‘ ‘

– కొండవీటి సత్యవతి

ఈ నెల పదోతేదీన నెట్‌వర్క్‌ ఆఫ్‌ వుమన్‌ ఇన్‌ మీడియా ప్రెస్‌ అకాడమీల సంయుక్త ఆధ్వర్యంలో ”ప్రసార సాధనాలు- మహిళలు-పురుష దృక్కోణం” అనే అంశం మీద ఒక సమావేశం జరిపారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖామాత్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ప్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్ట్‌లు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

సమావేశాన్ని ప్రారంభిస్తూ సాక్షిలో పనిచేస్తున్న మంజరి ”మీడియాలో మహిళల పట్ల పురుష దృష్టికోణం గురించి మాట్లాడడానికి ఎడిటర్లందరినీ పిలిచామని. ఈ రోజు వాళ్ళు మాట్లాడింది వినడానికి ఇంతమంది మహిళా జర్నలిస్ట్‌లు ఎదురుచూస్తున్నారని. ఈ సమావేశాన్ని కోఆర్డినేట్‌ చెయ్యాల్సిందిగా భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతిని, ది వీక్‌ సీనియర్‌ రిపోర్టర్‌ ఆర్‌. అఖిలేశ్వరిని కోరుతున్నానని చెప్పారు. సమావేశం మొదలైన పది నిమిషాలకి మంత్రి సునీతాలక్ష్మారెడ్డి, హెచ్‌.ఎమ్‌.టి.వీ సిఈవో రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణా, ఎడిటర్‌ అల్లం నారాయణ, ఆంధ్రప్రభ ఎడిటర్‌, ప్రెస్‌ అకాడమీ ఛైర్‌పర్సన్‌ సురేందర్‌ తదితరులు వచ్చారు.

రామచంద్రమూర్తిగారు మాట్లాడుతూ మహిళలకు అన్నింటా రిజర్వేషన్లున్నాయి కానీ మీడియాలో లేవని చెబుతూ తను పనిచేస్తున్న మీడియా సంస్థల్లో మహిళలకు తప్పకుండా ప్రాధాన్యత నిస్తున్నామని ఢిల్లీలో తమ మీడియా సంస్థ బాధ్యురాలు మహిళ అని, మీకు మా సహకారం ఎప్పుడూ వుంటుందని చెప్పారు. అల్లం నారాయణగారు మాట్లాడుతూ ప్రపంచం అంతా అధ్వాన్నంగా వుంది. మీడియాలో పరిస్థితి దీనికతీతంగా లేదు. మహిళా జర్నలిస్ట్‌లు పీచర్‌ జర్నలిస్ట్‌లుగానే వుండిపోతున్నారు. ఇన్‌చార్జీలుగా బాధ్యతలివ్వడం లేదు. మీడియాలో స్త్రీలపట్ల చాలా వివక్ష వుంది. ఈ వివక్షవల్లే వేధింపులు కూడా జరుగుతున్నాయ్‌. మైనారటీల పట్ల ఎంత వివక్ష వుందో మహిళల పట్ల కూడా అంతే వివక్ష వుంది. దీనిని అధిగమించాలంటే మోనిటరింగ్‌ కమిటీలు ఏర్పాటు చెయ్యాలి. ఒక పర్‌స్పెక్టివ్‌ డెవలప్‌ చేసుకోవాలి” అన్నారు.

మంత్రి మాట్లాడుతూ ఈ సమావేశానికి రావడం తనకు ఎంతో సంతోషంగా వుందని, మహిళా జర్నలిస్ట్‌ల సమస్యలు తనకు తెలుసునని, తన శాఖాపరంగా వారికి ఎలాంటి సహకార మందించడానికైనా తాను సిద్ధంగా వున్నానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత, జర్నలిస్ట్‌ల సంఘం అధ్యక్షులు ఆంజనేయులు, సురేందర్‌ తదితరులు మాట్లాడారు. అన్ని జర్నలిజమ్‌ కళాశాలల్లోను జండర్‌ సెన్సటైజేషన్‌ అంశాలు కరికలమ్‌లో చేరేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రెస్‌ అకాడమీ శిక్షణా కార్యక్రమాల్లో కూడా ఈ అంశాన్ని చేర్చాలని సత్యవతి సూచించారు.

ఆ తర్వాత జర్నలిస్ట్‌ల మధ్య చర్చ జరిగి కొన్ని తీర్మానాలు రూపొందించి. వాటిని సంబంధిత మంత్రికి ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా జర్నలిస్ట్‌ల రిక్రూట్‌మెంట్‌. ప్రోమోషన్లు, ట్రాన్స్‌పోర్ట్‌, ఫిర్యాదుల కమిటీల ఏర్పాటు మొదలైన తీర్మానాలు చేసారు. అలాగే ఈసారి సమావేశానికి మీడియా యాజమాన్యాలవారిని కూడా ఆహ్వానించి ”జండర్‌ పాలసీ” తయారుచేసి అమలు చేసేలా వారిని కోరాలని కూడా తీర్మానించారు. ముందుగా వుమన్‌ ఫ్రెండ్లీగా వున్న మీడియా సంస్థల్ని ‘జండర్‌ పాలసీ’ రూపొందించాల్సిందిగా కోరాలని తీర్మానించడం జరిగింది.

ఇక నుండి మహిళా జర్నలిస్ట్‌ల సమావేశాలు ప్రెస్‌ అకాడమీలో జరుపుకోవచ్చని, ఛైర్‌పర్సన్‌ సురేందర్‌ గారు ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలతో స్వాగతించారు. మంచి చర్చలు, తీర్మానాలు జరగడం ద్వారా ఈ సమావేశం ఫలవంతంగా జరిగి భోజన విరామానికి ముందే ముగిసింది.

HGH

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.