‘ ” ‘ ‘

– కొండవీటి సత్యవతి

‘గ్రామీణ మహిళావరణం’ పేరుతో ఈ సంచిక నుండే ప్రారంభిస్తున్నాను. క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఎంతోమంది మహిళలు ఎన్నో అద్భుత కార్యాలను నిర్వహిస్తున్నారు. వీరంతా రకరకాల గొడుగుల కింద ఐక్యమై వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ, ఐ.కే.పి ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల కింద వీరంతా భిన్నమైన కార్యాచరణతో ముందుకు దూసుకెళుతున్నారు.

అస్మిత ఆధ్వర్యంలో వచ్చిన మహిళావరణం (ఇళిళీబిదీ ఐబీబిచీలి) అందరికీ గుర్తుండే వుంటుంది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వందకు మించిన మహిళల పొట్టి పరిచయాలు, నిలువెత్తు ఫోటోలతో సహా ప్రచురించిన గ్రంథమిది. అలాంటి పుస్తకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో, భిన్న సమూహాల్లో అత్యద్భుతంగా పనిచేస్తూ తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్న గ్రామీణ మహిళల కృషిని డాక్యుమెంట్‌ చెయ్యాలని ఎంతోకాలంగా నేను ఆలోచిస్తున్నాను. ఓ రెండేళ్ళ క్రితం ‘ఇందిరా క్రాంతి పథం’ పథకం కింద ఐక్యంగా పనిచేస్తూ, అధ్బుతమైన ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తమ సమస్యలనే కాక తమ చుట్టూ వున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వందమంది మహిళల ఇంటర్వ్యూలు సేకరించడం జరిగింది. అదింకా పుస్తక రూపం దాల్చలేదు. పుస్తకంగా వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకే భూమికలోనే కాలమ్‌ రాయాలని నిర్ణయించుకుని ‘గ్రామీణ మహిళావరణం’ పేరుతో ఈ సంచిక నుండే ప్రారంభిస్తున్నాను. క్షేత్ర స్థాయిలో ఈ రోజు ఎంతోమంది మహిళలు ఎన్నో అద్భుత కార్యాలను నిర్వహిస్తున్నారు. వీరంతా రకరకాల గొడుగుల కింద ఐక్యమై వున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ, ఐ.కే.పి ఇంకా అనేక స్వచ్ఛంద సంస్థల కింద వీరంతా భిన్నమైన కార్యాచరణతో ముందుకు దూసుకెళుతున్నారు. ఒక్కో నెల ఒక్కో మహిళ లేక బృందం గురించి భూమిక పాఠకులకు చెప్పాలన్నదే నా తపన. నా ప్రయత్నాన్ని హర్షిస్తారని, ఆదరిస్తారని నమ్మూతూ……

సమత దండు

భారత ప్రభుత్వ మహిళా సమాఖ్య కార్యక్రమంలో భాగంగా 1992లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సమత సొసైటీ ప్రారంభమైంది. మానవ వనరులు మంత్రిత్వ శాఖలోని విద్యావిభాగం ఈ కార్యక్రమం నడుస్తోంది. ప్రారంభంలో మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మాత్రమే మొదలైన మహిళా సమత ప్రస్తుతం పధ్నాలుగు జిల్లాల్లో విస్తరించింది. దాదాపు రెండు లక్షలపైనే స్త్రీలు, 120 మండలాల్లో మహిళా సమత ప్రోగ్రామ్‌ కింద సమీకృతమై ఉన్నారు. వీరంతా గ్రామీణ, నిరక్షరాశ్య, పేదమహిళలు. చదువురాని ఈ మహిళలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రయత్నాలు చాలా స్ఫూర్తిదాయకమైనవి. తమ సమస్యలను పరిష్కరించుకుంటూ తమ గ్రామంలోని మహిళలందరి సమస్యలమీద దృష్టిపెట్టడం, తమదైనరీతిలో పరిష్కరించడం వీరి ప్రత్యేకత. ‘కలిసి నడిస్తే బాటవుతుంది’ అన్నది వీరి ట్యాగ్‌లైన్‌. (ఊళివీలిశినీలిజీ గీలి ళీబిదిలి బి చీబిశినీ) దీనిని ఆచరణలో పెడుతూ వీరు ఓ వినూత్న కార్యక్రమానికి తెర తీసారు.

