– రోష్ని
పూలన్నింటినీ నేను ప్రేమిస్తాను
రంగు, వాసన, ముళ్ళు- ఇవేవీ నా ప్రేమకు అడ్డురావు
నేను ప్రేమిస్తాను నాకు తెలిసిన మనుషుల్ని
గ్రూపు, కులం, మతం, జాతి, తెగ, ప్రాంతం – నా ప్రేమకు
ఇవేవీ ఆటంకాలు కావు
గుడ్డిదాన్ని!
ఈ చూడలేనితనాన్ని చూసి మీరు నవ్వుకోండి
మానసికంగా హింసిస్తారా!
అయినా నేను మారబోను
మనుషుల్ని దూరం పెట్టే చూపు నాకొద్దు
మీ తెలివిడులు నాకొద్దు
నా గుడ్డితనం, అవివేకంతో
ఇలాగే బతనీయండి
నా ఈ ప్రేమించే దృష్ట్టి నాకెలా నప్పుతుందో అలానే ఉండనివ్వండి
జీవితం అతి చిన్నది, అందమైంది
అపురూపమయిన అమ్మలాంటిది
కాబట్టే పువ్వుల్లాగే మనుషుల్ని ప్రేమిస్తాను
రోష్ని,
ఈ కవిత చాలా చాలా చాలా చాలా చక్కగా వుంది.