దళిత సాహిత్యానికి దళిత తల్లే నిర్మాత

– కత్తి పద్మారావు

దళితులు అంటే అస్పృశ్యతకు గురైన జాతులు అని అర్థం. అస్పృశ్యతకు గురిచేసిన వారు భారతీయులు. అస్పృశ్యతకు గురైన వారు ఆదిభారతీయులు. అస్పృశ్యత అనే శబ్దం సంస్కృత శబ్దం. అస్పృశ్యులంటే స్పృశించబడనివారు అని అర్థం. ఈ భావం బ్రాహ్మణ కుటుంబ జన్యం అని అంబేద్కర్‌ చెప్పాడు. స్పృశ్యతా భావం పరిపూర్ణంగా ఉన్నవారే అస్పృశ్యులుగా ముద్ర వేయబడ్డారు. అనగా పుట్టుకలో, మరణంలో, జీవితంలో కుటుంబంలో, పరిసరాలలో, అనుబంధంలో ఏవిధమైన తేడా లేని వారు. సూర్యునికి – భూమికి, నీటికి-భూమికి ఒక ప్రాకృతిక అనుబంధమే స్పృశ్యభావం. దీనికి భిన్నమైన సమాజం వీరిని అస్పృశ్యులుగా పేర్కొంది.

దళితుల ప్రకృతి-తత్వం

ప్రకృతితో సంబంధం వున్న స్పృశ్య సమాజంగా దళితులను చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతితో అనుబంధం ఉన్న ప్రాకృతిక జీవులు. ప్రకృతితో సంబంధం ఉన్న ఏ జాతులు అయినా ప్రపంచంలో సాంస్కృతికంగానే ఉంటాయి. సృజనాత్మ కంగా కూడా ఉంటాయి. Productive కూడా ఉంటాయి. ప్రకృతిలో ప్రధానమైనవి సూర్యుడు, భూమి, నీరు, నిప్పు శూన్యం లేక చీకటి. వీటిని జీవితానికి అన్వయం చేసుకుని అర్థం చేసుకోవడమే తత్వశాస్త్రం. ప్రతీ సాంస్కృతిక విప్లవానికి ఒక తత్వశాస్త్రం ఉంటుంది. తత్వశాస్త్రం ఒక జాతిని నడిపించే వాహిక. అస్పృశ్యులుగా చెప్పబడుతున్న దళితులు అతి ప్రాచీనకాలం నుండి భౌతికవాద తాత్వికులు. చార్వాకులు, సాంఖ్యులు ఈ భౌతికవాదాన్ని చెప్పారు. భౌతికవాదంలో నిర్భయత ఉంది. జీవన సమతుల్యత వుంది. జీవన పోరాటం, జీవితం ఉన్నాయి. దళితులు మొదటి నుండి అధీన భావానికి వ్యతిరేకులు. స్వేచ్ఛా జీవులు Emotional Creatures. జీవితమే కవితాత్మకం అయిన వీరిని వెలివేసిన సమాజం కృత్రిమం అయింది. వీరిని వెలివేసిన వైదిక సమాజం మెదడుకు మేకులు కొట్టిన సమాజం. ఇనుప కచ్చడాలు బిగించిన సమాజం. ఈ వైదిక సమాజం ఆదిభారతీయులను వెలివేయడానికి చెప్పిన కారణాలలో వర్ణసంకరం, బౌద్ధ స్వీకరణ, స్త్రీస్వామ్యం ముఖ్యమైనవి. దళితులు ప్రాయకంగా మాతృస్వామ్యక పునాది కల్గిన జాతులు. తల్లి ఇక్కడ Main force (చోదక శక్తి). సంతానానికి తనకు ఉన్న (Inter relation) బలమైంది. చాలా సందర్భాలలో భర్త ద్వితీయం. సంతానం ప్రథమం. తల్లితో అనురక్తి ఉన్న ప్రతి జాతి సాంస్రృతికమైన శక్తి. ఇది వైదిక సంస్కృతికి పూర్తిగా భిన్నమైంది. వైదికం పితృస్వామికమైంది. మాతృస్వామిక సమాజం వారికి అర్థం కాదు. తల్లి తన జోల పాటతోనే తన పిల్లవాడి మెదడును మేల్కొపుతుంది. హృదయ స్పందనను కల్గిస్తుంది. సగం గోరు ముద్దలు, సగం పాటలతో దళితులు పెరుగుతారు. వైదిక సమాజంలో నిందాపూరితమైన భాష ఎక్కువ. దళిత భాషలో ప్రకృతి, హృదయ స్పందన పెనవేసుకుని ఉంటాయి. అందునే దళిత భాష బ్రాహ్మణులకు అర్థం కాదు. భాష అర్థం కానప్పుడు దళిత సాంస్కృతిక విప్లవం అర్థం ఎలా అవుతుంది?

వైదిక జీవనానికి – దళిత జీవనానికి వైరుద్యం:

వైదిక సాహిత్యంలో కర్త బ్రాహ్మణుడు లేక పురోహితుడు. అతడు అభద్రతతో కూడిన వాడు. అతడు, అతని భాష కృత్రిమం. ఇతరులను నిందించడం వల్ల తన ఆధిపత్యాన్ని అతడు నిలుపుకుంటాడు. అతని భావాలే స్మృతులు. మనుస్మృతి, పరాసరస్మృతి, నారదస్మృతి అన్నీ వర్ణ వ్యవస్థ పూరిత ద్వేషభావాలే. దళిత సాంస్కృక విప్లవానికి దళిత తల్లి నాయకురాలు. ఆమె భాషలో నిందలు లేవు. ద్వేషాలు లేవు. సామాజిక అంతరాలు లేవు. ఆత్మీయత, ప్రేమ, ఆర్ద్రత, ప్రకృతి, దుఃఖం, శ్రవ్యత, అనురాగం వుంటాయి. ఒక శృతిబద్ధమైన శైలిలో దేశీయత నుంచి ఆమె పలుకుతుంది. ప్రపంచ సాహిత్యానికి సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని అందించింది ఈ దళిత తల్లే. ఎందుకంటే, ఆమె ఇంతవరకు దేశీయ భాషను మార్చుకోలేదు. ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తున్న భాష గ్రీకు, లాటిన్‌, ఇంగ్లీషు, సంస్కృతం. ఇవన్నీ పితృస్వామిక భాషలు. వీటిలో సాంస్కృతిక భాష తక్కువ. చైనీస్‌, ఫ్రెంచ్‌, తెలుగు, కన్నడం, తుద, కుట, కోయి, గదబ, సవర వంటి భాషలలో Matriarchal diction ఎక్కువ. ఇందులో Cultural revolution సంబంధించిన మూలకాలు దోరుకుతాయి. ఎక్కడ తల్లి నిర్ణాయక పాత్రలో ఉంటుందో అక్కడ సమాజం సాంస్కృతికంగా ఉంటుంది. ఎక్కడ పురుషుడు ఆధిపత్యంలో వుంటాడో అక్కడ సమాజం నియంతృత్వంలో వుంటుంది. దళితుల ఒక సాంస్కృతిక శక్తిగా ఈనాటికి ఉండటానికి కారణం తల్లి సంస్కృతే.

దళిత తల్లి కళా జీవి:

సంస్కృతిలో ప్రధానమైంది సంఘ నిర్మాణం. దళితులకి కులభేదాలు లేవు. ఉపకులాలు కూడా ఆ తరువాత వచ్చినవే. దళితులది జాతి. వీరు భారతీయ ఆదిమ జాతి. వీరి మౌఖిక సాహిత్యమంతా తరం నుంచి తరంకి అందించబడింది. పరిణామం చెందింది. ఒక రకంగా తల్లి మితభాషి. తన భావావేశాలు అంగిక వాచక చలనాల నుండి చూపించినంత భాష నుండి చూపించదు. అందుకనే దళితస్త్రీ అభివ్యక్తతో పాటు దృశ్యప్రదానంగా వుంటుంది. తన బిడ్డలైన దళితులు కూడా ఎక్కువ భాష కంటే దృశ్యాన్ని ప్రేమిస్తారు. అందుకే పాట నృత్య సమ్మిళతమైంది. చిందుతో పాటు డప్పు ఆధునికంగా మనకు కనిపిస్తున్న సాంస్కృతిక రూపం. శ్రమతో కూడిన నృత్యం, లయతో కూడినపాట. వీర రసానిష్కతి కరుణ రసాప్రదమైన జానపదులు వీరు. వీరిది ప్రాకృతిక జన్యమైన భాష, భావం, నృత్యం, ధ్వని కలసిన కళాజ్వలనం. వీరి సాంస్కృతిక విప్లవానికి ప్రేరణ కళారూపాలే. బ్రాహ్మణవాదాన్ని వీరు ఈ తల్లి పాటలతోనే ఎదుర్కొంటున్నారు. వీరి సంఘం గుంపు. వీరి పాట గుంపుపాట. వీరి పాటలో సమూహం ఉంది. మాటలో సంఘ ఐక్యత ఉంది. అందుకే ఎన్నో కళారూపాలు శిథిలమవుతున్నా దళితుల సామాజిక, సాంస్కృతిక విప్లవ స్రవంతి ప్రవాహ శీలమౌతూనే వుంది.

నదీనాగరికతా వారసులు దళితులు:

దళిత స్త్రీ నదీప్రవాహం వంటి చలనం కలిగినది. నదీ నాగరికత భారత దేశంలో ప్రధానమైంది. సింధు, గంగా, యమున, గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి నదులన్నింటి నాగరికతను సంపన్నం చేసిన వాళ్ళు దళితులు. వైదికులు వీరిని ఊరినుండి వెలివేయగలిగారు కాని నదీ నాగరికత నుండి వెలివేయ లేకపోయారు. బ్రాహ్మణులు అగ్ని ప్రధానమైన జాతి. ఋగ్వేదంలో అగ్నిని కొనియాడే మంత్రాలు కొల్లలు. వారికి నది తెలియదు. నీళ్ళు అంటే వరుణ దేవుడు ఇచ్చేవే అనుకుంటారు. కాని నిజానికి వాళ్ళు సాంస్కృతిక పునాదిని అక్కడే కోల్పోయారు. వారు శ్రమలేని జాతులు అయ్యారు. శ్రమ లేని జాతిగా మారారు. శ్రామిక జాతులు అణచివేతకు గురవుతాయి. శ్రమ, విశ్రాంతి, వినోదం అంతఃసంబంధితంగా ఉంటాయి. దళితుల యొక్క జీవన సంస్కృతిలో సృజనాత్మకత, నదీ నాగరికతనుండే ఆవిర్భవించింది. నది వీరికి ఆహారాన్ని అందించింది. గొరసలు, వంజరాలు, చందువాలు, బొమ్మిడాయలు, రొయ్యలు, పీతలు అని వీటికి పేర్లు పెట్టింది కూడా వీళ్ళే. దళితుల ఆయాభాషల సృష్టికర్తలు కూడా. మనం చేపలను పరిశీలిస్తే వాటి స్వభావాన్ని బట్టి పేర్లు ఉంటాయి. ముళ్ళు ఎక్కువగా ఉండేదాన్ని జల్ల అని, పొడుగ్గా ఉండేదాన్ని వాలిగా అని, చందమామ ఆకారంలో ఉండేదాన్ని చందవా అని అన్నారు. చాలా భాషని బ్రాహ్మణులు సృష్టించలేదు. దళితులే సృష్టించారు. పుట్ట, గుట్ట, లోయ, చెట్టు ఇవన్నీ వీళ్ళు పెట్టిన పేర్లే. వీరిని భాషా సృష్టికర్తలు అనొచ్చు. సంస్కృతిలో ప్రధానమైనది భాషా సృజనమే. ముంత, చల్ల, గరిస, గంప, గాదె అనే పేర్లు బ్రాహ్మణులకు తెలియదు. నెయ్యి, వెన్న, ఇవన్నీ సంస్కృతం నుండే వాడతారు. అందుకనే బ్రాహ్మణులకు దళితుల మీద భాషాద్వేషం వుంది. అందుకనే వీళ్ళు వాళ్ళని ద్వేషంగా చూస్తారు. వీరి గొంతు నరాలు సున్నితంగా ఉంటాయి. పాటలు మధురంగా పాడతారు. ఎక్కువ ప్రకృతిలో దొరికే వస్తువులు తింటారు. వేప, గానుగ, నేరేడు, జామ వంటి వాటితో పళ్ళు తోముకోవడం వల్ల దుర్వాసన లేకుండా ఉంటారు. ప్రాకృతికమైన స్వచ్ఛత వల్ల కూడా వీళ్ళు ద్వేషించబడ్డారు. శిల్పపరమైన సౌందర్యం దళితుల సొంతం. ఎక్కువ మంది కళ్ళు పెద్దవి. కనుబొమ్మలు విల్లంబుల్లా ఉంటాయి. ముక్కులు పొడుగ్గా ఉండి పెన్సిల్‌తో గీసిన బొమ్మల్లా ఉంటారు. కన్నమనీడు వంటి వారి శరీర నిర్మాణం మనం చూసినట్లైతే వీరిది యుద్ధజాతి. కొన్ని ప్రాంతాల్లో వీరు ఆరు అడుగులు వుంటారు. కోర మీసాలు. ధైర్యమెక్కువ. వీరిది కరుణ వీర రసం. ఎన్నో సైన్యాల్లో వీళ్ళు మావటీళ్ళుగా వున్నారు. ఎన్నో సైన్యాల్లో అశ్వాధిపతులుగా కూడా వున్నారు. అందువల్ల వీళ్ళని కొన్ని సైన్యాల్లోకి రాకుండా నిషేధించారు. ఆర్య ఋషులు పెక్కురు దళిత వనితలని చేసుకున్నారు. అరుంధతి, అదృశ్యంతి, సత్యవతి ఇలా ఎందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వీళ్ళు దేవతలుగా మారారు. పోచమ్మ, అంకాళమ్మ, నూకాలమ్మ, గంగానమ్మ, సారమ్మ, వీరంతా దళిత స్త్రీలే. పోరాటాలు చేసిన దళిత స్త్రీల చుట్టూ పౌరాణిక కథలల్లి ఇప్పటికీ వారిని దేవతలుగా కొలుస్తున్నారు. ఆర్య ఋషులకు వీరిపై ద్వేషానికి కారణం, లోతుగా చూసినప్పుడు కాని అర్థం కాదు. భారతదేశ చరిత్రకు వీర నాయిక దళిత స్త్రీయే. ఈమె The force of evolution. ఈమె పరిణామానికి ఒక మూల శక్తిగా పనిచేసింది.

వ్యవసాయిక విప్లవంలో దళితుల పాత్ర :

భారత దేశాన్ని మలుపు తిప్పిన ప్రతీ పరిణామంలోను దళిత స్త్రీది కీలకపాత్ర. నదీ నాగరికత నుండి వ్యవసాయిక విప్లవం వచ్చిన తరువాత చాతుర్వర్ణాలలోని ఏ స్త్రీ పోషించలేని పాత్రను దళిత స్త్రీ పోషించింది. నాగలి పట్టింది, విత్తనాలు వేసింది, నారు పీకింది, నాటు వేసింది. కోత కోసింది, కలుపు తీసింది, దంచింది ఈ పనులన్నీ చేసి వ్యవసాయిక సంస్కృతిక బతికించింది. తనను ఊరినుండి బయటకు నెట్టితే పొలంలో వెళ్ళి పంట పండించింది. అక్కడ కూడా సంస్కృతిని పెనవేసింది. పాట-పని, పని-పాట ఈరెంటి నుండే మొత్తం భారతీయ సాహిత్యం ఆవిర్భవించింది. పనిలేని పాట జీవనం లేని కట్టెలా మిగిలిపోయింది. పనితో కూడిన పాట సాంస్కృతిక విప్లవానికి జీవధార. మౌఖికంగా వున్న పాటలన్నీ లిఖిత రూపకంలోనికి వచ్చి ఉన్నట్లయితే ఇప్పుడు లిఖిత రూపంలో వున్న వాంజ్మయం అంతా దానిలో పదిశాతం కూడా ఉండదు.

అందుకనే తెలుగు నిఘంటువుని ఒకసారి పరిశీలిస్తే సంస్కృతేతరమైన పెక్కుపదాలు దళిత స్త్రీ సృష్టించినవే. కోత, నాటు, కలుపు, ఊడ్పు, నడక, పరుగు వంటి పదాలన్నీ ఆమె యాసలోనే పలుకుతాయి. మిగిలిన వారు ఆమెలా వాటిని పలకలేరు. సంస్కృతం, ఇంగ్లీషు వచ్చిన వారు ఆ శైలిలో ఈ పదాలు పలుకుతారు. స్వచ్ఛమైన తెలుగు, తమిళం లాంటి దేశీయ భాషలు మాట్లాడే దళిత వాడల్లో సంస్కృతి, చరిత్ర కొలువు తీరాయి.

దళిత కవిత్వంలో సంస్కృతీ వారసత్వం :

ఆధునికంగా దళిత కవిత్వం వచ్చిన తరువాత తల్లి భాషలో మాట్లాడటం ప్రారంబమయింది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. దళితులు తమ ఆడ పిల్లలను కాన్పుకి ఇంటికి తీసుకు వస్తారు. అప్పుడు తల్లి పేదరికంలో ఉండి కూడా తనని బిడ్డని చూసే విధానాన్ని బిడ్డ ఒక సంస్కృతిగా నేర్చుకుంటుంది. ఆ ప్రేమ బంధాన్ని గురించి ”పురుటి వాన” అనే కవితలో దళిత స్త్రీ ఎలా అభివ్యక్తీకరిస్తుందో చూడండి.

ఇంటి మూలల్లో
పగటి చీకట్లో
నా పొత్తిళ్ళలో
పసికందు మూలుగు
నన్ను సుడిపెడుతుందే
అమ్మా! – నీలికేక

ఇందులో ఒక దళిత స్వరం వుంది. దళిత కవిత్వం వుంది. దేశీయమైన నుడికారంతో అభివ్యక్తి వుంది. దానికి ఊపిరి దళిత తల్లి. పితృస్వామ్య వ్యవస్థకు భిన్నమైన ఈ స్వరం నూతన సామాజిక చరిత్ర నుంచి మాట్లాడుతుంది. అందుకే శివసాగర్‌, మద్దూరి నగేష్‌బాబు, సతీష్‌చంద్ర, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‌ వంటి శక్తివంతమైన కవులు ఈనాటి దళిత కవితా యుగానికి ఆయువులు పోస్తున్నారు. దళిత కవయిత్రు లుగా, కథా రచయితలుగా, సంపాదకులుగా జూపాక సుభద్ర, కొలకలూరి స్వరూపరాణి, అనిశెట్టి రజిత, చల్లపల్లి స్వరూపరాణి,జాజుల గౌరి, జోత్స్నారాణి, గోగు శ్యామల, చంద్ర శ్రీ ఇంకా ఎందరో వందలాది మంది దళిత కవయిత్రులు ఆవిర్భవిస్తున్నారు. దీనితో తెలుగు భాష సుసంపన్నం అవుతుంది. తెలుగు సాహిత్యం కొత్త యుగాన్ని ఆవిష్క రించుకుంటుంది. ఈ పరిణామాన్ని పరికించ డం చారిత్రక అనివార్యత. ఇది దళిత సాహిత్య యుగం.

(CESSS పరిశోధక సంస్థ మూమెంట్స్‌, సోషల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ అండ్‌ మేకింగు ఆఫ్‌ మోడ్రన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే సదస్సుకు సమర్పించిన పత్రంలో మొదటి భాగం.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to దళిత సాహిత్యానికి దళిత తల్లే నిర్మాత

  1. Anonymous says:

    సత్యవతి గారూ,
    పత్రిక వెబ్బులో చూసి ఆనందం వేసింది. తెలుగు కీ బోర్డు వచ్చేసింది. కత్తి వ్యాసం బాగుంది.

    bhagya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.