భూమిక సత్యవతికి,
కంగ్రాచ్యులేషన్స్, థాంక్యూ, నమస్తే. తెలుగు రచయితుల్రతో మీరు అరెంజ్ చేసిన ఉమెన్ రైటర్స్ క్యాంప్ ( సెప్టెంబర్ 16,17,18) ఎంత బాగా జరిగిందంటే, విశ్వనాథవారి కిన్నెరసాని నురుగు తరగలతో నెమరు వేసుకున్నట్టు, మేమంతా ఇంకా పట్టిసీమ, పాపికొండల్నే నెమరేసుకుంటున్నాం. అసలు పదిమందిని పోగేసుకుని వెళ్ళడమే కష్టమనుకుంటే మీరు ఏకంగా మా ఇరవయ్యేడు మందిని తీసుకెళ్ళడం, దానికి కావలసిన ఏర్పాట్లు, రైల్వే రిజర్వేషన్ మొదలుకుని, విడిది, భోజనం, లోకల్ ట్రాన్స్‌పోర్ట్ అస్సలు ఎక్కడా ఏ పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ప్రోగ్రామ్ ఒంటిచేత్తో నిర్వహించడం మీకే సాధ్యం సుమా! దానికి హార్టీ కంగ్రాచ్యులేషన్స్! ఇక మనం వ్యక్తిగతంగా,కుటుంబాలతోనూ, మనకు బాగా దగ్గరి వాళ్ళతోనూ టూర్స్ వెళ్ళి ఆనందించడం వేరు, ఇలా రచనలు మామే పరిచయం వుండి వాటిని రాసినవారు కొంత అపరిచితంగా వున్నవాళ్ళం కాస్తా ఈ ట్రిప్ తో దగ్గర స్నేహితులమై ఓ సమిష్టిగా ఓ గుర్తింపుని, ఆనందాన్ని పంచుకోవడం నాకు చాలా నచ్చిన విషయం. అందుకు లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. భవిష్యత్తులో మీరింకా ఎన్నో కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించాలని, నిర్వహిస్తారు, అని ఆశిస్తూ మన సమిష్టి ఆనందానికి మరొక్కసారి హిప్, హిప్ హుర్రే.
-సుజాతా పట్వారి, హైదరాబాద్