జూపాక సుభద్ర
ఆ మద్దెన చెన్నైలో ‘క్యాస్ట్ ఔటాఫ్ డెవలప్‌మెంట్’ అనే పేరుతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్‌కంటే వర్క్‌షాపు అనొచ్చు. దక్షిణ భారత రాష్ట్రాలైన కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలనుంచి దళిత సంఘాలు, మహిళా సంఘాలు, దళిత ఎన్‌జివో సంఘాలు మహిళా ఎన్‌జివో సంఘాలు పాల్గొన్నాయి.
దళితులు అభివృద్ధి చెందడానికి ఏంచేయాలి? ప్రభుత్వాలు చట్టాలు చేసినయి, అనేక రాష్ట్ర కేంద్ర పథకాలున్నయి, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషండ్లున్నయి. అయినా దళితులు ఎందుకు అభివృద్ధి చెందడం లేదు ఏమిటి కారణాలు, ఎక్కడ లొసుగులు వాటిని అధిగమించడానికి ప్రభుత్వాల్ని ఎలా అలెర్ట్ చేయాలి? ఎలా చైతన్యం చేయాలి సమాజాన్ని అనే అంశాలమీద చాలా విస్తృతంగా చర్చ జరిగింది. అయితే ఈ చర్చల్లో పాల్గొన్న వివిధ సంగాల దళితులు వాల్ల కోణాల్ని వాల్లు చెప్పుకొచ్చారు. దాంట్లో దళిత మహిళా సంగాలు, దళిత మహిళా ఎన్‌జివో సంగాలొచ్చినయి.
ప్రధానంగా కేరళ తమిళనాడునుంచి ఎక్కువగా వచ్చిండ్రు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఎవరూ రాలేదు. ఎందుకు రాలేదంటే ఏపీలో దళిత మహిళలు నాయకత్వంగా వున్న సంగాలు గానీ ఎన్‌జీవోలు లేరనీ, అందికే పిలవలేకపోయామని అక్కడి ఆర్గనైజర్స్ చెప్పారు. యిక ఆ దళిత మహిళా సంగాలు, వారి ఎన్‌జివో సంగాలు చాలా అంశాలు చాలా సాధికారికంగా మాట్లాడిండ్రు. పారిశుద్ద్య కార్మికులు, పాకీపని, యింకా భవననిర్మాణం, ఇంటిపని మనుషులు యింకా అనేక అనార్గనైజ్‌డ్ సెక్టార్స్, ఆర్గనైజ్‌డ్ సెక్టార్ నుంచి వచ్చిండ్రు. వీరి నాయకులు ఆంధ్ర, కర్నాటక లాగ ఆధిపత్య కులాల మహిళలు కాదు దళిత మహిళలే వారి నాయకులు. మేము బలాన్ని పెంచుకునేందుకు సాధికారత సాధించుకునేందుకు పోరాడుతున్నామనీ, వారు పనిచేసే రంగాల్లో ఎలాంటి కుల, జెండర్ వివక్షలకు గురవుతున్నారో! దళిత మహిళా నాయకుల అనుభవాలు క్యాడర్ లీడర్ సమన్వయంతో చెప్పిన సందర్భాలు యిక్కడ చూడము. దళిత మహిళలే తమవారికి నాయకత్వంగా వుండడము, తమ ఆధ్వర్యంలోనే ఎన్‌జీవో సంస్థలు పనిచేయడం చాలా న్యాయంగా అనిపించింది. ఏపీలో మహిళా సంగాలు, ఎన్‌జీవో సంగాలు అన్నీ ఆధిపత్యకులాల ఆడవాల్ల ఆధ్వర్యంలోనైనా వున్నాయి లేదా మగవాళ్ల్ల అజమాయిషీలో పంజేసేవే వున్నయి. యిక్కడ దళిత మహిళా సంగాలు, దళిత మహిళలే నడిపించే ఎన్‌జివో సంస్థలు ఎందుకు లేవు? ఇక్కడి శ్రామిక దళిత స్త్రీలు స్వతంత్రంగా సంగాలు పెట్టుకొని వారి సమస్యల్ని వారే విశ్లేషించి గొంతెత్తే వాతావరణం లేదు. ఏ తెలియని శక్తులు, కనిపించని యుక్తులు యిక్కడి దళిత మహిళల్ని తమ సమస్యల పట్ల తామే స్వతంత్రించి పోరాడినా నాయకత్వాల్ని అడ్డుకుంటున్నాయి? మహిళా చేతన, చైతన్య మహిళా సమాఖ్య, ఐద్వా, పివోడబ్ల్యు వంటి మహిళా సంగాలు, అస్మిత, అన్వేషిలాంటి ఎన్‌జివో సంగాల నాయకత్వమంతా ఆధిపత్యకులాల స్త్రీలే. ఏమైనా అంటే మేము దళిత శ్రామిక మహిళల్ని ఉద్దరిస్తున్నాము అని చెప్తారు. దళిత మహిళా నాయకత్వాన్ని ఎదగనివ్వరు.
