సెలయేటి గలగలా
చిరుగాలి కిలకిలా
కొండవీటి సత్యవెంట
చిరునవ్వుల వెన్నెల!
అందమైన పాటలా వెంటాడే ఆహ్లాదకరమైన అనుభూతి మనసంతటా మిగిల్చింది, క్షణంలా కరిగిపోయిన మూడురోజుల మన విహారం! ఇంతవరకు చూడని ఇందరు ఆత్మీయుల్ని ఒక్కసారి కలుసుకోవడం అపూర్వమైన అనుభవం. ప్రయాణం మొదలవుతూనే నిశ్చల తటాకంలో తటాలున ఈదుకుంటూ పోయే చేపపిల్లలా రైల్లో మా మధ్యకు మీరు ప్రవేశించడం, టార్చ్‌లైట్ వేసినట్టు మీరు ఎటు తిరిగితే వాళ్ళమీద మీ నవ్వుల వెలుగుల్ని ఫోకస్ చేయడం, పెళ్ళి సందడి గుర్తుకు తెస్తూ మొగలి అత్తర్లు మా అందరి మణికట్లకీ రాసి స్నేహ పరిమళాన్ని గుబాళింపచేయడం… అన్నిటికీ థ్యాంక్యూ! మళ్ళీ అందరం చిన్నపిల్లలమైపోయి హాయిగా తుళ్ళి తుళ్ళి నవ్వుకోగలగడం, మనసులోపల పరవళ్ళు తొక్కే నవ్వు పుట్టడమే గొప్ప అయితే, దాన్ని పెదవుల వెనక ఆపి జాగ్రత్తగా వదలవలసిన అవసరం లేకుండా మనసారా నవ్వగలగడం ఎంత గొప్ప! మండుటెండలూ, ముంచెత్తిన వరదలూ – ఈ రెండిటికీ మధ్యలో మనం చల్లని ప్రశాంత వాతావరణంలో మన ప్లాన్ ప్రకారం ఏ ఆటంకాలూ లేకుండా చక్కగా ట్రిప్ పూర్తి చేసుకురావడం తలుచుకుంటే ఆనందం కలుగుతోంది.
నర్సాపురంలో దిగినప్పటినుంచి అందిన ఆత్మీయ ఆతిథ్యం, ఉమన్స్ కాలేజీలోనూ, వై.ఎన్ కాలేజిలోనూ – యాజమాన్యంతోనూ, విద్యార్థులతోనూ గడిపిన సమయం ఎంతో బావుంది. అందరు రచయితుల్రనూ వాళ్ళు ఆదరించిన పద్ధతి, గుర్తుగా వాళ్ళు పెజ్రెంట్ చేసిన లేసు టేబుల్ క్లాత్ మర్చిపోలేం. సీతారాంపురం వెళ్ళడం, మీ తోటలో తిరగడం – పిచికలు వాలిన చెట్టు, తాడిచెట్టును ఆత్మీయంగా చుట్టుకున్న జువ్విచెట్టు, అప్పుడే తాజా తాటిపండు రాలిపడడం, పొగడపూలు, కోళ్ళగూడు, గాయపాకులు, పల్లేరు కాయలు, జామచెట్లకు వేళ్ళాడే పెద్ద పెద్ద బూడిద గుమ్మడి కాయలు (!), మీ మహిళా కేంద్రంలో సెల్్ఫ హెల్్ప గూప్ర్్స తయారు చేసిన స్పెషల్ సున్నిపిండి, పళ్ళపొడి, దోమల నివారణి వగైరాలు, పిల్లలు, పెద్దల విచ్చుకున్న వదనాలు, ఆ చెట్ల మధ్య మనమూ పిల్లలమైపోయి పంచుకున్న ఆకతాయి నవ్వులు… ఎప్పటికీ మరపురాని అనుభూతులు. అక్కడినుంచి లేస్ ఫాక్టరీకి వెళ్ళడం, అందమైన, వరల్డ్ ఫేమస్ అయిన అల్లికల్ని తయారీ స్థానంలో చూడడం, షాపింగ్ మత్తు ఆవహించిన మా మూకని ఓ కుదుపు కుదిపి, బస్సెక్కించి, పదకొండున్నరకల్లా ఇన్నీ ముగించుకుని కేవలం గంట లేటు’గా ప్రెస్‌మీట్‌కి తీసుకురాగలగడం…. అబ్బ! ఎక్కడ చేశారండీ బాబు ఈ మేనేజ్‌మెంటు కోర్సు? ఎలాగోలా కోప్పడి బస్సెక్కించి, బస్సులో, నవ్వుతూ ( బస్సు పని బస్సు చేసుకుపోతుండగా) అందరికీ క్షమాపణలు చెప్పేయడం మా ‘మాస్టర్ స్ట్రోక్’ అంటే ఒప్పుకుతీరాల్సిందే.
ప్రెస్ మీట్ ఎంత బాగా జరిగిందనీ! నాక్కూడా మిగిలిన రచయితుల్ర దృక్పథం అర్థమయేందుకు సహాయపడింది ఆ మీటింగ్. ఇక పట్టిసీమ పయ్రాణం…. పట్టిసీమ. అదేంపేరో… ప్రకృతిమాతకి గారాల పట్టి కదా ఆవిడ. అందుకేమో. అయితే మాత్రం మనసుల్ని ఇంతగా పట్టేయాలా? కళ్ళు తిప్పుకోలేనంతగా కట్టేయాలా? పొద్దుటినుంచి సాయంత్రం దాకా, ఎక్కడోగాని మరో పడవ కూడా కనిపించని ఏకాంతం, రేడియో తరంగాలు కూడా అంతగా చికాకు పరచని నిశ్శబ్ద ప్రశాంత వాతావరణం. ఎవరైనా చూస్తే బావుండదేమో అనే సంకోచం లేకుండా హాయిగా నవ్వుకోగలగడం! ప్రకృతి కాంత, ‘మౌనరాగాల’ నేపథ్యంలో, ‘ నిశ్చల నాట్యాలు’ చేస్తుంటే విభ్రాంతిగా కళ్ళప్పగించి చూస్తూ వుండిపోవడం… అయినా దేహానికి కావలసిన అన్నపానాలు ‘ఏయే వేళల కోరే వాటిని ఆయా వేళల’ అందిస్తూ అనుచరగణం… గోపికల మధ్య కృష్ణుడిలా అందరి పేమ్రనూ ఆక్సెప్ట్ చేస్తూ మీరు!
విమాన ప్రయాణంలో అత్యవసర వస్తువులన్నీ ఎలా వాడాలో వివరించినట్టు మీ కొబ్బరి బూరల డెమో! అన్నట్టు – ఎవరెంత అభ్యంతరాలు లేవదీసినా ముందుగా చేసిన ప్రకటన ప్రకారం మీరు నాకొక కానుక బాకీ ఉన్నారు సుమా…. గుర్తులేదంటారా? అదేనండీ… కొబ్బరి బూరని విజయవంతంగా తయారుచేసి ఊది చూపించాను కదా! వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే జడ్జిగారికి చెప్పాల్సి వస్తుంది మరి! అందరికీ అన్నీ సమకూర్చిన తరవాతే టీ అయినా టిఫిన్ అయినా మీరు తీసుకోవడం… మరీ ఇంత బాగా ‘గారాబం’ చేసి, చివరికి ఎవరిళ్ళకి వాళ్ళని పంపించేస్తే ఎలాగండీ మరి?
సత్యగారూ! నిజం చెప్పొద్దూ… పాపికొండల మధ్య మనం గడిపిన ప్రతిక్షణం ఒక వజప్రు తునక. మరి అన్ని వజాల్రతో చేసిన పతకం మన ఆనాటి యాత్ర. మన పయ్రాణమంతటికీ మకుటంలాగా మనసులో నిలిచిపోయింది ఆ నౌకా(!) విహారం. అడవిలో ఆ మౌనమందిరం, కొబ్బరిపూలు, ఆ నడక, ఆ అనుభూతి ఒక చల్లని మలయ సమీరం. చివరికి చీరసారెలతో మమ్మల్ని మా యిళ్ళకి సాగనంపారు కదా. వీటన్నిటికీ కలిపి ఒక రెండు పదాలు ‘థ్యాంక్యూ’ వాక్యం చెప్పేసి సరిపెట్టేయడం సరికాదని తెలిసినా అదికూడా చెప్పకపోవడం న్యాయం కూడా కాదు కదా! అందుకే ఎ వెరీ బిగ్ థ్యాంక్యూ! మళ్ళీ నియర్ ఫ్యూచర్ లో మరో ట్రిప్ కోసం ఎదురుచూస్తూ… ప్రేమతో…
-నాగలక్ష్మి, హైదరాబాద్