ఎగిసిపడే
భావాల్ని, బాధల్ని
కుదిపి కుదిపి
గుప్పెడు గోతాంలో కట్టేస్తే
పొంగిపొరలి
కనురెప్పల చాటుగా ప్రవహించి
కన్నీరయింది
ఆపినా ఆగదు
ఆనందానికి, ఆరనిగాయానికి
ఆనవాలునని చెప్తూ
ఆగని కన్నీరు
చెంపమీద చిటికేసి
గుండెభారం దించింది
(కుటుంబ హింస నెదుర్కుంటూ రహస్యంగా బాత్రూంలోనో, బెడ్రూంలోనో ఏడ్చేసి, అన్నిటినీ దిగమింగుతూ బయటకు వస్తున్న స్త్రీలనుద్దేశించి)