రత్నాకరం రుక్మిణీదేవి
చైతన్యకు పురిటినెప్పులు వస్తున్నాయి. ఆ బాధకు తట్టుకోలేక పెద్దగా అమ్మా… అయ్యా… అంటూ తల్లిదండ్రుల్ని తలుచు కుంటూ ఏడుస్తున్నది. చైతన్య, పక్కనే ఉన్న చైతన్య అత్తగారు శివకామిని ఊరుకోవే తల్లీ బాధ ఓర్చుకుంటేనే మరి బిడ్డల్ని పొందేది. ”ఒరేయ్ ప్రసాదు నువ్వెళ్ళి ఆదెమ్మని, అదే… మంత్రసాని ఆదెమ్మ లేదు దానిని పిలుచుకురా అంటూ కోడలికి ఓదార్పు, అటు కొడుకు ప్రసాదుకి పని పురమాయింపు ఒకేసారి జారీచేసింది శివకామిని. ఇదుగో ఎల్తున్నా అంటూ ప్రసాదు మంత్రసానిని పిలవడానికి బైటకి వెళ్ళాడు. కానీ చైతన్య బాధ మాత్రం ఎక్కువైంది. శివకామిని పక్కనే కూర్చుని నడుములు రాస్తూ ఊరుకోవే అమ్మా… ఊరుకో ఇప్పుడిలా బాధతో ఏడ్చినదానివే రేపు కొడుకుని చూసుకుని ఆనందంతో కొండెక్కి కూర్చుంటావు. మంత్రసాని ఆదెమ్మకు కబురు పెట్టాను బయలుదేరే వుంటుంది. కాస్సేపు ఓర్చుకో మాతల్లివిగదు. కోడలికి ధైర్యం చెప్పింది శివకామిని.
పదినిముషాల తరువాత బైటనించి… ఏమేవ్ ఆదెమ్మ వచ్చింది అనే చైతన్య మామగారు వెంకటేశం కేక వినిపించింది.
సరె…సరె లోపలికి రమ్మనండి. లోపలి నుండి శివకామిని కూడా ఒక కేక పెట్టింది. లోపలికి వెళ్ళిన ఆదెమ్మ మీరెళ్ళి వేన్నీళ్ళు అవి రెడీ చేసుకోండి. మీ కోడలిగారి దగ్గర నేనుంటాను అంటూ చీరను మడిచి పైకి దోపుకుంటూ అన్నది ఆదెమ్మ. సరేనే ఆదెమ్మ పదినిముషాల్లో పండంటి మనుమణ్ణి చూపించు నేవెళ్ళి నువ్వు చెప్పినట్లు లోపలి పన్లు చూస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళింది శివకామిని.
పావుగంట తరువాత చైతన్య గదినుండి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. వంటగదిలో నీళ్ళు కాయడం పూర్తిచేసిన శివకామిని వేన్నీళ్ళ బకెట్, మెత్తని, తెల్లని తువ్వాలు పట్టుకుని గది దగ్గరకొచ్చింది. ఆ వెనుకే చైతన్య మామగారు వెంకటేశం, భర్త ప్రసాదు. నాలుగేళ్ళ కూతురు కుసుమ అందరూ అక్కడికి చేరుకున్నారు. బాబుని చూడచ్చా అని ఏకకంఠంతో అడిగారు. దానికి ఆదెమ్మ బాబుకాదండి లక్ష్మీదేవిలాంటి అమ్మాయి. ఇదుగో స్నానం చేయించగానే చూద్దురుగాని.
ఏంటి అమ్మాయా! మళ్ళీ ఏకకంఠీ వాచకం వినిపించింది. అదేంటమ్మా! ఈసారి అబ్బాయేనని కచ్చితంగా చెప్పింది చైతన్య. అంతేకాదు మా అమ్మకి కూడా రెండోసారి అబ్బాయేనని నమ్మకంగా చెప్పింది. ఇదేంటి ఇలా జరిగింది తల్లివంకచూస్తూ అన్నాడు ప్రసాదు.
దానికేమన్నా భవిష్యత్తు తెలుసంట్రా. నేముందే చెప్పానా! కడుపు వద్దూ, కాకరకాయా వద్దు, మొదటిసారి ఆడరాక్షసి పుట్టిందంటే రెండోసారి అబ్బాయి పుడతాడన్న నమ్మకం ఉండదని. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి లాభం. నువ్వు మీ నాన్నా కలిపి తెచ్చే ముష్టి మూడువేలతో రెండో ఈ ఆడరాక్షసిని ఎలాసాకాలో ఆలోచించు ముందు. తన రక్తంతో కూడా జీవం పోసుకున్న ఒక ఆడపిల్ల గురించి మరొక ఆడది అందులో నానమ్మ ఇలా మాట్లాడటం కర్ణకఠోరంగా ఉంది కదా! ఉంటుంది. ఉండదు మరి కలికాలం గదా!
భార్య మాటలు విన్న వెంకటేశం మన చేతుల్లో ఏముంది. అంతా ఆ భగవంతుని సంకల్పం. మానాన్నా తాతకు కలిపి మూడువేలే వస్తాయని పాపం ఆ పసిగుడ్డుకు తెలియదు కదా! అని గొణుక్కుంటూ బైటకి వెళ్ళాడు వెంకటేశం.
చెల్లాయ్ పుట్టిందా బలెబలె ఇద్దరం ఎంచక్కా ఆడుకుంటాం. రేపటినుండి నానమ్మ నన్ను తిట్టిందనుకో చెల్లాయ్ కూడా నానమ్మ మీద పోట్లాడుతుంది. నానమ్మా… నానమ్మా చెల్లాయ్‌ని చూద్దాం రా, నానమ్మా! కల్లాకపటం తెలియని ఆ చిన్నారి నానమ్మ చెయ్యి పట్టుకుంది.
ఏంటి! నువ్వు మీ చెల్లాయ్ కలిసి నామీద పోట్లాడతారా! ఇప్పుడేమొ మీ చెల్లాయ్‌ని నేను చూపించాలా! భడవా! ఛీ అవతలకి పో చేతిని విసురుగా విదిలించేసింది ఆ విసురుడికి అల్లంతదూరాన పడిన కుసుమ ఏడుపు మొదలుపెట్టింది.
ఇదంతా కళ్ళప్పగించి చూస్తున్న ఆదెమ్మ అదేంటమ్మా పిల్లని అట్టాగ తోసేసినావు దెబ్బ తగిలిందేమొ సూడండి అన్నది.
ఆ సంగతి మాకు తెలుసుగానీ నీ పని కానియ్ అన్నది శివకామిని ఆదెమ్మను కోపంగా చూస్తూ. ఆ ఇంటివారి వింత ప్రవర్తనకు విస్తుపోతూ మారుమాట్లాడకుండా తన బాధ్యతగా పాపకి నీళ్ళుపోసి, తల్లి పక్కలో పడుకోబెట్టి ఇంటికి వెళ్ళిపోయింది ఆదెమ్మ.
చైతన్య ప్రసవించి అప్పుడే పదిరోజులు దాటింది. పురిటిస్నానం కూడా అయి పోయింది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి పిల్లకి పాలిస్తూ కూర్చుంది చైతన్య. కుసుమ ప్రక్కనే కూర్చుని కబుర్లు చెప్తున్నది. అంతలో బైటనుండి ప్రసాదు వచ్చాడు. వస్తూనే అమ్మా…నాన్నా అని కేకలాంటి పిలుపుతో వచ్చాడు. ఆ పిలుపుకి తల్లి శివకామిని, తండ్రి వెంకటేశం పరుగున అక్కడికి వచ్చి ఏంటిరా ఆ పిలుపు గుండెదడ పుట్టేట్లు అన్నారు.
ఆ మాట అన్న వెంటనే శివకామిని సరెసరె నే చెప్పిన పని ఏంచేసుకొచ్చావో అది చెప్పు ముందు.
