వీధిబాలల వికాసం- స్వచ్ఛందసంస్థల పాత్ర-ఒక పరిశీలన

– టి.మనోహర స్వామి, టి.సదయ్య

పరిచయం

నేటి బాలలే రేపటి పౌరులు, బాలలు మన జాతీయ సంపద, వారిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం సమాజం మీద ఉందని భారత రాజ్యాంగం చెపుతుంది. అయితే నేడు సమాజంలో బాలల బ్రతుకు తీరుతెన్నులు చూస్తే తీవ్రమైన భయాందోళనలు కలుగుతున్నవి. మనదేశ జనాభాలో (మూడవ వంతుగా) ఉన్న బాలల హక్కులను రక్షించి దేశాన్ని అభివృద్ధి పథంలోనికి తీసుకెల్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. బాలల హక్కుల పరిరక్షణ కోసం చట్టాలు చేసినా ప్రభుత్వాలు మారినా బాల్యాన్ని అనుభవించే హక్కు, ఆట, పాటలతో గడపాల్సిన బాల్యం శ్రమకు అంకితం చేసి పాలేర్లుగా, వీధి బాలలుగా, బాల కార్మికులుగా, హోటల్లలో కూలీలుగా, వాహనాలపై క్లీనర్లుగా, బాలికలు బాల వేశ్యలుగా మలచబడి ఎంతో హీనంగా, దీనంగా బ్రతుకులీడుస్తున్నారు.

వీధి బాలలు, ప్రస్థుత పరిస్థితి

వీధి బాలలు వివిధ కారణాలతో ఇల్లు వదలివచ్చి ప్లాట్‌ ఫామ్‌ జీవితానికి అలవాటు పడి ఫుట్‌పాత్‌లపై ఒకరిద్దరుగా కాకుండా, గుంపులు గుంపులుగా (అయిదు నుంచి పదిమంది) వరకు నివసిస్తారు. వీరు సంచార జీవులు, వీరు ఎవరి అదుపు, ఆజ్ఞలు లేనందున రకరకాల చెడు అలవాట్లు కలిగి ఉంటారు. ఉదాహరణకు సిగరెట్‌, గంజాయి, మద్యం, గుటకాలు, తంబాకు, వైట్‌నర్‌, (ERAZEX) మరియు హోమోసెక్స్‌వాల్‌టీ వంటి లక్షణాలు కలిగి ఉంటారు.

వీరిలో మరికొంత మంది సంఘ విద్రోహ శక్తులుగా కూడా తయారవుతున్నారు.

వీరిలో చాలామంది శ్రమ దోపిడి, అత్యాచారాలు లైంగిక వేదింపులకు గురి అవుతున్నారు. చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు సుఖవ్యాధులు వంటి దీర్ఘకాలిక రోగాలకు గురి అవుతున్నారు. వీరిలో చాలా మంది హెచ్‌.ఐ.వి. ఎయిడ్స్‌ లాంటి ప్రమాదకర వ్యాధుల బారిన పడిన వారు కూడ ఎక్కువసంఖ్యలో ఉన్నారు. మద్యం సేవించి మత్తులోకదులుతున్న రైలు ఎక్కి జారిపడి మరణించిన వారు, కాళ్ళు, చేతులు కోల్పోయిన వారు మరియు సిగరెట్‌, గంజాయి, మత్తుపదార్థాలకు బానిసలై బాల్యంలోనే టి.బి. మరియు ఛాతి సంబంధమైన వ్యాధుల బారిన పడుతున్నారు. టాల్విన్‌ రసాయనముతో తయారైన (Erias Ex) వైట్‌నర్‌, డైల్యూట్‌ సొల్యూషన్‌ సేవించి అనతి కాలంలోనే న్యూరోసైకిక్‌గా మారి భయంకరమైన క్యాన్సర్‌ వ్యాధితో చనిపోతున్నారని Helping Hand De-Addiction Centre, Warangal నిర్యాహకులు డా|| దేవర కొండ రాధాకృష్ణ, ప్రముఖ న్యూరో సైకియాట్రిస్టు తెలియజేస్తున్నారు.

ప్రతిరోజూ విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, గుంటూరు, గూడూరు, నెల్లూరు, హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలకు అయిదు నుంచి పదిమంది వీధిబాలలు, మరికొన్ని చోట్ల 10 నుండి 25 మంది వీధి బాలలు వస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 3 లక్షలకు పైన వీధి బాలలున్నారు. హైదరాబాద్‌లో మాత్రం 50 నుంచి 75 వేల వీధి బాలలున్నారని సామాజిక సేవా భావంతో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు మరియు మేధావి వర్గాలు తెలియజేస్తున్నాయి.

వీధి బాలలు ఇల్లు వదలి రావడానికి కారణాలు:- ముఖ్యంగా వీధి బాలలు ఇల్లు వదలి ఇలా మారడానికి, తమ కుటుంబాలలో ఉన్న పేదరికం నిరక్షరాస్యత, కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించక కొందరు, ఆక్రమ సంబంధాల వలన కుటుంబాలు విచ్ఛిన్నమై కొందరు, ఆర్థిక పరిపుష్ఠి ఉన్నప్పటికీ, తల్లి దండ్రుల మధ్య సమన్యయలోపం, దాని ప్రభావం పిల్లలపై పడి లేత వయస్సులో బాధలను భుజాలపైకెత్తుకొని గమ్యాన్ని వెత్తుక్కుంటూ వీధుల్లోకొచ్చి అనేకరకాల అవమానాలకు గురి అవుతూ వీధిబాలలుగా అవతారమెత్తుతున్నారు. మరికొంత మంది పిల్లలు మిత్రుల ప్రోద్భలంతో వచ్చి ఇంటికెల్లకుండా ప్లాట్‌ ఫామ్‌ జీవితానికి అలవాటు పడుతున్నారు.

పునరావాస చర్యలు:- బాలల హక్కుల పరిరక్షణకై 1986లలో జువెనైల్‌ జస్టిస్‌ ఆక్ట్‌ 2000 సం||రములో జువెనైల్‌ జస్టిస్‌ కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఆక్ట్‌ అమలులోకి వచ్చింది. ఈ చట్టం నిర్లక్ష్యానికి గురికాబడిన పిల్లలు, తప్పుచేసిన పిల్లలు, అనాధలు పకృతి వైపరీత్యానికి గురైన వారిలో మానసిక పరివర్తన తీసుకురావాలనే సదుద్దేశముతో దేశమంతట పిల్లలందరికి ఒకే చట్టం ఉండాలని పై చట్టాలను రూపొందించినారు.

మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు జువెనల్‌ హోమ్‌ వారి సహాకారముతో పిల్లలలో ప్రతిభ పాటవాలను వెలికితీసి సమాజంలో వారికొక సముచిత స్థానము కల్పించుటకు కృషి చేస్తున్నారు. వీధి బాలల కోసం రాష్ట్రంలో పలు స్వచ్ఛంద సంస్థలు యాక్షన్‌ ఎయిడ్‌ ఇండియా, డాన్‌బోస్‌కో నవజీవన్‌, కేర్‌ అండ్‌ కేర్‌, ఎ.పి క్రాఫ్‌, వర్డ్‌ విజన్‌, అంకురం, హైదరాబాద్‌ కౌన్సిల్‌ ఫర్‌ హ్యూమన్‌ వెల్‌ఫేర్‌ (HC HW), న్యూహోప్‌, SOS (సేవ్‌ అవర్‌ సోల్స్‌) తదితర సంస్థలతోపాటు కొన్ని చారిటబుల్‌ ట్రస్టులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీధి పిల్లల సంరక్షణ మరియు రక్షణ కోసం పనిచేస్తున్నాయి.

వీధి బాలలలో మొదట మానసిక పరివర్తన కోసం (De Addiction) కౌన్సిలింగు నిర్వహించి, క్రమేపి వారి వారి అభిరుచులకు అనుగుణంగా వృత్తి శిక్షణలలో తగు శిక్షణ ఇప్పించడం, చదువుపట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించడం జరుగుతుంది.

యాక్షన్‌ ఎయిడ్‌ సహాకారముతో పనిచేస్తున్న బాలతేజస్సులాంటి సంస్థలు ప్లాట్‌ ఫామ్‌పై బాలలను చేరదీసి, విద్యార్థి క్యాంప్‌ మరియు Back to Home Camp అని రెండు శిభిరాలు వేరు వేరుగా నిర్వహించడం జరుగుచున్నది. Back to Home Camp లలో వీధి బాలలను 40 రోజుల పాటు మారుమూల ప్రాంతములలో జనజీవనానికి దూరంగా తీసుకెళ్ళి విద్య, వైద్యం, భోజన సదుపాయాలు కల్పించి, ధ్యానము, యోగ, నీతి కథల ద్వారా వారిలో మానసిక పరివర్తన తీసుకవచ్చి తమ తప్పులను తాము తెలుసుకొని కుటుంబ సభ్యులతో గడుపుటకు కౌన్సిలింగు నిర్వహించడం, మరియు అనాధ పిల్లలకోసం కూడా 40 రోజులు ఇదేవిధంగా కౌన్సిలింగు నిర్వహించి వారి అభిరుచులకు అనుగుణంగా విద్య మరియు వృత్తి శిక్షణలలో తగు ప్రావీణ్యతను సంపాదించుకునేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ వారి ఆర్థిక సహాకారముతో గుంటూరులోని శ్రీ వీరహనుమాన్‌ యువజన సేవా సమితి, తిరుపతిలోని పాస్‌, హైదరాబాద్‌లోని ప్రగతి స్వచ్ఛంద సంస్థ మొదలగు స్వచ్ఛంద సంస్థలు వీధి పిల్లలకు లైంగిక ఆరోగ్య విషయాల పట్ల మరియు HIV, AIDS ల పట్ల అవగాహన కల్పిస్తు తమను తాము వీటి బారిన పడకుండా అవగాహన కల్పిస్తు కాపాడుకునే విధంగా జీవన నైపుణ్యాలను Life Skills నేర్పించడం జరుగుతుంది.

ముగింపు:

ఐకరాజ్య సమితి నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా 1992 నుంచి భారతదేశం బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వేతర సంస్థలు కూడా వీధిబాలల సంక్షేమానికి కృషి చేస్తున్నాయి. ఏ ప్రజాభివృద్ది కార్యక్రమమైన సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగసామ్యం తప్పనిసరి. బాలల హక్కుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే బాలల కోసం స్నేహాపూర్వక సమాజం ఆవిర్భవిస్తుంది. ఈ సమాజ స్థాపనకోసం మనమందరం నడుం బిగించి కల్సికట్టుగా కృషి చేస్తేనే సాధ్యపడుతుంది. దేశ భవిష్యత్తును సరియైన దిశలో నడిపించిన వారం అవుతాము. వీధి బాలలహక్కుల పరిరక్షణ, సంక్షేమం మనందరి బాధ్యత.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో