జెండర్‌ మరియు మీడియా వర్క్‌షాప్‌

పి. కల్పన

భూమిక, పాప్యులేషన్‌ ఫస్ట్‌ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల మీడియా వర్క్‌షాప్‌ను ప్రగతిరిసార్ట్స్‌లో సెప్టెంబర్‌ 19, 20 తేదీల్లో నిర్వహించారు. అన్ని ప్రింట్‌ మరియు ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన 34 మంది విలేఖరులు హాజరయ్యారు.
భూమిక సెక్రటరీ సత్యవతి ఉ. 9.30కు వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. సత్యవతి మాట్లాడుతూ మీడియాలో వస్తున్న కొన్ని కార్యక్రమాలు, ప్రకటనలు మహిళలను చాలా కించపరుస్తూ ఉన్నాయని తెలియచేశారు.  ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చే చాలా కార్యక్రమాలు జెండర్‌ అవగాహన లేకుండా తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత అక్కడకు విచ్చేసిన అందరిని, ఈ వర్క్‌షాప్‌ ఏర్పాటుచేయటానికి సహకరించిన శారద గారిని(పాఫ్యులేషన్‌ ఫస్టు), యుఎఫ్‌ఎఫ్‌పిఏ, అనూజ గులాటిగారిని ఆహ్వానించారు.
మొదటి రోజు వర్క్‌షాప్‌ని శారదగారి ప్రెజెంటేషన్‌తో మొదలు పెట్టారు. లాడ్లీ మీడియా అడ్వకసీ గురించి వివరంగా చెప్తూ, ఈ పాప్యులేషన్‌ ఫస్ట్‌  జాతీయ స్థాయిలో   మూడు వేరు వేరు అంశాలకోసం పనిచేస్తుంది. మాధ్యమ్‌ కార్యక్రమం విద్యార్థులలో చైతన్యం కోసం, ఆమ్‌చీ(ఎఎమ్‌సిహెచ్‌ఐ) కార్యక్రమం గ్రామాల అభివృద్ధికోసం, లాడ్లీ ఆడపిల్లల సంరక్షణ బాధ్యత, పిసిపిఎన్‌డిటి చట్టం అమలుకోసం కృషిచేస్తున్నాయని చెప్పారు. ఈ లాడ్లీ కార్యక్రమంలో భాగంగానే ఈ వర్క్‌షాప్‌ను పెట్టడం జరిగిందన్నారు. ఈ వర్క్‌షాప్‌ ముఖ్య ఉద్ధేశ్యాలు: ఎవరైతే మీడియాతో కలిసి పనిచేస్తున్నారో, రచయితలుగా ఉంటున్నారో వారికి  జెండర్‌ అంశాలమీద అవగాహన కలిగేలా చెయ్యటం, లాడ్లీ బహుమతుల ద్వారా వారిని ప్రోత్సహించడం, ప్రకటనలు చేసే వృత్తిలో ఉంటూ జెండర్‌ మీద సున్నితమైన అవగాహన కలిగి ప్రకటనలు వచ్చేలా వారిని సెన్సిటైజ్‌ చెయ్యడం, విద్యార్థులకు, విలేఖరులకు ఇలా ప్రతి ఒక్కరికీ జెండర్‌ మీద అవగాహన కలిగేలా వర్క్‌షాప్‌లు పెట్టడం వంటివి తమ కార్యక్రమాల్లో భాగమని చెప్పారు.
ప్రొ. కె. నాగేశ్వర్‌ రావు మాట్లాడుతూ జెండర్‌ అనేది ఒక మహిళకు సంబంధించినది మాత్రమే కాదని ఇది అనేక విధాలుగా అనేక దృష్టికోణాలలో చూడవలసి ఉన్నదని చెప్పారు. యుఎన్‌డిపి అంచనాల ప్రకారం మహిళలు అనేక రంగాల్లో చాలా అభివృద్ధి పొందుతున్నారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, రాజకీయాలలో ఎదుగుదల ఉంది. ఇలాంటి అభివృద్ధి కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా సాధ్యమౌతుంది.  ఇలా జెండర్‌కి సంబంధించిన శిక్షణా కార్యక్రమాలు మీడియా వారికే కాకుండా, లెజిస్లేటర్స్‌ (జిలివీరిరీజిబిశితిజీలిరీ)కి కూడా పెడితే బాగుంటుందని, దీని వలన సోషల్‌ పాలసీలో  కూడా మార్పులు తీసుకు రావచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆయన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజుల్లో టెలివిజన్‌లో ఆడశిశువుల హత్యలు, బయటపడేయటం చూపించడంవల్ల మహిళలే ఎక్కువగా నిందలు అనుభవించాల్సి వస్తుందని.  జెండర్‌ బడ్జెట్‌ మీద మాట్లాడుతూ మహిళలకోసం ఎలాంటి ప్రత్యేకమైన బడ్జెట్‌ లేదని సృష్టీకరించారు.
జెండర్‌ మరియు పితృస్వామ్య వ్యవస్థ: ఎపిఎంఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన పద్మ మాట్లాడుతూ, జర్నలిస్టులను కొన్ని ప్రశ్నలను అడుగుతూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. మహిళలకు ప్రత్యేకమైన చట్టాలు ఎందుకు అవసరం? ఆడపిల్లలకు తక్కువ స్థాయి నిర్మాణం ఎందుకు? మనం అందరం నిజంగా మహిళల ఉన్నతస్థాయికోసం పనిచేస్తున్నామా? అని ప్రశ్నిస్తూ దీనిలో భాగంగా మహిళలకు సంబంధించిన అనేక రకాల సమస్యలను, వాటి రూపాల్ని గణాంకాల ద్వారా వివరించారు. వాటిలో ముఖ్యమైనవి లింగవివక్షత, అవిద్య, అనారోగ్యం, ఉద్యో గాలు, వనరుల మీద హక్కు, రాజకీయాలు, హింస, మహి ళల స్థాయి మొదలగునవి. అంతే కాకుండా జెండర్‌, సెక్స్‌ అనే ఈ పదాలగురించి చాలా వివరంగా చెప్తూ, రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా వివరంగా అందరికీ అర్థం అయ్యేలా వివరించారు.
ఆ తర్వాత గ్రూప్‌ డిస్కషన్‌ జరిగింది. అందులో పద్మగారు మాట్లాడుతూ టి.విలలో వచ్చే వాణిజ్య ప్రకటనలలో మహిళలను ఎలా చూపిస్తారో, అసలు ఆ ప్రకటనకు అవసరం ఉన్నా, లేకున్నా మహిళల్ని కించపరుస్తున్నట్టుగా ఉండే కొన్ని అంశాలను చర్చలోకి తెచ్చారు. శారదగారు మాట్లాడుతూ మహిళలకు ఉన్నతవిద్య అనే కాకుండా సాంకేతిక విద్యకూడా అవసరమని చెప్పారు.
సత్యవతి ఈ వర్క్‌షాప్‌ మీడియా యాజమాన్యాలకు, సియిఓలకు కూడా  ఇస్తే బాగుంటుందని అన్నారు.
జెండర్‌/లింగనిర్ధారణ: యుఎన్‌ఎఫ్‌పిఎ నుండి వచ్చిన అనూజగులాటి లింగనిర్థారణ కారణాలు, సమస్యలు అనే అంశంతో ప్రారంభించారు. దీనికి సంబంధించిన గణాలంకాలను  కూడా ప్రదర్శించారు. వాటిలో ముఖ్యమైనవి.
లాన్సర్‌ అనే పత్రిక గణాంకాల ప్రకారం 11 లక్షల గృహాలలో 5 లక్షల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని చెప్పారు. రోజుకి కనీసం 1600 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతున్నారు. 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్న మన దేశంలో 27 రాష్ట్రాలలో లింగ నిష్పత్తి చాలా వేగంగా తగ్గిపోతున్నట్లు వ్యాఖ్యానించారు. వీటిలో ముఖ్యమైనవి రాజస్థాన్‌, మహరాష్ట్ర, యు.పి, జమ్ముకాశ్మీర్‌ మొదలైనవి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఈ సమస్య పట్టణాలలో కంటే పల్లెలో పెరుగుతున్నట్లు ఆమె చెప్పారు.
