జీవన ప్రవాహం – జి.లక్ష్మీనరసయ్య

ఇవ్వాళ రాస్తున్న కవిత్వం పట్ల సీనియర్‌ కవులకు, లబ్ద ప్రతిష్టులైన పాత కవులకు చాలా మందికి చిన్నచూపుంది. దీనికి కారణం నేటి కవుల కవిత్వాన్ని వారు చదవకుండా వుండటమన్నా అయ్యుండాలి, లేక వారికి అలవాటైన పద్ధతిలో నిర్మితమైనదే కవిత్వం అనే దురభిప్రాయం అయినా అయ్యుండాలి.

ఏ తరానికి ఆ తరం నుడినీ నిర్మాణాన్నీ తమ సమయ సన్నివేశాలకనుగుణంగా తమ ప్రత్యేక స్వభావానికి అనుగుణంగా రూపొందించుకుంటుందని వీరు మరిచిపోతుంటారు.
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం(శ్రీ శ్రీ)
అని శ్రీశ్రీ రాసినట్లు.. ఈరోజు ఎవరూ రాయరు. వారలా రాయటం లేదని వారిని నిందించడం తప్పు. ఇంతకన్నా భిన్నంగా, ఒక రకంగా ఎఫెక్టివ్‌గా వ్యక్తం చేయగలుగుతున్నారు.
ఎటుజూడు కాడికింది ఎద్దుల కన్నీరు రాసే కవిత్వమే
మేకు చుట్టూ మొలుస్తున్న మేఘాల తడే
అని ఇంకా గాఢంగా అనుభవైక నిర్మితిగా కవిత్వాన్ని తీర్చి దిద్దుతున్నారు. ఈ వ్యక్తీకరణ కవిత్వం కాదని అనగలమా? శ్రీ శ్రీ వాక్యాల కంటే తక్కువ కవితా స్థాయిలో ఉందని అనగలమా? అనలేం. అందుకు భిన్నంగా ఉందని అనగలం. ఎక్కడ వచ్చిందా భిన్నత్వం. కవితా నుడి కారంలో, నిర్మాణ పద్ధతిలో వచ్చింది. మాటలూ పదాల నుంచి అనుభవాల ఆస్వాదన మీదికి దృష్టిని మళ్లించటంలో, వాక్యాల అల్లికలో వచ్చింది. ఈ దృష్టితో చూడగలిగినప్పుడే ఈనాటి కవిత్వపు ప్రాముఖ్యత, కవుల సమర్ధతా అర్ధమౌతాయ్‌.
మనుషులు బేసిగ్గా ఎవరికి వాళ్ళే రక్షకులనీ, ఎవరికి వాళ్ళే ప్రధాన ఆశ్రయమనీ, ఎవరి పోరాటాలు వాళ్ళు చేయాలనీ, ఎవరి తండ్లాటకు వారే క్రియ అని చెప్పటానికి
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరిచి నిదురపోకుమా అంటాడు శ్రీశ్రీ.
ఎవడూ వేటలు పట్టుకుని నడిపించడు
చిదుగులన్నీ పొగుచేసి పదాల్ని ముట్టించుకుని ప్రయాణమై పోవాల్సిందే తప్ప సైగలూ లేవు శబ్ద సంకేతాలూ లేవు చూపు కాలిదోవలే శరణ్యం నీ నెత్తుటి కాలి గుర్తుల అరణ్యమే శరణ్యం (శివారెడ్డి.కె) అంటాడు శివారెడ్డి.
ప్రతి రోజూ కొత్తగా రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరీ ఎగిరీ అలసిపోయి
ఒక్కసారి ఏదైనా చెట్టు కింద సేదతీరాలనిపించింది.
నా పిచ్చిగానీ మళ్లీ గుర్తొచ్చి నవ్వొచ్చింది
ఆ చెట్టూ నేనే అని (స్వేచ్ఛ)
అంటుంది పోయిన నెలే పుస్తకం దెచ్చిన స్వేచ్ఛ. ముగ్గురూ ఎవరికి వాళ్ళే శరణ్యం అనే ఆలోచననే కవిత్వీకరించారు.
ఇదే ఆలోచనని Nobody soothes you except yourself
అంటాడు words worth You are your best thing
అంటుందిToni morrison.
కవిత్వీకరణలోని భిన్నత్వం తత్సమయ సందర్భాలను బట్టీ కవుల వ్యక్తిగత టెంపెరమెంట్‌ని బట్టీ నేపద్యాన్ని బట్టీ, స్పందించే తీరుని బట్టీ వచ్చింది. శ్రీ శ్రీ కంటే శివారెడ్డి భిన్నంగా మరింత ఆధునికంగా కనిపించాడిక్కడ. ఈ ఇద్దరికీ ఏ మాత్రం తీసిపోకుండా చాలా శీతీఱస్త్రఱఅaశ్రీగా, సరికొత్త అల్లికతో భావాన్ని నిర్మించింది స్వేచ్ఛ.
నిద్రను గురించీ, నిద్ర పట్టకుండా చేస్తున్న గాయాల గురించి ఈమె కవిత్వం చేస్తున్న పద్ధతి చూడండి.
నిదురకిప్పుడు ఉనికి లేదు వాలిన దేహం మీద
పాలిపోయిన వెన్నెల ఇసుక నిండిన గొంతులో
పూడ్చిపెట్టిన కోయిల చూడలేని సమయాలను
గుండెల్లో కప్పేసి దూరపు నీడలకు ఉలికి పడుతూ
మన చీకటిలో రెప్పపాటు బాటసారి (స్వేచ్ఛ)
కొమ్ములు తిరిగిన కవులకు తీసిపోకుండా నిద్ర రాని వేదనను ఎంత అనుభూతిమయం చేసిందో చూడండి. విషయాన్ని కవిత్వీకరించటంలో ఒక అలవోకతనం ఎలా ప్రదర్శిస్తుందో గమనిస్తే ఆశ్చర్యం వేయక మానదు. మనం ఊహించని దృక్కోణం నుంచి స్పందించటంలోనే సగం కవితను రాస్తుందీ కవి. ఏడుపంటే బాధ మాత్రమే కాదు ఒక జీవన ప్రవహమనే ఆలోచనని కవిత్వాన్ని చేయటానికి ఇలా చిత్రిస్తుంది.
నడవలేనప్పుడు తనలో ఈదుకొమ్మంటుంది
ఈదలేనప్పుడు ప్రాణం తనలో దాచుకొని
దేహాన్ని దూరంగా విసిరేయమంటుంది
ఇలా దు:ఖాన్ని తోడుగా వర్ణించటంలో భావ పరిణతి మాత్రమే కాదు పోయేటిక్‌ maturityని వెల్లడిచేయగలిగింది. Emily Deckerson ఒకప్పుడు అన్నట్లుగా
After a great storm
A formal feeling comes (Emily Dickerson)
స్వేచ్ఛ కవిత్వంలో కూడా తుఫాను గుంజాటన తరువాత సంభవించే ఒక రిలీఫ్‌, ఒక ఈజ్‌తో కూడిన ఫీలింగ్‌ కనపడుతుంది. Dickerson లాగే అమూర్తాన్ని (abstract) మూర్తంగా (షశీఅషతీవ్‌వగా) భావాన్ని పరిమితికి గురిచేయకుండా, నిర్వచనాలకు దూరంగా నిర్మిస్తుంది.
ఇప్పుడే వస్తానుండు చెప్పి పక్కకెళ్లింది మేఘం
కొద్ది సేపటికి నేను కౌగిలించుకోవాలన్నంత గాఢంగా
దట్టంగా ఎదురొచ్చి నన్ను తాకగానే
వర్షమైపోయింది(స్వేచ్ఛ)
అన్నప్పుడు వర్షం కావటానికి మేఘం కారణమా, తనలోని తండ్లాట కారణమా స్పష్టం చేయకపోవటంలోని పరిమితిని గమనించండి. తన గురించి, తన సంబంధాల గురించీ, వాటినుంచి జనించిన రోదన, ఒంటరితనం, మధనం గురించే రాస్తున్నట్లు కనిపించినప్పటికీ తను జీవించే సమాజ పరిమితుల్ని చాలా సటిల్గా సంకేతిన్చటం ఈ కవి చేస్తున్న పని. అందుకే ఈమె కవిత్వాన్ని చదువుతుంటే Emily Dickerson కవిత్వం స్ఫురణకొస్తుంది.
ఏదో ఎదురు చూపులోని మాధుర్యాన్నీ, అందులోని అనిర్వచనీయ శక్తినీ ఈ కవి ఆస్వాదిస్తుంది. ఆ శక్తికి ఆశ్చర్యపోతుంది.
నువ్వస్తున్నవాని తెలిసి సూర్యుడివాల నీలి వర్ణాన్ని ఆకసానికివ్వలేదు
వాన మబ్బును తొడుక్కున్న సగం చందమామ కూడా ఎదురుచూస్తుంది
నీకోసం మట్టిపూల కొత్తగాలిని దోసిట్లో పట్టుకుని ఎదురుచూస్తున్నా(స్వేచ్ఛ)
అని ఈకవి పలికినప్పుడు Emily Dickerson వ్యక్తం చేసిన నిరీక్షణ తాలూకు దిటవుతనం జ్ఞాపకం వస్తుంది.
What fortitude the soul contains That it can so endure
The accent of a coming foot The opening of a door (Emily Dickenson)
ఇలా ఒక గొప్ప కవి కవిత్వంతో పోలికకు స్వేచ్ఛ కవిత్వం నిలబడగలిగింది. మరణాన్ని గురించి మాట్లాడుతూ ఎమిలీ డికిన్సన్‌ ఏమంటుందో చూడండి.
Because I cannot stop for death He kindly stopped for me
The carriage held but just ourselves (Emily Dickenson)
మరణాన్ని ఇంతే పాజిటివ్‌గా చూస్తూ స్వేచ్ఛ మరింత చిక్కగా intenseగా రాసింది.
కాలమే మరణమైనప్పుడు మరణంలో జీవించడం
స్తంభించిన గాలిని పీల్చే ప్రయత్నం సఫలమా విఫలమా అనే ప్రశ్నలేదు
అలసిపోయి ఆగిపోయిన గుండె ఒక్కసారి నిన్ను చూసి
మరోసారి ఆఖరిగా స్పందించి మరణంలో విస్పోటనానికి
శక్తిని కూడదీసుకుంటుంది.(స్వేచ్ఛ)
మరొక చోట ‘ మరణాన్ని పూర్తిగా పట్టుకోడానికి / ఇంకాస్త మరణం కావాలి’ అని ఒక విరోధాభాసను ప్రయోగిస్తుంది.
ఓ సరస్సూ నీటిని వదిలిపో
నా బరువంతా అవిరిచేసుకుపో
మనసుకూ తడికీ తెగదెంపులు చేసి(స్వేచ్ఛ)
గాఢమైన భావాన్ని ఎంత సింపుల్గా కవిత్వీకరించిందో చూపటానికే ఈ ఉదాహరణలు.

Share
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.