6,7,8 తరగతుల బాలికలకు ఉచితంగా సైకిళ్ళు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ఉచితంగా సైకిళ్ళను పంపిణీ చేయబోతున్నారు. ప్రాథమిక విద్యతోనే చదువుకు దూరం కాకుండా… ఉన్నతవిద్యవైపు వారు దృష్టి సారించేలా చేయాలన్న ఉద్దేశంతో ప్రాథమిక విద్యాశాఖ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకాన్ని తొలుత విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో 6,7,8 తరగతుల్లో చదివే బాలికలకు మాత్రమే వర్తింపజేస్తారు. ఈ కొత్త పథాకానికి త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ వెల్లడించారు. బాలికా స్రవంతి విద్యా కార్యక్రమంపై 17.10.2011న హైదరాబాద్‌లో సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో జరిగిన వర్క్‌షాప్‌లో పాల్గొన్న మంత్రి శైలజానాథ్‌ ఈ విషయం చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు విద్యకు దూరం కాకుండా ప్రోత్సహించేందుకు ఈ పథకం చేపడుతున్నామన్నారు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో చదివే బాలికలందరికీ శానిటరీ నాప్కిన్లు అందజేయాలని ఇప్పటికే నిర్ణయించిన విషయాన్ని గుర్తు చేశారు. బాలికలకు సైకిళ్ల పంపిణీ ద్వారా డ్రాపౌట్లను చాలావరకు తగ్గించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. చాలా గ్రామీణ ప్రాంత బడులు ఐదో తరగతి వరకే ఉంటాయి. ఆరు, ఆ పై చదవాలంటే అయిదారు కిలోమీటర్ల దూరంలోని పక్క ఊళ్ళకు వెళ్ళాల్సి వుంటుంది. కుటుంబ పరిస్థితి, ఇతరత్రా కారణాలతో చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటికి పంపేందుకు పెద్దగా ఆసక్తి చూపక మధ్యలోనే చదువును ఆపేస్తున్నారు. సైకిళ్ల పంపిణీ ద్వారా దీనిని చాలావరకు నివారించవచ్చుననేది ప్రభుత్వ ఉద్దేశం.
ు6,7,8 తరగతుల్లో చదివే బాలికల సంఖ్య దాదాపు 11 లక్షలు ు 1 నుంచి 7వ తరగతి మధ్య చదువుకు దూరమవుతున్న వారి సంఖ్య 20% ుప్రాధమికోన్నత పాఠశాలలో చదువు ముగించి 8వ తరగతి చదివేందుకు కనీసం 3 కి.మీ. వెళ్లే బాలికలకే సైకిళ్లను ఇవ్వాలన్నది  ప్రభుత్వ ఆలోచన. ు దూరం వెళ్లలేక చదువు ఆపేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ ఆలోచనకు కారణం. ు ఒక్కో సైకిలుకు అంచనా వ్యయం కనీసం రూ. 2000 ు బాలికలకు మాత్రమే ఉపయోగపడేలా సైకిళ్ల డిజైనింగ్‌లో మార్పు చేయించాలన్నది సర్కారు ఆలోచన.
వీలునామా లేకున్నా ఆడపడుచులకు సమాన ఆస్తి హక్కు
హిందూ మహిళ లేదా బాలికకు సమాన ఆస్తిహక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2005 నాటి హిందూ వారసత్వ చట్టం సవరణ కింద అవిభక్త హిందూ కుటుంబం ఆస్తిలో పురుషులతో సమానంగా ఆడపిల్లకు కూడా ఆస్తి హక్కు సంక్రమించిన విషయాన్ని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. 2005 సెప్టెంబర్‌ అనంతరం వీలునామా లేని సందర్భాల్లో జరిగిన ఆస్తి పంపకాలన్నిటికీ కూడా ఈ సవరణ వర్తిస్తుందని జస్టిస్‌ ఆర్‌ఎం లోథా, జస్టిస్‌ జగదీశ్‌సింగ్‌ ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం సమాన ఆస్తి హక్కు మాత్రమే కాదు… ఉత్తరదాయిత్వంలోనూ కుమారుడి తరహాలో కుమార్తెకూ సమాన బాధ్యత ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండూరి కోటేశ్వరమ్మ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వివరాలను సుస్పష్టం చేసింది.

అత్యాచార బాధితులకు ఆసరా
అత్యాచార బాధిత మహిళలకు మానసికంగా, న్యాయపరంగా, వైద్యపరంగా, ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న పథకాన్ని రూపొందించింది. బాధిత మహిళకు ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనుంది.
ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన ఓ బోర్డును కూడా ఏర్పాటు చేయనుంది. 1995 నుంచి ఈ పథకం అమలు ప్రయత్నాలు జరగుతున్నా, సుప్రీంకోర్టు ఆదేశాలతో సత్వరమే అమల్లోకి రానుంది. దేశంలో అత్యాచార బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ‘జాతీయ నేర చరిత్రల బ్యూరో’ నివేదిక ప్రకారం 2008 సంవత్సరంలోనే దేశంలో ఇలాంటి 21,467 కేసులు నమోదయ్యాయి. ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే వుంది.  ఈ నేపథ్యంలో బాధిత మహిళకు ఊరటనిచ్చేందుకు ఆర్థిక సహకారంతో పాటు మానసికపరంగా, వైద్యపరంగా, న్యాయపరంగా సహకారం అందించాలని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1995లో జాతీయ మహిళా సంఘం ఈ ప్రతిపాదన తెచ్చినా, దీని అమలుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయలేదు. ఈ కారణంగా, గత ఏడాది జులైలో ‘ఢిల్లీ డొమెస్టిక్‌ వర్కింగ్‌ ఉమెన్స్‌ ఫోరం’ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. బాధిత మహిళలను ఆదుకోవడంలో తాత్సారం చేయవద్దని ధర్మాసనం కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికి 10 సార్లు ఆదేశించినా ప్రభుత్వం లక్ష్యపెట్టకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది.  దీంతో కేంద్రం ఆరువారాల్లో ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటామని జులైలో సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలుకు ఒక ముసాయిదా (డ్రాఫ్టు) కూడా రూపొందించి ప్రజాభిప్రాయ సేకరణకు పెట్టింది. అనేకమంది న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పోలీసు అధికారులతో చర్చించి డ్రాఫ్టును సమర్థంగా రూపొందించింది.
వారసులకు లబ్ధి : స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకంలో భాగంగా… బాధితులకు ముందుగా వసతి కల్పించడంతో పాటు వైద్య, న్యాయ, సహాయం, రూ.2 లక్షల వరకు ఆర్థిక సహకారం అందిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ సహాయం రూ.3 లక్షల వరకు ఉంటుంది. అత్యాచారం నమోదైన 15 రోజుల్లోగా రూ.20 వేలు, ఆ తరువాత రూ.50 వేలు అందిస్తారు. ఒక నెలలోపు మిగిలిన రూ.1.30 లక్షలు బాధిత మహిళకు అందజేస్తారు. దీంతోపాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వారికి వృత్తివిద్యలో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పథకాల్లో వారిని లబ్ధిదారులుగా చేర్చుకుంటారు.  అయితే ఎఫ్‌ఐఆర్‌ నమోదయిన తర్వాతనే ఈ పథకం లబ్ధిదారులవుతారు. ఒకవేళ బాధిత మహిళలు చనిపోతే వారి వారసులు ఈ ఆర్థిక సహాయాన్ని పొందుతారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉండే ఈ బోర్డుకు ఎస్పీ, న్యాయసేవా విభాగం నుంచి ఒక మహిళ, జిల్లా వైధ్యాధికారి సభ్యులుగా స్త్రీ, శిశు సంక్షేమాధికారి సభ్యకార్యదర్శిగా ఉంటారు. మూడు సంవత్సరాల కాల వ్యవధి గల ఈ బోర్డును అవసరమైతే మరో దఫా పొడిగించుకోవచ్చు. మైనర్‌ బాలికల సహాయార్థం ప్రత్యేకంగా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఒక కమిటీని ఏర్పాటుచేస్తుంది. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు.
అత్యాచార బాధితులంటే…. ఎవరెవరు అత్యాచార బాధితులవుతారో డ్రాఫ్టులో స్పష్టంగా పేర్కొన్నారు. తన అంగీకారం లేకుండా బలాత్కారానికి గురైన మహిళను బాధితురాలిగా పరిగణిస్తారు. చంపుతామని, కొడతామన్న బెదిరింపుల పర్యవసానంగా మహిళ సమ్మతితో అత్యాచారం జరిగినా, అలాంటివారిని కూడా బాధితులుగా పరిగణిస్తారు. చట్టపరంగా పెళ్ళి చేసుకుంటానని నమ్మించి,  వారి చేతితో మోసానికి గురైన వారు కూడా బాధితులే. ఈ పథకానికి సంబంధించిన నిధులు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ నుంచి అందుతాయి. ఈ శాఖ రాష్ట్రస్థాయి కమిటీలకు నిధులు అందిస్తుంది. రాష్ట్రస్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలకు నిధులు అందిస్తాయి. (‘మహిళాసాధికారత’ – సౌజన్యంతో)

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో