. విశృనరుడ నేను’ అని ఒక చోట జాషువా చెప్పుకున్నాడు. కరుణ రసాత్మకం.
క్రీస్తుశకం 11వ శతాబ్ధంలో పర్షియా దేశపు రాజు గజనీ మహమ్మదు. పద్దెనిమిది సార్లు భారతదేశం మీద దండయాత్రలు చేశాడు. దోపిడి చేసి అపార ధనరాసులను దోచుకోని గజనీ పట్టణం చేరాడు. తన పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు. పారశీసుకవి శ్రేణి శిరోభూషణం అయిన ‘ఫిరదౌసి’ నిరూపించాడు. తరతరాల తన వంశ చరిత్రను గొప్ప కావ్యంగా రచించమని కోరాడు. ఒక్కొక్క పద్దియంబున కొక్కొక్క బంగారు రూకమొసగెదను కవీ అని వాగ్ధానం చేశాడు. పిరదౌసి ముప్పయ్యేళ్లు శ్రమించి గజనీ వంశానికి చెందిన 16 మంది రోజుల చరిత్రను షానామా’ అనే మహాకావ్యంగా రచించాడు. 60 వేల పద్యాల ఉద్గ్రంథం అది. అయితే రాజు ఆడిన మాట తప్పి 60 వేల బంగారు నాణాలకు బదులుగా వెండినాణాలు కవికి పంపించాడు. పిరదౌసి ఆశాభంగం పొంది, ఆ ధనం రాజుకు తిప్పి పంపించి, ఒక లేఖ నిందా పూర్వకంగా రాశాడు. అది చదివిన గజనీ కోపించి సాంప్రదాయమైన పద్ధతిలోనే నడుస్తూ, దొరగారి పక్షం వుంటాడు. చిన్నవాడు కంఠీరవంలను తన వాంచే భ్రష్టుడనిపించుకున్నప్పటికి వూరిలో దొరగారి పీడనకు గురువుతున్న వారి సానుభూతిని పొందగలుగుతాడు. అంతేకాకుండా ఈ నవలలో మరొక విశేషం ఆనాడు వున్న రాజకీయ పార్శనే కాకుండా మత సాంస్కతిక వైవిధ్యలకు సంబంధించిన అనేక అంశాలు చోటు చేసుకున్నాయి.
ఉదహరణకు కంఠీరవం క్రమంగా ఎదుగుతూ వచ్చిన క్రమం, ఆ పరిణామాన్ని ఈ నవలలో చాలా అద్భుతంగా చిత్రించారు. కంఠీరవం తన వేదిక నేపథ్యాన్ని వదులుకొని, ఎలా ఇతర వర్గాల వారి అనుభవాన్ని పురస్కరించుకొని తాను మారుతూ వచ్చింది ఆళ్వారుస్వామి గారు చక్కగా ప్రతిబించి చేశాడు. నిజామాబాద్‌ జైలుకు వెళ్లేవరకు కంఠీరవానికి ఇంకా తనకు పట్టింపులు చాలా ఉన్నాయి. అందరితో కలిసి భోం చేయటం. అందరితో కలిసి ఉండటం అనే విషయాల మీద ఉన్న శషబిషలు జైలు జీవితంలో పోయాయి. అందుకే జైలు జీవితం గడుపుతూ, అక్కడికి వచ్చిన అనేక వర్గాల వారితో ఆయన పొందిన అనుభూతిని ఒక్క వ్యాసంలో ఆయన తెల్చి చెప్పుతాడు. జైలు ఒక పెద్ద పాఠశాల వాస్తవానికి అది రెండు విధాల అన్వయించుకోవచ్చు. నిజాం యొక్క దౌష్ట్రానికి గురైన ప్రజలను మరింతగా అర్ధం చేసుకునే క్రమంలో జైలు ఒక పాఠశాల అయితే, తాను జన్మించి పెరిగిన ఛాందస నేపథ్యాన్ని వదులుకొని సామాజికమైన ప్రగతి పథంలో పయనించటానికి కంఠీరవానికి జైలు ఒక పాఠశాల అయింది.
సాంప్రదాయ విద్యకు దూరమై లోకానుభవం చేత, విజ్ఞతచేత తాను గ్రహించిన విజ్ఞానాన్ని ఆఊరి ప్రజల అభ్యున్నతికి వినియోగించడం చూస్తాం. ముఖ్యంగా ఇందులో గమనించవలసిన విషయం తెలంగాణ ఉద్యమానికి ఆలంబనమైన గ్రంథాలయోద్యమం మనకు అనుశ్రుతంగా కనిపిస్తుంది. నిజామాబాదులో జరపదలచిన గ్రంథాలయ మహాసభలకు నిజాం అనుమతి నిరాకరించడం దగ్గర నుంచి తమ ఊళ్లో గ్రంథాలయం, అక్కడి పీడిత ప్రజలకు తమ జీవన సమస్యల చర్యలకు కేంద్రం కావటం, చివరికి విజయ పతీక కూడా అక్కడే ఎగురవేయటం గ్రంథాలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా సాంస్కృతిక అణచివేతకు తార్కాణమైన నిజాం పాలనకు వ్యతిరేకంగా వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ ప్రజల సమైక్య సాంస్కృతిక ఉద్దీపనానికి ఈ నవలను ఒక సాధనంగా వాడారు.
సాహిత్యం సమాజ హితాన్ని కొలిచే ప్రజల మనిషి ప్రజల అభ్యున్నతిలో సాహిత్య సాంస్కృతిక పార్శ్వంతో పాటు, భూస్వామ్య దోపీడి నుంచి ప్రజల విముత్తం కావలసిన అంశాన్ని స్పష్టం చేసింది. కదిని పట్టి చంపమని భటులకాజ్ఞాపించాడు. అది తెలిసిన పిరదౌసి బాధలో మసీదు గోడ మీద ఒక పద్యం రాసి భార్య, కుమార్తెతో గజనీ పట్టణం వదిలిపెట్టి, తన స్వస్థలమైన తూసు పట్టణం చేరాడు. కొంతకాలానికి కనువిప్పు కలిగిన గజనీ మహమ్మదు మసీదు గోడమీద పిరదౌసి కవికి పంపాడు. కాని అప్పటికే దుర్భర దారిద్య్రంతో పిరదౌసి మరణించాడు. తన తండ్రిని కష్టపెట్టిన ధనాన్ని కూతురు స్వీకరించలేదు. గజనీ మహమ్మదు పశ్చాత్తాపంతో కని రుణం తీర్చుకోవడానికి తూసు పట్టణంలో ఒక సత్రశాల కట్టించాడు. కవికి కీర్తి, రాజుకు అపకీర్తి నిలిచిపోయాయి. ఎక్కడో పర్షియా దేశంలో ఎన్నడో జరిగిపోయిన ఈ కథా వస్తువును గ్రహించి తెలుగు పాఠములకు ఆత్మీయంగా చేసి, అద్భుతంగా కవిత్రీకరించగలిగాడు జాషువా.
పంచముడైన కవిగా సామాజిక నిరాదరణతో ఎంతో వేదన అనుభవించాడు జాషువా. అట్టడగు పేదరికాన్ని చవి చూశాడు. నిరుపేద అయిన పిరదౌసిదీ వేదనామయ జీవితమే. బహుశా ఈ సారూప్యమే ఆ కథావస్తువును గ్రహించేటట్లు చేసి ఉంటుంది. పిరదౌసి కావ్యం చదువుతుంటే పిరదౌసి జాషువా ఇద్దరు కలగలసిన ఒకే ఒక కవిస్వరూపం మన కళ్లముందు కదలాడుతుంది. పిరదౌసి వ్యక్తిత్వాన్ని ఆత్మీకరించుకున్నాడు జాషువా. నిజానికి వీరిద్దరి ఆత్మా ఒక్కటే.
ఇంక విషాదగీతములకే మిగిలెన్‌ రసహీనమై మషీ
పంకము నాకలమ్మున, న భాగ్యుడు నైతి వయ: పటుత్వమున్‌
గ్రుంకె, శరీరమం దలముకొన్నది వార్ధకభూత : మీనిరా
శాంకిత బాష్పముల్‌ ఫలములైనవి ముప్పది యేండ్ల సేవకున్‌
అని పిరదౌసి చేసిన ఆక్రోశం కేవలం పిరదౌసి దేనా? జాషువాది కూడా అనిపిస్తుంది. పిరదౌసి గజనీ మహమ్మదుకు రాసిన లేఖ సారాంశముతో కవిగా జాషువా పడిన వేదనా సారాంశమే అనిపిస్తుంది. అయితే పిరదౌసి దౌర్భగ్యానికి కేవలం గజనీ మహమ్మదే కారణమా అనే సందేహం తలెత్తక మానదు. కాసుకోపం కవిత్వాన్ని అమ్ముకోదలచని పిరదౌసి దురాశ కూడా కొంత వరకు కారణమే. అందుకే తమ కత్తికి మనుషుల్ని ఆహారంగా వేసే రాతి గుండె సుల్తానులపై తన కవితా సుధను చిందించిన పాపం తనకు తగలిందని పిరదౌసి తర్వాత గ్రహిస్తాడు.
స్వభావాన్ని బట్టి జాషువా హృదయ విధానమైన కవిత్వం. బుద్ది ప్రధానం కాదు. జాషువా జుఎశ్‌ీఱశీఅaశ్రీ జూశీవ్‌. మానవ భావవేశాల్ని అతను వ్యక్తీరించినంత మృదువుగా గాడంగా వ్యక్తీరించిన ఇతర ఆధునిక కవులు తక్కువ. అతని వ్యక్తిత్వం ఎంతో ఆర్ద్రంగా, ఆత్మీయంగా మన గుండె తలుపులు తెరచి లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ఉధృతాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కావ్యంలో పిరదౌసి వేదన జాషువా వేదనగా, అంతిమంగ మన వేదనగా పర్యవసిస్తుంది.
ఆలోచనకు హేతువు నివ్వటం జాషువాకి తెలుసు. భావానికి లోతు నివ్వటం తెలుసు. అభివ్యక్తిని ఉన్నతీకరించటం తెలుసు. పిరదౌసి గజనీ పట్టణం వదలివెళ్తూ మసీదు గోడ మీద రాసిన వాక్యాలు జాషువా మన గుండెలమీద రాసిన వాక్యాలే.
‘‘కృతియెక బెబ్బులింబలె శరీర పటుత్వము నాహరింప, శే
షితమగు నస్థిపంజరము జీవలంబున నూగూలాడగా
బ్రతికియుం జచ్చియున్న ముదివగ్గు మహమ్మదుగారి ఖడ్గదే
వతకు రుచించునా పరిభవ వ్యధ యింతట నంతరించునా ?
ముత్యముల కిక్కjైున సముద్రమునను
పెక్కుమారులు ముస్కలు వేసినాడ
భాగ్యహీనుండ, ముత్యమ్ము పడయునైతి
వనథి నిను మ్రింగ నోరు విచ్చినది తుదకు’’
గజనీ మహమ్మదు పిరదౌసికి చేసిన అన్యాయాన్ని కవి దురదృష్టాన్ని స్పురింపజేసే వాక్యాలివి. ఈ సందర్భంలో బహుశా ఇంతకంటే ధ్వని ప్రధానమైన వ్యక్తీకరణ ఎవరికి సాధ్యం కాదేమో.
పిరదౌసి తన భార్య కూతురుతో గజనీ పట్టణం వదలి అరణ్య మార్గంలో ప్రయాణించేటప్పుడు కవికి ప్రకృతిని వర్ణించే అవకాశం లభించింది. అయితే అక్కడ పై పై వర్ణనలు గాక జాషువా మనిషి ప్రకృతి – భగవంతుడు అనే త్రికానికి సంబంధించిన లోతైన తాత్విక పరిశీలన చేస్తాడు. పిరదౌసి మానసిక పరిణతికి అదెంతో అవసరం. చెలువమొప్ప పుడమి సృష్టించి, మాకిచ్చి, అనుభవింపుడనుచు ఆనతిచ్చ, నిలువనీడలేక నిల్చిన కలవాడు గా భగవంతుణ్ణి భావిస్తాడు. ప్రకృతి అంతా పరమేశ్వర కవనంగా ఊహిస్తాడు. ప్రకృతి అనంతత్వాన్ని మనిషి అశాశ్వతత్త్వాన్నీ వివేచిస్తాడు.
ఈ కావ్యంలో నాయకుడు కవి కనుక సందర్భాలకు కవి స్వభావాన్ని స్వీకరించే అవకాశం లభించింది జాషువాకి.
కవికి గన్న తల్లి గర్భంగు ధన్యంబు
కృతిని జెందువాడ మృతుడుగాడు
తమ్మి చూరికేలు కమ్మిని గలనేర్పు
కవి కలంబు నందు గలదు
దాటినపోయిన యుగముల నాటి చరిత
మరల పుట్టిండు కవియ సమర్ధుడగును
ఈ భావాలన్నీ గజనీ మహమ్మదు నోటి వెంట జాషువా పలికిస్తాడు. అపారమైన కావ్య ప్రపంచంలో కవే బ్రహ్మ అని ఆనందవర్ధనుడనే అలకారికుడన్నట్లు, అటువంటి భావాన్నే చెప్పాడు జాషువా. కవి సామర్థ్యం వల్లనే పిరదౌసి రచించిన షానామా కావ్యంలోగానీ, కాళిదాసు కావ్యం రఘవంశంలో గానీ గడిచిపోయిన యుగాలనాటి చరిత్ర దర్శించగలుగుతున్నాం. కవి ఏ పాత్రను చిత్రిస్తాడో ఆ పాత్రలో తదాతద్యం చెందాలి. అప్పుడే సజీవ పాత్ర చిత్రణ జరుగుతుంది. పరకాయ ప్రవేశం లాగా యిది పరాత్మ ప్రవేశమే అందుకే
వసుధ శాపింపగల సార్వభౌముడగును
ధీరుడగు, భిక్షుకుండగు, ధీనులడగును
దు:ఖతుండగు, నిత్యసంతోషి యగును
సత్కవి ధరింపకొని వేషములు గలనె
అన్నాడు జాషువా రచనాక్రమంలో కవి అనుభవించే ఆవేశ తీవ్రత. ఆలోచనా వ్యగ్రత అతని శారీరక మానసిక శక్తుల్ని ఎంతగానో హరించివేస్తాయి. ఈ రచనా భారం మోపిన వాడికే తెలుస్తుంది.
విద్యానేవ విజానాతి విద్యాజ్ఞాన పరిశ్రమవ్‌ు అని పెద్దలు చెప్పారు. కనుకనే ఒక్కొక్క పద్దియంబునకు నొక్కొక్క నెత్తురు బొట్టు మేనిలో తక్కువగా రచించితినని పిరదౌసి అంటాడు.
పద్య రచనా శిల్పం తెలిసిన పాత్రలో జాషువా ముందు వరుసలో ఉంటాడు. పద్యం రాయటమంటే, గురువు లఘువుజేసి కుంచించి కుంచించి, లఘువు గురువుజేసి లాగి లాగి’ గణాలు పూరించటం కాదు. యతి ప్రాసల దగ్గర పిల్లి మొగ్గులు వెయ్యటం కాదు. కవికి మాట యొక్క మూలశక్తి తెలియాలి. మాటకి రంగు, రుచి, వాసన ఉంటాయని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారన్నారు అని తెలియాలి. శబ్ధ సమన్వయం తెలియాలి. భావం శబ్దంలో ఒద్దికగా ఒదిగిపోయాలి. పద్యగమనము, రససంపదయును, స్వభావ శబలత పిరదౌసి కవిత్వంలో ఉన్నట్లు జాషువా చెపుతాడు. నిజానికి ఈ లక్షణాలన్నీ జాషువా కవిత్వంలోనూ ఉన్నాయి. ఉర్దూ మొదలైన ఇతర భాషా పదాలు కూడా జాషువా కవిత్వంలో అందంగా ఒదిగిపోతాయి. తెలుగు పద్య సౌందర్యం తెలుసుకోవాలంటే, జాషువా రచనలు తప్పకుండా చదవాలి.
గొప్ప కవులు తమ భాషని తామే సృష్టించుకొంటారు. భాషలో ఆ మాటలు ముందె ఉండొచ్చు. సృజనాత్మకగల కవి ఆ మాటలకి విశిష్టమైన అర్ధం స్థిరీకరిస్తాడు. వేర్వేరు మాటల్ని కలిపి ఆ సంబంధాల ద్వారా కొత్త కొత్త అర్ధాలు స్ఫురింపజేస్తాడు. ఆంగ్లంలో షేక్‌ స్పియర్‌ వంటి మహాకవులు ఈ పనే చేశారు. తెలుగులో తిక్కన, పింగళి సూరన మొదలైనవాళ్లు, జాషువా కవిత్వంలో అద్భుతమైన సృజనాత్మకత, భావనాశక్తి కనిపిస్తాయి. రచనలో ఒక తాజాదనం, నూతన కాంతి కన్పిస్తాయి. ఎంతో మంది కవులకు కోయిలకూత తెలుసుగాని, ముదురు కోయిల కంఠ నివాసము సేము కొసరింపుకూతల’ అర్ధమును గ్రహించినవాడు తనే. అలరి నురుగల్ని సముద్రపు పిల్లలుగా ఊహించగలిగినవాడతనే. ఉక్కుపుప్పొడి రాలు యుద్ధభూమి’ భావించగలిగినవాడు అతనే. నల్లని వాన మబ్బుల్ని గర్భిణీ మేఘాలన్నాడు జాషువా. ఆగడపు మబ్బు శయ్యల మీద ‘బుడత చంద్రుడు నిద్రపోతున్నాడ’ న్నాడు. సృష్టికర్త ‘విత్తనంబున మహా వృక్షంబు నిమిడిరచి సృష్టించి గారడీ’ చేసేవాడుగా కన్పించాడు జాషువాకి. అదే సృష్టికర్త ఆకాశపు కాగితం మీద తను రచించి లేఖను వేగుచుక్కతో నిలిపివేశాడట! ఇంత అద్భుతమైన ఊహశక్తి జాషువాది.
తెలుగు సాహిత్యంలో ఒకే ఒక్కడు జాషువా. ఆధునిక తెలుగు సాహిత్యానికి కవికుల గురువు జాషువా.
(అతిధి అధ్యాపకులు. తెలుగు శాఖ హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.