మోయడం కష్టం! – భండారు విజయ

ఒక చల్లని మాట
కురిపించిన ఆనందం
ఒక వాన చుక్కలా
హృదయాన్ని మురిపిస్తుంది

ఒక మంచి మాట
ఎంతటి చలిలోనైనా
వేడిని రగిలిస్తుంది
ఒక చక్కటి పొగడ్త
కొన్ని వేల సంవత్సరాలు
ఆమెను ఉత్సహపరుస్తుంది
ఒక వెగటు నింద
గుండెను పిండి, పిసికి
ఒంటరిని చేస్తుంది
ఒక చిన్న అపవాదు
ఆమె హృదయాల్ని
భగ్నం చేస్తు ఓడిస్తాయి
ఒక చిన్న ఊరటతో
ఆమె కోలుకుంటుంది
మనమేది ఎట్లాగూ చేయలేం
మనం చేసేదంతా నిందాస్తుతే!
ఇప్పటివరకు మనం చేసింది
చేయగలిగింది చేసింది చాలు
మనకు మాత్రమే తెల్సినవి
వాంతి చేసుకుందీ చాలు
ఆమెను ఆమెగా
బతకనీయండి
ఆమెను ఆమెగానే
చనిపోనీయండి …
మనం తీర్పులు ఇస్తే
వినడానికి ఏం బాగాలేదు
మన ముఖం మళ్ళీ మనం
చూసుకున్నట్లుగానే వుంటుంది
ముసుగుల్లో బతికేవారు కూడా
నీతులు వల్లించడం
బ్రమలను జయించలేని వారు
కూడా నిందా స్తుతి చేయడం
ఏమాసించి చేస్తున్నారో గానీ…
అవకాశవాదులు, పరనిందాశూరులు
ఈ లోకంలో కోకొల్లలు బయటకొచ్చి
నినదించింది కంపు వాసనేస్తోంది
మనిషి పోకముందు
అపహాస్యం చేసిన మనమే..
మనిషి పోయాక మాత్రం
మరికొన్ని ఊత పదాలు చేర్చి
నివాళులు అర్పిస్తుంటాం !
దీపం పెట్టడానికి దీపావళే
అక్కరలేదు
దేదీప్యంగా వెలగడానికి
ఆమెకు ఆమెను లొంగనివ్వని
ఆంతర్య మొహావేదనే చాలు!
ఆమె ఏంటో తెలుసుకోవడానికి
ఆమె ఎవరో తెలుసుకోవడానికి…
భగ్నప్రేమికులకెప్పుడూ
మిగిలింది మరణ శాసనమే!
పీలికలు ఎన్ని చేసి కుట్టినా
అది అతుకుల
బొంతే అవుతుంది
పగిలిన హృదయాలను
మనమిప్పుడు ఇంకా
పగులకొడుతున్నాం చూడండి
అచ్చం అలాగే..!
తనలో జీవించిన ఆమెను
ప్రకృతే తన హృదయంతో హత్తుకుంది
మీ మాటల తుటాలిప్పుడు
ఆమెను తాకి ఇక గాయపరచలేవు…!

Share
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.