భిన్నత్వంలోని సౌందర్యం

నలభై ఆరు సంవత్సరాల క్రితం నా జీవితంలో ఇది జరిగింది. నా తల్లిదండ్రులు తమిళులు. నా తండ్రిది నల్లని శరీరఛాయ. నా తల్లి ఛామన ఛాయలో వుంటుంది. ఉత్తరప్రదేశ్కి చెందిన నా ఆయా కూడా ఛామన ఛాయ రంగులో వుండేది. హిందీ మాట్లాడుతుంది. మేముండేది జార్ఖండ్లోని దట్టమైన అడవి ప్రాంతంలో. మా చుట్టూ వుండే ఆదివాసులు నల్లని శరీర ఛాయతో మెరిసిపోయేవారు. వాళ్ళు మాట్లాడే భాష ‘హో’. నేను ఇంటినుండి బయటపడి, బయట తిరిగేటపుడు ఎంతో మంది, ఎన్నో రకాల వేషధారణలతో కన్పడేవాళ్ళు. దిగంబరులైన సాధువులు, శరీర పైభాగాన ఏమీ ధరించని స్థానికులు, బురఖాలో శరీరం మొత్తాన్ని కప్పుకునే ముస్లిమ్ స్త్రీలు. మా ఇంటికొచ్చే అతిథులు ఎక్కువగా ఇంగ్లీషులోనే సంభాషించేవారు. మేము హిందువులం. నా ఆయా ముస్లిమ్. నా చుట్టూ వుండే ఆదివాసులు, క్రిస్టియన్లు లేదా ఆనిమిస్ట్‌లు,(Animists )ఎందుకంటే వాళ్ళు చెట్లని, జంతువులని వారి పూర్వీకుల ఆత్మలని పూజిస్తారు. నా చుట్టూ వుండే వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా భిన్నమైనవి. కొందరు పందిమాంసం తినరు. కొందరు ఎలకలు, బల్లులతో సహా అన్నింటిని తింటారు.

మా మైనింగ్ కమ్యూనిటి వాళ్ళు అన్ని పండగల్ని ఒకేలాంటి ఉత్తేజంతో జరుపుకుంటారు. మేము దట్టమైన అడవిలో నివాసముంటున్నాం కాబట్టి మా చుట్టుపక్కల కౄరమృగాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, జింకలు తిరుగుతుంటాయి. అపుడపుడూ ఇవన్నీ మా ఇళ్ళల్లోకి చొరబడుతుంటాయి. అద్భుతమైన ఈ ప్రాంతపు చిన్న పరిచయమిది. నేను చిన్నపిల్లగా వున్నపుడే నాలుగు రకాల మతాలు, వేషభాషలు, భిన్నమైన ఆహారపుటలవాట్లు గమనిస్తూ వుండేదాన్ని. వింటూండేదాన్ని. వీటిల్లో నుండే నేను నా జీవిత పాఠాలు నేర్చుకున్నట్టున్నాను. శరీర రంగు, ఆకారం, పూజావిధానం, వస్త్రధారణ, ఆహారం అలవాట్లు, మాట్లాడే భాషలు ఏవైనప్పటికీ మనిషి మాత్రం మనిషే. (A human was a human.)