అనూజ తన రెండవ  ప్రజెంటేషన్‌లో ”వై ఆర్‌ డాటర్స్‌ అన్‌వాంటెడ్‌?”  అనే అంశం మీద చర్చించారు.  మనదేశంలో ఉన్న నమ్మకాలు, విలువలు, సామాజిక సమస్యలు వంటి అనేక కారణాలు ఆడపిల్లలకు జన్మనివ్వకుండా చేస్తున్నాయి. లింగనిష్పత్తి తగ్గినప్పుడు దేశంలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. హింస అనేది భారీ స్థాయిలో పెరుగుతుంది. మహిళల యొక్క సామాన్య హక్కులు కూడా నశిస్తాయి, అత్యాచారాలు, మహిళలపై మానసిక, ఆరోగ్య లైంగిక దోపిడీలు జరిగే అవకాశం ఎక్కువ. దీని కారణంగా ఎస్‌టిడిలు, హెచ్‌ఐవి/ఎయిడ్స్‌లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌ని మనం పరిశీలిస్తే ఈ సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతోంది. 2011 జనాభాలెక్కలు పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది.పిసిపిఎన్‌డిటి ఆక్ట్‌ అమలు గురించి చెప్తూ… 1994లో ఈ చట్టం అమలులోకి వచ్చిందని, దీనిలో మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ పాత్ర ఉన్నదని, పోలీసులు ఈ చట్ట పరిధిలోనికి రారని చెప్పారు. ముందుగా మహారాష్ట్రలో 1987లో ప్రారంభించారు. 1994 నుండి అన్ని రాష్ట్రాలకు దీన్ని విస్తరింపచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం అమలు: ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగ అధికారి భారతిగారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అల్ట్రాసౌండ్‌  పరికరాలు ఎక్కువగా వాడటం వలన ఈ సమస్య ఎక్కువ అవుతోందని చెప్పారు. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిస్తున్నామని చెప్పారు.
రెండవరోజు సెషన్‌ను సత్యవతిగారు ప్రారంభిస్తూ భూమిక ఎపుడు స్థాపించబడింది, హెల్ప్‌లైన్‌  ప్రారంభం, ఎలా సక్సెస్‌ అయిందో వివరించారు. అలాగే సివిల్‌ సొసైటీ ద్వారా చేస్తున్న అనేక కార్యక్రమాలను, సదస్సులను గురించి వివరించారు.
ఆ తర్వాత రిసెర్చ్‌ అసోసియేట్‌గా భూమికలో పనిచేస్తున్న ముజీబా మహిళల సమస్యలగురించి రిపోర్ట్‌ను ప్రజెంట్‌ చేశారు. దీనిలో ముఖ్యంగా గృహహింస పలురూపాలను గణాంకాలద్వారా వివరించారు. దీనిలో ఎన్‌పిఆర్‌బి, యుఎన్‌ విమెన్‌ రిపోర్ట్‌కి సంబంధించిన గణాంకాలను పొందుపరిచారు.
డా. సమతారోష్ని జండర్‌ – ఆరోగ్యం మీద మాట్లాడుతూ మొదటగా గ్రామాలలో మహిళలు సాధారణంగా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో  చెప్పారు. ఇక్కడ మహిళలు, ఇంటిపనులు వంటపనులే కాకుండా బయటిపనులకు కూడా వెళ్ళటం జరుగుతుంది.దీనివలన మహిళలు కనీస ఆహారం కూడా తీసుకోరని చెప్పారు. దీనివలన అనేక సమస్యలు రావటం, ఎక్కువమంది పిహెచ్‌సిల మీద ఆధారపడుతారని చెప్పారు.  వారి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా  హిస్టరెక్టమి, హర్మోన్‌ ఇంబాలన్స్‌, సర్వికల్‌ కాన్సర్‌ లాంటివని చెప్పారు. దీనితర్వాత శారదగారు  అందరిచేత గ్రూప్‌ ఆక్టివిటీ చేయించారు. ఇందులో వివిధరకాలైన వ్యాధులు, వాటి ప్రభావం ముఖ్యంగా మహిళల మీద ఎంతగా ఉంటుందో తెలియజేశారు.
