సత్యా ! ప్రియా!!
గోదావరి పడవ (లాంచి, ప్రయాణం మత్తు వదలలేదు. ఇంకా చెప్పలేక పోతున్న అనుభూతులెన్నో భాషకు అందడం లేదు. చాలా కొత్తగా, గమ్మత్తుగా వుంది. మళ్ళీ మరోసారి పేమ్రలో పడినట్లు అనందంగా వుంది. ఇంత అందమైన అనుభవాల్ని మనం ఎందుకు మళ్ళీ మళ్ళీ పొందకూడదు? మనకు సాధ్యం కానిది ఏముంది. అనుకుంటే చేయగలం.
గోదావరి వరద వార్తలు వింటుంటే తల్లి గోదావరి మనకోసం తన వరద ఆపుకొని మనకన్ని అందాలు చూపించిందోమో అనిపిస్తోంది. నేను స్టేషన్కు వస్తున్న దారిలో అనుమానమేసింది మన కాంప్ వాయిదా పడిందేమో. వాకబ్ చేయకుండా బయలు దేరానే, దగ్గర సెల్ లేదే అని. అయితే మళ్ళీ భరోసా. అలాంటిది వుంటే భూమిక నుండి ఫోన్ వచ్చేది కదా అని. వర్షాలు కురుస్తున్నా,రాత్రిళ్ళు వానలు కురిసి, పగలు చల్లని చిరుగాలులు వీస్తూ. ఓహ్! ఎంత ఆనందం! పంచభూతాలు రచయిత్రులను శ్లాఘించాయి. ఈ అద్భుతమైన దినాలు మనందరం ఈ జీవితకాలం గుర్తుంచుకోదగినవి.
సత్యా, నీకు నీవే ‘మిలటరీమాన్’గా వూహించుకోకు. నీ ఆలోచనల్ని, అనుభూతుల్ని, నీ రక్తసంబంధాల్ని మీ, ఆయన (నీ ) స్నేహబంధాల్ని అన్నింటిని రచయితుల్ర క్యాంపు కోసం వినియోగించావు. ప్రతి చోట అమూల్యమైన అతిధ్యం. ఆతిధ్యంతో అలరించామని వారు పొందిన ఆనందం. ఎప్పుడూ వాడిపోని మధురానుభూతులు. టైంకు అనుకున్నవన్నీ చూసి రావడం ఈ క్రమశిక్షణ వెనుక వున్న దీక్ష చాలా గొప్పది. నీ వెనుక వుండి నడిపించిన గీత, మీ స్నేహం ఇలాగే కలకాలం వుండాలని అభిలషిస్తూ పేమ్రతో…
-ఎస్. జయ, హైదరాబాద్