– పసుపులేటి గీత

మానవ జీవితంలోని చీకటి కోణాలకు వెలుతురు భాష్యం చెబుతున్న మహిళా ఫోటోగ్రాఫర్‌ లీసా క్రిస్టీన్‌ అనుభవమిది.

‘ఘనాలోని ఒకానొక అక్రమ బొగ్గుగనిలో నేను 150 అడుగుల లోతు సొరంగంలో ఉన్నాను. ఆ సొరంగంలో దుమ్మూ, ధూళితో గాలి వేడెక్కి పోయింది. శ్వాస తీసుకోవడమే కష్టంగా ఉంది. చీకటిగా ఉంది. నన్ను రాసుకుంటూ, తోసుకుంటూ ఎందరెందరో నడుస్తున్నారని నాకు తెలుస్తోంది. నా శరీరానికి తగిలిన దేహాలన్నీ చమటతో తడిసి ముద్దయి ఉన్నాయన్న విషయాన్ని కూడా నేను అర్థం చేసుకున్నాను. అందర్లాగే నేను కూడా తలకి ఒక చవకబారు ఫ్లాష్‌లైట్‌ను అమర్చుకు న్నాను. మూడు అడుగుల వ్యాసం కూడా లేని వలయాకారపు సొరంగం కిందికి వెళ్ళేకొద్దీ భూగర్భంలో వేలాది అడుగుల లోతు ఉంది. సొరంగపు గోడల్ని చేతులతో గట్టిగా పట్టుకుని, కిందికి జారిపోకుండా నేను నిలదొక్కుకుంటున్నాను. చెయ్యి పట్టు తప్పినప్పుడల్లా, ఇటీవలే ఇలాగే పట్టుతప్పి ఆ అంధకారపు లోయలోకి జారిపోయి, ప్రాణాల్ని పోగొట్టుకున్న కార్మికుడి ఉదంతం నాకు గుర్తుకు వస్తోంది. ఆ సొరంగంలో పనిచేస్తున్న వాళ్ళకి జీత భత్యాలు ఉండవు, ఎలాంటి ప్రతిఫలమూ అందదు…., కానీ వాళ్ళు ప్రతిక్షణం తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతూ, చావుతో దోబూచులాడుతున్నారు. నా పని పూర్తయ్యాక నేను ఇంటికి వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు మాత్రం దివారాత్రాలు ఆ సొరంగంలోనే గడపాలి. వాళ్ళు చిక్కుకున్నది సొరంగంలో మాత్రమే కాదు, జీవితాంతపు వెట్టి చాకిరీలో కూడా!

నేను గత 28 ఏళ్ళుగా ఆరు ఖండాల్లో 78 దేశాలకు చెందిన సంస్కృతు ల్ని డాక్యుమెంటరీలుగా మలిచాను. వాంకోవర్‌ శిఖరాగ్ర శాంతి సమావేశాల్లో 2009లో నేను నా డాక్యుమెంటరీల్ని ప్రదర్శించాను. అక్కడ నేను ‘ఫ్రీ ద స్లేవ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ తాలూకు ప్రతినిధిని కలుసుకున్నాను. అతను చెప్పిన మాటల్ని విని, ఇంకా నా సమకాలీన ప్రపంచంలో నాతో పాటు 27 మిలియన్ల మంది బానిసలుగా వెట్టి చాకిరికి బలవు తున్న నిజాన్ని తెలుసుకుని, ఆశ్చర్యపోయాను. ఇంతవరకు ఇలాంటి విషయాన్ని గురించి ఏమీ తెలుసుకోకుండా జీవిస్తున్నందుకు ఆ క్షణంలో నిజంగా నేను సిగ్గుపడ్డాను కూడా.

ఈ దురాగతాన్ని నేను మరిచిపోలేక పోయాను. ఫలితంగా కొన్ని వారాల తరువాత లాస్‌ ఏంజిలిస్‌లో నివసిస్తున్న ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని కలుసుకున్నాను. నూట యాభై ఏళ్ళ క్రితం అమెరికాలో ఒక బానిస ఖరీదు ప్రస్తుతం ఒక అమెరికన్‌ కార్మికుడి వార్షిక వేతనంలో మూడు వంతులుగా ఉండేది. ఇప్పటికీ కేవలం పద్దెనిమిది డాలర్ల అప్పును తీర్చలేక అనేకానేక కుటుంబాలు కట్టు బానిసత్వంలో మగ్గుతున్నాయి. ‘ఫ్రీ దస్లేవ్స్‌’ సంస్థతో కలిసి పనిచేయడాన్ని మొదలు పెట్టాను. అందులో భాగంగా నేను గతంలో పర్యటించిన అనేక ప్రాంతాల్లో మళ్ళీ పర్యటించాల్సి వచ్చింది. ఒకప్పుడు నాకు భూతల స్వర్గాలుగా కనిపించిన ఆ ప్రదేశాలన్నీ ఇప్పుడు స్మశాన సదృశంగా కనిపించాయి. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా బానిసల ద్వారా 13 బిలియన్‌ డాలర్లకు పైగా లాభాలు ఉత్పన్నమవుతున్నాయి. మంచి చదువులు చెబుతామని, మంచి ఉద్యోగాలిస్తామని మనుషుల్ని భ్రమల్లో ముంచి, తరువాత హింసించి జీత భత్యాల ఊసే లేని కట్టుబానిసలుగా మార్చుతున్నారు. బానిసలు సృష్టించే ఉత్పాదనలకు ఎంతో విలువ ఉన్నప్పటికీ, వాటిని ఉత్పత్తి చేసిన బానిసలకు మాత్రం ఎలాంటి విలువ ఉండదు. కట్టుబానిస విధానం చట్ట వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రపంచమంతటా ఇది కొనసాగుతూనే ఉంది.ఈ దురాగతాన్ని నేను మరిచిపోలేక పోయాను. ఫలితంగా కొన్ని వారాల తరువాత లాస్‌ ఏంజిలిస్‌లో నివసిస్తున్న ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిని కలుసుకున్నాను. నూట యాభై ఏళ్ళ క్రితం అమెరికాలో ఒక బానిస ఖరీదు ప్రస్తుతం ఒక అమెరికన్‌ కార్మికుడి వార్షిక వేతనంలో మూడు వంతులుగా ఉండేది. ఇప్పటికీ కేవలం పద్దెనిమిది డాలర్ల అప్పును తీర్చలేక అనేకానేక కుటుంబాలు కట్టు బానిసత్వంలో మగ్గుతున్నాయి. ‘ఫ్రీ దస్లేవ్స్‌’ సంస్థతో కలిసి పనిచేయడాన్ని మొదలు పెట్టాను. అందులో భాగంగా నేను గతంలో పర్యటించిన అనేక ప్రాంతాల్లో మళ్ళీ పర్యటించాల్సి వచ్చింది. ఒకప్పుడు నాకు భూతల స్వర్గాలుగా కనిపించిన ఆ ప్రదేశాలన్నీ ఇప్పుడు స్మశాన సదృశంగా కనిపించాయి. నేటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా బానిసల ద్వారా 13 బిలియన్‌ డాలర్లకు పైగా లాభాలు ఉత్పన్నమవుతున్నాయి. మంచి చదువులు చెబుతామని, మంచి ఉద్యోగాలిస్తామని మనుషుల్ని భ్రమల్లో ముంచి, తరువాత హింసించి జీత భత్యాల ఊసే లేని కట్టుబానిసలుగా మార్చుతున్నారు. బానిసలు సృష్టించే ఉత్పాదనలకు ఎంతో విలువ ఉన్నప్పటికీ, వాటిని ఉత్పత్తి చేసిన బానిసలకు మాత్రం ఎలాంటి విలువ ఉండదు. కట్టుబానిస విధానం చట్ట వ్యతిరేకమే అయినప్పటికీ, ప్రపంచమంతటా ఇది కొనసాగుతూనే ఉంది.

భారతదేశం, నేపాల్లో నేను ఇటుకల బట్టీల్ని సందర్శించాను. దాదాపు 130 డిగ్రీల వేడిలో, దుమ్ము, ధూళిలో స్త్రీలు, పురుషులు, పిల్లలు, కుటుంబాలన్నీ రెక్కలు మ్కులు చేసుకోవడాన్ని చూశాను. ఒకేసారి 18 ఇటుకల్ని తలమీద పెట్టుకుని, మోయడాన్ని చూశాను. ఎకాఎకిన రోజుకు 16 నుంచి 17 గంటల దాకా వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటారు. మధ్యలో భోజన విరామం కానీ, దాహం తీర్చుకునే వీలు కానీ ఉండదు. దాంతో వాళ్ళలో చాలామంది డీహైడ్రేషన్‌కు గురవుతుంటారు. వాళ్ళ బాధామయ జీవితాన్ని నా కెమరాలో బంధించాలనుకుంటే, అక్కడి వేడికి అది పని చేయనంటూ చాలాసార్లు మొరాయించింది. ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి నేను నా క్రూయిజర్‌ వాహనం దగ్గరికి వెళ్ళి, అక్కడ కెమెరాను కాసేపు ఎసిలో ఉంచాల్సి వచ్చింది. వాళ్ళ వేదనల్ని కళ్ళారా చూస్తున్న నాకు ఏడుపాగలేదు. కానీ నా వెంట వచ్చిన వ్యక్తి, ‘లీసా’ దయచేసి ఏడవొద్దు, అలా చేస్తే వాళ్ళకు ప్రమాదమే తప్ప, ఒరిగేదేమీ లేదు’ అంటూ వారించాడు. నేను వాళ్ళకు ధనసహాయం చేయలేను. కనీసం జాలిగా పలకరించలేను. నా గుండె బరువెక్కింది. ‘ఫ్రీ ద స్లేవ్స్‌’ సంస్థలాంటివి పూనుకుంటే తప్ప ఈ బానిసత్వానికి అంతం లేదు.

పర్వతాల కింద రోడ్ల పక్కగా వాహనాల్లోకి ఎక్కించడం కోసం చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బండరాళ్ళను మోయడాన్ని నేను హిమాలయాల్లోని క్వారీలో చూశాను. తమను మోస్తున్న పిల్లలకంటే ఆ రాళ్ళు ఎన్నోరెట్లు బరువైనవి. వాటిని తాళ్ల సహాయంతో వాళ్లు మోస్తున్నారు. ఇంతకన్నా దాష్టీకాన్ని నేను చూడలేనేమో?! ఈ పిల్లలకు గానీ, ఇక్కడ పనిచేస్తున్న పెద్దలకు గానీ తాము కట్టుబానిసలమన్న సంగతి కూడా తెలియదు. జీతభత్యాలు లేకుండా చేసే ఈ వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం ఇక్కడి గ్రామ ప్రజలు ఉద్యమిస్తే, అక్రమ క్వారీ నిర్వాహకులు ఆ గ్రామస్థుల ఇళ్ళను తగలబెట్టేస్తుంటారు. ట్టుబానిస విధానం అమల్లో ఉన్న మరో రంగం జౌళి పరిశ్రమ. భారతదేశంలోని పట్టు పరిశ్రమల్లో పని చేస్తున్న బానిసల్ని నేను చూశాను. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు లేక్‌ ఓల్టాలో నాలుగువేల మంది పిల్లలు చేపలు పడుతుంటారు. వీళ్ళంతా కట్టుబానిసలే. పిల్లల్ని అపహరించి, ఈ పనిలోకి దించుతుంటారు. వాళ్ల చేత గంటల పర్యంతం వెట్టిచాకిరీ చేయిస్తుంటారు. భయపడే పిల్లల్ని, అలసిపోయిన పిల్లల్ని మరింత భయపెట్టడానికి సరస్సులోకి విసిరేస్తుంటారు. అలా సరస్సులో పడిన చాలామంది పిల్లలు మరణిస్తుంటారు. ఈ పిల్లలు చలిరాత్రుల్లో సరస్సు మీద చేపలు పడుతుంటారు. చేపలతో నిండిన ఒక్కో వల వేలాది పౌండ్ల బరువు ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా బానిసల్ని నేను కలిసినప్పుడల్లా నాతో పాటు కొన్ని వేల కొవ్వొత్తుల్ని తీసుకువెళతాను. ఆ కొవ్వొత్తుల వెలుగులోనే వాళ్ళని ఫోటోలు తీస్తాను. నేను ఒక ఫోటోగ్రాఫర్‌నని, తమ కథల్ని, గాథల్ని ఈ కొవ్వొత్తుల్లాగే వెలుగులోకి తెచ్చి, ప్రపంచం ముందు ప్రదర్శిస్తానని నేను వాళ్ళకి చెబుతాను.’

హ్యుమానిటేరియన్‌ ఫోటోగ్రాఫర్‌ లీసా క్రిస్టీన్‌ మానవ జీవితంలోని మారుమూల చీకట్లని తన కెమెరాలో బంధిస్తుంది. తన ఫోటోల ద్వారా ప్రపంచం ముందుకు రాని ఎన్నో చీకటి నిజాల్ని వెలుగులోకి తెచ్చిందామె. కాలిఫోర్నియాకు చెందిన శాన్‌ఫ్రాన్సిస్కోలో లీసా 2 సెప్టెంబర్‌, 1965న జన్మించింది. ఈమె తాను తీసిన ఛాయా చిత్రాలతో రెండు పుస్తకాల్ని వెలువరించింది. ఈ పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమయ్యాయి. లీసా నార్త్‌ కరొలినాలో నివసిస్తోంది.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.