మా సంతోషం మా వృత్తిలోనే వుంది.

డా|| జ్యోత్స్న , కన్సల్టెంట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ & ఆజూఊ:్పుఊ, డా|| మాధవిప్రసాద్‌ , ఈస్త్రఖ, ఆపరేషన్స్‌ డా|| కవిత, రేడియాలజి & న్యూక్లియర్‌ మెడిసిన్‌ క/ం ఈలిచీశి.
అపోలో హాస్పిటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు – భూమిక ప్రత్యేక సంచిక కోసం వారిని ఇంటర్వ్యూ చేసినపుడు ఎన్నో అంశాల గురించి మాట్లాడారు. వారి వారి వ్యక్తిగత జీవితాలు, ప్రొఫెషన్‌, ఇంటిపని, పిల్లలు, కుటుంబ బాధ్యతలు, ఆర్థిక స్వాతంత్య్రంలాంటి విషయాల మీద చర్చారూపంలో ఇంటర్వ్యూ జరిగింది.
ముందుగా చర్చను ప్రారంభిస్తూ మేము కొన్ని అంశాలను లేవనెత్తుతూ అంతర్జాతీయ మహిళా దినం మొదలై 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనదేశంలో స్త్రీల హోదా, స్థితిగతులు గురించి మాట్లాడమన్నపుడు ముందుగా డా|| జ్యోత్స్న మాట్లాడుతూ…
స్త్రీల జీవితాల్లో కొంత మార్పు వచ్చినప్పటికీ, ముఖ్యంగా ఆర్థికంగా సంపాదించుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ స్వేచ్ఛగా వున్నట్టు అన్పిస్తున్నప్పటికీ సమాన హక్కులు లేవు. ఖర్చుపెట్టుకోవడానికి స్వేచ్ఛ వున్నప్పటికీ నిర్ణయాధికారం మాత్రం లేదు. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే ఒకళ్ళిచ్చేది కాదు. పుట్టుకతోనే వస్తుంది. కుటుంబంలో భర్తవల్లే కాక చాలాసార్లు పిల్లలవల్ల కూడా స్వేచ్ఛ కోల్పోతాం. మగవాళ్ళు రెండువేల సంవత్సరాల క్రితం ఎలా వున్నారో ఇపుడూ అలాగే వున్నారు. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కూడా కాదు. మన ఆత్మ ఒప్పుకునేలా వుండేదే స్వేచ్ఛ నా దృష్టిలో. ఆత్మవిశ్వాసం వుండకపోవడం వల్ల ప్రేమతో చెబుతున్నట్టుగా చెబుతూ మనల్ని ఆపాలని చూస్తారు. నా సంతోషం వృత్తిలోనే వుంటుంది. వృత్తిలోనే నా ఐడెంటిటీ వుంటుంది. ఇక్కడ సెన్స్‌ ఆఫ్‌ ఎచీవ్‌మెంట్‌ వుంటుంది. ఇంట్లో నా బాధ్యత అంతే. నాకంటూ ఒక ఐడెంటిటీ వుండదు. పనిచేసేచోట ప్రశంస వుంటుంది. ఇంట్లో మాత్రం అలా వుండదు. అంతా శిబిదిలిదీ తీళిజీ వీజీబిదీశిలిఖి అంటున్నప్పుడు డా|| మాధవి మాట్లాడుతూ… మా ఇంట్లో కొంత చర్చ వుంటుంది. నన్ను అడగడం వుంటుంది. కానీ అంతిమ నిర్ణయం మాత్రం అతనిదే. నేను ఒప్పుకోకపోయినా నేను కన్విన్స్‌ అయ్యేలా చేస్తారు. రెండు జీతాలొచ్చాయి కానీ అన్నీ మనమీదే వున్నాయి. నేనేదైనా నా ఇష్టమైన పని చెయ్యదలిచినా డిస్కరేజ్‌ చేస్తారు. తను మాత్రం నాకు చెప్పకుండానే చేసేస్తాడు. స్వేచ్ఛ… వుంది. అయితే కుటుంబ పరిధికి, టైమింగ్సుకి లోబడి మాత్రమే. డబ్బు సంపాదిస్తున్నాం కానీ అది కుటుంబ ప్రయోజనానికి మాత్రమే. వాళ్ళతో సమానంగా దేనిలోను లేము. ఎంత సంపాదిస్తున్నా ఇంటిపని, వంటపని, పిల్లల