నేను పెరుగుతున్న క్రమంలో మా నాన్న బదిలీల వల్ల ఇండియాలోని అన్ని రాష్ట్రాలు నేను చూసాను. మిగిలిన భారతదేశాన్ని కూడా నేను చూసాను. నేను చిన్నపిల్లగా వున్నపుడు నాకు తెలిసిన దేవుళ్ళు కాక ఇక్కడ ఇంక ఎంతోమంది దేవుళ్ళను భారతీయులు కొలుస్తారని అర్థమైంది. ప్రతి రాష్ట్రం మూడు, నాలుగు ప్రాంతాలను కలిగివుండటం చూసాను. ప్రతి ప్రాంతం బిన్నమైన భాషని, మాండలికాన్ని కలిగివుండటమే కాక వారి వారి ప్రాంతీయ మాండలికాన్ని వారు అర్థం చేసుకోలేరు. ప్రతి ప్రాంతం భిన్నమైన ఆహారపు అలవాట్లు, భిన్నమైన వస్త్రధారణ, భిన్నమైన సంస్కృతితో భౌగోళికంగా కూడా చాలా భిన్నంగా కన్పిస్తారు. ఈ రోజు నా మతంవల్ల, నా శరీర రంగువల్ల, నేను మాట్లాడే భాషవల్ల నేను అధికురాలనని, గొప్పదాన్నని ఎవ్వరూ నన్ను ఒప్పించలేరు. నా బాల్యంలో నేననుభవించిన వైవిధ్యం నాకే స్వంతం కూడా కాదు. ప్రతి భారతీయుడు/ భారతీయురాలు అనుభవంలోకి వచ్చేదే ఇది. అయితే కొన్ని వివరాల్లో తేడా వుండొచ్చు. ఈ వైవిధ్యమే మన దేశాన్ని గొప్ప సహనశీల దేశంగా ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఈ భిన్నత్వాన్ని నేను అనుభవించాను కాబట్టే నేను ఈ దేశంలో కాక మరే ఇతర దేశంలోను నివశించలేను. ముఖ్యంగా హోమోజీనియస్ గా వుండే దేశాల్లో – అందరూ ఒకేలా కన్పించే చోట, ఒకే రకమైన తిండి తినే చోట, ఒకే మతాన్ని అవలంభించేచోట నేనుండలేను. నెదర్లాండ్స్, జర్మనీ, జపాన్, స్వీడన్ తదితర వందలాది దేశాల గురించి ఆలోచించండి. అవును నిజమే. భిన్నత్వం వల్ల, భిన్న మతాల వల్ల మనం ఒకరినొకరం చంపుకుంటున్నాం. ఇలా జరగడం చాలా బాధాకరం. ఇలా ఎప్పుడూ జరగకూడదు. ఇలా చూడ్డానికి ప్రయత్నించండి. సున్నీలు, బౌద్ధులు, రోమన్ కాథలిక్‌లు, సిక్కులు, బొహరులు, దిగంబర జైనులు, పార్సీలు, కుర్మీలు, ఐయ్యర్‌లు, అగర్వాల్‌లు, నాయర్‌లు, సిరియన్ క్రిష్టియన్‌లు, షియాలు, శ్వేతాంబరులు, జైనులు, యూదులు, ఇస్మాయిల్‌లు, సెవెంత్ డే ఎడ్డన్టిష్ట్‌లు, బిస్నోయిలు ఇంకా అనేకానేక సమూహాలు కలిసిమెలిసి భారతదేశంలో బతుకుతున్నారు.

బ్రిటన్‌లోను, ఎమన్‌లోను ఒకే మతానికి చెందిన రెండు వర్గాలవారు ఎంతోకాలంగా ఒకర్నొకరు చంపుకుంటున్నారు. లెబనాన్‌లో రెండు మతాలవారు పరస్పరం చంపుకుంటున్నారు. అమెరికాలో, దక్షిణాఫ్రికాలో శరీరరంగు కారణంగా ఎన్నో సమస్యల్నెదుర్కుంటున్నారు. కెనడాలో అయితే రెండు భాషల వల్ల సమస్యలెదుర్కొంటున్నారు. భారతీయురాలిగా, ఇంత చిన్నవిషయాల కోసం వీళ్ళు కొట్టుకు చస్తున్నారా అని మనసారా నవ్వుకుంటాన్నేను. రెండు మతాలు, రెండు రంగులు, రెండు భాషలు. హల్లో! దిగంబర్ జైన్, గుజరాతీ మాట్లాడే, పైజామా కుర్తా ధరించే వాళ్ళు, మళయాళీ మాట్లాడే, సిగ ధరించే సిరియన్ క్రిష్టియన్‌తో కలిసి మెలిసి బతుకుతున్నారు. ఇలా ప్రయత్నం చెయ్యండి అని చెప్పాలన్పిస్తుంది. వాళ్ళలాగా మనం కూడా అంత అసహనాన్ని ప్రదర్శిస్తే మనం ఎక్కడుండేవాళ్ళం. ఈరోజున మనం చూస్తున్న పరమత అసహనం కూడా చాలా చిన్నశాతం మనుషులకే పరిమితం. అధికశాతం వాళ్ళు బేధాల్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతులకు చెందిన మనం ఓ అద్భుతమైన సమ్మేళనం. నేనెప్పటికి ఒక గ్లోబల్ సిటిజన్ని కాలేను. ఒక స్టాక్ బ్రోకర్ పదజాలంలో చెప్పాలంటే నా సమస్త భావోద్వేగాల్ని భారతదేశమనే స్టాక్‌లో మదుపు పెట్టాను. నాకు తెలుసు ఈ స్టాక్‌ల విలువ పెరుగుతుందే కానీ తరగదని. ఈ పెరుగుదల స్టీల్ వల్లనే, టెక్స్టైల్ వల్లనో కాదుసుమా! ఎందుకు పెరుగుతుందంటే మనం కలిసి బతకడమెలాగో నేర్చుకున్నాం కాబట్టి.

-జి.వి. దాశరథి, అనువాదం: కె.ఎస్

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to భిన్నత్వంలోని సౌందర్యం

  1. NIRMALA says:

    చాల బాగ రాసారు. ఈలాగె రాస్తు ఉండడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.