జెండర్‌ బడ్జెటింగ్‌ : మాధవిమాట్లాడుతూ జెండర్‌ బడ్జెటింగ్‌ను అర్ధం చేసుకోవడానికి అందరికీి చాలా క్లారిటీ ఉండాలని ముందుగా చెప్పారు.  జెండర్‌ బడ్జెట్‌ మొత్తం జెండర్‌ సమానత్వం మీద ఆధారపడి వుంటుంది. ఇది కేవలం ఒక్క మహిళల కోసం సంబంధించిన బడ్జెట్‌ కాదు.  బడ్జెట్‌ అంటే  మహిళల్ని కూడ దృష్టిలో పెట్టుకొని చేసే బడ్జెట్‌ అని చెప్పారు. మన దేశం ఆర్థికపరిస్థితిని ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కమీషన్‌ ఈ బడ్జెట్‌ని రూపొందిస్తుంది. కాని ఇందులో మహిళలకు , పిల్లలకు సంబంధించి ప్రత్యేకంగా ఏమి బడ్జెట్‌ వుండదు. 8వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వం ఏదో కొంచెం మహిళల అభివృద్ధి కోసం వెచ్చించడం, దాని ద్వారా గ్రామాలలో ఉన్న పేద మహిళల అభివృద్ధి కోసం వెచ్చించటం, వారి విద్య, ఆరోగ్య విషయాలను మెరుగుపరచటం జరిగింది. అలాగే 9వ పంచవర్ష ప్రణాళికలో విద్య, ఆరోగ్యం లాంటి వాటితో పాటు మహిళకోసం ప్రత్యేకంగా  కొంత బడ్జెట్‌ని సమ కూర్చారు అని చెప్పారు.
చివరిగా ఈ వర్క్‌షాఫ్‌ అమ్ముజోసెప్‌, లలిత అయ్యర్‌ , మంజరిగార్ల ప్యానల్‌ డిస్కషన్‌లో ్ల ముఖ్యంగా  గ్లోబల్‌ మీడియా మానిటరింగ్‌ ప్రాజెక్టు (2010)  మీద చర్చించారు. అందులో ముఖ్య అంశాలేమిటంటే  అందరూ మహిళా దృష్టికోణంతో లోకాన్ని చూడాలి. మహిళలకు రాజకీయ అర్హత కల్పించి మహిళా కార్యకర్తలను పంచాయితీరాజ్‌ద్వారా అభివృద్ధి పథంలో పైకి తీసుకురావాలి. ఇవే కాకుండా 1985లో అహ్మదాబాద్‌లో జరిగిన ఒక ఉద్యమం గురించి తెలుసుకోవడానికి కొంతమంది విలేఖరులు అక్కడికి వెళ్ళి వివరాలు సేకరించారు. ముఖ్యంగా మహిళలకు కర్ఫ్యూ విధించినపుడు ఎలాంటి ఇబ్బంది పడతారో తెలియజేశారు. ఇలాంటి వాటివల్ల రోజువారీ కూలీలు, మహిళలు, పిల్లలు పడే సమస్యలు చాలానే ఉన్నాయి. ఇవే ముఖ్యమైన ఇబ్బందిగా పరిగణించారు. ఎన్‌సిఆర్‌బి 2007 గణాంకాల ప్రకారం స్త్రీలు, పురుషులు ఆత్మహత్యలు చేసుకోవడానికిగల కారణాలు ఏమిటంటే మగవాళ్ళు సామాజిక లేక ఆర్థిక పరమైన కారణాలవలన ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మహిళలు మానసిక కారణాలవలన  ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని తెలిపారు.
ఆ తర్వాత లలిత అయ్యర్‌, మంజరి కూడా శారదగారితో కలిసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంజరిగారు మాట్లాడుతూ అన్ని మీడియాలోకి ప్రింట్‌ మీడియా కొంచెం ఫర్వాలేదని వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్‌ మీడియాలో మహిళలకు సంబంధించిన ఎలాంటి వార్తనైన పరిగణనలోకి తీసుకురావడానికి విలేఖరులకు కూడా కష్టమైపోతుందని వివరించారు.
లలిత అయ్యర్‌ మాట్లాడుతూ  మీడియాలో మహిళలకు మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయని, ఇది మహిళలకు ఒక మంచి వృత్తి అని చెప్పారు. చివరగా కొండేపూడి నిర్మల వందన సమర్పణతో వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారందరికీ సర్టిఫికెట్స్‌ ఇవ్వడంతో కార్యక్రమం జయప్రదంగా ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.