బాధ్యత మాత్రం నాదే. నిజానికి నేను ఎన్నో పనులు చేస్తాను. ఇల్లు కట్టించాను. డ్రైవ్‌ చేసుకుంటూ పిల్లల్ని స్కూల్‌లో ట్యూషన్‌లో దింపుతాను. ఇంట్లో పనంతా చేస్తాను. వృత్తిలో కూడా ఎంతో చేస్తుంటాను. నన్ను నేను సూపర్‌వుమన్‌లాగా అనుకుంటాను. అయినప్పటికీ చాలాసార్లు మామూలు గృహిణిగా వుంటేనే బావుండేది అని కూడా అనుకుంటాను. అపుడు ఇన్ని పనులు చెయ్యక్కరలేదు కదా అనుకుంటాను. పైగా డాక్టర్‌నవ్వడంవల్ల ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా నాకే. ఎడ్యుకేటెడ్‌ అవ్వడం వల్ల వాళ్ళ చదువులు చూసుకోవాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మనం సంపాదించినా మన జీతం పట్ల చిన్నచూపు వున్నా కామన్‌గా ఖర్చుపెట్టాల్సి వచ్చినపుడు నేనే పెట్టాలి. ఇద్దరం కలిసి సూపర్‌మార్కెట్‌కి వెళితే అతను పర్స్‌ తియ్యడు. నేనే తీస్తాను.
డా|| కవిత మాట్లాడుతూ కుటుంబ ఆర్థిక విషయాల్లో నా ప్రేమయం ఏమీ లేదు. ప్రోపర్టీస్‌ అన్నీ నా పేరు మీద వున్నప్పటికీ దానిమీద ఎంత ఆదాయం వస్తుంది, అసలు ఎంత ప్రాపర్టీ వుందనేది కూడా నాకు తెలియదు. నా ఉద్దేశ్యంలో స్వేచ్ఛకి పరిమితులున్నాయి. ఇంటి బాధ్యత ఆడవాళ్ళ మీదే వుంది. మొదట నేను గైనిక్‌ సైడ్‌ వెళదామనుకున్నాను కానీ, ఆయనా బిజీగా వుండి, నేనూ బిజీగా వుంటే పిల్లలకెలా అని ఆలోచించి నేనే నా ఇష్టాన్ని పక్కనపెట్టి రేడియాలజీకి వచ్చాను. ఇంట్లో ఎంత పని చేసినా ప్రశంస వుండదు. వృత్తిలోనే సంతోషంగా వుంటాను. అక్కడ కూడా ఎక్కువ సమయం పెట్టాల్సిన కార్డియాలజీ, ఎమర్జన్సీలు వచ్చేచోట స్త్రీలం కాబట్టి మనల్ని మనం కంట్రోల్‌ చేసుకుంటూ, కుటుంబానికి ఇబ్బంది కల్గించని టైమింగ్సు వుండే ప్రొఫెషన్‌ని ఎంచుకుంటాం. ఎన్ని కొత్త అవకాశాలు, పైపైకి వృద్ధిచెందగల అవకాశాలను చేజేతులా వదిలేసుకుంటాం.
ఈ పాయింట్‌ మీద జ్యోత్స్నగారు అందుకుంటూ అట్లా పైకి వెళ్ళే ముఖ్యంగా బయట దేశాలకు వెళ్ళగలిగే అవకాశాలను మగవాళ్ళు వదులుకోరు. వెంటనే వాళ్ళ ఆమోదాన్ని ఇచ్చేసి వస్తారు. వాళ్ళకి కుటుంబం, పిల్లలు, భార్య ఇవేవీ గుర్తురావు. వాళ్ళ కెరీర్‌లో ఎదగడమే ముఖ్యం. మాధవి స్పందిస్తూ ఆడవాళ్ళకి ప్రోటోకాల్‌ లాంటి పనులు, ఎవరైనా ప్రముఖులు వస్తే వేళకానివేళల్లో వాళ్ళను రిసీవ్‌ చేసుకోవడం, ఎయిర్‌పోర్ట్‌లకెళ్ళడమో, వాళ్ళతో డిన్నర్‌లకెళ్ళడం లాంటి పనులు మీరు చెయ్యలేరు అంటూ ముందే పక్కన పెట్టేస్తారు. ఆఫీసులోను ఎంకరేజ్‌ చెయ్యరు. కుటుంబంలో అస్సలు వెళ్ళనివ్వరు. చాలా డిస్కరేజ్‌ చేస్తారు అంటే
కవిత మాట్లాడుతూ ఆపీసులో వివక్ష లేకపోయినప్పటికీ కొన్ని పనులు మీరు చెయ్యలేరని వాళ్ళు ప్రక్కన పెడితే కొన్నింటిని మనమే వొదిలేస్తాం. ముఖ్యంగా శారీరకశ్రమతో కూడిన ఆర్థోపెడిక్‌ డిపార్ట్‌మెంట్‌ని మనమే వొదిలేస్తాం.
ఇంత చదువుకున్నారు, సంపాదిస్తున్నారు కదా మీరెంత సంతోషంగా వున్నారు అని అడిగితే మాధవి నా సంతోషం నా వృత్తిలోనే వుంది. ఇంట్లో ఎంత చేసినా ఎవరూ తృప్తిపడరు. నేనేదైనా కంప్లయింట్‌ చేస్తే ఆఖరికి నా కూతురు కూడా ఎదురుతిరిగి నువ్వేం గొప్పా! అందరూ చేస్తున్నారుగా అంటుంది. వొత్తిడి తట్టుకోలేక నేనేమీ ఆధ్యాత్మికత వేపు వెళ్ళలేదు. నేను కొట్లాడుతూ వుంటానని నన్నిప్పటికే ఫెమినిస్ట్‌ అంటూ వుంటారు. జ్యోత్స్న గారు మాట్లాడుతూ నా సంతోషం నా వృత్తిలోనే వుంది. ఇక్కడ నాకో గుర్తింపు వుంది. మా అమ్మ ఎప్పుడూ బాధపడుతూ వుంటుంది. ఇంత చదివి నీకు సుఖం లేదని. అమ్మకి నా చదువంటే గర్వమే. కానీ చదివించి పొరపాటు చేసానని బాధపడుతుంది. ఇంత కష్టపడి పనిచేసినా, తృప్తి దొరకనపుడు చదువుకుని, ఉద్యోగం చేసి ఏంటి లాభం. గృహిణిగా వుంటే బావుండేదేమో అనుకున్న సందర్భాలు చాలానే వున్నాయి.
కవిత అందుకుంటూ ప్రొఫెషన్‌లోనే నాకు ఆనందం దొరుకుతుంది. ఇంట్లో ఏమీ లేదు. వొత్తిడి తట్టుకోలేక నేను ఆధ్యాత్మికత వేపు వెళ్ళాను. బ్రహ్మకుమారీల దగ్గరకెళతాను. అక్కడ మనశ్శాంతిని వెదుక్కుంటాను. నేను కూడా అనుకుంటాను ఉద్యోగం చేయడం వల్ల ఏమీ సాధించింది లేదనిపిస్తుంది. ఇన్ని రకాల పనులు చెయ్యలేక గృహిణిగా వుంటేనే హాయిగా వుండేదాన్నేమో అనిపిస్తుంది.
మాధవి అందుకుంటూ నాకయితే ఆడపిల్లలకి 10వ క్లాసులో ఆపేస్తే బావుంటుంది కదా అనిపిస్తుంది. చదువుకుని మేము ఏం సుఖపడ్డామని రేపు వాళ్ళు అంతే కదా! ఎంత చదివినా ఇంటిపనులు తప్పవు కదా!
అలా ఎందుకు ఆలోచించాలి. ఇల్లు అందరిదీ, ఇంటిపని అందరూ పంచుకోవాలి. మన పిల్లలచేత కూడా పని చేయించాలి గాని మనం వెనక్కు ఆలోచిస్తే ఎలా అని ప్రశ్నించినపుడు, అందరూ ఆలోచనలో పడ్డారు. నిజమే మేమెపుడూ అలా ఆలోచించలేదు. మామీద వొత్తిడి వుంది కాబట్టి మేము ఉద్యోగం మానేస్తే హాయి అనుకున్నాం కానీ దానికి భిన్నంగా ఆలోచించలేదు. పిల్లల పెంపకం, చదువులో సమానభావాలను ప్రవేశపెట్టడం లాంటి విషయాలు ఆలోచించలేదు. స్త్రీల ఉద్యమాల గురించి అడిగినపుడు మౌనంగా వుండిపోయారు.
ఇంటర్వ్యూ: కె.సత్యవతి, ఎన్‌.గీత

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.