పరిపూర్ణత్తయ్య – మాధవి నంబూరి

ఆ పేరు వింటేనే నా చిన్నతనంలో గుర్తుకు వచ్చే విషయం అత్తయ్య క్రమశిక్షణ! అత్తయ్య అంటే క్రమశిక్షణ! ఆ తరువాతే ఏమయినా… మా అమ్మ మమ్మల్ని ముందే హడలుగొట్టేది, ‘మీ పూర్ణత్తయ్య పెద్ద ఆఫీసర్‌, చాలా స్ట్రిక్ట్‌’ అని. ఇహ దానితో అత్తయ్య ఇంటికి వస్తుందంటే చాలు మా భాష, ప్రవర్తన చక్కగా ఉండేలా జాగ్రత్త పడేవాళ్ళం. అత్తయ్య వస్తూనే మమ్మల్ని ప్రేమగా దగ్గరకు తీసుకునేది,

నన్నయితే మరీనూ. దానికి కారణం లేకపోలేదు. వాళ్ళమ్మ పేరు లాలమ్మ. లాలమ్మంటే నాన్నమ్మ. నా పేరు మాధవి అయినప్పటికీ మా నాన్న నన్ను ‘లాలి తల్లీ’ అని ప్రేమగా పిలిచేవారు. మా రక్తసంబంధీకులందరికీ నేను లాలమ్మను అయిపోయాను. పూర్ణత్తయ్యకు మరింక చెప్పాలా! అందుకే నేనంటే అంత మురిపం. అయినా మా ఉచ్ఛారణలో ఒక్క అక్షరం దోషం ఉన్నా ఊరుకునేది కాదు. ఆ పదాన్ని ఎలా ఉచ్ఛరించాలో పట్టుబట్టి మరీ నేర్పించేది. మా మాటలో కాకినాడ యాస ఉంటే ఊరుకునేది కాదు. మాకు చక్కటి భాష, మంచి ఉచ్ఛారణ రావడానికి అత్తయ్య కూడా ఒక కారణం అని నేను భావిస్తాను.
నేను, సతీష్‌ పుట్టిన తర్వాత నాన్న, అత్తయ్య చేస్తున్న ఉద్యోగాల కారణంగా బహుదూరాలలో నివాసాలు ఉండడం వల్ల పూర్ణత్తయ్యతో ఎక్కువగా గడిపిన సందర్భాలు తక్కువనే చెప్పాలి. నాన్న తరచూ అత్తయ్య దగ్గరకు వెళ్ళివస్తుండేవారు. పూర్ణత్తయ్యకు, నాన్నకు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమానుబంధాల గురించి నాన్న ఎప్పుడూ చాలా గొప్పగా చెబుతూ ఉండేవారు. నాన్న మాకు చిన్నతనంలో చెప్పే కథలలో… పూర్ణత్తయ్య దగ్గరకు రైలు ఎక్కి వెళ్ళేటప్పుడు… అని మొదలుపెట్టి, ప్రతి స్టేషన్లోనూ రైలు ఆగినప్పుడు బోగీల దగ్గరకొచ్చి అమ్మే మిఠాయిలు, వాటి రుచుల గురించి చెప్పే కథ మాకు చెప్పలేనంత ఇష్టం. పూర్ణత్తయ్య కథ చెప్పు నాన్నా అని ప్రాణాలు తోడేసేవాళ్ళము సతీష్‌, నేను. మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఆ కథ. అత్తయ్య కాకినాడకు అప్పుడప్పుడూ వచ్చేది. ఎప్పటిలానే రాత్రంతా ‘గానాబజానా’
ఉండేది. నాన్న హార్మోనియం వేసుకొని కూర్చుంటే అత్తయ్య భానుమతి గారి పాటలు, అంతకంటే పాతవి, మాకు తెలియని పాటలు అద్భుతంగా పాడేది. కళ్ళు మూతలు పడిపోతున్నా వెళ్ళి పడుకునేవాళ్ళం కాదు. అంత శ్రావ్యమైన కంఠం మా పూర్ణత్తయ్యది. వినేకొద్దీ వినాలనిపించేలా… ఇప్పటికీ అదే శ్రావ్యత, అంతే మాధుర్యం.