నువ్వు పని చెప్పడం, ఆ పనికి నేను వెళ్ళడం, ఇక ఆ పని కాకపోవడమా! పని పూర్తిచేసుకునే వచ్చాను. వాళ్ళ మాటలు అర్థంకాని వెంకటేశం ఏంటిరా అది. మీ అమ్మ చెప్పిన పని, నువ్వు చేసుకువచ్చిన పని. ఇన్ని ఏళ్ళలో మీరిద్దరూ కలిసి పూర్తిచేసిన ఒక మంచిపని కూడా నేనెరుగను. ఆఖరికి నీ పెళ్ళి విషయంలో కూడా నే కలుగచేసు కుంటేనే వాళ్ళు ఒప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు నేనేదో పని పూర్తిచేసుకువచ్చాను అని నువ్వు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉందిరా నాకు. ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తపరుస్తూ పెదవి పై వేలేసుకుని మరీ అన్నాడు వెంకటేశం.
సరేలే నేను, అమ్మా పూర్తిచేసే మంచిపనులు కొన్ని వుంటాయి. వాటినైతే చిటికెలో పూర్తిచేస్తాం.
సరేలేరా ఆ విషయం నువ్వు నాకు చెప్పాలా పాతికేళ్ళనుండి చూస్తూనే వున్నా నుగా, అసలు విషయం ఏంటో చెప్పు అవతల నాకు పనివుంది. త్వరగా బైటకి వెళ్ళాలి.
అంత తొందర ఎందుకండీ హడావుడి చేయకండి, ప్రశాంతంగా అలా కూర్చోండి మధ్యలో కలుగచేసుకుని అన్నది శివకామిని.
ఊ, సరె! చెప్పండి అంటూ రంగు సగం వెలిసిపోయిన కుర్చీ లాక్కుని కూర్చున్నాడు వెంకటేశం.
ప్రసాదు, శివకామినీ కుర్చీకి అటూ, ఇటూ కూర్చున్నారు. విషయం ఎలా మొదలుపెట్టాలో తెలియక, అదేనయ్యా! నేను వాడికి చెప్పిన పని అంత చెడ్డపనేమీ కాదు. మంచిగా ఆలోచిస్తే మంచిగానే కనిపిస్తుంది. చెడ్డగా ఆలోచిస్తే మరి చెడ్డగానే కనిపిస్తుంది. కానీ ఈ పనిమాత్రం మనలాంటివారికి ఎంతో ఉపయోగకరమైనదే. చాలీచాలని ఆదా యంతో అవస్థలు పడే మనకి ఈ పని తప్ప వేరే గత్యంతరం లేదు అన్నది శివకామిని.
అదేంటో చెప్పి ఏడవ్వే టెన్షన్తో నన్ను చంపక! అదేనండీ మన ఊళ్ళో ”మదర్ థెరిసా” అనాథాశ్రమం ఉంది కదా! దాన్లో… మొన్న మనింట్లో కొత్తగా ఊపిరిపోసుకున్న ఆ పిల్ల రాక్షసిని పడేసి వచ్చామనుకో అప్పుడు దానికీ మనకీ కూడా ఏ బాధా ఉండదు. అదేదో పనికిరాని వస్తువును చెత్తసామాన్ల అబ్బాయికి వేసినంత తేలికగా చెప్పింది శివకామిని.
అది విన్న వెంకటేశానికి నోటమాట రాలేదు. ఏంటి! ఆ పసిదాన్ని అనాథాశ్రమంలో పడేస్తారా! అలాంటి పిచ్చిపన్లు చేయకండి లేనిపాపం చుట్టుకుంటుంది. అదేదో ముందే వుండాలి కాని ఇప్పుడు తల్లీబిడ్డల్ని వేరుచేస్తారా! అంతకంటే మహాపాపం మరొకటి ఉండదు. ఇదా మీరు చేసిన మంచిపని. ఇంకా ఏం ఘనకార్యం సాధించారో విని సంతోషిద్దామని కూర్చున్నాను. ఇక నే వెళ్తున్నా అని లేవబోయాడు వెంకటేశం.
వెళ్ళకు నాన్నా వెళ్ళకు అలా కూర్చో ఇది కూడా ఘనకార్యమే. అసలు ఆశ్రమాల్లో ఖాళీలే లేవు. అందులో తల్లీ, తండ్రీ, తాతా, నానమ్మా, ఇలా అందరూ ఉన్న పిల్లల్ని ఆశ్రమంలో చేర్చుకోరు కూడా. అలాంటి అసాధ్యమైన పనిని నేను సాధ్యపరుచు కొచ్చాను. సంతోషించాల్సింది పోయి, పాపం, పుణ్యం అంటావేంటి నాన్నా అన్నాడు ప్రసాదు. నిజమేనయ్యా ఇద్దరాడపిల్లల్ని పోషించడం ఎంత కష్టం, ఇప్పుడే తినో తినకో గౌరవంగా కాలం గడుపుతున్నాం. ఇకముందు అది కూడా ఉండదు. ఇద్దరు పిల్లల్నేసుకుని మనం కూడా అమ్మా, అయ్యా అనుకుంటూ రోడ్డున పడాలి. మీరెన్ని చెప్పినా సరేనండీ మా నిర్ణయాన్ని మార్చుకునేది లేదు. వంశోద్ధార కుడు ఉండాలి కదా మీ కోడలు చెప్పిన ఆనవాయితీ ప్రకారం వాళ్ళమ్మలా మగ పిల్లాడినే కంటుంది అనుకున్నాం. కానీ ఇదుగో ఈ పూతన పుట్టుకొచ్చింది. ద్వాపర యుగంలో పాలతో పాటు దీని రక్తం ఆ శ్రీకృష్ణుడు తాగేస్తే ఇప్పుడిది మన రక్తం పీల్చి పిప్పి చేయడానికి వచ్చింది. మీరెన్ని చెప్పినా ఇది ఇంట్లో ఉండడానికి వీలులేదు అన్నది శివకామిని, ప్రసాదు తల్లికి వంతపాడాడు.
అనువుగాని చోట అధికుల మనరాదు అన్న పెద్దల సూక్తి పైకే చదువుకుంటూ లేచి వెళ్ళిపోయాడు వెంకటేశం.
లేచి వెళ్ళిన వెంకటేశం వైపు చూస్తూ వెంకటేశం మనస్తత్వం తెలిసిన శివకామిని, ప్రసాదులు, ఇక నిర్ణయం మనదేలే అన్నట్లు కార్యనిర్వహణలో నిమగ్నమవడానికి కాసిని చల్లని మంచినీళ్ళు తాగి ముందు గదిలో కూర్చుని వున్న చైతన్య దగ్గరకు వచ్చి పక్కనే కూర్చుంటూ ఏంటి చైతన్య ఇందాక మేమం దరం రాగానే నువ్వు లేచి వెళ్ళి పోయావు.
ఆఁహ ఏం లేదండీ మీరేదో మాట్లాడు కోవడానికి కూర్చున్నారు గదా అని నేను పాప దగ్గరకెళ్ళి పడుకున్నాను అన్నది చైతన్య. అంతలో శివకామిని వచ్చి చైతన్యకు అటువైపు కూర్చున్నది. కూర్చోవడమే గాదు… అమ్మా! చైతన్య పిల్లకి పాలిస్తున్నావు గదా! నీకు బాగా నీరసంగా ఉండి ఉంటుంది. ఒక గ్లాసు పాలిద్దామన్నా మనకంత స్తోమత లేకపాయె అన్నది చైతన్య తలపై చేత్తో రాస్తూ శివకామిని.
నిజమే చైతన్య, పాపకి బలమైన ఆహారం పెట్టి, చదువు, సంధ్య చెప్పించి ఏ లోటు లేకుండ పెంచలేము. అందులో ఒకరు కాదు ఇద్దర్ని పెంచాలి. అది మనం కలలో కూడా ఊహించని విషయం.
అదేంటండీ నాకే నీరసం లేదు, బాగానే ఉన్నాను. మన పిల్లల్ని కూడా మనకి ఉన్న దాంట్లోనే గొప్పగా పెంచుకుందాం. అంతగా అయితే నేను కూడా ఏదో ఒక పనిచేసి కాస్తోకూస్తో సంపాదించి వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా కాస్త సాయపడతాను. ఆ తరువాత కష్టపడి మన స్తోమతకు తగినట్లుగా పిల్లలకి కూడా ఏదో ఒక వృత్తివిద్యల్ని నేర్పించామను కోండి అప్పుడు వాళ్ళు కూడా మనకి కాస్త ఆసరాగా వుంటారు. అందులో ఆడపిల్లలు మగపిల్ల లంత నిర్లక్ష్యభావంతో వుండరు. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటారు. కష్ట సుఖాలు తెలుసు కోవడానికి ప్రయత్నిస్తారు అన్నది చైతన్య.
ఆసరా కాదే! మన ఉసురు తీస్తారు. మొదట చదువు, ఆ తరువాత పెళ్ళి, ఆపై పురుడు, పుణ్యాలు. ఇవన్నీ అయ్యేసరికి మన పని అయిపోయి మింగటానికి మెతుకు కూడా ఉండదు. అందుకే ఇలాంటి బాధలు దానికీ, మనకీ కూడా లేకుండా నే చెప్పిన పనిచేస్తే అందరికీ మేలు జరుగుతుంది. కాస్త కోపంగా, మరికాస్త శాంతంగా, నచ్చచెప్పే రీతిలో ఆజ్ఞాపిస్తున్నట్లుగా అన్నది శివకామిని.
అదేంటత్తయ్యా! మనకి మేలు జరుగుతుందంటే, మన పిల్లలకి ఏ బాధా రాదంటే, మీరు చెప్పిన పని ఏదైనా నేను చేస్తాను. అదేంటో చెప్పండి ఆనందంగా అన్నది చైతన్య.
ఏం లేదమ్మా! మన ఊరిలో ఉన్న ”మదర్‌థెరిసా” ఆశ్రమంలో పాపనిచ్చా మనుకో, అక్కడ అదీ హాయిగా పెరుగుతుంది. ఇక్కడ మనమూ కాస్త గాలి పీల్చుకోవచ్చు. ఆ విషయమే అబ్బాయి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వొప్పించి వచ్చాడు. సాయంత్రం తీసుకు రమ్మన్నారట. ఇప్పుడు నువ్వెళ్ళి దాన్ని అక్కడ ఇచ్చిరా! ఏమ్మా! చైతన్య తల నిమురుతూ అన్నది శివకామిని.
ఆ మాట వినగానే చైతన్యకు భూమి బ్రద్దలై అగాధంలో పడిపోతున్నట్లనిపించింది. అత్తగారి చేతిని విసురుగా నెట్టి లేచి నిల్చుంది.
అత్తగారి వంక, భర్త వంక మార్చిమార్చి కోపంగా చూస్తూ ఏంటి? నా బిడ్డను అనాథా శ్రమంలో వదిలిరావాలా! మనం ఉన్నాంగా! అందులో అమ్మా నాన్నలం మనిద్దరం బ్రతికే ఉన్నాంగా అటువంటప్పుడు నాబిడ్డ అనాథ ఎలా అవుతుంది అన్నది చైతన్య.
చైతన్యా! అని ప్రసాదు, శివకామినీ ఒకేసారి కేకపెట్టారు. ఆ కేకకి చైతన్య అవాక్కయి పోయింది. కన్నార్పడం మరిచి అలా వారివంక చూస్తూనే వుండిపోయింది భయంగా.
చైతన్యా మేము చెప్పినదానికి ఎదురు చెప్పకు. నువ్వు వెళ్ళి అప్పుడప్పుడు చూసు కొచ్చే విధంగా మాట్లాడివచ్చాను. ఇప్పుడు నువ్వు మా మాట వినలేదనుకో మేమే తీసుకువెళ్ళి వాకిట్లో పడేసి వస్తాం. ఆ తరువాత వాళ్ళు నిన్ను చూడటానికి కూడా రానివ్వరు. తరువాత నీ ఇష్టం.
నావల్ల కాదండీ. నేను తినడం మానేస్తాను. లేకుంటే ఈ రోజునుంచే పాచిపని చేసి సంపాదించి నా బిడ్డకి పాలుపడతాను. అంతేగానీ అనాథగా వదులకోలేను.
ఏంటే నీ మొండితనం. మరీ అంత ఆదర్శతల్లిలా మాట్లాడకు. ఈ రోజుల్లో ఒక్కో తల్లి ఆడపక్షుల్ని కని ఏ చెత్తకుండీలోనో, మురుగుకాలువల్లోనో పడేసి చేతులు దులుపుకుంటున్నారు. నిన్నేమన్నా అట్లా చేయమన్నామా, లేకపోతే అందరం హాయిగా బ్రతికే ప్లాను చెప్పాము. నువ్వు వెళ్ళి వదిలివస్తే సరేసరి లేకుంటే మేమే వెళ్ళి అక్కడ పడేసి వస్తాము. పదే నిముషాల టైము ఇస్తున్నాము నిర్ణయించుకో. ఒరేయ్ ప్రసాదు నువ్వు రెడీగా ఉండు, అన్నది శివకామిని.
వద్దు…వద్దు నేనే వెళ్తాను, వెళ్ళి జాగ్రత్తగా చూచుకోమని వాళ్ళని బ్రతిమాలు కుని వస్తాను అని గబగబా లోపలికి వెళ్ళి పది నిముషాల్లో తయారయి పిల్లని తీసుకుని వచ్చింది చైతన్య.
ఒరేయ్ ప్రసాదు రిక్షా ఎక్కించి రిక్షా వాడికి అడ్రసు చెప్పి రారా. ”నాన్నా నాన్నా నే కూడా వస్తాను అన్నది కుసుమ!! నువ్వెక్కడికే పద లోపలికి అంటూ కుసుమ చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది శివకామిని.
చైతన్యని తీసుకువెళ్ళి రిక్షా ఎక్కించి వచ్చాడు ప్రసాదు. కన్నబిడ్డను కడుపులో దాచుకుంటూ కన్నీళ్ళు కార్చుకుంటూ అయోమయస్థితిలో బొమ్మలా రిక్షాల్లో కూర్చుని వుంది చైతన్య.
జ జ జ
ఇదేనమ్మా ఆశ్రమం దిగండి అన్నాడు రిక్షావాడు. అప్పటికి ఈ లోకంలోకి వచ్చిన చైతన్య కళ్ళు తుడుచుకుంటూ దిగింది. ఎదురుగా మదర్‌థెరిసా ఫొటోతో పెద్ద బోర్డు కనిపించింది. తనకు తెలియకుండానే ఆమెకు మనసులో నమస్సుమాంజలులు సమర్పించు కుంటూ ఇలా అనుకుంది. అమ్మా నీవు అనాథ పిల్లలందరూ నీ పిల్లలే అనుకున్నావు. కానీ కొంతమంది మానవులు తమ రక్తాన్నే కాలదన్ని అనాథల్ని చేసేస్తున్నారమ్మా.
ఏంమ్మా ఏంటి ఆలోచిస్తున్నావు కన్నబిడ్డని వదలాలంటే అలాగే ఉంటుంది. మరి నువ్వు పెంచలేనప్పుడు ఏం చేస్తావు. ఇక్కడ పిల్లల్ని బాగానే చూచుకుంటారు అన్నది ఎవరో ఒక పెద్దావిడ అటు వెళ్తూ.
మమకారాన్ని చంపుకుని పది అడు గులు వేసి ముఖద్వారం చేరింది చైతన్య. గుండెకి హత్తుకుని వున్న పసిగుడ్డు గుప్పెళ్ళు మూసి లేత చిగుళ్ళ వంటి పెదవులను చప్పరిస్తూ పాలకోసం తల్లి స్థనాలను వెతు క్కుంటున్నది తల అటూ ఇటూ తిప్పుతూ అంతే చైతన్య కాళ్ళు అక్కడే ఆగిపోయాయి.
ఆశ్రమం పైన ఉన్న మైకులోనుండి పెద్దగా పాట వినిపిస్తున్నది. తలెత్తి మైకువంక చూస్తూ అక్కడే నిలబడిపోయింది.
చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు
మా పాపాయి బోసినవ్వులే, మంచి ముత్యముల వానలు
పిడికిలి మూసిన చేతులు, లేతగులాబీరేకులు
చెంపకు చారెడు సోగకన్నులె, సంపదలీనెడు జ్యోతులు
ఇంటను వెలసిన దైవము, కంటను మెరిసిన దీపము
మా హృదయాలకు హాయినొసంగె, పాపాయే మా ప్రాణము
నోచిన నోముల పంటగ, అందరి కళ్ళకు విందుగా
పేరుప్రతిష్టలే నీ పెన్నిధిగా, నూరేళ్ళాయువు పొందుమా ||చల్లని||
ఈ పాట ఎంత బాగుంది. ఎంత అర్థముంది. అసలు ఈ పాట రాసిందెవరో. ఈ పాట విన్న తరువాత తల్లిగా నే చేయాల్సిన పని ఇదేనా అన్న ఆలోచన నాకు కలుగుతున్నది. అంతలో చేతిలో పుస్తకాలతో లోపలినుండి ఒకాయన బైటకి వస్తున్నాడు. చైతన్య గబగబా ఆయన దగ్గరకెళ్ళి ఏమండీ ఇప్పుడు పాడిన పాట ఎవరు రాసారు అని అడిగింది.
అదా! అది వెలుగునీడలు సినిమాకి శ్రీశ్రీ గారు రాసారు. ఎందుకమ్మా అని అడిగాడు ఆయన.
అఁహ ఏంలేదండి పాట చాలా బాగుంది. ఈ పాట విన్న తరువాత నా బిడ్డని ఇక్కడ వదిలివేయాలనిపించడం లేదు.
మంచిదమ్మా శ్రీశ్రీగారు లేక పోయినా ఆయన పాట కూడా ఒక తల్లీబిడ్డలను వేరుగాకుండా చేసిందంటే ఎంతో గొప్ప విషయం. అసలు ఆయన రాసిన ప్రతి పాటలోను ఏదో ఒక సందేశం తప్పక ఉంటుంది. నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇంటికి వెళ్ళిరా అన్నాడాయన.
లేదండి! నేను ఇంటికి వెళ్ళను వెళ్ళినా మావాళ్ళు రానీయరు. అందుకే మన ఊళ్ళో ఉన్న సరోజినీ స్త్రీ శిశు సంక్షేమ కేంద్రానికి దారి ఎటో చెప్తారా అని అడిగింది చైతన్య. సరేనమ్మా అలా బైటకి రా రిక్షా ఎక్కించి ఆ అబ్బాయికి అడ్రసు చెప్తాను. నిన్ను అక్కడకు తీసుకువెళ్తాడు అన్నాడు దేవుడు పంపినట్లుగా సమయానికి వచ్చిన ఆ మంచి మనసుగల వ్యక్తి. అతని వెనుకనే ముందడుగు వేసింది చైతన్య.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
కధలో పాజిటివ్ విషయం వుంది. రాసిన విధానం చాలా తక్కువ స్థాయిలో వుంది. ఒక పాత్ర మాట్టాడే మాటలు కోట్సులో లేకపోవడం వల్ల అయోమయంగా తయారయింది కధ. ఒక పాట వినడం వల్ల మారిపోవడం అనేది చాలా అసమంజసమైన విషయం. ఒకవేళ ఆ పాట వినకపోయి వుంటే, ఏం జరిగేది? అలా కాకుండా, ఆ తల్లిలో క్రమేణా మార్పు వచ్చినట్టూ, పెద్ద కూతురు కుసుమని కూడా తీసుకు వెళ్ళినట్టూ రాస్తే, కాస్త సమంజసంగా వుండేది. ఏమైనా, ఇప్పటికీ ఆడ పిల్లలని చాలా తక్కువగా చూడ్డం, అదీ పెద్ద ఆడవాళ్ళే అలా ప్రవర్తించడం, ఇంకా వుంటూనే వుంది. చైతన్య అనేది మొగ పేరనుకున్నాను. ఆడవాళ్ళు కూడా పెట్టుకుంటారన్న మాట. తమ కాళ్ళ మీద తాము నిలబడాలీ అని స్త్రీలు అనుకున్నప్పుడే, ఇటువంటి సమస్యల ఉదృతం తగ్గుతుంది.
కథ బాగుంది. మంచి సందెసముంది. ఆదపిల్లలను కొన్ని కులాలలొ అమ్ముకుంతున్నారు కూదా. ఎంథ అమానుషమ…..ఇవన్ని అర్దికపరంగ వచ్హె సంస్యలె. స్త్రీలు అర్దికంగ ఎవరిపిన ఆదారపదకుదదు. స్త్రీలు బనిసలుగ ఉన్నంత కాలమ , భర్త అనె యజమాని ఎమిన చెస్తాదు, ఎదయిన చెస్తాదు. స్త్రీలు ఆత్మగౌరవంథొ, అత్మాభినంథొ బ్రతకతమ నెర్చుకొవలి.