అనేక ఆర్గనైజ్‌డ్ అనార్గనైజ్‌డ్ సెక్టార్స్‌లో పంజేసే దళిత మహిళల నెత్తిమీద ఆధిపత్య కులాల స్త్రీలు నాయకత్వం నెరపడం దాన్ని యింకా కొనసాగిస్తూనే వుండడం విషాదం. తమిళనాడు, కేరళలో లాగ దళిత స్త్రీలకు దళిత స్త్రీలే నాయకత్వం వహించుకునే ఒక సామాజిక న్యాయం ఆంధ్రప్రదేశ్‌కి ఎప్పుడొస్తుందో కార్మిక శ్రామికులుగా వున్న దళిత, బీసీ, ఆదివాసీ మహిళ మీద శ్రమ సంబంధం లేని శ్రమ విలువ తెలువని ఆధిపత్యకులాలు నాయకత్వాలు వహించడం ఎప్పుడు పోతుందో. శ్రమచేసే ఉత్పత్తి కులాల మహిళల మీద ఆధిపత్య కులాల పురుషులు, దళిత మగవాల్లు, ఆధిపత్య కులాల స్త్రీలలో దళిత స్త్రీల సాధికారం సాధ్యమా! వాల్లు అస్వతంత్రులుగా, పాలితులుగా వివిధ సంగాల్లో ఎన్‌జీవోలల్లో తమ సమస్యల్ని తమకోణంనుంచి చెప్పుకోవడం చర్చించడం జరగడం లేదు. ఆధిపత్య కులాల స్త్రీలు నాయకత్వం వహించే మహిళా సంగాలు దళిత స్త్రీల కులం కుటుంబం, నిరక్షరాస్యత, లైంగికత, శ్రమదోపిడి, వారిపై వున్న జోగిని లాంటి సమస్యలపట్ల దళిత్ జెండర్ పర్స్‌పెక్టివ్‌తో అవగాహన చేసుకుని ఆవైపుగా పరిష్కరించే వాతావరణం కనిపించదు. ఆధిపత్య కుల జెండర్ పర్స్‌పెక్టివ్‌నే మూసగా దళిత మహిళకు ఆపాదించడంవల్ల దళిత మహిళలు ఆ సమాజంలో తను ప్రత్యేక అస్తిత్వాన్ని అవాచ్యం చేయబడే ప్రమాదానికి లోనవుతున్నరు. దాంతో అభివృద్ధికి ఆమడదూరంగా వుంచబడ్తున్నారు. ‘జోగినీ విమోచన సంస్థ’ ‘దళిత స్త్రీ శక్తి’ వంటి దళిత మహిళా ఎన్‌జీవోలున్నా వాటి నిర్వహణ రిమోట్ వారి చేతిలో వుండదు.
యిట్లా ఒక్క ఏపీలోనే కాదు దేశమంతటా కమ్యూనిజం, విప్లవం, దళిత, స్త్రీల పేరుతో పనిచేస్తున్న సంస్థలన్నింటిలో నాయకత్వమంతా మగవాల్లు, ఆధిపత్య ఆడవాల్లు, శ్రమజేసే కిందికులాల ఆడవాల్లంతా వీరి పట్టులో, కబలింపులో, కబందాల్లో వున్నారు. యీ పరిస్థితి మారాలి. దళిత బహుజన, ఆదివాసీ కులాల మహిళలంతా పైన చెప్పినవారి ధృతరాష్ట్రకౌగిలినుంచి బైట పడితేగానీ తమ పీడనల్ని ఏ మోహమాటాలు లేకుండా, నిష్కర్షగా, స్వతంత్రంగా తమ దృష్టికోణాల, తమ అస్తిత్వాల విశ్లేషణలతో చర్చచేస్తారు పోరాడ్తారు. అప్పుడే సమాజము ముందుంచి సాధికారత సాధించేదిశగా పయనిస్తారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
జూపాక .సుభధ్ర గారు ,చాలా బాగా చెప్పారు .వారికి నా క్రుతజ్నలు. …………………………మీ…………ఘనపురం.అనిలు కుమారు …………….9704793577
ముందు మహిళా నాయకత్వం ఎదగాలి. దళిత మహిళా నాయకత్వం అంటే ఇప్పుడున్న దళిత రాజకీయ నాయకుల భార్యల నాయకత్వమా?