అత్తయ్య ఉన్నప్పుడు నాన్న ఫ్రెండ్స్‌, ఇంకా అత్తయ్య ఫ్రెండ్స్‌తో చిన్నపాటి మీటింగులే జరుగుతుండేవి మా ఇంట్లో. Communism, socialism, capitalism, socio-political-econimic conditions ఇంకా అనేక చారిత్రక విషయాలు, ప్రపంచ దేశాల ఆర్థిక, రాజకీయ సంబంధాలు… ఒకటేమిటి? పెద్ద చర్చాగోష్ఠులే సాగుతుండేవి. ఇవన్నీ ఏదో ఒక మూలనున్న చెక్కపెట్టె మీదో, గడప ప్రక్కగానో కూర్చొని చాలా శ్రద్ధగా వినేదాన్ని. ఎంతో ఇష్టంగా ఉండేది అలా వినడం. నాకు చాలా జ్ఞానం వచ్చేసినట్లు, ప్రపంచ విషయాలన్నీ తెలిసిపోయినట్లు తెగ సంబరపడేదాన్ని. పూర్ణత్తయ్య కాకినాడలో చదువుకొన్నప్పుడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌కి లీడర్‌గా ఉండేదట. అప్పుడు జరిగిన కార్యక్రమాలలో తను ఎంతో చురుకుగా, సమర్ధవంతంగా, నిబద్ధతతో పనిచేసి, పోరాటాలలో ధైర్యంగా ముందు నిలబడి ఒకరోజు జైలుకి కూడా వెళ్ళివచ్చిందట పెదనాన్నల్లా! వారయితే స్వాతంత్య్ర సమరయోధులుగా, ఏళ్ళ తరబడి జైళ్ళలో ఉన్నారనుకోండి. అప్పటి పోరాట కార్యక్రమాల సాహచర్యం వల్ల కాబోలు అత్తయ్య కాకినాడ వచ్చినప్పుడల్లా ఐడియల్‌ కాలేజీ కరస్పాండెంట్‌ చిరంజీవిని కుమారిగారు, వారి భర్త శర్మ గారు లాంటి పెద్దపెద్ద వాళ్ళని కలిసి వస్తుండేది. ఇకపోతే అమ్మకు, అత్తయ్యకు కూడా మంచి సంబంధాలే ఉండేవి. అమ్మకు అత్తయ్య అంటే గౌరవం, ప్రేమ, కాస్త భయం కూడా ఉండేదేమో?! అత్తయ్యను చాలా మర్యాదగా చూసేది. నాన్న కూరలు తేవడం, అమ్మ రుచిగా వండిపెడితే, ‘బాగున్నాయిరా తాయారు’ అంటూ అత్తయ్య చాలా ఇష్టంగా తినడం గుర్తు. ఎందుకంటే అమ్మ చేపలు, రొయ్యలు, నాటుకోడి లాంటి నాన్‌వెజ్‌ ఐటమ్స్‌ చేయడంలో అందెవేసిన చెయ్యి. అత్తయ్య ఉన్న రెండు, మూడు రోజులు, ‘అక్కయ్యా, అక్కయ్యా’ అంటూ నాన్న తన వెనకాలే తిరిగేవారు. చాలా ఆనందంగా గడిచేవి ఆ రోజులు!
అక్కలందరికీ నాన్న ముద్దుల తమ్ముడే అయినా, నాన్నది, పూర్ణత్తయ్యది ప్రత్యేకమైన అనుబంధం. మేము ఎదిగేకొద్దీ అర్థం చేసుకొన్నాము, వారిద్దరిదీ విడదీయరాని ప్రేమానురాగం అని, ఒకరి జీవితం మీద ఇంకొకరి ప్రభావం కూడా ఎక్కువేనని. ఆ విధంగా మాకు పూర్ణత్తయ్య మీద ప్రేమ ఇంకా ఎక్కువయ్యిందని చెప్పొచ్చు. అత్తయ్య జీవితంలో నాన్నది కూడా పెద్ద పాత్రే అనిపిస్తుంది. ఆమె కష్టంలో, సుఖంలో అడుగడుగునా నాన్న, అత్తయ్య వెన్నుదన్నుగా ఉన్నారు. అత్తయ్య కూడా అంతే. ఇవి విన్నప్పుడు చాలా ఆనందంగాను, తృప్తిగాను ఉండేది మాకు. పరిపూర్ణత్తయ్యది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. నాన్నమ్మ, తాతయ్యల నుండి సంక్రమించిన ధైర్యం, సాహసం, వితరణ ఇవన్నీ ఒక ఎత్తయితే, పరిస్థితులకు ఎదురొడ్డి ధైర్యంగా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ముందుడుగు వేయడం, అనుకున్నది సాధించడం అత్తయ్యకే సాధ్యం అనిపిస్తుంది. ఈ క్వాలిటీస్‌ అన్నీ అత్తయ్యను మంచి లీడర్‌గా నిలబెట్టాయని నా ఉద్దేశ్యం. మహిళా సాధికారత, స్త్రీ స్వేచ్ఛ, స్వాభిమానాల పట్ల నిర్దిష్టమయిన అభిప్రాయాలు ఉండేవి మా అత్తయ్యకు. ఇలా అత్తయ్య చాలా జనరేషన్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. తన నుండి నేర్చుకోవలసి విషయాలు ఎన్నో ఉన్నాయి, ఉంటాయి.
పూర్ణత్తయ్య అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ మేనకోడళ్ళందరికీ స్పెషల్‌! ఎందుకంటే, తన మాట, భాష, ఆలోచనలు, ఆశయాలు, విలువలు, మరీ ముఖ్యంగా ఆమె గాత్రం… ఆ మృదుమధుర గాత్రమే చిన్నతనంలోనే తను భక్తప్రహ్లాద టైటిల్‌ రోల్‌ పోషించడానికి కారణమయింది. ఆ పాత్రను అద్భుతంగా పోషించిన ఘనత మా అత్తయ్యదని తెలిసిన తర్వాత అత్తయ్యకు మేము అడ్మైరర్స్‌గా మారిపోయాము. మేము కాస్తయినా బాగా పాడగలుగుతున్నామంటే, వ్రాయగలుగుతున్నామంటే, సభలలో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామంటే మా పూర్ణత్తయ్య లక్షణాలు కొద్దో, గొప్పో మాకు వచ్చాయని తెగ సంబరపడిపోతుంటాము. ఏ సందర్భం వచ్చినా ఆ విషయాన్ని సగర్వంగా చాటుతూనే ఉంటాము, మా అత్తయ్య ఫలానా, మా పూర్ణత్తయ్యది ఘన చరిత్ర అని. మా పెదనాన్నలిద్దరివీ (దూర్వాస మహర్షి, శ్రీనివాసరావు) ఘనమైన చరిత్రలే. ఒకరు మహాకవి, మరొకరు ప్రజాప్రతినిధి. వారి ప్రభావం కూడా మా అత్తయ్య మీద ఎక్కువే. నిజంగానే మేం నంబూరి వంశంలో పుట్టడమూ, తాత, నాయనమ్మ, పెదనాన్నలు, మేనత్తల పోలికలు కాస్తో కూస్తో రావడం వల్ల జనార్ధనరావు గారి సంతానమయిన మేమంతా, ఎక్కడున్నా మా ప్రత్యేకతను నిలుపుకుంటూ కాస్త విలక్షణంగానే గుర్తించబడుతున్నామని చెప్పడానికి గర్వపడతాను!
తాతయ్య, నాన్నమ్మలకు దేశభక్తి మెండు. అందువల్ల పూర్ణత్తయ్యలో కూడా దేశభక్తి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ వంటి లక్షణాలు ఎక్కువే. అత్తయ్యది va’st knowledge విషయాలను అర్థం చేసుకోవడంలో, విపులీకరించడంలో తనకు తానే సాటి! అత్తయ్య సూక్ష్మగ్రాహి. అనేక సబ్జక్టులలో commandable knowledge ఉంటుంది అత్తయ్యకు. పూర్ణత్తయ్య ఒకsuccessful motherఎశ్‌ీష్ట్రవతీ అనడానికి శిరీష వదిన, అమరేంద్ర బావ, శైలేంద్ర బావలే పవర్‌ best examples.. ఆ ముగ్గురు వారి జీవితాలలో క్రమశిక్షణ, విలువలతోనే ముందుకు నడుస్తున్నారు. హ్యాట్సాఫ్‌ అత్తయ్యా.Poornattayya is pride of Namburi family.. సార్థక నామధేయి అయిన పరిపూర్ణత్తయ్య జీవితం నిజంగా పరిపూర్ణమే…She is a living legend.
ప్రేమతో…. లాలి

Share
This entry was posted in ప్రత్యక సంచిక - నంబూరి పరిపూర్ణ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.