స్వేచ్ఛగా..- లెల్లే సురేష్‌

ఇన్ని మౌనాల మధ్య నా శబ్దం వినిపించదు
ఈ వేడుకల్లో నా నీడ అడుగుపెట్టదు
ఈ పల్లకీలలో నా మనసు కూర్చోదు

నేను మబ్బుల్ని మోసుకుంటూ కన్నీళ్ళతో ఈ నేలను తడిపాను
నిన్న, మొన్న, అటు మొన్న
ఈ కాలమంతా నేను బయటనే నిల్చున్నాను
సముద్రం ఉప్పేసినా
ఆకాశం ఉమ్మేసినా
అడవి పూతను ఆప్యాయంగా ముద్దాడాను

అర్ధరాత్రి పక్షులు నా నవ్వులతో కలిసి పాడుతుంటే
ప్రకృతి నా పేరు మీద నిలబడి పతంగులు ఎగరేసేది
ఒక కంట్లో పగటిని, మరో కంట్లో చీకటిని ప్రేమిస్తూ నా రెండు కళ్ళు తెరుచుకునేవి
నా నడకను, నా నడతను ముద్దాడి నా పెదవులు అడుగులు వేసేవి
వంటితనం భలే తుంటరిది
అది నా వంటరితనాన్ని ఆట పట్టించేది
ఆ ఆటలో నా దుఃఖం అనేక సార్లు బంధీ అయ్యేది

తడిగా మొలకెత్తిన మనిషి మట్టివాసన వేయాలి కదా
ఈ నేల నెమలిగా మారాలి కదా

మనసులో పింఛాల్నిమూట కట్టి నక్షత్రాలకి పంపించాను
ఇప్పుడు నేనే నా తోడు, నేనే నా నీడ
ఇప్పుడైనా నన్ను నేను ప్రేమించుకోవాలి కదా
ఇప్పుడూ ఎప్పుడూ నా శ్వాస నాదే కదా
నా శ్వాసలో నేను వెచ్చగా కలిసిపోతాను
పక్షిలా పాడుకుంటూ స్వేచ్చగా ఎగిరిపోతాను

Share
This entry was posted in స్వేచ్చ స్మరణలో. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.