హైదరాబాదులో జరిగిన శిక్షణా కార్యక్రమంలో తొలిసారి వీరు గులాబీ గ్యాంగ్‌ గురించి విన్నారు. మహిళా సమత కార్యక్రమాల్లో భాగంగా లీగల్‌ లిటరసీ అంశం కింద సంఘం సభ్యులకు అనేక అంశాలమీద శిక్షణ నిస్తారు. అలాంటి ఒక శిక్షణా కార్యక్రమానికి నేను రిసోర్స్‌పర్సన్‌గా వెళ్ళినపుడు గులాబీ గ్యాంగ్‌ గురించి రాసిన భూమిక కాపీలను ఇవ్వడం జరిగింది. సంపత్‌పాల్‌ దేవి తన బృందంతో థీమాగా, ధైర్యంగా కర్రలు చేతబట్టి నిలబడిన ఫోటోను కవర్‌ పేజీ మీద చూసినపుడు స్ఫూర్తి పొందిన నెల్లికుదురు మండలం మహిళా సమత సభ్యులు తామెందుకు అలా ప్రారంభించకూడదు అని ఆలోచన చేసారు. గులాబీ గ్యాంగ్‌ని స్ఫూర్తిగా తీసుకుని వంగ పూత రంగు చీరలు ధరించి తమ ఆలోచనకు ఆచరణ రూపమిచ్చారు. వరంగల్‌ జిల్లా నెల్లికుదురు మండలంలో అడుగుపెడితే వంగపువ్వు రంగు చీరలు కట్టి, ఐక్యంగా గ్రామాల్లో తిరిగే ఈ మహిళలు స్త్రీలు, బాలికల సమస్యల మీద తమ దృష్టి పెట్టారు. దాదాపు నలభై మంది మహిళలు ‘సమత దండు’ పేరుతో గ్రామంలో తిరుగుతూ ఏ మహిళకి అన్యాయం జరిగినా అండగా నిలుస్తారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారు. న్యాయ సలహాలిస్తారు. గృహహింస బాధితులకు బాసటగా వుంటూ వారికి కావలసిన సహాయాన్ని అందిస్తున్నారు.

ప్రతి సంవత్సరం టీ.వీ.9 ఛానెల్‌, నవీన కార్యక్రమం కింద ఇచ్చే నవీన మహిళ అవార్డును ఈ సంవత్సరం ఈ సమత దండు గెలుచుకుని మిగతా జిల్లాల్లోని మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రాబోయే రోజుల్లో సమత దండు రాష్ట్రమంతా విస్తరించి బాధిత స్త్రీలకు అండగా నిలబడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఈ మహిళలు, మహిళా సమత ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారు. మహిళల్లో నిరక్షరాశ్యత పోగొట్టడం, బడికి పోని పిల్లల్ని బడి వరకు తీసుకురావడం, బాల్య వివాహాలను ఆపుచెయ్యడం, బాధిత స్త్రీలకు కౌన్సిలింగ్‌ ఇవ్వడం, కోర్టులు నిర్వహించడం లాంటి భిన్నమైన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

భవిష్యత్తులో మహిళా సమతలో వున్న దాదాపు రెండున్నర లక్షల మంది మహిళలు, మహిళా సమత సారధి, స్టేట్‌ ప్రోగ్రామ్‌ డైరక్టర్‌ ప్రశాంతి నాయకత్వంలో ఆనాడు ‘మా ఊరికి సారావద్దు’ అంటూ నెల్లూరు మహిళలు చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమం తరహాలో, దాన్ని మించిన ఉధృతితో ‘మా ఊళ్ళో హింసలొద్దు’ అంటూ ఈ సమతదండు పెను ప్రభంజనంలా విరుచుకుపడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్‌. నాయకురాలు ప్రశాంతికి, ”సమత దండు”కి చారిత్రిక శ్రీకారం చుట్టిన మహిళా సమత మహిళలకి జేజేలు చెప్పి తీరాల్సిందే.

అన్ని రకాల హింసలని వ్యతిరేకిస్తూ గ్రామీణ మహిళలు సంఘటితంగా చేస్తున్న ఒక ఉద్యమంలో మైలురాయిగా దీనిని అభివర్ణించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు సంవత్సరాలుగా హింస పెరుగుతూ కొత్త కొత్త రూపాల్లో స్త్రీల జీవితాలను ప్రభావితం చేస్తొంది. ఇలాంటి నేపధ్యంలో పురుడుపోసుకున్న ‘సమత దండు’ ఒక మండలంలో ప్రారంభమై భవిష్యత్తులో మహిళా సమత పని చేస్తున్న 120 మండలాలకు విస్తరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్‌. ఈ ప్రభావం వీటకే పరిమితమౌతుందని నేను భావించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా సమతదండు ప్రభావంతో ‘మా ఊళ్ళో హింసలొద్దు” నినాదంతో ఒక చారిత్రిక ఉద్యమానికి ఇది నాందీ ప్రస్థాపనేదని నేను బలంగా నమ్ముతున్నాను.

పి. ప్రశాంతి

స్టేట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌, ఎ.పి. మహిళా సమత

Share
This entry was posted in గ్రామీణ మహిళావరణం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో