పురోగామిని

ఆచంట హైమావతి
కతలలో – కైతలలో
పాటల్లో – పద్యాల్లో
స్త్రీ జనాభ్యుదయం-
వెల్లివిరుస్తోంది… గాని
చేతల్లో – చేతనల్లో
మృగ్యమౌతున్నది –
వెనుకంజ వేస్తున్నది.
విద్యార్హతలు – విజ్ఞానాలూ
గడించి – గడించి …
స్వయం సంపాదనాపరులం కావాలనీ
శతధా …. సహస్రధా యత్నించి
సఫలులైనామని సగర్వంగా…
ధైర్యంగా అభివ్యక్తించి-
సంతోషానుభూతి నొందుతుంటే…??
ఆశించిన ఫలితం ఏదీ…?
వట్టి శూన్యం! క్రూరం – ఘోరం …
బలాత్కారాలు – బలవన్మరణాలు,
యాసిడ్‌ దాడులు – లైంగిక వేధింపులు,
జి ఘాంస క్రియలు – కృతక ప్రేమలు
విపరీతాలై … మితిమీరుతున్న –
ఈ వ్యధాకులిత తరుణంలో-
ఓ మహిళా! లే…! పిడికిలి బిగించు-
ధైర్యంగా ముందుకి సాగు
అంతశ్శక్తిని ఉద్దీపన చేసుకో!
దుస్సహ దుర్మార్గ శక్తుల నెదిరించి-
మట్టుపెట్టి – మారణహోమం గావించు!
విశేషాభ్యుదయ పథంలో పయనించు
నీసాటి నీవేనని నిరూపించు
క్రొంగొత్త తరానికి నాంది నినదించి-
పురోగామివై సదా భాసిల్లుమమ్మా!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.