చేపలకోసం
సత్యవతి వెంట
నదికెళ్ళానా
చేపలబదులుగా
బుట్టలో నా బాల్యం!
ముదితెల కొప్పులు
సాయంతాల్రు
పూలు తురుముకుంటే
కొండ కొప్పులు
వేకువనే మేఘమాలికల్ని
తురుముకున్నాయి.
చిటారు కొమ్మన
మిఠాయి పొట్లానికెళితే
కొమ్మల్లో సత్యవతి
ఇక మిఠాయెందుకు?
తడిసి ముద్దయి
మొదలంతా నీరు పారినా
చలించని
జెన్ మౌని-
పాపికొండలు
చేపల చెరువులో
ముఖం సరిచేసుకునేంతలో
చందుణ్ణ్రి జార్చుకున్న ఆకాశం
నవ్విన తెల్లకలువ