బాల్య వివాహాల నిరోధక చట్టం, 2008 వివాహాల చట్టంలోని ముఖ్య అంశాలు

సెక్షన్‌ 2(ఏ) బాలిక అంటే 18 సంవతసరాలు నిండని ఆడపిల్ల.
2 (బి) ”బాల్య వివాహం” అంటే మైనర్‌ బాలిక, మరియు బాలుడు మధ్య జరిగేది. (మైనర్‌ అంటే 18 సం. నిండని బాల బాలికలు ఎవరైనా).
సెక్షన్‌. 3(1)  ఈ చట్ట పరిధి ప్రకారం, ఎవరైనా (బాలిక గాని బాలుడుగాని) వివాహ సమయానికి మైనరు అయితే ఆ వివాహం చెల్లదు.
సెక్షన్‌. 4 (1)  ఈ సెక్షన్‌ క్రింద మైనర్‌ వివాహం జరిగినపుడు, దానిని జరిపిన బాలుని తల్లిదండ్రులు లేదా అతని సంరక్షులు గాని మైనర్‌ బాలికకు భరణం చెల్లించవలసి ఉంటుంది. ఈ భరణం ఆమె మరలా వివాహం  చేసుకునేదాక ఇచ్చేటట్లు ”జిల్లా న్యాయస్థానం” ఆజ్ఞాపిస్తుంది.
సెక్షన్‌ 5 బాల్య వివాహం ద్వారా మైనరు బాలిక శిశువుకు జన్మనిస్తే ఆ శిశువు రక్షణ, మొత్తం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.
సెక్షన్‌ 9  – 18 సంవత్సరాలు దాటిన పురుషుడు ఎవరైన బాల్యవివాహం చేసుకుంటే (మైనర్‌ బాలికను)  2 సంవత్సరాలు జైలుశిక్ష  మరియు జరిమానా కోర్టు విధిస్తుంది.
సెక్షన్‌ 10 ఈ సెక్షను క్రింద ఎవరైతే బాల్యవివాహాన్ని జరిపిస్తారో, జరగడానికి తోడ్పడతారో వారు కూడా శిక్షార్హులే. వారికి  రెండు సంవత్సరాల దాకా జైలుశిక్ష రూ. లక్ష దాకా జరిమానా కోర్టు విధిస్తుంది.
సెక్షన్‌ 12 బాల్య వివాహం జరిపి తరువాత ఆ మైనరు బాలికను, అతని సంరక్షుడుగాని, మరి ఎవరైనా ఇతరులుగాని ఆమెను అక్రమ రవాణా  చేయడానికి ప్రయత్నిస్తే ఆ వివాహం చట్టరీత్యా నేరం.
సెక్షన్‌ 13(1) ఈ సెక్షన్‌ ద్వారా 1క్లాస్‌ జ్యూడీషన్‌ మేజిస్ట్రేట్‌కు, మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు, బాల్య వివాహాలను నిరోధించే అధికారం ప్రభుత్వం ఇచ్చింది.
సెక్షన్‌ 13 (4) ఈ సెక్షన్‌ ద్వారా జిల్లా మేజిస్ట్రేట్‌, బాల్య వివాహ నిరోధక అధికారిగా, బాల్య వివాహాలను నిరోధించే అధికారం ఉంటుంది.
సెక్షన్‌ (14) ఈ చట్టాన్ని ఉల్లంఘించి, మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని అన్ని హిందూ సాంప్రదాయాలలో జరిపినా అది చెల్లదు.
సెక్షన్‌ 15 – ఈ చట్టం క్రింద నమోదు అయ్యే వారెంట్‌ లేదా మేజిస్ట్రేట్‌ అనుమతి లేకుండా పోలీసులు ఆపవచ్చు.

బాలికల కోసం అమలులో ఉన్న పథకాలలో కొన్ని :
బాలికా సంరక్షణ బీమా : 2005వ సంవత్సరం ఏప్రిల్‌ ఒకటి తర్వాత పుట్టిన బాలికలందరికీ ప్రభుత్వం బీమా చేస్తుంది. వీరికి 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి ఈ బీమా మొత్తం లక్ష రూపాయలుగా వీరికి అందుతుంది. అయితే, ఈ మొత్తాన్ని అందుకోవాలంటే బాలిక ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి ఉండాలి.
విద్యా ప్రోత్సాహక స్కాలర్‌షిప్‌ : బాలికల విద్యార్జనను పెంచేందుకు తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఏడాదికి 1200 రూపాయల వరకు స్కాలర్‌షిప్‌ ఇస్తారు. అంగన్‌వాడీలు ఈ బాలికలను గుర్తించి ఐసిడిఎస్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారికి ప్రతిపాదనలు పంపుతారు.
బాలికా మండలి : మాతా, శిశు మరణాలు ఎక్కువ ఉండి, బడిమానివేసే బాలికల శాతం అధికంగా ఉన్నచోట్ల బాలికలను గుర్తించి, వారికి శిక్షణనిచ్చి వారివారి గ్రామాలలో బడి ఈడు పిల్లలు (బాలికలు) బయట ఉండకుండా చూసే బాధ్యతను అప్పగిస్తారు. అయితే, ఈ పథకం రాష్ట్రమంతటా అమలులోలేదు. గుర్తించిన కొన్ని ప్రాంతాలలోనే ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
బాలికల గృహం : తల్లిదండ్రులులేని / వదిలివేయబడిన బాలికలను రెసిడెన్షియల్‌ పద్ధతిలో వసతి సదుపాయంతోపాటు పదవ తరగతి వరకు ఉచితంగా విద్యనందిస్తారు. విజయనగరం జిల్లాలో ఈ హోమ్‌లో ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్యావకాశం ఉంది.
శిశు గృహం : పసిపిల్లల్ని తల్లిదండ్రులు వదిలేసినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఆ శిశువులను ఈ గృహంలో సంరక్షించి, వారిని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చే వారికి దత్తత ఇస్తారు. దత్తత వెళ్ళని పిల్లలు మేజర్లు అయ్యేవరకు ప్రభుత్వమే వారి సంరక్షణ, విద్యావసరాలను చూస్తుంది.
సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌
కొక్కొరగడ్డ విజయలక్ష్మిగారు 2004లో ఈ సంస్థను స్థాపించారు. జీవితంలో ఆవిడ ఎదుర్కొన్న సమస్యలకు అనుభవాలకు ఒక పరిష్కార మార్గంగా ఆవిడ ఈ సంస్థను ఐదుమంది ఆడపిల్లలతో ప్రారంభించారు. స్వరాజ్యలక్ష్మి, జానకి, ప్రమీల సభ్యులుగాను, రాజేశ్వరి, ఇందిర వాలంటీర్లుగాను ఇంకా కొందరు ఆర్ధికంగాను వారి వారి సహాయ సహకారాలను దీనికి అందిస్తున్నారు.
ఈ సంస్థ ముఖ్యంగా మూడు కార్యక్రమాలు చేపట్టింది.
అనాధ బాలికల గృహం-శోభాస్‌ హోం ఫర్‌ గర్ల్స్‌ అండ్‌ విమెన్‌- ప్రతి సంవత్సరం కొంతమంది ఆడపిల్లలను సి.యస్‌.యస్‌, వారి ‘శోభాస్‌ హోం ఫర్‌ గర్ల్స్‌ అండ్‌ విమెన్‌లో చేర్చుకుంటూ ఉంటారు. అనాధలను, తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయిన వారిని, ఆర్ధికంగాను, సామాజికంగాను వెనుబడినవారిని ఇందులో చేర్చుకుంటారు. ఈ బాలికలకు ఆశ్రయం, కావలసిన వసతులు, విద్య కల్పిస్తున్నారు. సి.యస్‌.యస్‌ సభ్యులు వివిధ కళాశాలల అధిపతులను కలిసి ఆశ్రమంలోని పిల్లలను వారి ప్రతిభానుసారం ఆయా కళాశాలలో చేరుస్తుంటారు. ప్రస్తుతం సియస్‌యస్‌ 69 మంది బాలికలకు ఆశ్రయం కల్పిస్తోంది. వీరు బిఎస్‌సి నర్సింగు, జియన్‌ఎం. నర్సింగు, బి.ఎస్‌సి, బి.కాం, బి.యిడి, ఇంటర్మీడియట్‌ 10,9,8,7,6,3, 2, యుకెజి, నర్సరీ క్లాసులలో చదువుకుంటున్నారు.  సంవత్సరానికి ఒక బాలికకు 30,000 రూపాయలు ఖర్చవుతుంది. ఈ కార్యక్రమమంతా కూడా దాతల విరాళాలతోనే నడుస్తోంది.
ఆర్ధికంగాను సామాజికంగాను వెనకబడిన ఆడపిల్లలకోసం ఉచిత ఇంగ్లీషు మీడియం పాఠశాల-నిమ్మగడ్డ ఆనందమ్మ మొమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్‌- హయత్‌నగర్‌ మండలంలోని మునగనూర్‌ గ్రామ పంచాయితీ పరిధిలో వున్న బన్జారా కాలనీ, అంబేద్కర్‌ కాలనీ, లేబర్‌ కాలనీ వంటి ఆర్ధికంగాను సామాజికంగాను వెనుకబడిన ప్రాంతాలలో ఉంటున్న కుటుంబాలకు చెందిన బాలికలకోసం సియస్‌యస్‌ నిమ్మగడ్డ ఆనందమ్మ మెమోరియల్‌ గర్ల్స్‌ స్కూల్ని నడిపిస్తోంది. ఈ ప్రాంతంలోని వాళ్ళంతా ఆటో డ్రైవర్లు, రోజు కూలీలు, పెయింటర్లుగా పనిచేస్తూ అతికష్టం మీద తమ కుటుంబాలను పోషిస్తున్నవారే. ఈ స్కూలులో యూనిఫార్మ్‌, పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇచ్చి వారి పిల్లల విద్యాభ్యాసానికి అంకురార్పణ చేస్తోంది సియస్‌యస్‌. ప్రస్తుతం నర్సరీ నుంచి 3వ తరగతి దాకా పిల్లలు ఈ స్కూల్‌లో చదువుకుంటున్నారు. ఒక పిల్ల చదువుకు సంవత్సరానికి రూ. 6200 ఖర్చవుతోంది. ఈ కార్యక్రమంకూడా దాతల విరాళాలతోనే నడుస్తోంది.
సమస్యలలో చిక్కుకున్న స్త్రీలకు సహాయపడే లక్ష్మి గంగ స్వయంశక్తి పథకం-వివిధ పరిస్థితుల వల్ల మానసికంగా కుంగిపోయిన స్త్రీలకు స్థైర్యాన్ని కలిగిస్తూ వారు కోలుకునే దాకా తాత్కాలికంగా ఆశ్రయాన్ని కలిగిస్తుంది సియస్‌యస్‌ లక్ష్మి గంగ స్వయం శక్తి నిలయం. ఆర్ధికంగాను, సామాజికంగాను వెనుకబడిన స్త్రీలకు స్వయం ఉపాధి పధకాలను కూడా చేపడుతున్నారు ఇక్కడ. ఈ కార్యక్రమాలన్ని కూడా సెంటర్‌ ఫర్‌ సోషల్‌ సర్వీస్‌ దాతలు ఇచ్చే విరాళాల తోనే నడుస్తున్నాయి. వివరాలకు సంప్రదించాల్సివారు. విజయలక్ష్మి ఫోన్‌. 9885472959

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.