స్వప్న రాగాలతో నిశ్శబ్ద సంగీతం – వసంత

ప్రియ మిత్రమా,
మనం కలిసి జీవించడానికి ఈ మార్చి 2కి 30 ఏళ్లు పూర్తయ్యాయి. నీకు గుర్తుందో లేదో కానీ నీవు అదే రోజు ఫోన్‌ చేసి మాతో మాట్లాడేవు. గుర్తు చేసే సందర్భంలో నేను లేను, గుర్తించే స్థితిలో నువ్వు లేవు. రాజ్యం కర్కశత్వానికి అంతమంటూ లేదు.

ప్రాణాలు నిలబెట్టుకునే పోరాటంలో పెళ్లి రోజు, పుట్టిన రోజు తలచుకునే, పంచుకునే సందర్భాలు శూన్యం. రాజ్యం దయతలచి ఇచ్చిన ఆ కొన్ని క్షణాల్లో ఎంతో పంచుకోవాలనే ఆరాటం నీకూ, నాకూ. ఎన్నో విషయాలు పెదవి దాటక ముందే ముగిసిపోయే ఫోన్‌ కాల్‌.
ఈనాడు నిర్బంధ నీడలో, భారమైన హృదయంతో, రాయలేని నిస్సహాయతతో, ఛిద్రమైన మనస్సును కూడగట్టుకుని నీకు ఈ లేఖ రాస్తున్నాను. సాయీ, నీకు గుర్తుందా?! మనం పదో తరగతి ట్యూషన్‌లో మొదటిసారి కలిసినప్పుడు నీకు రాని లెక్కల సబ్జెక్ట్‌లో లెక్కలు ఎలా చేయాలో నేను నేర్పించాను. నీవు నాకు ఇంగ్లీష్‌ గ్రామర్‌ చెప్పేవాడివి. ఆ తర్వాత పుస్తక పఠనం, సాహిత్యమే మన స్నేహాన్ని స్థిరపరిచాయి. మన చిన్నతనం నుంచి ఒకరికొకరం చూసుకోకుండా నాలుగు రోజులు దూరంగా ఉండడం ఎంతో కష్టంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఏళ్లకు ఏళ్లు దూరంగా, ఎల్లలు లేని దూరంతో జీవించాల్సి వస్తుంది. అది ఒక తప్పుడు కేసులో మే 9, 2014న అరెస్ట్‌ వల్ల, మార్చి 7, 2017 జీవిత ఖైదు శిక్ష ఖరారు చేసిన గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు తీర్పు వల్ల. ఆ తీర్పులో న్యాయమే లేదు. డిఫెన్స్‌ ఆర్గ్యుమెంట్స్‌ పరిగణనలోకి తీసుకోనేలేదు. ఈ అన్యాయానికి అంతం లేదు.
నన్ను చాలా మంది నిన్నే జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నావని ఇప్పటికీ అడుగుతూనే ఉన్నారు. అలా అడుగుతున్న అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఈ పితృస్వామిక సమాజంలో స్త్రీలను అణచివేస్తూ ఎప్పుడూ రెండో స్థానమే ఇచ్చారు. కానీ నువ్వు ఎప్పుడూ స్త్రీలకు సమాన హక్కులు ఉండాలనీ, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి అనే వాడివి. సమాజ పురోగమనంలో స్త్రీల భాగస్వామ్యానికి ఎంతో విలువైన స్థానం ఉందని చెప్తూ స్త్రీలను ఎంతో గౌరవించే వాడివి, ప్రోత్సహించే వాడివి. అందుకే నేను నీ సాహచర్యం జీవితాంతం ఉండాలని కోరుకున్నాను. చాలామంది మన ప్రేమని ‘నిజమైన స్వచ్ఛమైన’ ప్రేమకు గొప్ప ఉదాహరణ అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. స్వేచ్ఛగా, హాయిగా, ఉల్లాసంగా మనం ప్రేమను పంచుకున్నాం. అలాగే మన చుట్టూ వున్న ఎంతో మందితో ఆత్మీయ అనురాగాలను, స్నేహాన్ని, ప్రేమను పంచుకున్నాం. కానీ ఇప్పుడు రోజులు ఎంత గడ్డుగా నడుస్తున్నాయి అంటే %-% ప్రేమ అనే పదం నేర జాబితాలో చేరిపోయింది. ప్రేమ జంటలను తన్ని తరిమి బోనుల్లో పెడుతోంది ఒక వర్గం. ద్వేషం ఎటు చూసినా విషకోరలు చాస్తూ హింసను ప్రేరేపిస్తున్నది.
సాయీ, నీవు దివ్యాంగుల కొరకు, ముఖ్యంగా అకాడెమిక్‌ రీసర్చ్‌ వర్క్‌కి అనుకూలంగా ఉంటుందని ఎన్నో ఆశలతో దేశ రాజధాని ఢల్లీిలో అడుగుపెట్టావు. ఢల్లీి విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి కొరకు, ఉద్యోగం కొరకు నీ ప్రయత్నాలు కొనసాగాయి. నిజానికి ఢల్లీిలో విపరీతమైన ఎండ, చలి వాతావరణం నీ శరీరానికి సరిపడనివి. నువ్వు నడుము నొప్పి, కాళ్ళలో నరాలు మెలితిరగడం వలన ఎంతో బాధను భరిస్తూ వుంటావు. అయినా నీ జిజ్ఞాస నిన్ను ఇవన్నీ తట్టుకునేలా చేసింది. నీ ప్రయత్నాలు ఫలించి 2003లో రామ్‌లాల్‌ ఆనంద్‌ కాలేజ్‌, ఢల్లీి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఇంగ్లీష్‌ విభాగంలో జాయిన్‌ అయ్యావు. టీచింగ్‌ పట్ల, ప్రొఫెషన్‌ పట్ల నీ అంకితభావం, నిబద్ధత నిన్ను ఒక మంచి గురువుగా విద్యార్థుల మనసులలో సుస్థిరపరచింది. తోటి అధ్యాపకులలో కూడా గౌరవ స్థానం పొందావు. మంచి స్కాలర్‌గా మెప్పు పొందావు. అలాంటి నిన్ను డిసిప్లినరీ ఏక్షన్‌ క్రింద 2021లో నీ వృత్తికి దూరం చేశారు. నీవు ఎంతగానో ప్రేమించే నీ టీచింగ్‌ ప్రొఫెషన్‌ నుండి నిన్ను తీసేసారు. అదీ ఒక తప్పుడు ఆరోపణ, అబద్ధపు తీర్పు వలన. నాకు తెలుసు, ఈ వార్త నీవు తట్టుకోలేనిది.
జైలు క్లిష్ట పరిస్థితులు నీకు 19 రకాల తీవ్ర అనారోగ్య సమస్యల్ని జత చేసింది. అసలే నడవలేని నీవు, చేతులు కూడా చచ్చుపడిన స్థితిలో, జైలులో కనీసం టాయిలెట్‌కి వెళ్లలేని పరిస్థితిలో వున్నావు. నిరంతరం ఇద్దరు మనుషుల సహాయంతో జీవనం సాగించాల్సిన కఠినమైన కారాగార శిక్ష ఇది. అత్తమ్మ లింఫాటిక్‌ కాన్సర్‌తో, అనారోగ్యంగా చివరి దశలో వున్నప్పుడు, ఆమె చివరి కోరికగా నిన్ను చూడాలని ఎంతో తపన పడిరది. అప్పుడు పెట్టుకున్న పెరోల్‌కి అనుమతి ఇవ్వలేదు. చివరికి నిన్ను ఎంతో ప్రేమతో, అపురూపంగా పెంచిన అమ్మ చనిపోయినప్పుడు కూడా నీకు పెరోల్‌ ఇవ్వలేదు. నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు. దిగజారుతున్న నీ ఆరోగ్య పరిస్థితిపై మెడికల్‌ గ్రౌండ్స్‌లో వేసిన బెయిల్‌ కూడా తిరస్కరించారు. మాఫియా గూండాలకి, అధికార పార్టీ నాయకులకి, హంతకులకి మాత్రం చాలా సునాయాసంగా బెయిల్‌ దొరుకుతుంది. సాక్ష్యాధారాలతో పట్టుబడినా, ట్రయల్‌ కోర్టులో గర్వంగా నేరం అంగీకరించిన వారు సైతం అధికారపు కార్పెట్‌పై నడుచుకుంటూ, జైలు గోడలను సునాయాసంగా దాటి వచ్చేస్తారు. ఆ తరువాత ఎలక్షన్‌ లో పాల్గొని పార్లమెంటులో తిష్ట వేస్తారు. అంతేకాదు ఆ కేసులన్నీ కూడా కొట్టివేయడం జరుగుతుంది. కానీ 90 శాతం డిసెబిలిటీతో వీల్‌ చైర్‌లో వుండే, రెండు చేతులు కూడా పని చేయలేని, స్వయంగా టాయిలెట్‌ గదికి కూడా వెళ్ళలేని, స్నానం చేయలేని, తిండి తినలేని, తనకు తానుగా మంచంపై పడుకోలేని, లేవలేని పరిస్థితుల్లో వున్న ఒక ప్రొఫెసర్‌కి మాత్రం బెయిల్‌, పెరోల్‌ ఏదీ దొరకదు. యునైటెడ్‌ నేషన్స్‌ హ్యూమన్‌ రైట్స్‌ నుండి డిసెబిలిటీ రైట్స్‌ విభాగపు ప్రత్యేక ప్రతినిధులు మానవ హక్కుల కొరకై నీ అలుపెరుగని పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని, విషమిస్తున్న నీ ఆరోగ్య పరిస్థితికి స్పందించి నిన్ను వెంటనే విడుదల చేయాలని చాలాసార్లు ప్రకటనలు ఇచ్చారు. మెడికల్‌ గ్రౌండ్స్‌లో బెయిల్‌ ఇవ్వాలని భారత ప్రభుత్వానికి అప్పీలు చేసారు కూడా. అయినా ఎంతటి నిర్భంధం. నీపైనే ఎందుకు ఇంత కక్ష?
రాత్రి అందమైన కలలో నేను వీల్‌ చైర్‌లో వున్న నీ మెడ చుట్టూ చేతులు వేసి నా చెంపలు నీ మోముకు ఆనించి ఎన్నో సంగతులు చెపుతూ వుంటే నీవు చిరునవ్వుతో ఆలకిస్తున్నావంట. ఎంత ఆహ్లాదంగా ఉన్నది కదా ఈ కల! నీవు రచించే నవల చెపుతుంటే, నేను టైపు చేస్తున్నట్లు, నీ గుండెల్లో ఒరిగి గూడుకట్టుకున్న బాధను వూరడిస్తున్నట్లు, మన కూతురుతో లిటరరీ ఆర్గ్యుమెంట్స్‌ పెట్టుకున్నట్లు ఎన్నో ఊహలు. ఇలా మరెన్నో అనుభూతులు కలగా మిగలకుండా నేను చేసే పోరాటం కోసం వున్నంతలో నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో సుమా! ఈ నిర్బంధం త్వరలోనే తొలగిపోతుంది. నీవు నా దగ్గరకు చేరుకుంటావు.
ఈ మధ్య నువ్వు రాసిన ఉత్తరంలో ‘సరైన వైద్యం దొరకకపోవడం వల్ల రోజు రోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యంతో ఎంతకాలం బ్రతుకుతానో చెప్పలేనని, ఎప్పుడైనా స్టాన్‌ స్వామిలా ఆ వార్త మీరు వినాల్సి ఉంటుందేమో? మీరు ఏమైనా చేసి నన్ను బయటికి తీసుకురాకపోతే’ అన్నావు. ఆ మాటకి మనసంతా దుఃఖంతో సుడులు తిరుగుతూనే ఉంది. ఇది తలచుకున్నప్పుడల్లా, ఆ లెటర్‌ చదవాలి అనుకున్నప్పుడల్లా నా మనసు మెలిపెట్టినట్టు అవుతుంది. ఈ విషయం చెప్తే మిత్రులు కూడా ఎంతో బాధతో విలవిలలాడారు.
మనం ఎప్పటికీ ఒంటరి కాము. ఒకరికొకరం తోడుగా వున్నాము. ఇక ముందు కూడా వుంటాము. న్యాయ వ్యవస్థకే మచ్చ తెచ్చిన ఈ అన్యాయమైన తీర్పు మన మధ్య దూరాన్ని పెంచినా, మానసికంగా మనిద్దరం ఎప్పుడూ ఒకటే. నీ విడుదల కోసం, ప్రజాస్వామిక విలువల కోసం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం చేసే పోరాటంలో నేను ఒంటరిని కాను. మన నిస్వార్థ జీవితపు పోరాటాన్ని సమర్థించే మరెందరో మనకు తోడుగా ఉన్నారు. మరింత మందిని నీ విడుదలకై నేను చేస్తున్న న్యాయపోరాటంలో భాగమవ్వమని అభ్యర్థిస్తున్నాను. …..ప్రేమతో నీ – వసంత
(నాగపూర్‌ జైలులోని అండాసెల్‌లో ఉన్న ప్రొఫెసర్‌ జి. ఎన్‌. సాయిబాబాకు సహచరి వసంత కుమారి ఇటీవల రాసిన లేఖలోని కొన్ని భాగాల సంక్షిప్త రూపం ఇది) (ఆంధ్రజ్యోతి సౌజన్యంతో…)

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.