పుప్పొడి చిట్లి
ఒక్కసారిగా వెదజల్లిన
పసుపు చినుకుల్లా
చిరునవ్వుల కేరింతలతో
లేత పచ్చిక మీద వాలిన
సీతాకోక చిలుకలు
అల్లరి స్కూలు పిల్లల్లా
చొరబడి పాటలు పాడి
రుషి మౌనాన్ని భంగపరిచే
అప్సరస్సల్లా
ఎండలో నీడలో
ఎసి గదిలో
శూన్యాన్ని చెదర గొడుతూ
మెరుపుల తునకలై
అంతరాళాల్లో
అనుమానాలని
వెలికితీసి
సందేహాల తలపులు తీసి
దాగి వుందోనని తొంగి చూసి
హాయిగా తోటల్లో
మబ్బు నీడల్లో
ఎండ నీడ జాడల్లో
ఎవరి కష్టాలైన
ఉదేక్రంగా చర్చించుకొని
యోగాలు నేర్చుకొని
ఆ రోజు
తమతో పాటూ నడిచిన
ఎండ వెలుగుల్ని
నవ్వుల్లో ముంచి
పెదవుల మీదకి
రంగరించుకొని
భూమి పుతిక్రలందరూ
సత్యవతికి
వీడ్కొలు చెప్పి
ఇంటిదారి పట్టారు !!
(ఆదివారం భూమిక తరఫున ‘టూర్’ వెళ్ళి వచ్చాక)