ఒంటరి మేఘం కన్నీటి గానం – మందరపు హైమవతి

దుఃఖం దుఃఖం. . ఎడతెరిపిలేని దుఃఖం. ఈ విశాల విశ్వంలో గాలి కూడా తోడులేని భయంకరమైన ఒంటరితనం. మనసు లోలోపలి పొరలను కరిగించే గాఢ ప్రేమ. వీటన్నిటి కలయికే స్వేచ్ఛ కవిత్వం.

ఊహల ఊరేగింపులో కదిలిపోయే కొత్తకొత్త పద చిత్రాలు, అపురూపమైన భావుకత, పొదుపుగా పేర్చిన మాటలు, విభిన్న భావోద్వేగాల, పరిమళాల తుఫాన్‌ ‘‘మట్టిపూల గాలి’’.
ఈ సంపుటిలోని కవితలన్నీ వ్యక్తిగతంగా కనిపిస్తాయి పైకి. కానీ దుఖిత జీవుల కలలన్నీ, బతుకువెతల గీతాలన్నీ సామూహికమే కదా! దుఃఖం రంగు పూసుకున్న కవితలన్నీ మనసును కుదిపివేస్తాయి. ఈ సంపుటిలోని కవితలలో ఎక్కువ భాగం దుఃఖ కవితలే.
‘‘దు:ఖానికి అంతులేదు/ ఎడతెరపిలేని వానలా/ ముసురుకుంది వెన్నులో/ ఒణుకై మొలకెత్తింది అయినా ఎంత దుఃఖాన్నైనా దాన్ని జయించినదాన్ని / దుఃఖమూ నాలాంటిదే / ఒంటరిగానైనా ముందుకే పయనిస్తుంది’’ అని ‘‘దుఖిత’’లో తన ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాంటిదే మరో కవిత ’’దుఃఖపు తోడు’’ మామూలుగా మనకి ఎవరో ఒకరు తోడుగా వుంటారు. తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు , భర్తకు భార్యో, భార్యకు భర్తో అండగా వుంటారు. కానీ ఇక్కడ కవయిత్రికి దుఃఖమే తోడు. ఇక్కడ విషాదం పరాకాష్టకు చేరుకుంటుంది.’’ ఎలా వుండగలను ఏడవకుండా/ బతకడం అంటేనే ఏడవడం అయినప్పుడు / చచ్చిపోలేను కదా!‘‘ అంటుంది. తన జీవితానికి దు:ఖానికి గల అవినాభావ సంబంధాన్ని’’ ప్రేమో/ ద్వేషమో / ఇష్టమో /పగో / ఏదీ లేకుండా/ వుండడం కంటే/ ఏడుపై బతకడమే / నాకు చేతనైయ్యేది’’ అని తన నిస్సహాయతను తెలుపుతుంది.
మనిషి సంఘజీవి. కొన్ని కొన్ని సమయాల్లో ఒంటరిగా ఉండాలని అనుకుంటాడు. కానీ ఎప్పుడూ ఒంటరిగా జీవించలేడు. ఒంటరితనం ఏక్‌ తార మీటే విషాద రాగం. అంతులేని ఒంటరితనంతో బాధపడుతూ ఒంపిన అక్షరాలే ‘‘ఒంటరి దీపం’’ కవిత.’’ ‘‘గుండె ఒక్కటే వుంటుంది / కొట్టుకుంటేనే బతికేది / కుంగిపోని భూమేదో / చూసుకుని దిగలేను / అని తనను అతలాకుతలం చేసే ఒంటరితనాన్ని గురించి మాట్లాడుకోవడానికి /ఓ గోడ కావాలి / ఒంటిగా మాట్లాడుకునే / ముసలాయన లాగా / దీపం వెలిగించుకుంటా / నా కొత్త సమాధికి / అని తనలోని ఒంటరితనం తీవ్రతను బొమ్మ కట్టిస్తుంది.
జీవితంలో ప్రేమకు ఉన్న స్థానం గొప్పది. ‘‘ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును’’ అంటాడు ఒక కవి. ఒక్కసారైనా ప్రేమ సముద్రంలో మునగాలని ప్రతి ఒక్కడూ అనుకుంటాడు. అక్షరం రానివాడైనా ప్రేమలో పడినపుడు కాళిదాసు అవుతాడు. మాట్లాడడం చేతకానివాడైనా మాటల పూలమాలలు అల్లి ప్రేయసి మెడలో వేస్తాడు. ప్రేమలో వున్న గొప్పతనం అలాంటిది. ఈ సంపుటిలో అలాంటి ప్రేమ కవితలు ఎన్నో. అలాంటి ఒక కవిత ‘‘కౌగిలి’’ ‘‘ప్రియుని అద్భుతమైన కళ్ళను వర్ణిస్తూ / దట్టమైన అడవి లాంటి కొన్ని తెల్లని ఆకాశాలు / నీ కళ్ళల్లోంచి /’’ అని అరణ్యం లాంటి తెల్లని ఆకాశాలు ప్రతిఫలించే నేత్రాలను వర్ణిస్తుంది. ప్రియుని సమక్షంలో ప్రతిక్షణం ఆనందమే. నవ్వుల పండుగలే ‘‘నీలిరంగు శ్వాసల్లా / పొరలు పొరలుగా రెప్పలు వీచిన గాలిలో / నవ్వుల పరుగులు /’’ అని ఆ సంతోషానికి కవితా రూపం ఇస్తుంది. ఇక అతడి ముద్దు గురించి ‘‘పదేపదే వెనక్కి తిరుగుతూ / చూస్తూనే వుండిపోవాలని / అడుగులిటే పడుతుంటే / కౌగిలించుకున్నాయి పెదవులు /’’ అని రెండు అధరాల ఆశ్లేషాన్ని అద్భుతంగా చిత్రిస్తుంది.
స్వేచ్ఛ కవిత్వంలో అన్నీ కొత్త కొత్త పద చిత్రాలు ‘‘శ్వాస-2’’లో ‘‘చలికి నా గుండెల్లోకి వంగి / వెచ్చబడే నీ ముఖం చుట్టూ నా చేతులు అలానే వుంచేసా / తెల్లారిందిగా.. అడవి పిలుస్తుంది / కాస్త చలిని తీసుకుని వచ్చి /మళ్లీ వెచ్చబడదామా’’ అని తన ప్రేమను సరికొత్తగా నిర్వచిస్తుంది.
‘‘వాఖ్యం రసాత్మకం కావ్యం’’ అన్నారు. కవిత్వంతో కూడిన ఒక చిన్న వాఖ్యమైనా కావ్య గౌరవాన్ని పొందుతుంది అన్నారు. ప్రియునికి ప్రేయసి ఓ కొత్త విన్నపాన్ని చేస్తుంది. ‘‘ఈచేలన్నీ గుండెకద్దుకుంటే వస్తావా / ఆ మన్నుని మీద కప్పుకుంటే చూస్తావా / నీ కళ్ళు వెతికే లేగదూడనౌతా / ఇంటికి తీసుకెళ్ళు’’ అని ప్రియుణ్ణి వదలలేని వ్యామోహాన్ని అక్షరీకరిస్తుంది.
కేవలం ప్రేమ, ఒంటరితనం గురించే కాదు. మరణం గురించి కూడా విభిన్నమైన కవితలు వున్నాయి ఈ కవితా సంపుటిలో. ‘‘ఇంకాస్త మరణం కావాలి / వెంటాడుతున్న ఒంటరితనాన్ని సవాలు చేస్తూ / ఇంకాస్త మరణం కావాలి / మరణాన్ని పూర్తిగా పట్టుకోవడానికి / ఇంకాస్త .. మరణం కావాలి /’’. అంటుంది కవయిత్రి.
జీవితం విఫలం అయినప్పుడు కోరికలు తీరనప్పుడు బతుకే చావుడప్పుగా మారుతుంది. విరక్తి ఆవహిస్తుంది / ‘‘అలసిపోయి ఆగిపోయిన గుండె / ఒకసారి నిన్ను చూసి / మరోసారి ఆఖరిగా స్పందించి / మరణంలో విస్పోటనానికి / శక్తిని కూడదీసుకుంటుంది’’. అని ప్రియుడు స్పందించకపోతే జీవితం మరణ సద్రుశమౌతుందని చెబుతుంది.
ఈ సంపుటి అంతా ప్రవహించే దుఃఖగానం. ఒంటరితనం, కన్నీళ్లు, బాధ ఈ అక్షరాల నిండా అంతర్వాహినిలా ప్రవహిస్తాయి. అనంత దుఃఖగానం, మహా సున్నితమైన మనసుపై గాయాల కొరడా దెబ్బలు. వేదనలోంచే కవిత్వం వచ్చినట్లు మనసును చెమ్మగిల్ల చేసే వాక్యాల ప్రవాహం ‘‘మట్టిపూల గాలి’’.
కవయిత్రి తన ఒంటరితనానికి కానీ, దుఖానికి గానీ ఎవరినీ కారణం చేసి నిందించదు. ధైర్యంగా బతుకుతానని’’ నేను నా బిడ్డ / మనుషులు లేనిచోట / ప్రేమించుకుంటూ బతికేస్తాం’’ అని సాహసంగా ఆత్మవిశ్వాస పతాకాన్ని ఎగురవేస్తుంది. దుఃఖం వైయక్తికం కాదు. సమాజానికి చెందింది. ఈనాడు సమాజం సంక్లిష్టంగా, హింసాపూరితంగా మారిపోయింది. బయటకు వెళ్లిన పిల్లలు ఏ గాయాలు లేకుండా తిరిగి వస్తారా అని తల్లులు తల్లడిల్లిపోతున్నారు’’ ఎలా గుర్తుపట్టాలి ‘‘కవితలో ఆ సంక్షోభాన్ని’’ బిడ్డని తల్లి గుర్తుపట్టి తెచ్చుకోవాలి / ఒక బిడ్డకు రొమ్ములు కోసి వున్నాయి / కాళ్ళు చేతులు. ఆఖరికి జననాంగాలు / ఒంట్లో వున్న అవయవాలన్నీ / ఛిద్రమైపోయినాయి /ఓయమ్మో ఎట్ల గుర్తు పడతావే / అని ఆడపిల్లకు రక్షణ లేని ఈనాటి వ్యవస్థ గురించి తల్లడిల్లిన తల్లి గుండె కురిసిన కన్నీటి వాక్యాలివి.
ఈ సంపుటి చదివిన ప్రతి పాఠకుడు కవితలతో సహానుభూతి చెందుతాడు. కన్నీరై ప్రవహిస్తాడు. భావోద్వేగాల వరదౌతాడు.
ప్రేమ ఈత, పిట్టరెక్కల పిలగాడు, నిశ్శబ్దం కొక్కెం, గాలి గాయాలు, కుళ్ళిన రెప్పల శవాలు, ఒంటరి కన్నీళ్లు, కన్నీటి పూలు మొదలైన పద చిత్రాలు పరవశింప చేస్తాయి. కొత్తదనాల పరిమళాలతో స్వేచ్ఛ ‘‘మట్టిపూల గాలి’’ హృదయాలను చుట్టేస్తుంది.

Share
This entry was posted in స్వేచ్చ స్మరణలో. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.